మహీంద్రా థార్ 5-డోర్ మోడల్‌కి పోటీగా వస్తున్న ఫోర్స్ గుర్ఖా 5-డోర్ మోడల్.. ఇప్పుడు అధిక సీట్లతో..

దేశీయ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్స్ మోటార్స్ (Force Motors) గడచిన సంవత్సరం భారత మార్కెట్లో విడుదల చేసిన తమ కొత్త తరం ఫోర్స్ గుర్ఖా (2021 Force Gurkha) ఆఫ్-రోడ్ ఎస్‌యూవీలో కంపెనీ ఇప్పుడు మరో కొత్త వేరియంట్ ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం, ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీని కంపెనీ 3-డోర్ (రెండు సైడ్ డోర్లు, ఒక వెనుక డోర్) ఆప్షన్ మాత్రమే విక్రయిస్తోంది. కాగా, ఇప్పుడు ఇందులో ఓ 5-డోర్ వెర్షన్ (నాలుగు సైడ్ డోర్లు, ఒక వెనుక డోర్) ఆప్షన్ ను పరిచయం చేసేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. ఇందుకు సంబంధించిన చిత్రాలు ఇప్పుడు ఇంటర్నెట్ లో లీక్ అయ్యాయి.

మహీంద్రా థార్ 5-డోర్ మోడల్‌కి పోటీగా వస్తున్న ఫోర్స్ గుర్ఖా 5-డోర్ మోడల్.. ఇప్పుడు అధిక సీట్లతో..

ఫోర్స్ మోటార్స్ గత సంవత్సరంలో గూర్ఖా యొక్క 5-డోర్ వేరియంట్‌ను ఉత్పత్తి చేస్తామని ధృవీకరించింది. ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఓ మోడల్ ను కంపెనీ భారత రోడ్లపై పరీక్షిస్తోంది. పూర్తిగా క్యామోఫ్లేజ్ చేసిన 5-డోర్ వెర్షన్ ఫోర్స్ గుర్ఖా కంపెనీ టెస్టింగ్ చేస్తుండగా, ఓ నెటిజెన్ తన కెమెరాలో బంధించాడు. ఈ స్పై చిత్రాలను చూస్తుంటే, ఫోర్స్ గుర్ఖాలో ఐదు డోర్లు కనిపిస్తాయి మరియు ఇది ప్రస్తుత 3-డోర్ వెర్షన్ కన్నా పొడవుగా ఉన్నట్లు తెలుస్తోంది.

మహీంద్రా థార్ 5-డోర్ మోడల్‌కి పోటీగా వస్తున్న ఫోర్స్ గుర్ఖా 5-డోర్ మోడల్.. ఇప్పుడు అధిక సీట్లతో..

ప్రస్తుతం, మార్కెట్లో విక్రయించబడుతున్న ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీలో కేవలం నాలుగు సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ నాలుగు సీట్లు కూడా వ్యక్తిగత కెప్టెన్ సీట్లుగా ఉంటాయి. అయితే, ఈ 5-డోర్ వెర్షన్ లో కంపెనీ సీటింగ్ సామర్థ్యాన్ని పెంచుతుందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కొత్త 5-డోర్ వెర్షన్ ఫోర్స్ గూర్ఖా ఎస్‌యూవీని సి-లాడర్ ఫ్రేమ్ ఛాసిస్‌పై ఆధారపడి తయారు చేయనున్నారు. ఇది 3-డోర్ వెర్షన్ ఫోర్స్ గూర్ఖాలో ఉపయోగించబడుతున్న చాస్సిస్ యొక్క పొడగించబడిన వెర్షన్.

మహీంద్రా థార్ 5-డోర్ మోడల్‌కి పోటీగా వస్తున్న ఫోర్స్ గుర్ఖా 5-డోర్ మోడల్.. ఇప్పుడు అధిక సీట్లతో..

ఫోర్స్ గూర్ఖా 5-డోర్‌ వెర్షన్ లో ప్రధానమైన మార్పులు దాని B-పిల్లర్ తర్వాత నుండి ప్రారంభమవుతాయి. అంటే, దాని ముందు వైపు మరియు వెనుక డిజైన్ ఇంచు మించు ప్రస్తుత ఫోర్స్ గుర్ఖా మాదిరిగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ వీడియోలో క్యాప్చర్ చేయబడిన టెస్టింగ్ వాహనం వైట్ కలర్ పెయింట్‌లో ఫినిష్ చేయబడి ఉంది. ఈ కొత్త మోడల్ ఫ్రంట్ డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ కూడా ప్రస్తుత మోడల్ మాదిరిగానే ఉంటుందని భావిస్తున్నారు. అయితే, ఇది 6-సీటర్ లేదా 7-సీటర్ వేరియంట్ గా విడుదలయ్యే అవకాశం ఉంది.

మహీంద్రా థార్ 5-డోర్ మోడల్‌కి పోటీగా వస్తున్న ఫోర్స్ గుర్ఖా 5-డోర్ మోడల్.. ఇప్పుడు అధిక సీట్లతో..

