ఆటోమొబైల్ కంపెనీలకు కలిసిరాని పాత సంవత్సరం.. మరి కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుందో..

భారత ఆటోమొబైల్ మార్కెట్ గడచిన 2019 నుండి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ సంవత్సరంలో మాంద్యం మార్కెట్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తే, 2020లో BS6 పరివర్తన మరియు 2021 కోవిడ్ సంక్షోభం ఈ మార్కెట్‌ను అనుసరిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం, మనం 2022 లోకి అడుగుపెడుతున్నప్పటికీ, భవిష్యత్తులో పరిస్థితులు అంత తేలికగా ఉండబోవని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆటోమొబైల్ మార్కెట్ 2021కి ఆశాజనకంగా ఉన్నప్పటికీ, కోవిడ్-19 యొక్క రెండవ వేవ్ మరియు సెమీకండక్టర్ చిప్ కొరత గత సంవత్సరం వృద్ధికి ఆటంకాన్ని కలిగించింది.

ఆటోమొబైల్ కంపెనీలకు కలిసిరాని పాత సంవత్సరం.. మరి కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుందో..

గడచిన 2021 ద్వితీయ అర్థభాగంలో భారత ఆటోమొబైల్ పరిశ్రమపై సెమీకండక్టర్ చిప్‌ల తీవ్రంగా ఉంది. దీంతో ప్రముఖ కార్ల తయారీ సంస్థలు తమ వాహనాల ఉత్పత్తిలో అంతరాయాలను ఎదుర్కున్నాయి. ఫలితంగా, కార్ల అమ్మకాలు కూడా మందగించాయి. గ్లోబల్ చిప్ సంక్షోభం గత నెలలో కూడా కొనసాగింది, ఇది డిసెంబర్ 2021 నెలలో భారతదేశంలో వాహన విక్రయాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది.

ఆటోమొబైల్ కంపెనీలకు కలిసిరాని పాత సంవత్సరం.. మరి కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుందో..

ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, డిసెంబర్ 2020తో పోలిస్తే డిసెంబర్‌ 2021లో భారతదేశంలో వాహన విక్రయాలు 16.05 శాతం తగ్గాయి. డిసెంబర్ 2020లో విక్రయించిన 18,56,869 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో డీలర్లు మొత్తం 15,58,756 వాహనాలను మాత్రమే విక్రయించారు.

ఆటోమొబైల్ కంపెనీలకు కలిసిరాని పాత సంవత్సరం.. మరి కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుందో..

డిసెంబర్ 2020 నెలలో 2,74,605 ​​యూనిట్లుగా దేశీయ ప్యాసింజర్ వాహన విక్రయాలు డిసెంబర్‌ 2021 నెలలో 10.91 శాతం తగ్గి 2,44,639 యూనిట్లకు పడిపోయాయి. మార్కెట్లో కార్లకు డిమాండ్ బలంగా ఉన్నప్పటికీ, అమ్మకాలు తగ్గడానికి ప్రధాన కారణం మాత్రమే సెమీకండక్టర్ చిప్‌ల కొరతే అని స్పష్టమవుతోంది. ఈ సమస్య కారణంగా తగ్గిన వాహనాల ఉత్పత్తి, పెరిగిన వెయిటింగ్ పీరియడ్ లు కార్ల అమ్మకాలపై ప్రభావాన్ని చూపాయి.

ఆటోమొబైల్ కంపెనీలకు కలిసిరాని పాత సంవత్సరం.. మరి కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుందో..

కోవిడ్-19 యొక్క ఆర్థిక ప్రభావం కారణంగా భారతదేశంలో ద్విచక్ర వాహనాల అమ్మకాల డిమాండ్ మెరుగుపడలేదని డీలర్ అసోసియేషన్ తెలిపింది. డిసెంబర్ 2020లో 14,33,334 యూనిట్లుగా ఉన్న దేశీయ ద్విచక్ర వాహన విక్రయాలు గత నెలలో 11,48,732 యూనిట్లకు పడిపోయాయి. ఈ సమయంలో టూవీలర్ సేల్స్ 19.86 శాతం క్షీణించాయి. జనవరి 2022లో భారతదేశంలో కోవిడ్ కేసులు తిరిగి పెరడం ప్రారంభించాయి. కొత్తగా పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ తో ఇప్పుడు కలకలం మొదలైంది.

ఆటోమొబైల్ కంపెనీలకు కలిసిరాని పాత సంవత్సరం.. మరి కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుందో..

ఈ పరిస్థితుల్లో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన ప్రయాణ ఆంక్షల కారణంగా జనవరి 2022లో ద్విచక్ర వాహన విక్రయాల డిమాండ్ మరింత ప్రభావితం అవుతుందని FADA ఆందోళన చెందుతోంది. 'సాధారణంగా డిసెంబర్ నెల అధిక విక్రయాల నెలగా పరిగణించబడుతుంది, ఈ నెలలో తయారీదారులు సంవత్సరం మార్పు కారణంగా ఇన్వెంటరీని క్లియర్ చేయడానికి మెరుగైన తగ్గింపులను అందిస్తూ ఉంటాయి. అయినప్పటికీ గడచిన నెలలో ఆ ప్రభావం అంతగా కనిపించలేదని FADA అధ్యక్షుడు వింకేశ్ గులాటీ అన్నారు.

