ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్‌లో సమస్య: డిజైర్ టూర్ ఎస్ కార్లను రీకాల్ చేసిన మారుతి సుజుకి!

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి అందిస్తున్న పాపులర్ కాంపాక్ట్ సెడాన్ డిజైర్ టూర్ ఎస్ (Maruti Suzuki Dzire Tour S) లోని ఎయిర్‌బ్యా సిస్టమ్‌లో సమస్య కారణంగా వాటిని రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది.

Recommended Video

Maruti Grand Vitara బుకింగ్స్ | వివరాలు

మారుతి సుజుకి డిజైర్ యొక్క కమర్షియల్ టాక్సీ వెర్షనే ఈ డిజైర్ టూర్ ఎస్. ఇది ప్రైవేట్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండదు, కేవలం ఫ్లీట్ ఆపరేటర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ కారులోని ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్‌లో లోపాలున్నట్టు గుర్తించామని, అందుకే వాటిని వెనక్కు పిలిస్తున్నామని మారుతి సుజుకి తెలిపింది.

ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్‌లో సమస్య: డిజైర్ టూర్ ఎస్ కార్లను రీకాల్ చేసిన మారుతి సుజుకి!

మారుతి సుజుకి ఇండియా లేటెస్ట్ రీకాల్‌లో మొత్తం 166 డిజైర్ టూర్ ఎస్ కార్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆగస్టు 6, 2022 నుంచి ఆగస్టు 16, 2022 మధ్యలో తయారు చేసి, విక్రయించబడినట్లుగా కంపెనీ గుర్తించింది. రీకాల్‌కు వర్తించే వాహనాలను మారుతి సుజుకి గుర్తించి, సదరు వాహన యజమానులకు సమాచారం అందిస్తుంది. ఈ రీకాల్ కు ప్రభావితమయ్యే వాహనాలలో కంపెనీ ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్‌ను ఉచితంగా రీప్లేస్ చేయనుంది. ఇందుకోసం వాహన యజమానులు తమ కారును మారుతి సుజుకి అధీకృత సర్వీస్ సెంటరుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది.

ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్‌లో సమస్య: డిజైర్ టూర్ ఎస్ కార్లను రీకాల్ చేసిన మారుతి సుజుకి!

ఒకవేళ ఎవరైనా తమ వాహనం ఈ రీకాల్‌కు వర్తిస్తుందో లేదో తామే స్వయంగా తెలుసుకోవాలనుకుంటే, మారుతి సుజుకి ఇండియా యొక్క అధికారిక వెబ్‌సైట్‌ ను సందర్శించి, అక్కడ కనిపించే 'Imp Customer Info' అనే ట్యాబ్ పై క్లిక్ చేసి, తమ వాహనానికి సంబంధించిన ఛాసిస్ నెంబర్ ను నమోదు చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. యజమానులు తమ వెహికల్ ఛాసిస్ నెంబరును వాహనం యొక్క విండ్‌షీల్డ్ పై కానీ, ఒరిజినల్ ఇన్వాయిస్ పై కానీ లేదా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పై కానీ చూడవచ్చు.

ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్‌లో సమస్య: డిజైర్ టూర్ ఎస్ కార్లను రీకాల్ చేసిన మారుతి సుజుకి!

ఆగస్టు 6, 2022 నుంచి ఆగస్టు 16, 2022 మధ్యలో తయారు చేసిన మొత్తం 166 డిజైర్ టూర్ ఎస్ కార్లలో ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్‌కు సంబంధించిన సమస్యను గుర్తించినట్లు మారుతి సుజుకి స్టాక్ ఎక్స్చేంజ్‌ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ సమస్య వలన అత్యవసర పరిస్థితుల్లో ఎయిర్‌బ్యాగ్‌ల తెరచుకోవడం విఫలమయ్యే అవకాశం ఉందని, కాబట్టి ముందు జాగ్రత్తగా ఈ రీకాల్‌ను ప్రకటిస్తున్నామని కంపెనీ వివరించింది. ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్‌ను మార్చే వరకు వాహనాన్ని నడపవద్దని మారుతీ అధికారిక నోటిఫికేషన్‌లో సూచించింది.

ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్‌లో సమస్య: డిజైర్ టూర్ ఎస్ కార్లను రీకాల్ చేసిన మారుతి సుజుకి!

