విడుదలకు సిద్ధమవుతున్న Force Gurkha 5-డోర్ వెర్షన్; మరి Thar 5-డోర్ పరిస్థితి ఏంటి?

ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ ఫోర్స్ మోటార్స్ (Force Motors) భారత మార్కెట్లో మహీంద్రా థార్ (Mahindra Thar) ఎస్‌యూవీకి పోటీగా అందిస్తున్న పాపులర్ ఆఫ్-రోడర్ ఎస్‌యూవీ ఫోర్స్ గుర్ఖా (Force Gurkha) లో కంపెనీ ఓ 5-డోర్ వెర్షన్ ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ గతేడాది గుర్ఖా యొక్క 3-డోర్ వెర్షన్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం, ఇది 3-డోర్ మరియు 4-సీటర్ ఆప్షన్ తో మాత్రమే లభ్యమవుతోంది. కాగా, కంపెనీ ఇప్పుడు ఇందులో 5-డోర్ వెర్షన్ ను భారత రోడ్లపై పరీక్షిస్తోంది.

విడుదలకు సిద్ధమవుతున్న Force Gurkha 5-డోర్ వెర్షన్; మరి Thar 5-డోర్ పరిస్థితి ఏంటి?

తాజాగా, ఫోర్స్ గూర్ఖా ఎస్‌యూవీ యొక్క 5-డోర్ వెర్షన్ టెస్టింగ్ దశలో ఉండగా కెమెరాకి చిక్కింది. మార్కెట్లో లాంచ్ అయినప్పుడు, ఫోర్స్ గూర్ఖా యొక్క 5-డోర్ వెర్షన్ మహీంద్రా థార్ యొక్క రాబోయే 5-డోర్ వెర్షన్‌కు పోటీగా ఉంటుంది. అయితే, ఫోర్స్ గూర్ఖా యొక్క 5-డోర్ వెర్షన్ మహీంద్రా థార్ యొక్క 5-డోర్ వెర్షన్ కంటే చాలా త్వరగా విడుదల చేయబడుతుందని తెలుస్తోంది.

విడుదలకు సిద్ధమవుతున్న Force Gurkha 5-డోర్ వెర్షన్; మరి Thar 5-డోర్ పరిస్థితి ఏంటి?

ఫోర్స్ గూర్ఖా యొక్క 5-డోర్ వెర్షన్ చూడటానికి ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఫోర్స్ గూర్ఖా యొక్క 3-డోర్ వెర్షన్ మాదిరిగానే ఉంటుందని సమాచారం. అయితే, రెండవ వరుసలో ప్రస్తుతం లభించే రెండు వ్యక్తిగత సీట్లకు బదులుగా కంపెనీ ఇందులో మూడు సీట్లు ఉండే బెంచ్ సీటును ఆఫర్ చేస్తుందో లేదా ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ధర విషయానికి వస్తే, ఇది ప్రస్తుత 3-డోర్ వెర్షన్ కంటే కనీసం రూ. 1 లక్ష ఖరీదైనదిగా ఉంటుందని అంచనా వేయండి.

విడుదలకు సిద్ధమవుతున్న Force Gurkha 5-డోర్ వెర్షన్; మరి Thar 5-డోర్ పరిస్థితి ఏంటి?

ఫోర్స్ గుర్ఖా 5-డోర్ వెర్షన్: డిజైన్

ఫోర్స్ గూర్ఖా యొక్క కొత్త 5-డోర్ వెర్షన్ డిజైన్ విషయానికి వస్తే, ఈ ఎస్‌యూవీ యొక్క 3-డోర్ వెర్షన్ లో కనిపించే అనేక డిజైన్ ఎలిమెంట్స్ ఈ కొత్త 5-డోర్ వెర్షన్ లోనూ ఉండనున్నాయి. ఇందులో ముందు మరియు వెనుక వైపున ఉండే రగ్గడ్ బంపర్లు, కంపెనీ లోగోకు బదులుగా 'గూర్ఖా' లోగోతో కూడిన ఫ్రంట్ గ్రిల్, గుండ్రటి ఎల్ఈడి హెడ్‌లైట్లు, హెడ్‌లైట్ల చుట్టూ ఉండే గుండ్రటి ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు మరియు వెనుక వైపున ఎల్ఈడి టెయిల్‌లైట్లు వంటి డిజైన్ ఫీచర్లు ఉన్నాయి.

విడుదలకు సిద్ధమవుతున్న Force Gurkha 5-డోర్ వెర్షన్; మరి Thar 5-డోర్ పరిస్థితి ఏంటి?

