భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త ఫెరారీ 296 GTB: ధర రూ. 5.40 కోట్లు

ఇటాలియన్ సూపర్ కార్ తయారీ సంస్థ 'ఫెరారీ' (Ferrari) తన మొట్ట మొదటి 6 సిలిండర్ స్పోర్ట్స్‌కార్ అయిన 'ఫెరారీ 296 జిటిబి' (Ferrari 296 GTB) విడుదల చేసింది. ఈ కొత్త హైబ్రిడ్ సూపర్ కార్ ధర అక్షరాలా రూ. 5.40 కోట్లు (ఎక్స్-షోరూమ్).

Recommended Video

Maruti Alto K10 Launched At Rs 3.99 Lakh In Telugu | What’s New On The Hatchback? Dual-Jet VVT & AMT

కంపెనీ ఈ కొత్త ఫెరారీ 296 GTB ని గత సంత్సరం జూన్‌లో ఆవిష్కరించింది. అయితే ఇప్పుడు అధికారికంగా విడుదల చేసింది. ఈ లేటెస్ట్ కారు గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

మార్కెట్లో విడుదలైన కొత్త ఫెరారీ 296 GTB: ధర రూ. 5.40 కోట్లు

నిజానికి ఫెరారీ కార్లు అంటేనే ముందుగా గుర్తొచ్చేది అద్భుతమైన వాటి డిజైన్, కావున కొత్త ఫెరారీ 296 జిటిబి సూపర్ కారు మంచి ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ కార్టు ఇప్పుడు తక్కువ వీల్‌బేస్‌ను కలిగి ఉంది. అయితే డిజైన్ దాదాపు దాని ఫెరారీ 250 LM మాదిరిగానే ఉంటుంది.

మార్కెట్లో విడుదలైన కొత్త ఫెరారీ 296 GTB: ధర రూ. 5.40 కోట్లు

ఇందులో ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే, మిడ్-ఇంజిన్ స్పోర్ట్స్‌కార్‌లో మొదటిసారిగా, ఫెరారీ యాక్టివ్ స్పాయిలర్‌ను కూడా ఉపయోగించింది. ఇది మరింత ఆకర్షణను తీసుకువస్తుంది. ఈ కొత్త మోడల్ యొక్క హెడ్‌లైట్ స్టైల్ 'టియర్‌డ్రాప్' ఆకారంలో ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇందులోని గేర్‌షిఫ్ట్ సెలెక్టర్ ఫెరారీ యొక్క క్లాసిక్ 'H-గేట్' డిజైన్‌కు నివాళిగా రూపొందించబడింది.

మార్కెట్లో విడుదలైన కొత్త ఫెరారీ 296 GTB: ధర రూ. 5.40 కోట్లు

ఫెరారీ 296 GTB యొక్క పరిమాణం కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సూపర్ కారు యొక్క పొడవు 4,565 మిమీ, వెడల్పు 1,958 మిమీ, ఎత్తు 1,187 మిమీ మరియు వీల్ బేస్ 2600 మిమీ వరకు ఉంటుంది. కావున వాహన వినియోగదారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.

మార్కెట్లో విడుదలైన కొత్త ఫెరారీ 296 GTB: ధర రూ. 5.40 కోట్లు

ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే, లోపలి భాగంలో ఎక్కువ భాగం డ్యూయల్-టోన్ ఫినిషింగ్ లో ఉంటుంది (బ్లాక్ అండ్ రెడ్). అదే సమయంలో ఇందులోని ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ లెదర్ తో చుట్టబడి మంచి పట్టును అందించే విధంగా ఉంది. ఈ స్టీరింగ్ రెడ్ స్టిచ్చింగ్ కూడా పొందుతుంది. సీట్లు కూడా రెడ్ మరియు బ్లాక్ థీమ్ లో ఉంటాయి. మొత్తం మీద ఇది మంచి ఇంటీరియర్ డిజైన్ పొందుతుంది.

మార్కెట్లో విడుదలైన కొత్త ఫెరారీ 296 GTB: ధర రూ. 5.40 కోట్లు

భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త ఫెరారీ 296 జిటిబి లో ట్విన్-టర్బో 3.0 లీటర్ V6 హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌ కలిగి ఉంటుంది. ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో కలిపి ఇంజిన్ 819 బిహెచ్‌పి పవర్ మరియు 740 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్ 165 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఎఫ్1 డిసిటి గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

మార్కెట్లో విడుదలైన కొత్త ఫెరారీ 296 GTB: ధర రూ. 5.40 కోట్లు

ఫెరారీ 296 జిటిబి నాలుగు డ్రైవింగ్ మోడ్‌లను పొందుతుంది. అవి ఇ-డ్రైవ్, హైబ్రిడ్, పెర్ఫార్మెన్స్ మరియు క్వాలిఫై మోడ్స్. ఈ నాలుగు డ్రైవింగ్ మోడ్స్ విభిన్న పవర్ ఫిగర్‌లను అందించడమే కాకుండా రీజెనరేటివ్ బ్రేకింగ్‌ కూడా పొందుతాయి. ఈ రీజెనరేటివ్ బ్రేకింగ్‌ అనేది ఆధునిక కార్లలో అందుబాటులో ఉన్న లేటెస్ట్ ఫీచర్.

మార్కెట్లో విడుదలైన కొత్త ఫెరారీ 296 GTB: ధర రూ. 5.40 కోట్లు

ఫెరారీ 296 జిటిబి యొక్క గరిష్ట వేగం గంటకు 330 కిమీ వరకు ఉంటుంది. అయితే ఇది కేవలం 2.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు మరియు 7.3 సెకన్లలో గంటకు 0 నుంచి 200 కిమీ వరకు వేగవతం అవుతుంది. అయితే ఈ హైబ్రిడ్ సూపర్‌కార్ మొత్తం-ఎలక్ట్రిక్ పరిధి 25 కి.మీ మాత్రమే. మొత్తం మీద ఇది అత్యంత వేగవతమైన కార్లలో ఒకరుగా ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, August 27, 2022, 11:48 [IST]
English summary
Ferrari has launched the new 296 gtb hyper supercar in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+