లోపభూయిష్ట ఎయిర్‌బ్యాగ్ కంట్రోల్ యూనిట్‌ను భర్తీ చేయడానికి మారుతి సుజుకి అధీకృత వర్క్‌షాప్ నుండి సంబంధిత వాహన యజమానులకు సమాచారం పంపబడుతుంది. మారుతి సుజుకి డిజైర్ టూర్ ఎస్ ను క్యాబ్‌లు, టాక్సీలు వంటి వాణిజ్య అవసరాల కోసం మాత్రమే కంపెనీ విక్రయిస్తోంది. డిజైర్ టూర్ ఎస్ పెట్రోల్ ఫ్యూయెల్ ఆప్షన్ తో పాటుగా సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్ తో కూడా అందుబాటులో ఉంది. ఇది ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్‌తో అమర్చబడి ఉంటుంది. ఇందులో తుప్పు మరియు లీకేజీని నిరోధించడానికి స్టెయిన్‌లెస్ స్టీల్ పైపులు మరియు పరికరాలను ఉపయోగించి తయారు చేయబడింది.

ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్‌లో సమస్య: డిజైర్ టూర్ ఎస్ కార్లను రీకాల్ చేసిన మారుతి సుజుకి!

అలాగే సిఎన్‌జి కార్లలో షార్ట్-సర్క్యూటింగ్‌ సమస్యను నివారించడానికి ఇందులోని వైరింగ్ కు ఇంటిగ్రేటెడ్ వైర్ జీన్ (వైర్ కేసింగ్) కూడా ఉంటుంది. అలాగే, కారులో సిఎన్‌జి ఇంధనం నింపుతున్నప్పుడు ఇంజన్ ఆఫ్ లో ఉండేలా ఓ మైక్రోస్విచ్ కూడా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో మారుతి సుజుకి డిజైర్ టూర్ ఎస్ పెట్రోల్ మరియు సిఎన్‌జి వేరియంట్లోల అందుబాటులో ఉంది. వీటి ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా రూ.6.21 లక్షలు (పెట్రోల్) మరియు రూ.7.16 లక్షలు (సిఎన్‌జి) గా ఉన్నాయి.

ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్‌లో సమస్య: డిజైర్ టూర్ ఎస్ కార్లను రీకాల్ చేసిన మారుతి సుజుకి!

మారుతి సుజుకి డిజైర్‌ టూర్ ఎస్ 1.2-లీటర్, 4-సిలిండర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. పెట్రోల్ మోడ్‌లో ఈ ఇంజన్ గరిష్టంగా 89 బిహెచ్‌పి పవర్‌ను మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే, సిఎన్‌జి మోడ్‌లో ఇదే ఇంజన్ 76 బిహెచ్‌పి శక్తిని మరియు 95 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కేవలం 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ తో మాత్రమే లభిస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే, పెట్రోల్ వెర్షన్ లీటరుకు 19.95 కిలోమీటర్ల మైలేజీని మరియు సిఎన్‌జి వెర్షన్ కేజీకి 26.55 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని (ఏఆర్ఏఐ) సర్టిఫై చేయబడింది.

ఎయిర్‌బ్యాగ్ సిస్టమ్‌లో సమస్య: డిజైర్ టూర్ ఎస్ కార్లను రీకాల్ చేసిన మారుతి సుజుకి!

డిజైర్ టూర్ ఎస్ టాక్సీ వెర్షన్ కావడంతో ఇది బేసిక్ ఫీచర్లతో అందుబాటులో ఉంటుంది. ఇందులో బాడీ కలర్ బంపర్స్, స్టైలిష్ హనీకోంబ్ గ్రిల్ మరియు దాని మధ్యలో పెద్ద సుజుకి లోగో, హాలోజెన్ హెడ్‌ల్యాంప్స్, ఆప్షనల్ ఫాగ్‌ల్యాంప్స్ కోసం ఫాగ్ ల్యాంప్ హౌసింగ్, స్టీల్ వీల్స్, డ్యూయెల్ టోన్ ఇంటీరియర్స్, డోర్ ట్రిమ్స్ పై ఫ్యాబ్రిక్ ఇన్‌సెర్ట్స్, రిమోట్ బ్యాక్ డోర్ ఓపెనర్, ఫోల్టింగ్ సీట్స్, ఆఫ్టర్ మార్కెట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం డ్యాష్‌బోర్డులో కటౌట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో రెండు ఎయిర్‌బ్యాగ్ లు మరియు ఈబిడితో కూడిన ఏబిఎస్ స్టాండర్డ్ గా లభిస్తాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, August 24, 2022, 17:27 [IST]
English summary
Faulty airbag system maruti suzuki india recalled dzire tour s details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+