టాటా టియాగో ఈవీ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు..ఇది చవకైన ఎలక్ట్రిక్ కారు మాత్రమే కాదు, అంతకు మించి..

భారతదేశపు అగ్రగామి ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors), దేశంలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ కేవలం రూ.8.49 లక్షల ప్రారంభ ధరతో, పూర్తి చార్జ్ పై 315 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్‌ను అందించే తమ సరికొత్త బడ్జెట్ ఎలక్ట్రిక్ కారు టాటా టియాగో ఈవీ (Tata Tiago EV) ని మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. నిజానికి ఇది దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ధర వద్ద ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయడం అంటే సాధారణమైన విషయం కాదు.

టాటా టియాగో ఈవీ గురించి మీరు తెలుసుకోవాల్సిన పూర్తి విషయాలు..ఇది చవకైన ఎలక్ట్రిక్ కారు మాత్రమే కాదు, అంతకు మించి..

టాటా మోటార్స్ తమ టియాగో ఈవీ యొక్క బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ ట్యాగ్‌తో ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో బలంగా పాతుకుపోవడం ఖాయమని తెలుస్తోంది. టియాగో ఈవీ దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు అయినప్పటికీ, కంపెనీ ఇందులో అద్భుతమైన ఫీచర్లను అందిస్తోంది. మరి ఈ ఎలక్ట్రిక్ కారు గురించి మీరు తెలుసుకోవాల్సిన అన్ని విషయాలను ఈ కథనంలో చూద్దాం రండి.

టాటా టియాగో ఈవీ గురించి మీరు తెలుసుకోవాల్సిన పూర్తి విషయాలు..ఇది చవకైన ఎలక్ట్రిక్ కారు మాత్రమే కాదు, అంతకు మించి..

పవర్‌ట్రైన్

టాటా టియాగో ఈవీ రెండు రకాల పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది. ఇందులోని బేస్ వేరియంట్ లలో ఉపయోగించిన ఎలక్ట్రిక్ మోటార్‌ గరిష్టంగా 60 బిహెచ్‌పి శక్తిని మరియు 105 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కాగా, ప్రీమియం వేరియంట్లలో ఉపయోగించిన మరింత శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 74 బిహెచ్‌పి శక్తిని మరియు 114 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

టాటా టియాగో ఈవీ గురించి మీరు తెలుసుకోవాల్సిన పూర్తి విషయాలు..ఇది చవకైన ఎలక్ట్రిక్ కారు మాత్రమే కాదు, అంతకు మించి..

బ్యాటరీ ప్యాక్

టియాగో ఈవీలో పవర్‌ట్రైన్ ఆప్షన్స్ మాదిరిగానే బ్యాటరీ ప్యాక్స్ కూడా రెండు రకాల సామర్థ్యాలతో లభిస్తాయి. ఇందులోని బేస్ వేరియంట్లు 19.2kWh బ్యాటరీ ప్యాక్ లను కలిగి ఉంటాయి. కాగా, టాప్-స్పెక్ వేరియంట్లు 24kWh బ్యాటరీ ప్యాక్ లను కలిగి ఉంటాయి. చిన్న బ్యాటరీ ప్యాక్ తక్కువ శక్తి కలిగిన ఎలక్ట్రిక్ మోటార్‌తో వస్తుండగా, పెద్ద బ్యాటరీ ప్యాక్ ఎక్కువ శక్తి కలిగిన ఎలక్ట్రిక్ మోటార్‌తో వస్తుంది.

టాటా టియాగో ఈవీ గురించి మీరు తెలుసుకోవాల్సిన పూర్తి విషయాలు..ఇది చవకైన ఎలక్ట్రిక్ కారు మాత్రమే కాదు, అంతకు మించి..

పెర్ఫార్మెన్స్, రేంజ్

టాటా మోటార్స్ తెలిపిన వివరాల ప్రకారం, టాటా టియాగో ఎలక్ట్రిక్ కారు కేవలం 5.7 సెకన్లలో గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఓ సాధారణ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌కు ఇది చాలా పుష్కలమైన శక్తిగా ఉంటుంది. ఇక రేంజ్ విషయానికి వస్తే, టాటా టియాగో ఈవీ యొక్క 24kWh వేరియంట్ పూర్తి ఛార్జ్ పై 315 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్‌ను అందిస్తుండగా, బేస్ స్పెక్ మోడల్ పూర్తి చార్జ్ పై 250 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్‌ను అందిస్తుంది.