ఆటోమొబైల్ కంపెనీలకు కలిసిరాని పాత సంవత్సరం.. మరి కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుందో..

గడచిన క్యాలెండర్ ఇయర్ ఆటోమొబైల్ తయారీదారులకు నిరాశాజనక ఫలితాలను ఇచ్చింది. గత సంవత్సరం ప్రారంభమైన సెమీ-కండక్టర్ కొరత ఇప్పటికీ కొనసాగుతోంది, కార్ కంపెనీలకు పెద్ద సంఖ్యలో బుకింగ్‌లు ఉన్నప్పటికీ, డిసెంబర్‌ నెలలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు మాత్రం నెగిటివ్ గా ముగిశాయి. అయితే వాహనాల సరఫరాలో డీలర్లు స్వల్ప వెసులుబాటును కనబరిచారని ఫడా తెలిపింది. దేశం కోవిడ్-19 మహమ్మారి యొక్క మరొక వేవ్ ను ఎదుర్కొంటున్నందున, ఇది సమీప భవిష్యత్తులో వాహనాల అమ్మకాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని FADA పేర్కొంది.

ఆటోమొబైల్ కంపెనీలకు కలిసిరాని పాత సంవత్సరం.. మరి కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుందో..

గతేడాది పండుగల సీజన్ కూడా మార్కెట్‌కు ప్రతికూలంగా మారింది. చిప్ సంక్షోభం వలన ఆటోమొబైల్ కంపెనీలు వాహన ఉత్పత్తిని ప్రభావితమైంది. తద్వారా ఫ్యాక్టరీ నుండి డీలర్‌లకు జరిగే షిప్పింగ్‌ను కూడా ప్రభావితం చేసింది. ఫలితంగా, వాహనాల అమ్మకాలు క్షీణించాయి. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే, గడచిన పండుగ సందర్భంగా ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర వాహనాలు మరియు ట్రాక్టర్ల రిటైల్ అమ్మకాలు బాగా పడిపోయాయని FADA నివేదించింది.

ఆటోమొబైల్ కంపెనీలకు కలిసిరాని పాత సంవత్సరం.. మరి కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుందో..

ఫడా నివేదిక ప్రకారం, 2020 లో భారతదేశంలో విక్రయించిన మొత్తం 25,56,335 యూనిట్ల వాహనాలతో పోలిస్తే, గడచిన 2021 లో విక్రయించిన మొత్తం రిటైల్ అమ్మకాలు 20,90,893 యూనిట్లకు పడిపోయాయి. అయితే, ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో ఈ ట్రెండ్ మరోలా ఉంది. డిసెంబర్ 2021 నెలలో ఎలక్ట్రిక్ వాహన తయారీదారులు భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలలో భారీ వృద్ధిని సాధించారు. జెఎమ్‌కె రీసెర్చ్ అండ్ అనలిటిక్స్ నివేదిక ప్రకారం, డిసెంబర్ 2021లో ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ 240 శాతం దాటి, నెలకు 50,000 యూనిట్లకు చేరుకుంది.

ఆటోమొబైల్ కంపెనీలకు కలిసిరాని పాత సంవత్సరం.. మరి కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుందో..

డిసెంబర్ 2021లో మొత్తం EV అమ్మకాలు 50,866 యూనిట్లుగా ఉన్నాయి. ఈ అమ్మకాల గణాంకాలు డిసెంబర్ 2020 నెలలో విక్రయించిన దాని కంటే 240 శాతం అధికం. అలాగే, నవంబర్ 2021 నెలలో విక్రయించిన వాటి కంటే 21 శాతం అధికం. డిసెంబర్ 2020లో, భారతదేశం అంతటా మొత్తం 14,978 ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. ఈ నివేదిక ప్రకారం, గతేడాది నవంబర్‌లో దేశవ్యాప్తంగా 42,055 ఎలక్ట్రిక్ వాహనాలు నమోదయ్యాయి.

ఆటోమొబైల్ కంపెనీలకు కలిసిరాని పాత సంవత్సరం.. మరి కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుందో..

డిసెంబరు 2021కి సంబంధించిన ఈవీ రిజిస్ట్రేషన్‌లు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మరియు ప్యాసింజర్ త్రీ-వీలర్‌లకు సంబంధించినవి, ఈ నెలలో జరిగిన మొత్తం ఈవీ రిజిస్ట్రేషన్‌లలో 90.3 శాతంగా ఉన్నాయని ఈ అధ్యయనం పేర్కొంది. మొత్తం EV రిజిస్ట్రేషన్లలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మాత్రమే 48.6 శాతం ఉండగా, ఎలక్ట్రిక్ కార్లు 5 శాతం, ఎలక్ట్రిక్ కార్గో త్రీవీలర్లు 4.3 శాతం ఉన్నాయి. ఈ ట్రెండ్ చూస్తుంటే, రానున్న నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు మరింత గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Fada reports passenger vehicle sales declined by 16 per cent in december 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X