బై బై ఫోర్డ్ ఎకోస్పోర్ట్.. కాంపాక్ట్ ఎస్‌యూవీకి కన్నీటి వీడ్కోలు.. చైన్నై ప్లాంట్‌లో ముగిసిన హైడ్రామా!

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ (Ford EcoSport), భారత కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఓ వెలుగు వెలిగిన అమెరికన్ మోడల్ ఇది. భారతదేశంలో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ 2013 లో విడుదలైంది. ఆ సమయంలోనే ఇది ఫోర్డ్ సింక్ అనే కనెక్టివిటీ ఫీచర్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది కారు క్రాష్ అయినట్లు గుర్తించి, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్లకు ఆటోమేటిక్‌గా కాల్ చేసే ఓ సేఫ్టీ ఫీచర్. ఇప్పుడు మనం కనెక్టివిటీ టెక్నాలజీగా పిలిచే ఈ ఫీచర్ ను ఫోర్డ్ దాదాపు పదేళ్ల క్రితమే తమ కారులో అందించింది. ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ భారత మార్కెట్లోకి వచ్చిన కొద్ది రోజులకే ఓ సక్సెస్‌ఫుల్ మోడల్‌గా నిలిచింది.

బై బై ఫోర్డ్ ఎకోస్పోర్ట్.. కాంపాక్ట్ ఎస్‌యూవీకి కన్నీటి వీడ్కోలు.. చైన్నై ప్లాంట్‌లో ముగిసిన హైడ్రామా!

అయితే, మారుతున్న కాలంతో పాటుగా ఫోర్డ్ తమ ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీని మార్చడం విఫలమైంది. ఫలితంగా, భారతదేశంలో ఈ మోడల్ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఫోర్డ్ దేశీయ మార్కెట్లో ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీని డిస్‌కంటిన్యూ చేసింది. కేవలం భారతదేశంలోనే కాకుండా పలు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఈ ఎస్‌యూవీ అమ్మకాలు నిలిపివేయబడ్డాయి. ఫోర్డ్ ఇండియా చాలా కాలం క్రితమే భారత మార్కెట్లో ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీ అమ్మకాలను నిలిపివేసింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న పెండింగ్ ఆర్డర్ల కోసం కంపెనీ ఇప్పటికీ ఈ ఎస్‌యూవీని భారతదేశంలో తయారు చేస్తూ వచ్చింది.

బై బై ఫోర్డ్ ఎకోస్పోర్ట్.. కాంపాక్ట్ ఎస్‌యూవీకి కన్నీటి వీడ్కోలు.. చైన్నై ప్లాంట్‌లో ముగిసిన హైడ్రామా!

తాజాగా, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ల కోసం కూడా ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీని తయారు చేయడాన్ని ఫోర్డ్ ఇండియా పూర్తిగా నిలిపివేసింది. ఫోర్డ్ ఇండియా తమ చెన్నై ప్లాంట్‌లో చివరి ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీని తయారు చేసింది. ఈ ప్లాంట్ లోని ఉద్యోగులు కన్నీటితో చివరి ఎకోస్పోర్ట్ ఎస్‌యూవీకి వీడ్కోలు పలికారు. దీంతో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ దశాబ్ధ కాలపు ప్రయాణం ముగిసినట్లయింది. భారతదేశంలో వచ్చిన భారీ నష్టాల కారణంగా ఫోర్డ్, ఇక్కడి మార్కెట్లో తమ వ్యాపారాన్ని మరియు కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే.

బై బై ఫోర్డ్ ఎకోస్పోర్ట్.. కాంపాక్ట్ ఎస్‌యూవీకి కన్నీటి వీడ్కోలు.. చైన్నై ప్లాంట్‌లో ముగిసిన హైడ్రామా!

ఫోర్డ్ ఇండియా సంస్థకు తమిళనాడు మరియు గుజరాత్ రాష్ట్రాలలో రెండు తయారీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో గుజరాత్ ప్లాంట్ ను టాటా మోటార్స్ సంస్థకు విక్రయించేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. కాగా, చెన్నై ప్లాంట్ లో ఫోర్డ్ తమ కార్లను ఉత్పత్తి చేస్తుంది. ఫోర్డ్ భారతదేశం నుండి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించినప్పటి నుండి ఈ చెన్నై ప్లాంట్ లో ఉద్యోగులు సమ్మె చేయడం మరియు కార్ల ఉత్పత్తికి అంతరాయం కలిగించడం ప్రారంభించారు. దీంతో ఫోర్డ్ గడువు ముగిసిన తర్వాత కూడా కార్లను పరిమితం సిబ్బందితో ఉత్పత్తి చేయాల్సి వచ్చింది. మొత్తానికి ఉద్యోగులు మరియు కంపెనీ మధ్య హైడ్రామాకు తెరపడింది.

