భారతదేశంలో మొట్టమొదటి 'అవెంటడార్ అల్టిమే కూపే' డెలివరీ చేసిన లంబోర్ఘిని: వివరాలు

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇటాలియన్ సూపర్ కార్ బ్రాండ్స్ లో ఒకటి 'లంబోర్ఘిని' (Lamborghini). ఈ కంపెనీ ఇప్పుడు తన 'అవెంటడార్ అల్టిమే కూపే' (Aventador Ultimae Coupe) ని భారతదేశపు కస్టమర్ కి డెలివరీ చేసింది. కంపెనీ యొక్క ఈ సూపర్ కార్ భారతదేశంలో మొట్ట మొదటిది కావడం విశేషం. భారతదేశంలో అడుగుపెట్టిన ఈ మొదటి 'లంబోర్ఘిని అవెంటడార్ అల్టిమే కూపే' గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారతదేశంలో మొట్టమొదటి 'లంబోర్ఘిని అవెంటడార్ అల్టిమే కూపే', ఇదే

ఇటాలియన్ సూపర్ కార్ తయారీదారు లంబోర్ఘిని ఇప్పటికే 'అవెంటడార్ అల్టిమే' యొక్క రెండు డోర్ల వెర్షన్‌ను భారతదేశంలో డెలివరీ చేసింది. ఈ అవెంటడార్ అల్టిమే ఎల్లో కలర్ లో చాలా ఆకర్షణీయంగా ఉంది.

అయితే ఇప్పుడు డెలివరీ చేయబడిన మోడల్ 'లంబోర్ఘిని అవెంటడార్ అల్టిమే కూపే'. ఇది వయోలా పాసిఫ్ పర్పుల్ కలర్ స్కీమ్‌లో చూడచక్కగా ఉంది. అయితే ఇది బ్రాంజ్ ఒరేడి యాక్సెంట్‌లను కలిగి. కావున ఇది బ్రేక్ కాలిపర్‌లతో పాటు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

భారతదేశంలో మొట్టమొదటి 'లంబోర్ఘిని అవెంటడార్ అల్టిమే కూపే', ఇదే

ఈ కొత్త 'అవెంటడార్ అల్టిమే కూపే' యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇంటీరియర్ ఎక్కువ భాగం బ్లాక్ కలర్ ఉంది. అదే సమయంలో అక్కడక్కడా గోల్డ్ కలర్ స్టిచ్చింగ్ చూడవచ్చు. ఇది కారుకు మంచి స్పోర్టి అనుభూతిని అందిస్తుంది. సీట్ల యొక్క కింది అంచుల్లో వైట్ కలర్ ఉండటం కూడా గమనించవచ్చు. అంతే కాకుండా సీట్ బెల్ట్ బ్లాక్ కలర్ లో ఉన్నాయి.

భారతదేశంలో మొట్టమొదటి 'లంబోర్ఘిని అవెంటడార్ అల్టిమే కూపే', ఇదే

అవెంటడార్ అల్టిమే కూపే దాని 'రోడ్‌స్టర్ వేరియంట్' మాదిరిగానే లిమిటెడ్ వెర్షన్. అయితే ఇది రోడ్‌స్టర్ వేరియంట్ కంటే కూడా 100 యూనిట్లు ఎక్కువుగా అందుబాటులో ఉంటాయి. అంటే కంపెనీ ఇప్పుడు తన 'లంబోర్ఘిని అవెంటడార్ అల్టిమే కూపే' ని 350 యూనిట్లు ఉత్పత్తి చేస్తుంది. కానీ లంబోర్ఘిని రోడ్‌స్టర్ వేరియంట్ మాత్రం కేవలం 250 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడింది.

