భారత్‌లో ఫిస్కర్ ఎలక్ట్రిక్ కార్ల విడుదల ఖరారు.. హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం ఏర్పాటు..

అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ ఫిస్కర్ (Fisker Inc) ఇప్పుడు భారతదేశంలో తమ ప్రధాన కార్యాలయాన్ని తెరవడానికి సిద్ధంగా ఉంది. అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ తన భారత ప్రధాన కార్యాలయానికి హైదరాబాద్‌ను వేదికగా ఎంచుకుంది. ఫిస్కర్ ఇన్‌కార్పోరేషన్ భారతీయ విభాగానికి ఫిస్కర్ విజ్ఞాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (Fisker Vigyan India Pvt Ltd) అని పేరు పెట్టారు.

భారత్‌లో ఫిస్కర్ ఎలక్ట్రిక్ కార్ల విడుదల ఖరారు.. హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం ఏర్పాటు..

ఈ మేరకు కంపెనీ బృందం గత నెలలో తెలంగాణ రాష్ట్ర ఐటి మంత్రి కేటిఆర్‌తో సంప్రదింపులు కూడా జరిపారు. ఫిస్కర్ యొక్క హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులు కాలిఫోర్నియాలోని ఇంజనీరింగ్ మరియు ఉత్పత్తి అభివృద్ధి బృందాల (ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ టీమ్)తో కలిసి పని చేస్తారు. ప్రారంభ దశలో భాగంగా, ఈ కంపెనీలో 300 మంది ఐటీ నిపుణులకు ఉపాధి లభించనుంది.

భారత్‌లో ఫిస్కర్ ఎలక్ట్రిక్ కార్ల విడుదల ఖరారు.. హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం ఏర్పాటు..

ఫిష్కర్ ఓషన్ (Fisker Ocean) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ

ఫిస్కర్ తమ ఎలక్ట్రిక్ కార్లను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తోంది. భారతదేశంలో ఫిస్కర్ ముందుగా తమ ఫిస్కర్ ఓషన్‌ (Fisker Ocean) ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించింది. ఫిష్కర్ ఓషన్ (Fisker Ocean) అనేది ఓ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. ఇది ఈ విభాగంలో టెస్లా కార్లకు పోటీగా నిలుస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ మోడల్ అమ్మకాలు, డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భారత్‌లో ఫిస్కర్ ఎలక్ట్రిక్ కార్ల విడుదల ఖరారు.. హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం ఏర్పాటు..

ఫిస్కర్ ఓషన్ మూడు ట్రిమ్ లలో అందుబాటులోకి రానుంది. ఇందులో మొదటిది ఓషన్ స్పోర్ట్. మార్కెట్లో దీని ధరలు 37,499 డాలర్ల (సుమారు రూ.28.59 లక్షల) నుండి ప్రారంభం కానున్నాయి. ఇది బేస్ వేరియంట్ మరియు పూర్తి చార్జ్ పై గరిష్టంగా 440 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తుంది. ఫిస్కర్ ఓషన్ స్పోర్ట్ 275 హెచ్‌పి (205kW) శక్తిని ఉత్పత్తి చేసే సింగిల్ మోటార్ (ఫ్రంట్ వీల్ డ్రైవ్) డ్రైవ్‌ట్రైన్ ఉంటుంది మరియు ఇది కేవలం 6.9 సెకండ్లలోనే గంటకు 0 నుండి 100 వేగాన్ని చేరుకుంటుంది.

భారత్‌లో ఫిస్కర్ ఎలక్ట్రిక్ కార్ల విడుదల ఖరారు.. హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం ఏర్పాటు..

ఇక రెండవ ట్రిమ్ విషయానికి వస్తే, దీని పేరు ఫిస్కర్ ఓషన్ అల్ట్రా. మార్కెట్లో దీని ధరలు 49,999 డాలర్లు (సుమారు రూ.38.11 లక్షలు)గా ఉంటుంది. ఇందులో 540 హెచ్‌పి (400kW) పవర్ ను ఉత్పత్తి చేసే డ్యూయల్ మోటార్ (ఆల్ వీల్ డ్రైవ్) డ్రైవ్‌ట్రైన్ ఉంటుంది. ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 610 కిమీ రేంజ్ ను అందిస్తుంది. ఈ కారు కేవలం 3.9 సెకండ్లలోనే గంటకు 0 నుండి 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది.

భారత్‌లో ఫిస్కర్ ఎలక్ట్రిక్ కార్ల విడుదల ఖరారు.. హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం ఏర్పాటు..

