రెనో కార్లపై ప్రేమికుల నెల ఆఫర్లు.. క్విడ్, కైగర్, ట్రైబర్ మరియు డస్టర్ మోడళ్లపై డిస్కౌంట్లు!

ఫ్రెంచ్ కార్ కంపెనీ రెనో ఇండియా (Renault India) దేశీయ మార్కెట్లో ఫిబ్రవరి నెల ఆఫర్లను ప్రకటించింది. ఈ నెలలో రెనో కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు సుమారు రూ. 1.30 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం, రెనో ఇండియా ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో క్విడ్, ట్రైబర్, కైగర్ మరియు డస్టర్ అనే నాలుగు మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నాలుగు మోడళ్లపై కంపెనీ కంపెనీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ మరియు రూరల్ డిస్కౌంట్స్ ఉన్నాయి. ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి.

రెనో కార్లపై ప్రేమికుల నెల ఆఫర్లు.. క్విడ్, కైగర్, ట్రైబర్ మరియు డస్టర్ మోడళ్లపై డిస్కౌంట్లు!

1. రెనో ట్రైబర్ (Renault Triber)

భారతదేశంలోనే ప్రస్తుతం అత్యంత చవకైన 7-సీటర్ ఎమ్‌పివిగా ఉన్న రెనో ట్రైబర్ (Renault Triber) మోడల్ పై కంపెనీ ఈ నెలలో మొత్తం రూ. 40,000 తగ్గింపును అందిస్తోంది. ఇది 2021 సంవత్సరం మోడల్‌పై వర్తిస్తుంది. ఇందులో స్క్రాపేజ్ ప్రోగ్రాం కింద రూ. 44,000 లాయల్టీ బెనిఫిట్ మరియు రూ. 10,000 ఎక్స్చేంజ్ బెనిఫిట్ కూడా ఇవ్వబడుతోంది. అదే సమయంలో, కొత్త 2022 సంవత్సరం మోడల్‌పై కంపెనీ మొత్తం రూ. 40,000 తగ్గింపును అందిస్తోంది. ఇందులో కూడా స్క్రాపేజ్ ప్రోగ్రాం కింద రూ. 44,000 లాయల్టీ బెనిఫిట్ మరియు రూ. 10,000 ఎక్స్చేంజ్ బెనిఫిట్ అందిస్తోంది.

రెనో కార్లపై ప్రేమికుల నెల ఆఫర్లు.. క్విడ్, కైగర్, ట్రైబర్ మరియు డస్టర్ మోడళ్లపై డిస్కౌంట్లు!

2. రెనాల్ట్ క్విడ్ (Renault Kiwd)

రెనో బ్రాండ్ యొక్క ఎంట్రీ లెవల్ కారు అయిన కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ రెనాల్ట్ క్విడ్ (Renault Kiwd) పై కూడా కంపెనీ ఈ నెలలో భారీ తగ్గింపులను అందిస్తోంది. ఈ హ్యాచ్‌బ్యాక్ యొక్క 2021 మోడల్‌పై కంపెనీ ఈ నెల మొత్తం రూ. 35,000 తగ్గింపును అందిస్తోంది. అలాగే, ఇందులో స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద రూ. 37,000, లాయల్టీ బెనిఫిట్ మరియు ఎక్స్చేంజ్ బెనిఫిట్ క్రింద రూ.10,000 ఇవ్వబడుతోంది. అదే సమయంలో, ఇందులో కొత్త 2022 మోడల్‌పై మొత్తం రూ. 35,000 తగ్గింపు ఇవ్వబడుతోంది. ఇందులో స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద రూ. 37,000 లాయల్టీ బెనిఫిట్ మరియు ఎక్స్చేంజ్ బెనిఫిట్ క్రింద రూ.10,000 ఇవ్వబడుతోంది.

రెనో కార్లపై ప్రేమికుల నెల ఆఫర్లు.. క్విడ్, కైగర్, ట్రైబర్ మరియు డస్టర్ మోడళ్లపై డిస్కౌంట్లు!

3. రెనాల్ట్ డస్టర్ (Renault Duster)

రెనో యొక్క పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ డస్టర్ (Renault Duster) పై కంపెనీ ఈ నెలలో మొత్తంగా రూ. 1.30 లక్షల తగ్గింపును అందిస్తోంది. ఇందులోని 2021 మోడల్ పై స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద రూ. 1,10,000 లాయల్టీ బెనిఫిట్ మరియు ఎక్స్చేంజ్ బెనిఫిట్ క్రింద రూ. 10,000 మరియు స్క్రాపేజ్ ప్రోగ్రామ్ కింద అదనంగా మరో రూ. 10,000 ఎక్స్చేంజ్ బెనిఫిట్ ఇవ్వబడుతోంది. ఇందులో, అన్ని వెర్షన్లపై దాదాపు రూ. 50,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్, రూ. 50,000 నగదు తగ్గింపు మరియు రూ. 30,000 వరకూ కార్పొరేట్ తగ్గింపులను కంపెనీ అందిస్తోంది.