టాటా టియాగో ఈవీ గురించి మీరు తెలుసుకోవాల్సిన పూర్తి విషయాలు..ఇది చవకైన ఎలక్ట్రిక్ కారు మాత్రమే కాదు, అంతకు మించి..

డ్రైవ్ మోడ్స్

టాటా టియాగో ఎలక్ట్రిక్ కారులో రెండు రకాల డ్రైవ్ మోడ్‌లు ఉంటాయి. వీటిలో మొదటి సిటీ డ్రైవ్ మోడ్, ఇది నగర రోడ్లపై ఆగుతూ సాగుతూ పోయే ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. ఈ మోడ్‌లో ఈవీ పనితీరు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇకపోతే, రెండవది స్పోర్ట్ మోడ్, ఇది ప్రత్యేకించి హైవై రోడ్లపై ఆగకుండా ప్రయాణించేందుకు ఉద్దేశించబడిన మోడ్. పేరుకు తగినట్లుగా ఈ మోడ్‌లో టియాగో ఈవీ పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ మెరుగైన బ్యాటరీ రీజెనరేషన్ కోసం 4 రీజెన్ మోడ్‌లను కూడా కలిగి ఉంది.

టాటా టియాగో ఈవీ గురించి మీరు తెలుసుకోవాల్సిన పూర్తి విషయాలు..ఇది చవకైన ఎలక్ట్రిక్ కారు మాత్రమే కాదు, అంతకు మించి..

చార్జింగ్ సమయం

టాటా టియాగో ఈవీ స్టాండర్డ్ మరియు డిసి ఫాస్ట్ చార్జింగ్ రెండింటినీ సపోర్ట్ చేస్తుంది. డిసి ఫాస్ట్ చార్జర్ సాయంతో కేవలం 57 నిమిషాల్లో దాని బ్యాటరీని 10 శాతం నుండి 80 శాతానికి ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. అలాగే, స్టాండర్డ్ 3.3kW ఏసి ఛార్జర్‌తో కూడా ఈ కారు బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చు. టియాగో ఈీ 'XZ+' మరియు 'XZ+ Tech LUS' వేరియంట్లతో కంపెనీ వేగవంతమైన 7.2kW ఏసి ఛార్జర్‌ను కూడా అందిస్తోంది. దీని సాయంతో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి కేవలం 3 గంటల 36 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది.

టాటా టియాగో ఈవీ గురించి మీరు తెలుసుకోవాల్సిన పూర్తి విషయాలు..ఇది చవకైన ఎలక్ట్రిక్ కారు మాత్రమే కాదు, అంతకు మించి..

వారంటీ

ఎలక్ట్రిక్ కార్ల విషయంలో చాలా మందికి ఆందోళన కలిగించే అంశం వారంటీ. అయితే, టాటా మోటార్స్ తమ టియాగో ఎలక్ట్రిక్ కారు యొక్క బ్యాటరీ ప్యాక్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ రెండింటిపై 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిలోమీటర్ల వారంటీని అందిస్తుంది. కాబట్టి, ఇది కొత్త ఈవీ కొనుగోలుదారులకు కూడా మంచి విశ్వాసాన్ని ఇస్తుంది.

టాటా టియాగో ఈవీ గురించి మీరు తెలుసుకోవాల్సిన పూర్తి విషయాలు..ఇది చవకైన ఎలక్ట్రిక్ కారు మాత్రమే కాదు, అంతకు మించి..

