దీపిక & రణవీర్ మైండ్ బ్లోయింగ్ కార్ కలెక్షన్: ఆడి నుంచి ఆస్టన్ మార్టిన్ దాకా..!!

'దీపికా పదుకొనె మరియు రణవీర్ సింగ్' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే బాలీవుడ్ చిత్ర సీమలో అత్యంత ప్రాచుర్యం పొందిన నటులు మాత్రమే కాకూండా మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ కూడా. అయితే వీరిద్దరూ సినీ రంగంలోనే కాకుండా.. లగ్జరీ కార్ల సేకరణలో కూడా ముందు ఉన్నారు. ఈ జంట వద్ద ఎలాంటి లగ్జరీ కార్లు ఉన్నాయి, వాటి వివరాలేంటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

దీపిక & రణవీర్ మైండ్ బ్లోయింగ్ కార్ కలెక్షన్: ఆడి నుంచి ఆస్టన్ మార్టిన్ దాకా..!!

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ (Land Rover Range Rover Vogue):

రణవీర్ & దీపికా కార్ గ్యారేజ్ లో ఉన్న అత్యంత ఖరీదైన కార్లలో 'ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్' ఒకటి. ఈ లగ్జరీ కారు ధర రూ. 4.38 కోట్లు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది.

దీపిక & రణవీర్ మైండ్ బ్లోయింగ్ కార్ కలెక్షన్: ఆడి నుంచి ఆస్టన్ మార్టిన్ దాకా..!!

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ 3.0 లీటర్ వి6 ఇంజన్‌ పొందుతుంది. ఇది 250 బిహెచ్‌పి పవర్ మరియు 600 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ కారు యొక్క గరిష్ట వేగం గరిష్టంగా గంటకు 209 కిలోమీటర్ల వరకు ఉంది. ఈ కారుని దీపికా పదుకొనె ఎక్కువగా ఉపయోగిస్తుంది.

దీపిక & రణవీర్ మైండ్ బ్లోయింగ్ కార్ కలెక్షన్: ఆడి నుంచి ఆస్టన్ మార్టిన్ దాకా..!!

లంబోర్ఘిని ఉరుస్ (Lamborghini Urus):

ప్రపంచ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మరియు ఎక్కువమంది సెలబ్రెటీలు ఇష్టపడే కార్లలో లంబోర్ఘిని బ్రాండ్ కార్లు ఎక్కువగా ఉన్నాయి. దీపికా మరియు రణవీర్ గ్యారేజిలో లంబోర్ఘిని యొక్క ఉరుస్ ఉంది. దీని ధర రూ. 4.5 కోట్లు. రణవీర్ సింగ్ ఈ కారుని డ్రైవ్ చేస్తూ కనిపించారు.

దీపిక & రణవీర్ మైండ్ బ్లోయింగ్ కార్ కలెక్షన్: ఆడి నుంచి ఆస్టన్ మార్టిన్ దాకా..!!

లంబోర్ఘిని ఉరుస్ 4 లీటర్ వి8 ట్విన్ టర్బో ఇంజిన్ పొందుతుంది. ఇది 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 650 బిహెచ్‌పి పవర్ మరియు 6,800 ఆర్‌పిఎమ్ వద్ద 850 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది మంచి పనితీరుని అందిస్తుంది. ఈ లంబోర్ఘిని ఉరుస్ కారుని ఇప్పటికే చాలామంది సెలబ్రెటీలు కలిగి ఉన్నారు.

దీపిక & రణవీర్ మైండ్ బ్లోయింగ్ కార్ కలెక్షన్: ఆడి నుంచి ఆస్టన్ మార్టిన్ దాకా..!!

ఆడి క్యూ5 (Audi Q5):

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి కంపెనీ యొక్క 'Q5' కూడా వీరి గ్యారేజ్ లో ఉంది. ఆడి క్యూ5 లగ్జరీ కారు ధర రూ. 65 లక్షలు. ఈ లగ్జరీ కారు మంచి డిజైన్ కలిగి లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇది 10.1 ఇంచెస్ ఎమ్ఎమ్ఐ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అప్‌డేటెడ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే మరియు కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి వాటిని పొందుతుంది. అంతే కాకూండా ఇందులో త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్ మరియు పవర్డ్ ఫ్రంట్ సీట్స్ వంటివి కూడా ఉన్నాయి.