రెండవ వరుసలో బెంచ్ సీట్ లేదా రెండు కెప్టెన్ సీట్లు మరియు వెనుక వరుసలో ఎదురెదురుగా ఉండే రెండు ఫార్వార్డ్ ఫేసింగ్ సీట్లు ఉండే అవకాశం ఉంది. ఈ మార్పులు మినహా మిగిలిన ఇంటీరియర్ అలాగే ఉంటుందని భావిస్తున్నారు. ఈ కారులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ప్రస్తుత మోడ్రన్ కార్లతో పోల్చుకుంటే, ఈ కారులో అందించే ఫీచర్ల జాబితా చిన్నదే అని చెప్పొచ్చు. కాకపోతే, ఇది అద్భుతమైన ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది.

మహీంద్రా థార్ 5-డోర్ మోడల్‌కి పోటీగా వస్తున్న ఫోర్స్ గుర్ఖా 5-డోర్ మోడల్.. ఇప్పుడు అధిక సీట్లతో..

స్టాండర్డ్ మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు మొదలైన ఫీచర్లను ఈ కొత్త 5-డోర్ మోడల్ లో కూడా ఆశించవచ్చు. ఫోర్స్ మోటార్స్ ఈ కొత్త 5-సీటర్ మోడల్ లో కొత్త సెట్ రియర్ డోర్‌లను జోడించింది మరియు ఇందులో రియర్-క్వార్టర్ గ్లాస్ ప్రాంతాన్ని కూడా దానికి అనుగుణంగా రీడిజైన్ చేశారు. ఈ కొత్త మోడల్ యొక్క వీల్‌బేస్ 2.8 మీటర్లు ఉంటుందని అంచనా వేయగా, ప్రస్తుత 3-డోర్ ఫోర్స్ గూర్ఖా యొక్క వీల్‌బేస్ 2.4 మీటర్లుగా ఉంది.

అంటే, ఫోర్స్ మోటార్స్ 5-సీటర్ గూర్ఖా ఎస్‌యూవీ యొక్క వీల్‌బేస్‌ను దాదాపు 400 మిమీ పెంచనుంది. పెరిగిన వీల్‌బేస్ కారణంగా క్యాబిన్ లోపల ఎక్కువ స్థలం కూడా లభిస్తుంది. ఇది వెనుక ప్రయాణీకులకు మరింత లెగ్‌రూమ్‌ను అందిస్తుంది. చిన్నపాటి మార్పులు చేర్పులు మినహా ఈ కొత్త మోడల్ యొక్క ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ మాత్రం అలాగే ఉంచబడుతుంది. ఇది బాక్సీ డిజైన్‌ను కలిగి ఉండి, మంచి రోడ్ ప్రజెన్స్ ను కలిగి ఉంటుంది. ఇందులో గుండ్రటి హెడ్‌ల్యాంప్స్ మరియు వాటి చుట్టూ గుండ్రటి ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ ఉంటాయి. వెనుక టెయిల్ ల్యాంప్‌లు సాధారణ హాలోజన్ యూనిట్ల రూపంలో ఉంటాయి.

మహీంద్రా థార్ 5-డోర్ మోడల్‌కి పోటీగా వస్తున్న ఫోర్స్ గుర్ఖా 5-డోర్ మోడల్.. ఇప్పుడు అధిక సీట్లతో..

ఇంజన్ పరంగా కొత్త 5-డోర్ వెర్షన్ ఫోర్స్ గుర్ఖాలో పెద్ద మార్పులు ఏవీ ఉండబోవని తెలుస్తోంది. ప్రస్తుతం, 3-డోర్ ఫోర్స్ గూర్ఖాలో 2.6-లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది మెర్సిడెస్-బెంజ్ నుండి గ్రహించబడిన ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 91 బిహెచ్‌పి పవర్ ను మరియు 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందులో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ లేదు.

మహీంద్రా థార్ 5-డోర్ మోడల్‌కి పోటీగా వస్తున్న ఫోర్స్ గుర్ఖా 5-డోర్ మోడల్.. ఇప్పుడు అధిక సీట్లతో..

ఇది కాకుండా, ఇందులో లో-రేంజ్ గేర్‌బాక్స్, ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ మరియు మెకానికల్ డిఫరెన్షియల్ లాక్‌ వంటి ఇతర ఆఫ్-రోడ్ అసిస్టెడ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. అదనపు పొడవు మరియు తలుపులతో, 5-డోర్ల గూర్ఖా ప్రస్తుత 3-డోర్ల గూర్ఖా కంటే ఎక్కువ బరువు కలిగి ఉంటుందని స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి, ఈ కొత్త 5-డోర్ మోడల్ లో పెరిగిన బరువు కారణంగా, దాని ఇంజన్ పవర్ టూ వెయిట్ రేషియోలో కంపెనీ కొద్దిపాటి మార్పులు చేసే అవకాశం ఉంది. ఇది త్వరలో రాబోయే మహీంద్రా థార్ 5-డోర్ మోడల్ కి పోటీగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, February 2, 2022, 15:49 [IST]
English summary
Force motors to launch 5 door version gurkha soon spy pics and other details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+