చైనాలో తయారైన టెస్లా (Tesla) కార్లకు భారతదేశంలో నో ఎంట్రీ.. తేల్చేసి చెప్పిన సర్కార్..!

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా (Tesla) బ్రాండ్ గత కొంత కాలంగా భారతదేశంలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తున్న సంగతి మనందరికీ తెలిసినదే. ఈ బ్రాండ్ కేవలం అమెరికాలో మాత్రమే కాకుండా అనేక ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో కూడా తమ కార్లను విజయవంతంగా విక్రయిస్తోంది. అంతేకాకుండా, అంతర్జాతీయ మార్కెట్లలో తమ వ్యాపారాన్ని మరింత సులభతరం చేసుకునేందుకు టెస్లా పలు దేశాల్లో తమ కార్ల తయారీ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేసింది. అయితే, భారత్‌లోకి ప్రవేశించేందుకు మాత్రం టెస్లా ఇంకా సంకోచంలోనే ఉంది.

చైనాలో తయారైన టెస్లా (Tesla) కార్లకు భారతదేశంలో నో ఎంట్రీ.. తేల్చేసి చెప్పిన సర్కార్..!

భారత మార్కెట్ విషయంలో టెస్లా 'వెయిట్ అండ్ వాచ్' విధానాన్ని అవలంభిస్తోంది. మనదేశంలో, ముందుగా విదేశాల్లో తయారు చేసిన టెస్లా ఎలక్ట్రిక్ కార్లను దిగుమతి చేసుకొని విక్రయించాలని టెస్లా భావిస్తోంది. ఇలా చేయడం భారత మార్కెట్లో టెస్లా కార్లకు లభించే ఆదరణను బట్టి, ఇక్కడ పూర్తిస్థాయిలో వ్యాపారాన్ని నిర్వహించడం లేదంటే, భారీ నష్టాలు రాక ముందే మొదట్లోనే తట్టాబుట్టా సర్దేయడం చేయవచ్చనేది ఈ అమెరికన్ కంపెనీ అభిప్రాయం కాబోలు.

చైనాలో తయారైన టెస్లా (Tesla) కార్లకు భారతదేశంలో నో ఎంట్రీ.. తేల్చేసి చెప్పిన సర్కార్..!

టెస్లా భారత అరంగేట్రం గురించి గత కొంత కాలంగా భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. తాజాగా, ఈ చర్చలు మరోసారి తెరపైకి వచ్చాయి. టెస్లాకు మన పొరుగు దేశమైన చైనాలో ఓ కార్ల తయారీ ప్లాంట్ ఉంది. ఈ అమెరికన్ కంపెనీ ఎక్కువ భాగం చైనాలోని విడిభాగాలతో తయారైన మేడ్ ఇన్ చైనా కార్లను పలు అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తోంది. ఇప్పుడు మనదేశంలో కూడా చైనాలో తయారు చేసిన టెస్లా కార్లను దిగుమతి చేసుకొని విక్రయించాలని టెస్లా చూస్తోంది. అయితే, ఇందుకు భారత ప్రభుత్వం ససేమిరా కుదరదని అంటోంది.

చైనాలో తయారైన టెస్లా (Tesla) కార్లకు భారతదేశంలో నో ఎంట్రీ.. తేల్చేసి చెప్పిన సర్కార్..!

టెస్లా భారతదేశంలో వ్యాపారం చేయడానికి, కార్లను విక్రయించడానికి మరియు వాటిని ఎగుమతి చేయడానికి స్వాగతిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. అయితే, అదే సమయంలో టెస్లా సంస్థ తమ ఎలక్ట్రిక్ కార్లను చైనా నుండి దిగుమతి చేసుకోవడానికి తాము అనుమతించబోమని కూడా ఆయన అన్నారు. మంగళవారం జరిగిన ఓ ప్రభుత్వ సదస్సులో రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు. "చైనాలో తయారు చేసి ఇక్కడ విక్రయించడం మంచి ప్రతిపాదన కాదు" అని ఆయన చెప్పారు.

చైనాలో తయారైన టెస్లా (Tesla) కార్లకు భారతదేశంలో నో ఎంట్రీ.. తేల్చేసి చెప్పిన సర్కార్..!

టెస్లా తన ఎలక్ట్రిక్ వాహనాలను భారతదేశంలోకి దిగుమతి చేసుకొని విక్రయించడం వలన ఆ కంపెనీకి కలిగే ప్రయోజనాలే అధికంగా ఉంటాయి. ఇలా చేయడం వలన భారతదేశానికి దిగుమతి సుంకాల ద్వారా వచ్చే ప్రయోజనం తప్ప వేరే ఇతర ఆదాయం ఉండదు. అదే, టెస్లా కంపెనీ భారదేశంలో స్వయంగా ఓ కార్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లయితే, మనదేశంలోకి కొన్ని లక్షల కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వస్తాయి, కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించబడుతాయి, స్థానిక విడిభాగాల కంపెనీల వ్యాపారం వృద్ధి చెందుతుంది, ఎగుమతుల వలన ఆదాయం వస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే, టెస్లా వలన మనదేశానికి లభించే ప్రయోజనాల జాబితా చాంతాడంత అవుతుంది.

