హ్యుందాయ్ క్రెటాలో ఎయిర్‌బ్యాగ్ ఫెయిల్.. యజమానికి రూ. 3 లక్షలు చెల్లించమన్న సుప్రీం కోర్టు!

కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న క్రెటా ఎస్‌యూవీ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం. ప్రస్తుతం, దేశంలో కెల్లా అత్యధికంగా అమ్ముడవుతున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీలలో క్రెటా నెంబర్ వన్ స్థానంలో ఉంది. అలాంటి క్రెటా ఎస్‌యూవీలో ఇప్పుడు ఓ పెద్ద సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా, జరిగిన ఓ సంఘటన క్రెటా యొక్క సేఫ్టీ వ్యవస్థను ప్రశ్నించేలా ఉంది. ఆ వివరాలేంటో చూద్దాం రండి.

హ్యుందాయ్ క్రెటాలో ఎయిర్‌బ్యాగ్ ఫెయిల్.. యజమానికి రూ. 3 లక్షలు చెల్లించమన్న సుప్రీం కోర్టు!

సాధారణంగా, ప్రయాణీకుల సేఫ్టీ కోసం కారులో ఎయిర్‌బ్యాగ్‌ లను అందిస్తారు. కానీ, ప్రమాదం జరిగినప్పుడు ఇవి ఫెయిల్ అయితే, అసలు కారులో ఈ సేఫ్టీ ఫీచర్ ఉండి ప్రయోజనం ఏముంటుంది. ఢిల్లీకి చెందిన ఓ హ్యుందాయ్ క్రెటా యజమాని తన కారుకి ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్‌బ్యాగ్‌లు విచ్చుకోలేదని దేశపు అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టులో కేసు వేశాడు. ఈ కేసులో నిజానిజాలను పరిశీలించిన కోర్టు, సదరు క్రెటా యజానికి నష్టపరిహారంగా రూ.3 లక్షలు చెల్లించాలని సదరు కంపెనీ ఆదేశించింది.

హ్యుందాయ్ క్రెటాలో ఎయిర్‌బ్యాగ్ ఫెయిల్.. యజమానికి రూ. 3 లక్షలు చెల్లించమన్న సుప్రీం కోర్టు!

ఢిల్లీకి చెందిన శైలేందర్ భట్నాగర్ ఆగస్టు 21, 2015వ తేదీన ఓ హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీని కొనుగోలు చేశాడు. భట్నాగర్ ప్రయాణిస్తున్న హ్యుందాయ్ క్రెటా నవంబర్ 16, 2017వ తేదీన దురదృష్టవశాత్తూ ప్రమాదానికి గురైంది. ఢిల్లీలోని పానిపట్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ జరిగిన సమయంలో క్రెటా నడుపుతున్న పిటిషనర్ (శైలేందర్ భట్నాగర్) తల, ముఖం మరియు ఛాతీ ప్రాంతాల్లో గాయాలయ్యాయి. ఈ సమయంలో క్రెటాలోని ఎయిర్‌బ్యాగ్స్ విచ్చుకోలేదు, దాని కారణంగా అతనికి గాయలైనట్లు తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.

హ్యుందాయ్ క్రెటాలో ఎయిర్‌బ్యాగ్ ఫెయిల్.. యజమానికి రూ. 3 లక్షలు చెల్లించమన్న సుప్రీం కోర్టు!

తన క్రెటాలో అమర్చిన ఎయిర్‌బ్యాగ్‌ లు విఫలమైనందున, భట్నాగర్ హ్యుందాయ్‌ కంపెనీపై కోర్టులో వాజ్యం వేశాడు. అతను ముందుగా తన సమస్యను ఢిల్లీ స్టేట్ కన్స్యూమర్ రిడ్రెసల్ కమిషన్‌ దృష్టికి తీసుకువచ్చాడు. ఢిల్లీ స్టేట్ కన్స్యూమర్ రిడ్రెసల్ కమిషన్ భట్నాగర్‌ కు అనుకూలంగా తీర్పునిచ్చింది మరియు వైద్య ఖర్చులు మరియు ఆస్తి నష్టానికి గాను రూ. 2 లక్షలు, వ్యాజ్యం కోసం రూ. 50,000 మరియు క్రాష్ కారణంగా మానసిక వేదనకు గురైనందుకు మరో రూ. 50,000 చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది.

హ్యుందాయ్ క్రెటాలో ఎయిర్‌బ్యాగ్ ఫెయిల్.. యజమానికి రూ. 3 లక్షలు చెల్లించమన్న సుప్రీం కోర్టు!

అంతేకాకుండా, పిటిషనర్ వాహనం మార్చబడనందున, దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురైన రోజున క్రెటా విలువపై సంవత్సరానికి ఏడు శాతం వడ్డీని పొందవలసి ఉంటుందని కూడా రాష్ట్ర కమిషన్ పేర్కొంది. అయితే, ఢిల్లీ స్టేట్ కన్స్యూమర్ రిడ్రెసల్ కమిషన్ తీర్పుతో హ్యుందాయ్ సంస్థ ఏకీభవించలేదు. కొరియన్ కార్ల తయారీ సంస్థ జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌ లో తీర్పును సవాలు చేసింది. అయితే, కార్ల తయారీ సంస్థ యొక్క అప్పీల్ తిరస్కరించబడింది మరియు ఆ మొత్తాన్ని భట్నాగర్ కు చెల్లించాలని ఢిల్లీ రాష్ట్ర కమిషన్ హ్యుందాయ్ ఆదేశించింది.

