కొత్త కార్లు కొనడంతో తగ్గేదేలే అంటున్న 'ఫహద్ ఫాసిల్'.. మొన్న లంబోర్ఘిని ఇప్పుడు మినీ కంట్రీమాన్

పార్టీ లేదా పుష్పా.. అంటేనే మనకు పుష్ప సినిమాలో 'భన్వర్ సింగ్ షెకావత్' (ఫహద్ ఫాసిల్) గుర్తొచ్చేస్తాడు. పుష్ప సినిమాతో బాగా పాపులర్ అయిన మన ఫహద్ ఫాసిల్ గురించి దాదాపు అందరికి తెలుసు. ఎందుకంటే ఇతడు ఎక్స్ప్రెషన్ బ్యూటీ 'నజ్రియా నజీమ్' భర్త కూడా. అయితే ఇటీవల ఈయన ఒక ఖరీదైన కారుని కొనుగోలు చేసినట్లు తెలిసింది.

ఇంతకీ ఫహద్ ఫాసిల్ కొనుగోలు చేసిన కారు ఏది, దాని ధర ఏమిటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

కొత్త కార్లు కొనడంతో తగ్గేదేలే అంటున్న 'ఫహద్ ఫాసిల్'.. మొన్న లంబోర్ఘిని ఇప్పుడు మినీ కంట్రీమాన్

నివేదికల ప్రకారం, ఫహద్ ఫాసిల్ ఇటీవల మినీ కంట్రీమ్యాన్ JCW కారును కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఇది కంపెనీ యొక్క అత్యంత పవర్ పుల్ కార్లలో ఒకటి. ఈ కొత్త కారుని కొచ్చిలోని మినీ డీలర్ నుంచి కొనుగోలు చేశారు. ఈ కొత్త మినీ కంట్రీమ్యాన్ ధర సుమారు రూ. 58 లక్షల (ఆన్-రోడ్) వరకు ఉంటుంది.

కొత్త కార్లు కొనడంతో తగ్గేదేలే అంటున్న 'ఫహద్ ఫాసిల్'.. మొన్న లంబోర్ఘిని ఇప్పుడు మినీ కంట్రీమాన్

నిజానికి మినీ కంపెనీ తన కొత్త కంట్రీమాన్ స్పోర్ట్స్ యాక్టివిటీ వెహికల్ ని రెండు వేరియంట్లలో విడుదల చేసింది. అవి కంట్రీమాన్ కూపర్ ఎస్ మరియు కంట్రీమాన్ కూపర్ ఎస్ జెసిడబ్ల్యు ఇన్స్పైర్డ్. ఇవి రెండూ కూడా చాలా ఆకర్షణీయమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతాయి.

కొత్త కార్లు కొనడంతో తగ్గేదేలే అంటున్న 'ఫహద్ ఫాసిల్'.. మొన్న లంబోర్ఘిని ఇప్పుడు మినీ కంట్రీమాన్

మినీ కంట్రీమ్యాన్ అద్భుతమైన డిజైన్ కలిగి ఇప్పుడు కొంత అప్డేటెడ్ లుక్ పొందుతుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ మరియు ఎల్ఈడీ టెయిల్ లైట్స్ వంటివి ఉన్నాయి. ఇందులో ఇప్పుడు కొత్త రేడియేటర్ గ్రిల్ చూడవచ్చు. ఇది 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటుంది.

కొత్త కార్లు కొనడంతో తగ్గేదేలే అంటున్న 'ఫహద్ ఫాసిల్'.. మొన్న లంబోర్ఘిని ఇప్పుడు మినీ కంట్రీమాన్

మినీ కంట్రీమాన్ కూపర్ ఎస్ లోపల కార్బన్ బ్లాక్ లెథరెట్ అపోల్స్ట్రే ఉంటుంది. అయితే జేసీడబ్ల్యు మాత్రం ప్రీమియం లెదర్ అపోల్స్ట్రే తో పాటు సిల్వర్ ట్రిమ్ కలిగి ఉంది. అదే సమయంలో ఇందులో 8.8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, హెడ్స్-అప్ డిస్ప్లే, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్స్ వంటివి ఉన్నాయి.