ఈ మార్పులు మాత్రమే కాకుండా, ఫోర్స్ గూర్ఖా యొక్క కొత్త 5-డోర్ వెర్షన్ దాని 3-డోర్ మోడల్ కంటే కొంచెం పొడవుగా ఉంటుందని తెలుస్తోంది. ఈ ఎవల్యూషనరీ డిజైన్ కొత్త ఫోర్స్ గూర్ఖాకు మరింత గంభీరమైన వైఖరిని అందిస్తుంది. పెరిగిన పొడవు కారణంగా లోపలి వైపున, ఫోర్స్ గూర్ఖా యొక్క 5-డోర్ వెర్షన్‌లో రెండు కెప్టెన్ సీట్లు లేదా మధ్య వరుసలో బెంచ్ సీటుతో కూడిన రీడిజైన్ చేయబడిన ఇంటీరియర్‌ను మరియు విశాలమైన క్యాబిన్, బూట్ స్పేస్ ను కలిగి ఉంటుందని ఆశించవచ్చు.

విడుదలకు సిద్ధమవుతున్న Force Gurkha 5-డోర్ వెర్షన్; మరి Thar 5-డోర్ పరిస్థితి ఏంటి?

ఫోర్స్ గుర్ఖా 5-డోర్ వెర్షన్: ఫీచర్లు

ఫీచర్ల విషయానికొస్తే, కొత్త ఫోర్స్ గూర్ఖా యొక్క 5-డోర్ వెర్షన్ లో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 7 ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లను చేర్చడంతో పాటుగా దాని 3-డోర్ వెర్షన్ మాదిరిగా ఒకేరకమైన ఫీచర్ లిస్ట్ ను కలిగి ఉంటుందని ఆశించవచ్చు. ఇందులో అనలాగ్ స్పీడోమీటర్ అండ్ టాకోమీటర్, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్, వ్యక్తిగత ఆర్మ్‌రెస్ట్, స్పీడ్-సెన్సింగ్ డోర్ లాక్‌లు, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్ మరియు ఫాలో-మీ-హోమ్ హెడ్‌లైట్లు మొదలైనవి ఉన్నాయి.

విడుదలకు సిద్ధమవుతున్న Force Gurkha 5-డోర్ వెర్షన్; మరి Thar 5-డోర్ పరిస్థితి ఏంటి?

ఫోర్స్ గుర్ఖా 5-డోర్ వెర్షన్: సేఫ్టీ ఫీచర్లు

ఇక కొత్త ఫోర్స్ గూర్ఖా 5-డోర్ వెర్షన్ ‌లో లభించబోయే సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), ఎలక్ట్రిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి), రియర్ పార్కింగ్ సెన్సార్లు, వన్-టచ్ లేన్ చేంజ్ ఇండికేటర్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్స్ (టిపిఎమ్ఎస్) మరియు స్పీడ్ అలర్ట్ వంటివి ఉండనున్నాయి.

విడుదలకు సిద్ధమవుతున్న Force Gurkha 5-డోర్ వెర్షన్; మరి Thar 5-డోర్ పరిస్థితి ఏంటి?

ఫోర్స్ గుర్ఖా 5-డోర్ వెర్షన్: ఇంజన్

చివరిగా ఈ కొత్త 5-డోర్ వెర్షన్ ఫోర్స్ గుర్ఖాలో ఉపయోగించబోయే ఇంజన్ విషయానికి వస్తే, ఫోర్స్ గూర్ఖా 3-డోర్ వెర్షన్ లో ఉపయోగించిన మరియు పరీక్షించబడిన 2.6-లీటర్ మెర్సిడెస్ కామన్ రైల్, డైరెక్ట్-ఇంజెక్షన్, టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ నే ఈ కొత్త మోడల్ లో కూడా ఉపయోగించనున్నారు. అయితే, దాని పవర్ మరియు టార్క్ గణాంకాల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. ఇందుకు ప్రధాన కారణం 5-డోర్ వెర్షన్ యొక్క పెరిగిన బరువుగా ఉండొచ్చు.

విడుదలకు సిద్ధమవుతున్న Force Gurkha 5-డోర్ వెర్షన్; మరి Thar 5-డోర్ పరిస్థితి ఏంటి?

గుర్ఖా 3-డోర్ ఎస్‌యూవీలోని ఈ బిఎస్6 కంప్లైంట్ ఇంజన్ గరిష్టంగా 91 బిహెచ్‌పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త ఫోర్స్ గూర్ఖా యొక్క 5-డోర్ వెర్షన్ లో రేషియో గేర్‌బాక్స్‌ తో పాటు ఫ్రంట్ అండ్ రియర్ యాక్సిల్‌ ల వద్ద డిఫరెన్షియల్ లాక్‌ లతో కూడిన స్టాండర్డ్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ తో లభిస్తుంది. ప్రస్తుతానికి ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ లేదు.

Image Courtesy: Abhijeet Mane

More from DriveSpark

Article Published On: Thursday, March 10, 2022, 15:15 [IST]
English summary
Force gurkha 5 door version launch around the corner spotted testing
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+