దీపిక & రణవీర్ మైండ్ బ్లోయింగ్ కార్ కలెక్షన్: ఆడి నుంచి ఆస్టన్ మార్టిన్ దాకా..!!

ఆడి క్యూ7 (Audi Q7):

దీపికా & రణవీర్ గ్యారేజీలో ఉన్న మరో ఆడి బ్రాండ్ కారు Q7. దీని ధర రూ. 82.49 లక్షలు. 'ఆడి క్యూ7' 3.0-లీటర్ వి6 ఇంజిన్ పొందుతుంది. ఇది 245 బిహెచ్‌పి పవర్ మరియు 600 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

దీపిక & రణవీర్ మైండ్ బ్లోయింగ్ కార్ కలెక్షన్: ఆడి నుంచి ఆస్టన్ మార్టిన్ దాకా..!!

ఆడి క్యూ7 ప్రీమియం ప్లస్, టెక్నాలజీ అనే రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది.ఇది 2,995సిసి వి6 ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజన్‌ అందుబటులో ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 335 బిహెచ్‌పి పవర్ మరియు 500 ఎన్ఎమ్‌ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు గరిష్టంగా 250 కి.మీ/గం వేగాన్ని అందుకోగలదు. అదే సమయంలో ఈ SUV కేవలం 5.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ వరకు వేగవంతం అవుతుంది.

దీపిక & రణవీర్ మైండ్ బ్లోయింగ్ కార్ కలెక్షన్: ఆడి నుంచి ఆస్టన్ మార్టిన్ దాకా..!!

జాగ్వార్ ఎక్స్‌జె-ఎల్ (Jaguar XJ-L):

జాగ్వార్ బ్రాండ్ యొక్క అద్భుతమైన కారు ఈ 'జాగ్వార్ ఎక్స్‌జె-ఎల్' (Jaguar XJ-L). అయితే ఇది ప్రస్తుతం నిలిపివేయబడింది. ఈ లగ్జరీ కారుని దీపిక మరియు రణవీర్ ఇద్దరూ డ్రైవ్ చేస్తూ కనిపించారు. 'జాగ్వార్ ఎక్స్‌జె-ఎల్' ధర రూ. 1.10 కోట్లు వరకు ఉంటుంది. ఇది వివిధ ఇంజిన్ ఆప్సన్లలో అందుబాటులో ఉంటుంది. అయితే మంచి పనితీరుని అందిస్తుంది.

దీపిక & రణవీర్ మైండ్ బ్లోయింగ్ కార్ కలెక్షన్: ఆడి నుంచి ఆస్టన్ మార్టిన్ దాకా..!!

ఆస్టన్ మార్టిన్ రాపిడ్-ఎస్ (Aston Martin Rapide-S):

దీపిక మరియు రణవీర్ గ్యారేజీలో ఉన్న అత్యంత ఖరీదైన కార్లలో ఈ 'ఆస్టన్ మార్టిన్ రాపిడ్ ఎస్' ఒకటి. దీని ధర అక్షరాలా రూ. 3.29 కోట్లు. ఈ లగ్జరీ కారులో 5935 సిసి, 12 సిలిండర్ DOHC ఇంజిన్ ఉంటుంది. ఇది 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 552 బిహెచ్‌పి పవర్ మరియు 5,000 ఆర్‌పిఎమ్ వద్ద 630 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

దీపిక & రణవీర్ మైండ్ బ్లోయింగ్ కార్ కలెక్షన్: ఆడి నుంచి ఆస్టన్ మార్టిన్ దాకా..!!

మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ (Mercedes-Benz GLS):

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థల్లో అత్యంత పాపులర్ బ్రాండ్ అయిన మెర్సిడెస్ బెంజ్ యొక్క 'జిఎల్ఎస్' కూడా వీరి గ్యారేజిలో ఉంది. ఎక్కువమంది సెలబ్రెటీలు ఈ కారుని కలిగి ఉన్నారు. రణ్‌వీర్ సింగ్‌ చాలా సార్లు ఈ కారుని డ్రైవ్ చేస్తూ కనిపించాడు. డీఐ ధర రూ. 1.16 కోట్లు.

దీపిక & రణవీర్ మైండ్ బ్లోయింగ్ కార్ కలెక్షన్: ఆడి నుంచి ఆస్టన్ మార్టిన్ దాకా..!!

మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ 3.0 లీటర్ వి6 డీజిల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 258 బిహెచ్‌పి పవర్ మరియు 628 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కారు యొక్క గరిష్ట వేగం గంటకు 238 కిమీ వరకు ఉంది. అదే సమయంలో ఇది కేవలం 6.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

దీపిక & రణవీర్ మైండ్ బ్లోయింగ్ కార్ కలెక్షన్: ఆడి నుంచి ఆస్టన్ మార్టిన్ దాకా..!!

మెర్సిడెస్-మేబాక్ జిఎల్ఎస్ 600 (Mercedes-Maybach GLS600):

రణ్‌వీర్ సింగ్‌ & దీపిక గ్యారేజిలో ఉన్న మరో బెంజ్ కారు ఈ 'మెర్సిడెస్-మేబాక్ జిఎల్ఎస్ 600'. దీని ధర దేశీయ మార్కెట్లో రూ. 2.80 కోట్లు. ఈ కారుని రణ్‌వీర్ సింగ్‌ స్వయంగా డ్రైవ్ చేస్తూ చాలా సార్లు కనిపించారు. ఈ మేబాక్ జిఎల్ఎస్ 600 అద్భుతమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది.

దీపిక & రణవీర్ మైండ్ బ్లోయింగ్ కార్ కలెక్షన్: ఆడి నుంచి ఆస్టన్ మార్టిన్ దాకా..!!

మెర్సిడెస్-మేబాచ్ జిఎల్‌ఎస్ 600 ఎస్‌యూవీలో 4.0-లీటర్ వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 550 బిహెచ్‌పి పవర్ మరియు 730 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 21 బిహెచ్‌పి శక్తిని మరియు 249ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే ఇంటిగ్రేటెడ్ ఈక్యూ బూస్ట్ స్టార్టర్-జనరేటర్‌ను కూడా కలిగి ఉంటుది.

దీపిక & రణవీర్ మైండ్ బ్లోయింగ్ కార్ కలెక్షన్: ఆడి నుంచి ఆస్టన్ మార్టిన్ దాకా..!!

మేబాక్ జిఎల్‌ఎస్ 600 కేవలం 4.9 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మొత్తం మీద ఇది ఉత్తమైన పనితీరుని అందిస్తుంది.

రణవీర్ సింగ్ 'మారుతి సుజుకి సియాజ్‌' కూడా కలిగి ఉన్నారు. రణవీర్ సింగ్ సియాజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నప్పుడు కంపెనీ ఈ సెడాన్ ని గిఫ్ట్ గా అందించింది. ఇది ఎరుపు రంగులో హలా ఆకర్షణీయంగా ఉంది.

దీపిక & రణవీర్ మైండ్ బ్లోయింగ్ కార్ కలెక్షన్: ఆడి నుంచి ఆస్టన్ మార్టిన్ దాకా..!!

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

బాలీవుడ్ చిత్ర సీమలో అత్యంత ఖరీదైన మరియు విలాసవంతమై కార్లను కలిగి ఉన్న జంటల్లో దీపిక & రణవీర్ కపూర్ ఒకరు. ఈ ఇద్దరికి కూడా లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే ఎప్పటికప్పుడు కొత్త కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. వీరి లాగానే విరాట్ కోహ్లీ మరియు అనుష్క శర్మ జంట కూడా ఖరీదైన లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు.

Article Published On: Friday, July 8, 2022, 8:00 [IST]
English summary
Deepika padukone and ranveer singh car collection details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+