2022 డిసెంబర్‌లో మహీంద్రా కారు కొనేవారు అదృష్టవంతులే.. ఎందుకో ఇక్కడ చూడండి

మహీంద్రా (Mahindra) కంపెనీ దేశీయ మార్కెట్లో 2022 డిసెంబర్ నెలలో తమ ఉత్పత్తులపైన అద్భుతమైన డిస్కౌంట్స్ అందిస్తోంది. కంపెనీ ప్రస్తావించిన మోడల్స్ కొనుగోలు చేసేవారు గరిష్టంగా రూ.1,00,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.

మహీంద్రా XUV300:

మహీంద్రా కంపెనీ యొక్క XUV300 కొనుగోలుపైనా ఇప్పుడు ఏకంగా రూ. 1,00,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇందులో కూడా XUV300 యొక్క టాప్-స్పెక్ W8(O) వేరియంట్‌పై రూ. 1 లక్ష, ఎంట్రీ-లెవల్ W4 వేరియంట్‌ మీద రూ. 53,000 వరకు బెనీఫీట్స్ పొందవచ్చు. కాగా మిడ్ స్పెక్ W6, W8 వేరియంట్‌ల మీద వరుసగా రూ. 80,000 మరియు రూ. 90,000 డిస్కౌంట్ లభిస్తుంది.

2022 డిసెంబర్‌లో మహీంద్రా కారు కొనేవారు అదృష్టవంతులే

మహీంద్రా బొలెరో:

మహీంద్రా బొలెరో దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. ఈ మహీంద్రా బొలెరో మీద కంపెనీ ఇప్పుడు గరిష్టంగా రూ. 95,000 డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ టాప్-స్పెక్ B6 (O) వేరియంట్ కి అందుబాటులో ఉంటుంది. అయితే బేస్ B2 మొత్తం రూ. 33,000 డిస్కౌంట్, మిడ్-స్పెక్ B4 మరియు B6 వేరియంట్‌లు వరుసగా రూ. 75,000 మరియు రూ. 70,000 డిస్కౌంట్ లభిస్తుంది.

మహీంద్రా బొలెరో నియో:

మహీంద్రా కంపెనీ ఇప్పుడు బొలెరో నియో మోడల్ మీద కూడా రూ. 95,000 డిస్కౌంట్ అందిస్తోంది. మహీంద్రా హై-ఎండ్ N10 మరియు N10 (O) వేరియంట్‌లపై వరుసగా రూ. 70,000 మరియు రూ. 90,000 వరకు డిస్కౌంట్ అందిస్తుంది. మహీంద్రా బొలెరో నియో ల్యాడర్ ఫ్రెమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌ కలిగి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

మహీంద్రా మొరాజో:

మహీంద్రా యొక్క మొరాజో మీద కంపెనీ ఇప్పుడు రూ. 67,200 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. మొరాజో యొక్క M2, M4+ మరియు M4+ అనే మూడు డీజిల్ ట్రిమ్‌లలో లభిస్తుంది. వీటిపైనా వరుసగా రూ. 67,200, రూ. 67,200 మరియు రూ. 60,200 డిస్కౌంట్ లభిస్తుంది. కంపెనీ ఈ కారు యొక్క అమ్మకాలను దేశీయ మార్కెట్లో మెరుగుపరచడానికి తగిన ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం భారీ డిస్కౌంట్స్ అందిస్తుంది.

మహీంద్రా థార్:

దేశీయ మార్కెట్లో విడుదల కాకముందు నుంచే విపరీతమైన ప్రజాదరణ పొందుతూ ఇప్పటికి కూడా అమ్మకాలు మరియు బుకింగ్స్ ఏ మాత్రం తగ్గకుండా ముందుకు సాగుతున్న థార్ SUV మీద కూడా కంపెనీ రూ. 20,000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ నెలలో మహీంద్రా యొక్క థార్ కొనుగోలు చేసే కస్టమర్లు థార్ పెట్రోల్ మరియు డీజిల్ కార్ల మీద రూ. 20,000 తగ్గింపును అందిస్తున్నారు.

మహీంద్రా థార్ మంచి డిజైన్ కలిగి ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో 2.0 లీటర్ పెట్రోల్ మరియు 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్సన్ పొందుతుంది. ఇందులోని 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ 130 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

మహీంద్రా కంపెనీ ఇప్పుడు తన స్కార్పియో N, XUV700 మరియు స్కార్పియో క్లాసిక్ SUV ల మీద ఎటువంటి డిస్కౌంట్స్ అందించడం లేదు. అయితే పైన పేర్కొన్న మోడల్స్ మీద మాత్రమే ఈ తగ్గింపులు అందుబాటులో ఉంటాయి. అయితే ఈ డిస్కౌంట్స్ అనేవి వివిధ నగరాల్లో వివిధ రకాలుగా ఉండే అవకాశం ఉంటుంది. కావున ఖచ్చితమైన డిస్కౌంట్స్ గురించి తెలుసుకోవడానికి స్థానిక డీలర్‌ను సంప్రదించవచ్చు.

Most Read Articles

English summary
Discount up to 1 lakh on mahindra cars 2022 december
Story first published: Tuesday, December 6, 2022, 6:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X