హ్యుందాయ్ క్రెటాలో ఎయిర్‌బ్యాగ్ ఫెయిల్.. యజమానికి రూ. 3 లక్షలు చెల్లించమన్న సుప్రీం కోర్టు!

హ్యుందాయ్ వెనక్కు తగ్గకుండా ఈ విషయంపై దేశంలోని అత్యున్నత న్యాయవ్యవస్థ అయిన సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ తీర్పును పునఃపరిశీలించాలని హ్యుందాయ్ మరోసారి సుప్రీం కోర్టును అప్పీల్ చేసింది. అయితే, ఈ ప్రమాద వివరాలను పరిశీలించిన సుప్రీం కోర్టు, భట్నాగర్ వల్ల జరిగిన క్రెటా ప్రమాదంలో ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చడానికి అవసరమైన పరిస్థితులను తీర్చడంలో హ్యుందాయ్ విఫలమైందని, కాబట్టి తప్పనిసరిగా పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మొత్తాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం సదరు పిటిషనర్‌కు అందజేసింది.

హ్యుందాయ్ క్రెటాలో ఎయిర్‌బ్యాగ్ ఫెయిల్.. యజమానికి రూ. 3 లక్షలు చెల్లించమన్న సుప్రీం కోర్టు!

హ్యుందాయ్ క్రెటా ముందు భాగంలో డ్యామేజ్ అయినప్పటిరీ, అందులోని ఎయిర్‌బ్యాగ్ డిప్లాయ్‌మెంట్ సిస్టమ్ విఫలమైందని ప్యానెల్ పేర్కొంది. ఎయిర్‌బ్యాగ్‌లు విచ్చుకోవడానికి వినియోగదారుడు బాద్యుడు కాకూడదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఎయిర్‌బ్యాగ్‌లు పనిచేస్తాయా లేదా అని గుర్తించడానికి క్రాష్ తీవ్రతను లెక్కించడం కస్టమర్‌కు ఇష్టం ఉండదని కోర్టు పేర్కొంది, ఇటువంటి సంఘటనల తర్వాత కూడా కార్ల తయారీదారులు దీనికి బాధ్యత వహించకపోవడం విచారకరం అని తెలిపింది.

హ్యుందాయ్ క్రెటాలో ఎయిర్‌బ్యాగ్ ఫెయిల్.. యజమానికి రూ. 3 లక్షలు చెల్లించమన్న సుప్రీం కోర్టు!

సాధారణంగా, కస్టమర్లు ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్‌బ్యాగ్‌లు సహజంగానే విచ్చుకుంటాయనే భావనలో ఉంటారని కోర్టు పేర్కొంది. తన తీర్పులో, సుప్రీంకోర్టు జాతీయ కమిషన్ తీర్పును సమర్థించడమే కాకుండా, పిటిషనర్ వాహనాన్ని మార్చమని హ్యుందాయ్‌ని ఆదేశించింది. ఒకప్పుడు కార్లలో ఎయిర్‌బ్యాగ్ అనేది యాడ్-ఆన్ సేఫ్టీ ఫీచర్. అధిక డబ్బు చెల్లించే వారికి మాత్రమే ఇలాంటి సేఫ్టీ ఫీచర్ లభించేది. అయితే, ప్రస్తుతం భారతదేశంలో విక్రయించబడుతున్న అన్ని కార్లలో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు (ఫ్రంట్ డ్రైవర్ మరియు కో-ప్యాసింజర్ల కోసం) ఉండటం తప్పనిసరి చేయబడింది.

హ్యుందాయ్ క్రెటాలో ఎయిర్‌బ్యాగ్ ఫెయిల్.. యజమానికి రూ. 3 లక్షలు చెల్లించమన్న సుప్రీం కోర్టు!

సాధారణంగా వినియోగదారులు తాము ప్రయాణిస్తున్న కారు అనుకోని సందర్భాల్లో ప్రమాదాని గురైనప్పుడు అందులో ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి, అవి తమ ప్రాణాలకు రక్షణ కల్పిస్తాయనే భావనతో ఉంటారు. అంతేకానీ, ఎవరూ కూడా తమ కారులో ఎయిర్‌బ్యాగులు పనిచేస్తున్నాయా లేదా అని పరీక్షించేందుకు కావాలనే యాక్సిడెంట్స్ చేయరు. సుప్రీం కోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ప్రమాదం జరిగినప్పుడు కారులో ఎయిర్‌బ్యాగు లు విచ్చుకోకపోవడం అనేది తయారీలోపమేనని కోర్టు పేర్కొంది.

గమనిక: ఈ కథనంలో ఉపయోగించబడిన మునుపటి తరం క్రెటా యొక్క చిత్రాలు కేవలం ప్రాతినిధ్య ప్రయోజనం కోసం మాత్రమే అని గమనించగలరు.

Most Read Articles

English summary
Faulty airbags on hyundai creta supreme court orders to pay car owner rs 3 lakhs
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X