రెనో కార్లపై ప్రేమికుల నెల ఆఫర్లు.. క్విడ్, కైగర్, ట్రైబర్ మరియు డస్టర్ మోడళ్లపై డిస్కౌంట్లు!

4. రెనాల్ట్ కిగర్ (Renault Kiger)

రెనో బ్రాండ్ నుండి లేటెస్ట్ గా మార్కెట్లోకి వచ్చిన కాంపాక్ట్ ఎస్‌యూవీ రెనో కైగర్ (Renault Kiger) పై కంపెనీ ఈ నెలలో రూ. 55,000 లాయల్టీ బెనిఫిట్‌తో పాటు రూ. 10,000 కార్పొరేట్ తగ్గింపును అందిస్తోంది. ఇది కంపెనీ యొక్క లేటెస్ట్ మోడల్ మరియు అమ్మకాల పరంగా ఇది బాగా రాణిస్తోంది, దీని కారణంగా కంపెనీ ఈ మోడల్ పై తక్కువ తగ్గింపును అందిస్తోంది. అయినప్పటికీ, ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీపై చిన్న డిస్కౌంట్ ఇవ్వడం ద్వారా ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించాలని కంపెనీ భావిస్తోంది.

రెనో కార్లపై ప్రేమికుల నెల ఆఫర్లు.. క్విడ్, కైగర్, ట్రైబర్ మరియు డస్టర్ మోడళ్లపై డిస్కౌంట్లు!

ప్రస్తుతం మార్కెట్లో రెనో కైగర్ ధరలు రూ. 5.79 లక్షల నుండి ప్రారంభం అవుతాయి. కాగా, ఈ ఆఫర్‌లన్నీ ఫిబ్రవరి 28, 2022 వరకు చెల్లుబాటులో ఉంటాయని, మరియు వివిధ రాష్ట్రాలు, నగరాలను బట్టి ఇవి మారుతూ ఉంటాయని కంపెనీ తెలిపింది. గత నెలలో కంపెనీ అందించిన డిస్కౌంట్ల కారణంగా కంపెనీ విక్రయాలు కాస్తంత మెరుగుపడినప్పటికీ, గతేడాదితో ఇదే సమయంతో పోలిస్తే ఇవి తక్కువగానే ఉన్నాయి. మరి ఈ కొత్త డిస్కౌంట్ల కారణంగా ఫిబ్రవరి నెలలో అమ్మకాలు ఎలా ఉంటాయో చూడాలి.

రెనో కార్లపై ప్రేమికుల నెల ఆఫర్లు.. క్విడ్, కైగర్, ట్రైబర్ మరియు డస్టర్ మోడళ్లపై డిస్కౌంట్లు!

భారీగా పెరిగిన రెనో ఎగుమతులు

రెనో ఇండియా దేశీయ మార్కెట్లో అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, కంపెనీ ఎగుమతులు మాత్రం జోరుగా సాగుతున్నాయి. రెనో గత నెలలో 1 లక్ష వాహనాలను భారతదేశం నుండి వివిధ ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. కంపెనీ ప్రస్తుతం, భారతదేశంలో తయారు చేసిన కార్లను ప్రపంచవ్యాప్తంగా 14 దేశాలకు ఎగుమతి చేస్తోంది. వీటిలో రెనో క్విడ్, రెనో ట్రైబర్ మరియు రెనో కైగర్ మోడళ్లు ఉన్నాయి. రెనో త్వరలోనే ఆఫ్రికా మరియు ఆగ్నేయాసియా ప్రాంతంలోని ఇతర దేశాలకు కూడా తమ వాహనాలను ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉంది.

రెనో కార్లపై ప్రేమికుల నెల ఆఫర్లు.. క్విడ్, కైగర్, ట్రైబర్ మరియు డస్టర్ మోడళ్లపై డిస్కౌంట్లు!

మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ వరల్డ్ సిద్ధాంతంలో భాగంగా రెనో భారతదేశాన్ని తమ వాహనాలకు ఎక్స్‌పోర్ట్ హబ్ గా మార్చుకుంటోంది. కంపెనీ ప్రణాళిక ప్రకారం, రెనో భారతదేశంలో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకునేందుకు గానూ తన ప్రోడక్డ్ పోర్ట్‌ఫోలియోలో అందుబాటులో ఉన్న ఉత్పత్తుల అభివృద్ధిని వేగవంతం చేయాలని చూస్తోంది. దీనితో పాటు, భారత మార్కెట్లో మరిన్ని కొత్త ఉత్పత్తులను కూడా ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, February 2, 2022, 13:02 [IST]
English summary
February 2022 offers and discounts on renault cars kwid kiger triber and duster
Read more on: #రెనో #renault
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+