డిజైన్

టాటా టియాగో ఈవీ యొక్క ఎక్స్టీరియర్ డిజైన్‌ను గమనిస్తే, ఇది చూడటానికి దాని పెట్రోల్-ఆధారిత మోడళ్ల మాదిరిగానే కనిపిస్తుంది. ఎవరైనా ఈ రెండు కార్లను దూరం నుంచి చూస్తే, తేడాను గుర్తుపట్టడం కష్టంగా ఉంటుంది. ఈ రెండు రకాల కార్లను దగ్గరగా చూస్తే, స్వల్ప మార్పులు కనిపిస్తాయి. టియాగో ఈవీ హెడ్‌లైట్స్ మరియు బాడీ చుట్టూ బ్లూ కలర్ యాక్సెంట్‌లు ఉంటాయి. ఇంటీరియర్ కూడా స్టాండర్డ్ టాటా టియాగోకి చాలా దగ్గర పోలికను కలిగి ఉంటుంది, అయితే ఇక్కడ కూడా బ్లూ కలర్ యాక్సెంట్స్ ప్రధానంగా కనిపిస్తాయి. ఈ కారులోని గేర్ లివర్ ఇప్పుడు రోటరీ డ్రైవ్-సెలెక్టర్ నాబ్‌తో భర్తీ చేయబడి ఉంటుంది.

టాటా టియాగో ఈవీ గురించి మీరు తెలుసుకోవాల్సిన పూర్తి విషయాలు..ఇది చవకైన ఎలక్ట్రిక్ కారు మాత్రమే కాదు, అంతకు మించి..

ఫీచర్లు

టియాగో ఈవీలో లభించే ఫీచర్ల విషయానికొస్తే, ఈ ఎలక్ట్రిక్ కారులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన పెద్ద 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, 8-స్పీకర్లతో కూడిన హర్మాన్ ఆడియో సిస్టమ్, టాటా ZConnect టెలిమాటిక్స్ మొదలైన ఫీచర్లు చాలానే ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే, ఈ కారులో బహుళ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, రియర్ పార్కింగ్ కెమెరా మొదలైనవి ఉన్నాయి.

టాటా టియాగో ఈవీ గురించి మీరు తెలుసుకోవాల్సిన పూర్తి విషయాలు..ఇది చవకైన ఎలక్ట్రిక్ కారు మాత్రమే కాదు, అంతకు మించి..

ధరలు

ప్రారంభంలో చెప్పుకున్నట్లుగా టాటా టియాగో ఈవీ కేవలం రూ.8.49 లక్షల ప్రారంభ ధరకే (బేస్ ఎక్స్‌టి వేరియంట్) విడుదల చేయబడింది. ఈ ధర వద్ద ఇది దేశంలోనే అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారుగా నిలుస్తుంది. ఇక ఇందులో 7.2kW AC ఛార్జర్‌తో కూడిన టాప్-స్పెక్ టాటా టియాగో ఈవీ (ఎక్స్‌జెడ్ ప్లస్ టెక్ లక్స్' వేరియంట్ ధర రూ. 11.79 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది.

టియాగో ఈవీ వేరియంట్ల వారీగా లభించే ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

Tata Tiago EV Price
Battery Pack Charging Option Variant Price
19.2 kWh 3.3 kW AC XE ₹8.49 Lakh
XT ₹9.09 Lakh
24 kWh 3.3 kW AC XT ₹9.99 Lakh
XZ+ ₹10.79 Lakh
XZ+ Tech LUX ₹11.29 Lakh
7.2 kW AC XZ+ ₹11.29 Lakh
XZ+ Tech LUX ₹11.79 Lakh
టాటా టియాగో ఈవీ గురించి మీరు తెలుసుకోవాల్సిన పూర్తి విషయాలు..ఇది చవకైన ఎలక్ట్రిక్ కారు మాత్రమే కాదు, అంతకు మించి..

బుకింగ్స్ మరియు డెలవరీలు

టాటా టియాగో ఈవీ కోసం అక్టోబర్ 10, 2022వ తేదీ నుండి కంపెనీ అధికారికంగా బుకింగ్‌లను స్వీకరించనుంది. టాటా మోటార్స్ యొక్క అధికారిక వెబ్‌సైట్ లేదా దేశవ్యాప్తంగా ఉన్న టాటా మోటార్స్ డీలర్‌షిప్‌లను సందర్శించి కస్టమర్లు ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ఇక డెలివరీల విషయానికి వస్తే, జనవరి 2023 నుండి ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.

Most Read Articles

English summary
Everything you need to know about tata tiago electric car
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X