మహీంద్రా స్కార్పియో-ఎన్ డెలివరీ తీసుకున్న 'గీతా కుమారి ఫోగట్'.. ఆనంద మహీంద్రా ఏమన్నారంటే?

'గీతా కుమారి ఫోగట్' ఈ పేరు దాదాపు అందరికి సుపరిచయమే, ఎందుకంటే 'దంగల్' (యుద్ధం) సినిమాతో ఈ పేరు మారుమోగిపోయింది. ప్రఖ్యాత కుస్తీ (Wrestler) క్రీడాకారిణి అయిన గీతా ఫోగట్ 2010 లో జరిగిన కామన్ వెల్త్ క్రెడల్లో భారతదేశానికి ఈ రంగంలో మొదటి గోల్డ్ మెడల్ సాధించింది. అయితే ఈ ఈమె ఇటీవల ఒక కొత్త కారుని కొనుగోలు చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

గీతా కుమారి ఫోగట్ ఖాతాలో చేరిన మహీంద్రా స్కార్పియో-ఎన్

గీతా కుమారి ఫోగట్ కొనుగోలు చేసిన కొత్త కారు 'మహీంద్రా' (Mahindra) కంపెనీ యొక్క కొత్త 'స్కార్పియో-ఎన్' (Scorpio-N). ఈ కారు డెలివరీ కూడా ఇటీవల జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఒలింపియన్ నాపోలి బ్లాక్ కలర్ కారుని చూడవచ్చు.

గీతా కుమారి ఫోగట్ ఖాతాలో చేరిన మహీంద్రా స్కార్పియో-ఎన్

కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ SUV ని ఈమె నవరాత్రి మొదటి రోజున డెలివరీ చేసుకుంది. డెలివరీ తీసుకునే ఫోటోలను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ 'ఇంత అందమైన రోజున అందమైన ఉదయంలో కొత్త సభ్యునికి స్వాగతం పలుకుతున్నాను. ఇటువంటి క్రెడిబుల్ కారును మార్కెట్లో విడుదల చేసినందుకు ఆనంద్ మహీంద్రాకు థ్యాంక్స్ అంటూ రాసింది. అంతే కాకుండా అద్భుతమైన సేవలకు గాను పి.పి.ఆటోమోటివ్ ప్రయివేట్ లిమిటెడ్ కర్నాల్ కు ధన్యవాదాలు అంటూ కూడా రాసింది.

గీతా కుమారి ఫోగట్ ఖాతాలో చేరిన మహీంద్రా స్కార్పియో-ఎన్

గీతా కుమారి ఫోగట్ చేసిన ట్వీట్ కి ఆనంద్ మహీంద్రా రీప్లే ఇస్తూ.. ఇది బోనస్, కొత్త స్కార్పియో-N డెలివరీ తీసుకునే మా మొదటి కస్టమర్లతో మీరు ఒకరు కావడం గొప్ప విశేషం. మేము నిజంగానే మీ గోల్డ్ మెడల్ కీర్తిని పొందుతున్నాము, మా కారు కూడా మీలాగే చాలా దృఢంగా ఉంటుందని ఆశిస్తున్నాము అన్నారు.

గీతా కుమారి ఫోగట్ ఖాతాలో చేరిన మహీంద్రా స్కార్పియో-ఎన్

మహీంద్రా స్కార్పియో-ఎన్ కోసం కంపెనీ 2022 జూలై ౩౦ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. బుకింగ్స్ ప్రారంభమైన కేవలం ఒక నిముషంలోనే 25,000 బుకింగ్స్ స్వీకరించి బుకింగ్స్ లో మంచి రికార్డ్ బద్దలు కొట్టింది. అంతే కాకుండా కేవలం 30 నిముషాల్లోనే ఏకంగా ఒక లక్ష బుకింగ్స్ కైవసం చేసుకుని, ఎక్కువ బుకింగ్స్ పొందిన కార్ల జాబితాలో ఇదికూడా చోటు సంపాదించుకుంది.