బై బై ఫోర్డ్ ఎకోస్పోర్ట్.. కాంపాక్ట్ ఎస్‌యూవీకి కన్నీటి వీడ్కోలు.. చైన్నై ప్లాంట్‌లో ముగిసిన హైడ్రామా!

తాజా సమాచారం ప్రకారం, ఫోర్డ్ ఇండియా ఎట్టకేలకు ఈ నెల 31వ తేదీ నాటికి తమ చెన్నై ప్లాంటును మూసివేయాలని నిర్ణయించుకుంది. ఫోర్డ్ భారతదేశంలో తన ప్లాంట్‌ను స్థాపించడం ద్వారా 1999 నుండి కార్లను తయారు చేస్తోంది. ఈ కంపెనీ నుండి భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన మోడళ్లలో ఫోర్డ్ ఎకోస్పోర్, ఎండీవర్ మరియు ఫిగో కార్లు ముందంజలో ఉంటాయి. ఒకప్పుడు భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లోని కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో అత్యంత ప్రాచుర్యం పొంది మరియు అత్యధికంగా అమ్ముడైన ఎకోస్పోర్ట్, ఇకపై సెకండ్ హ్యాండ్ మార్కెట్లో మాత్రమే కనిపించనుంది.

బై బై ఫోర్డ్ ఎకోస్పోర్ట్.. కాంపాక్ట్ ఎస్‌యూవీకి కన్నీటి వీడ్కోలు.. చైన్నై ప్లాంట్‌లో ముగిసిన హైడ్రామా!

ఫోర్డ్ భారతదేశం నుండి నిష్క్రమస్తున్నట్లు ప్రకటించినప్పుడు, దేశీయ మార్కెట్లో ఎకోస్పోర్ట్ లైనప్ యొక్క ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 8.19 లక్షల నుండి రూ. 11.69 లక్షల మధ్యలో ఉండేవి. భారత మార్కెట్లో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉండేది. ఇందులోని 1.5 లీటర్, న్యాచురల్లీ ఆస్పైర్డ్ ఇన్‌లైన్ 4 పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 123 బిహెచ్‌పి పవర్ ను మరియు 149 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో స్టాండర్డ్‌గా జతచేయబడి ఉంటుంది. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కోరుకునే వారి కోసం కంపెనీ ఇందులోని పెట్రోల్ వెర్షన్‌లో 6 స్పీడ్ సివిటి ఆప్షన్ కూడా అందించింది.

బై బై ఫోర్డ్ ఎకోస్పోర్ట్.. కాంపాక్ట్ ఎస్‌యూవీకి కన్నీటి వీడ్కోలు.. చైన్నై ప్లాంట్‌లో ముగిసిన హైడ్రామా!

కాగా, డీజిల్ వెర్షన్ లో 1.5 లీటర్, టర్బోచార్జ్డ్, ఇన్‌లైన్ 4 సిలిండర్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 100 బిహెచ్‌పి పవర్ ను మరియు 215 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులోని ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, మౌంటెడ్ కంట్రోల్‌లతో కూడిన మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ మరియు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి అనేక ఫీచర్లు ఇందులో లభించేవి.

బై బై ఫోర్డ్ ఎకోస్పోర్ట్.. కాంపాక్ట్ ఎస్‌యూవీకి కన్నీటి వీడ్కోలు.. చైన్నై ప్లాంట్‌లో ముగిసిన హైడ్రామా!

భారతదేశంలో ఫోర్డ్ గత కొన్ని సంవత్సరాలుగా తక్కువ అమ్మకాలు మరియు సరైన మార్కెట్ స్ట్రాటజీ లేని కారణంగా ఈ అమెరికన్ కంపెనీ భారత మార్కెట్లో భారీ నష్టాలను చవిచూసింది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఫోర్డ్ ఇండియాకు సుమారు 2 బిలియన్ డాలర్ల మేర నష్టం వచ్చింది. దీంతో వేరే ఆప్షన్ లేక ఈ బ్రాండ్ భారతదేశం వదిలి వెళ్లిపోయింది. దేశం వదిలి వెళ్లినప్పటికీ, తమ వినియోగదారులకు అవసరమైన వాహన సేవలు మరియు విడిభాగాలను అందిస్తూనే ఉంటామని కంపెనీ తెలిపింది.

Article Published On: Friday, July 22, 2022, 18:32 [IST]
English summary
Ford rolls out last unit ecosport from india production ended at chennai plant details
Read more on: #ఫోర్డ్ #ford
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+