భారతదేశంలో మొట్టమొదటి 'లంబోర్ఘిని అవెంటడార్ అల్టిమే కూపే', ఇదే

ఇక లంబోర్ఘిని యొక్క అల్టిమే కూపే యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో కూడా రోడ్‌స్టర్ లో ఉపయోగించిన V12 ఇంజన్ ఉపయోగించారు. కావున ఇందులో 6.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వి12 ఇంజన్ ఉంది. ఇది కూడా 1-12-4-9-2-11-6-7-3-10-5-8 ఫైరింగ్ ఆర్డర్ కలిగి ఉంటుంది. ఇది 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 770 బిహెచ్‌పి పవర్ మరియు 6,750 ఆర్‌పిఎమ్ వద్ద 720 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది.

భారతదేశంలో మొట్టమొదటి 'లంబోర్ఘిని అవెంటడార్ అల్టిమే కూపే', ఇదే

ఇంజిన్ 7-స్పీడ్ రోబోటైజ్డ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. ఇది కేవలం 2.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. అదే సమయంలో ఇది 0 నుంచి 200 కిమీ/గం వరకు వేగవంతం కావడానికి పట్టే సమయం కేవలం 8.7 సెకన్లు మాత్రమే. దీని గరిష్ట వేగం (టాప్ స్పీడ్) గంటకు 355 కిలోమీటర్లు. అంటే ఇది మెరుపువేగంతో దూసుకెళ్తుంది.

భారతదేశంలో మొట్టమొదటి 'లంబోర్ఘిని అవెంటడార్ అల్టిమే కూపే', ఇదే

ఈ సూపర్ కారు యొక్క ముందు భాగంలో 20 ఇంచెస్ వీల్స్, వెనుక భాగంలో 21 ఇంచెస్ వీల్స్ ఉన్నాయి. ఇక టైర్స్ విషయానికి వస్తే ముందు భాగంలో 255/30 జెడ్ఆర్ 20 92వై టైర్స్ మరియు వెనుక భాగంలో 355/25 జెడ్ఆర్ 21 107వై ఇవి రెండూ కూడా పైరెల్లి పి జీరో కోర్సా టైర్లు.

భారతదేశంలో మొట్టమొదటి 'లంబోర్ఘిని అవెంటడార్ అల్టిమే కూపే', ఇదే

బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ సూపర్ కారు యొక్క ముందు భాగంలో సిక్స్-పిస్టన్ ఫిక్స్‌డ్ మోనోబ్లాక్ అల్యూమినియం కాలిపర్‌తో కూడిన 400 మిమీ కార్బన్ సిరామిక్ డిస్క్‌లు మరియు వెనుక భాగంలో ఫోర్-పిస్టన్ స్థిర మోనోబ్లాక్ కాలిపర్‌లతో కూడిన 380 మిమీ కార్బన్ సిరామిక్ డిస్క్‌లు ఉన్నాయి. ఇవి చాలా షార్ప్ గా పనిచేస్తాయి. సస్పెన్షన్ కూడా అనుకూలంగా ఉంటుంది. లంబోర్ఘిని అవెంటడార్ అల్టిమే కూపే యొక్క మొత్తం బరువు 1,550 కేజీలు.

భారతదేశంలో మొట్టమొదటి 'లంబోర్ఘిని అవెంటడార్ అల్టిమే కూపే', ఇదే

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో లంబోర్ఘిని కంపెనీ తన 'అవెంటడార్ అల్టిమే' దెలియరీ చేసిన అతి తక్కువా కాలంలోనే అవెంటడార్ అల్టిమే కూపే కూడా డెలివరీ చేసింది. దీన్ని బట్టి చూస్తే లంబోర్ఘిని కార్లకు మార్కెట్లో ఉన్న డిమాండ్ ఏంటో స్పష్టంగా తెలుస్తోంది. అయితే కంపెనీ డెలివరీ చేసిన ఈ 'అవెంటడార్ అల్టిమే కూపే' యొక్క ధరలు మాత్రం తెలియరాలేదు.ఎప్పటికప్పుడు కొత్త కార్లు, మరియు బైకులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, July 6, 2022, 15:01 [IST]
English summary
First lamborghini aventador ultimae coupe delivered to first indian customer details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+