మూడవ ట్రిమ్ ఫిస్కర్ ఓషన్ ఎక్స్‌ట్రీమ్. మార్కెట్లో దీని ధర 68,999 డాలర్లుగా ఉంటుంది. ఇది పూర్తి చార్జ్ పై 630 కిమీ రేంజ్ ను అందిస్తుందని సర్టిఫై చేయబడింది. ఈ ఎలక్ట్రిక్ కారులో 550 హెచ్‌పి (410kW) శక్తిని జనరేట్ చేసే రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. వీటిలో ఒకటి ముందు మరొకటి వెనుక అమర్చబడి ఉంటాయి. ఇదొక ఆల్ వీల్ డ్రైవ్ ఎలక్ట్రిక్ కారు. ఈ కారు కేవలం 3.6 సెకండ్లలోనే గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

భారత్‌లో ఫిస్కర్ ఎలక్ట్రిక్ కార్ల విడుదల ఖరారు.. హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం ఏర్పాటు..

ఓషన్ స్పోర్ట్ ట్రిమ్‌లో కంపెనీ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీలను ఉపయోగిస్తుండగా, ఇతర ట్రిమ్‌లలో నికెల్ మాంగనీస్ కోబాల్ట్ (NMC) బ్యాటరీలను ఉపయోగిస్తుంది. ఫిస్కర్ ఓషన్ అనేది ఈ బ్రాండ్ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మరియు దీని ఉత్పత్తి నవంబర్ 2022లో ప్రారంభమవుతుంది. ఈ మోడల్ గ్లోబల్ మార్కెట్లలో విడుదల కాకముందే, ఫిస్కర్ ఓషన్ కోసం 40,000 బుకింగ్‌లు వచ్చినట్లు కంపెనీ తెలిపింది

భారత్‌లో ఫిస్కర్ ఎలక్ట్రిక్ కార్ల విడుదల ఖరారు.. హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం ఏర్పాటు..

ఫిస్కర్ కర్మ (Fisker Karma) పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ కారు

ఫిస్కర్ కర్మ (Fisker Karma) అనేది ఈ బ్రాండ్ సృష్టించిన ఓ హై పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్. ఇది ఫిస్కర్ బ్రాండ్ కీర్తిని ప్రపంచానికి పరిచయం చేయడంలో కీలకపాత్ర పోషించింది. ఫిస్కర్ కర్మ కంపెనీ పేరుపై హక్కులను పొందడానికి ముందే ప్రపంచవ్యాప్తంగా 2,000కు పైగా ఈ పెర్ఫార్మెన్స్ కార్లను కంపెనీ విక్రయించింది. అయితే, ఈ కారు యొక్క డిజైన్ మరియు సాంకేతికతలను 2014లో ఒక చైనీస్ కంపెనీ ఫిస్కర్ నుండి కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2016లో, Fisker Inc బ్రాండ్ పుట్టుకొచ్చింది.

భారత్‌లో ఫిస్కర్ ఎలక్ట్రిక్ కార్ల విడుదల ఖరారు.. హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం ఏర్పాటు..

ఫిస్కర్ ఇన్‌కార్పోరేషన్ (Fisker Inc) సంస్థని 2016 లో హెన్రిక్ ఫిస్కర్ మరియు అతని భార్య గీతా గుప్తా-ఫిస్కర్ లు స్థాపించారు. అయితే, ఈ బ్రాండ్ అంతకు ముందే ప్రారంభించబడింది. హెన్రిక్ ఫిస్కర్ మొదటిసారిగా 2007లో ఫిస్కర్ ఆటోమోటివ్‌ పేరుతో ఈ సంస్థను ప్రారంభించాడు మరియు ఈ బ్రాండ్ (ఫిస్కర్ ఆటోమోటివ్) నుండి వచ్చిన మొదటి ఉత్పత్తి ఫిస్కర్ కర్మ పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ కారు.

భారత్‌లో ఫిస్కర్ ఎలక్ట్రిక్ కార్ల విడుదల ఖరారు.. హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం ఏర్పాటు..

కాగా, ఇప్పుడు ఫిస్కర్ బ్రాండ్ భారత మార్కెట్లో కూడా తన సత్తా ఏంటో చూపించాలనుకుంటోంది. ఇందులో భాగంగా, కంపెనీ తన కొత్త ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఫిస్కర్ యొక్క భారతీయ ప్రధాన కార్యాలయం ఈ బ్రాండ్ యొక్క భవిష్యత్తు EVల కోసం సాఫ్ట్‌వేర్ మరియు వర్చువల్ వెహికల్ డెవలప్‌మెంట్‌ను తయారు చేయడంపై పని చేస్తుంది. ఈ బ్రాండ్ ప్రస్తుతం దాదాపు 450 మంది ఉద్యోగులను కలిగి ఉంది. కాగా, భారతదేశం మరియు ఐరోపాలో ఉద్యోగుల నియామకం పూర్తయిన తర్వాత ఈ సంవత్సరం చివరి నాటికి వీరి సంఖ్య దాదాపు 800 మందికి పెరుగుతుందని అంచనా.

More from DriveSpark

Article Published On: Thursday, April 14, 2022, 10:35 [IST]
English summary
Fisker to launch its ocean ev in india starts headquarter in hyderabad details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+