గీతా కుమారి ఫోగట్ ఖాతాలో చేరిన మహీంద్రా స్కార్పియో-ఎన్

మహీంద్రా స్కార్పియో-ఎన్ మొత్తం జెడ్2, జెడ్4, జెడ్6, జెడ్8 మరియు జడ్8 ఎల్ అనే వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. వీటి ధరల విషయానికి వస్తే.. ప్రారంభ ధర రూ .11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్), కాగా టాప్ వేరియంట్ ధర రూ .23.90 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

గీతా కుమారి ఫోగట్ ఖాతాలో చేరిన మహీంద్రా స్కార్పియో-ఎన్

కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ రెండు ఇంజిన్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఒకటి 2.2-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్, మరొకటి 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్.

గీతా కుమారి ఫోగట్ ఖాతాలో చేరిన మహీంద్రా స్కార్పియో-ఎన్

2.2-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ 175 పిఎస్ పవర్ మరియు 400 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ 203 పిఎస్ పవర్ మరియు 380 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లను పొందుతుంది.

గీతా కుమారి ఫోగట్ ఖాతాలో చేరిన మహీంద్రా స్కార్పియో-ఎన్

కొత్త మహీంద్రా స్కార్పియో-ఎన్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, సి షేప్ ఎల్ఈడి డిఆర్ఎల్, మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్, సిగ్నేచర్ వీల్ ఆర్చెస్, రూఫ్ రెయిల్స్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, స్కార్పియో స్టింగ్ క్రోమ్ విండో లైన్, సన్‌రూఫ్, సిగ్నేచర్ డబుల్ బారెల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, షార్క్-ఫిన్ యాంటెన్నా, లోడ్ బేరింగ్ స్కీ ర్యాక్, రూఫ్ స్పాయిలర్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ మరియు సైడ్ ఓపెనింగ్ టెయిల్ గేట్ వంటివి కలిగి ఉంటుంది. కావున చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

గీతా కుమారి ఫోగట్ ఖాతాలో చేరిన మహీంద్రా స్కార్పియో-ఎన్

కొత్త స్కార్పియో-ఎన్ SUV లో 17.78 సెం.మీ కలర్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో అండ్ క్రూయిజ్ కంట్రోల్స్, 6-వే పవర్ అడ్జస్టబల్ డ్రైవర్ సీట్, డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డ్, ప్రీమియం-లుకింగ్ బ్రౌన్ అండ్ బ్లాక్ లెదర్ సీట్లు మరియు 20.32 సెం.మీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, డ్యూయల్ ఛానెల్ సబ్-వూఫర్‌తో కూడిన సోనీ 3డి ఆడియో సిస్టమ్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు డ్యూయల్ కెమెరా వంటి ఆధునిక ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.

గీతా కుమారి ఫోగట్ ఖాతాలో చేరిన మహీంద్రా స్కార్పియో-ఎన్

ఇక చివరగా స్కార్పియో-ఎన్ యొక్క భద్రతా ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎబిఎస్ విత్ ఈబిడి, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, రోల్ ఓవర్ మిటిగేషన్, బ్రేక్ డిస్క్ వైపింగ్ మరియు ఐసోఫిక్స్ సీట్స్ వంటి సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో ఇప్పటికే మహీంద్రా స్కార్పియో-ఎన్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ SUV సెలబ్రెటీలను సైతం ఆకర్షిస్తోంది. ఈ కారణంగానే ఇప్పటికే లక్షకు పైగా బుకింగ్స్ వచ్చేసాయి. అయితే ఇవన్నీ డెలివరీ చేయడానికి కంపెనీకి కనీసం రెండు సంవత్సరాలు పట్టె అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి. కానీ కంపెనీ డెలివరీలను మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, September 28, 2022, 16:33 [IST]
English summary
Geeta kumari phogat buys new mahindra scorpio n details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+