కొత్త కార్లు కొనడంతో తగ్గేదేలే అంటున్న 'ఫహద్ ఫాసిల్'.. మొన్న లంబోర్ఘిని ఇప్పుడు మినీ కంట్రీమాన్

ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 2.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ అందుబాటులో ఉంటుంది. ఇది 189 బిహెచ్‌పి పవర్ మరియు 280 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. జెసిడబ్ల్యు ఇన్స్పైర్డ్ వేరియంట్ పాడిల్ షిఫ్టర్లతో వస్తుంది.

కొత్త కార్లు కొనడంతో తగ్గేదేలే అంటున్న 'ఫహద్ ఫాసిల్'.. మొన్న లంబోర్ఘిని ఇప్పుడు మినీ కంట్రీమాన్

మినీ కంట్రీమాన్ భారత మార్కెట్లో ప్రముఖ లగ్జరీ కార్ల విభాగంలో ఒకటిగా ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ కార్లు అనేక కొత్త ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటం వల్ల ఇది చాలా ఆకర్షణీయమైనవిగా ఉంటాయి. డిజైన్ మరోయు ఫీచర్స్ మాత్రమే కాకుండా ఇందులో సేఫ్టీ ఫీచర్స్ కూడా విరివిగానే ఉంటాయి.

కొత్త కార్లు కొనడంతో తగ్గేదేలే అంటున్న 'ఫహద్ ఫాసిల్'.. మొన్న లంబోర్ఘిని ఇప్పుడు మినీ కంట్రీమాన్

ఇక ఫహద్ ఫాసిల్ 'మినీ కంట్రీమాన్' కొనుగోలు చేయడానికి ముంది లంబోర్ఘిని' (Lamborghini) కంపెనీకి చెందిన పాపులర్ మోడల్ 'ఉరుస్' (Urus) కొనుగోలు చేసాడు. దీని ధర రూ. భారతీయ మార్కెట్లో రూ. 3.15 కోట్లు. ఈ కొత్త లంబోర్ఘిని ఉరుస్ 'గ్రిజియో కెరెస్' కలర్ లో చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ ఎస్‌యూవీతో ఫహద్ ఫాసిల్ రోడ్డుపై కూడా కనిపించాడు.

కొత్త కార్లు కొనడంతో తగ్గేదేలే అంటున్న 'ఫహద్ ఫాసిల్'.. మొన్న లంబోర్ఘిని ఇప్పుడు మినీ కంట్రీమాన్

లంబోర్ఘిని ఉరుస్ ఎస్‌యూవీ స్లిమ్ ఎల్‌ఇడి హెడ్‌లైట్, టెయిల్ లైట్స్ వంటివి పొందుతుంది. డిజైన్ పరంగా ఇది లంబోర్ఘిని హురాకాన్ సూపర్ కార్ నుండి ప్రేరణ పొందింది. లంబోర్ఘిని ఉరుస్ 21 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, 22 మరియు 23 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఆప్సన్ లో కూడా అందుబాటులో ఉంది. ఫీచర్స్ కూడా ఇందులో చాలా వరకు ఆధునికంగా ఉంటాయి.

కొత్త కార్లు కొనడంతో తగ్గేదేలే అంటున్న 'ఫహద్ ఫాసిల్'.. మొన్న లంబోర్ఘిని ఇప్పుడు మినీ కంట్రీమాన్

లంబోర్ఘిని ఉరుస్ అద్భుతమైన పనితీరుని అందించడానికి 4-లీటర్ ట్విన్-టర్బో వి8 ఇంజిన్ పొందుతుంది. ఇది 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 650 బిహెచ్‌పి పవర్ మరియు 2,250 ఆర్‌పిఎమ్ వద్ద 850 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 3.6 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. అదే విధంగా 12.8 సెకన్లలో 0 నుంచి 200 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది.

కొత్త కార్లు కొనడంతో తగ్గేదేలే అంటున్న 'ఫహద్ ఫాసిల్'.. మొన్న లంబోర్ఘిని ఇప్పుడు మినీ కంట్రీమాన్

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతదేశంలో చాలామంది సెలబ్రెటీలు 'విజయ దశమి' పండుగ సందర్భంగా కొత్త కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి 'ఫహద్ ఫాసిల్' కూడా చేరారు. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలతో పాటు, కొత్త కార్లు మరియు కొత్త బైకుల గురించి మరింత సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Monday, October 10, 2022, 9:56 [IST]
English summary
Fahad fazil buys new mini countryman jcw inspired details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+