చైనాలో తయారైన టెస్లా (Tesla) కార్లకు భారతదేశంలో నో ఎంట్రీ.. తేల్చేసి చెప్పిన సర్కార్..!

టెస్లా లాజిక్ కూడా అదే. ఒకేసారి భారతదేశంలో పూర్తిగా ప్రవేశించి, ఇక్కడే ప్లాంట్ ఏర్పాటు చేయటం మరియు అందుకోసం లక్షల కోట్ల మూలధనాన్ని వెచ్చించిన తర్వాత, ఈ బ్రాండ్ మనదేశంలో సక్సెస్‌ను సాధించలేకపోతే, అప్పటి వరకూ చేసినదంతా వృధా అవుతుంది మరియు కంపెనీ నష్టాల బాట పట్టే అవకాశం కూడా ఉంది. కాబట్టి, టెస్లా ముందుగా మనదేశంలో తన లక్‌ను ఇంపోర్టెడ్ కార్ల రూపంలో పరీక్షించుకోవాలని చూస్తోంది. ఇలా చేయడం వలన టెస్లా నష్టపోయేదేమీ లేదు.

చైనాలో తయారైన టెస్లా (Tesla) కార్లకు భారతదేశంలో నో ఎంట్రీ.. తేల్చేసి చెప్పిన సర్కార్..!

గతంలో కూడా టెస్లా బ్రాండ్ తాను ఇండియాకు రావాలంటే, భారత ప్రభుత్వం కొన్ని షరతులకు ఒప్పుకోవాలని డిమాండ్ చేసింది. భారతదేశంలోకి దిగుమతి చేసుకునే కార్లపై పన్ను తగ్గించాలన్న టెస్లా డిమాండ్‌ చేస్తోంది. అయితే, ఈ అమెరికన్ కంపెనీ ప్రతిపాదనను భారత ప్రభుత్వం మొదటి నుంచి తిరస్కరిస్తూనే వస్తోంది. ఇతర విదేశీ కంపెనీలకు వర్తించే పన్ను నిబంధనలే టెస్లాకు కూడా వర్తిస్తాయని, టెస్లాకు ఎలాంటి ప్రత్యేక సౌలభ్యాలు ఉండబోవని ప్రభుత్వం తేల్చి చెబుతోంది.

చైనాలో తయారైన టెస్లా (Tesla) కార్లకు భారతదేశంలో నో ఎంట్రీ.. తేల్చేసి చెప్పిన సర్కార్..!

భారతదేశంలోకి దిగుమతి చేసుకునే టెస్లా కార్లపై సుంకాలను తగ్గించాలని టెస్లా అధికారులు భారత ప్రభుత్వంతో దాదాపు ఒక సంవత్సరం పాటు లాబీయింగ్ చేసారు, ఇది ప్రపంచంలోనే అత్యధికమని ఆ కంపెనీ సీఈఓ ఎలోన్ మస్క్ అన్నారు. టెస్లా భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఒక దృఢమైన ప్రణాళికను వెల్లడించనందున, దాని ప్రయత్నాలు ఇంకా ప్రతిష్టంభనలో ఉన్నాయి. స్థానిక తయారీని పెంచడానికి మరియు ఉద్యోగాలను సృష్టించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన "మేక్ ఇన్ ఇండియా" విధానాన్ని అనుసరించే చర్య దీనికి అనుగుణంగానే ఉంటుంది.

చైనాలో తయారైన టెస్లా (Tesla) కార్లకు భారతదేశంలో నో ఎంట్రీ.. తేల్చేసి చెప్పిన సర్కార్..!

భారత్‌లో టెస్లా ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా సుమారు రూ. 2.3 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా. అయితే, టెస్లా మాత్రం ప్రస్తుతం తామకు అలాంటి ఆలోచన (ఇక్కడే ప్లాంట్ ఏర్పాటు చేసే ఆలోచన) లేదని చెబుతోంది. ఇదిలా ఉంటే, గడచిన ఫిబ్రవరి 2022 నెలలో, టెస్లా చైనాలోని షాంఘైలో మరొక కొత్త ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్ 2021 లో, టెస్లా షాంఘైలో 200 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఫ్యాక్టరీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది.

చైనాలో తయారైన టెస్లా (Tesla) కార్లకు భారతదేశంలో నో ఎంట్రీ.. తేల్చేసి చెప్పిన సర్కార్..!

చైనాలో టెస్లా కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని మరియు అక్కడ తయారైన కార్లను ఆసియా మార్కెట్లకు ఎగుమతి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకొని కంపెనీ తమ చైనా ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్లాన్ చేస్తోంది. టెస్లా తమ ఈవీల ఉత్పత్తిని పెంచడానికి, షాంఘైలో ఓ కొత్త ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని చూస్తోంది, ఈ ప్లాంట్ పనులు మార్చి 2020లోనే ప్రారంభమైనట్లు సమాచారం. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయితే ఏటా పది లక్షల టెస్లా ఎలక్ట్రిక్ కార్లు చైనాలో ఉత్పత్తి చేయబడుతాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, April 27, 2022, 14:23 [IST]
English summary
Govt welcomes tesla to do business in india but it can not import cars from china
Read more on: #టెస్లా #tesla
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+