మీకు తెలుసా.. భారతదేశంలో అత్యంత వేగవతమైన కార్లు గురించి..!!

మనం ఇప్పటికి వరకు భారతీయ మార్కెట్లోని ఎస్‌యువిలను గురించి, ఎమ్‌పివిలను గురించి, సిఎన్‌జి కార్లను గురించి మరియు లగ్జరీ కార్లను గురించి చాలా సమాచారం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు భారతదేశంలోని అత్యంత వేగవతమైన సూపర్ కార్లను గురించి పూర్తి సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

మీకు తెలుసా.. భారతదేశంలో అత్యంత వేగవతమైన కార్లు గురించి..!!

మహీంద్రా ఎమ్9 ఎలక్ట్రో జెన్3 ఫార్ములా ఈ (Mahindra M9 Electro Gen3 Formula E):

మహీంద్రా కంపెనీ యొక్క ఈ రేసింగ్ కారును 2022 యునైటెడ్ కింగ్‌డమ్‌లో జరిగిన గుడ్‌వుడ్ ఫెస్టివల్ ఆఫ్ స్పీడ్‌లో ఆవిష్కరించింది. కంపెనీ యొక్క ఈ రేసింగ్ కారు ప్రపంచంలోని అత్యుత్తమ రేసింగ్ కార్లలో ఒకటి. ఇది దాని మునుపటి కంటే 60 కేజీల తక్కువ బరువును కలిగి ఉంది. ఈ రేసింగ్ కారు యొక్క గరిష్ట వేగం గంటకు 322 కిమీ.

మీకు తెలుసా.. భారతదేశంలో అత్యంత వేగవతమైన కార్లు గురించి..!!

మహీంద్రా రేసింగ్ ఈ కారులో రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను ఉపయోగించింది. కావున ఇది దాదాపు 40% వరకు విద్యుత్‌ను ఈ రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌ ద్వారా ఉత్పత్తి చేయగలదని కంపెనీ తెలిపింది. ఈ రేసింగ్ కారు ఆధునిక డిజైన్ కలిగి, చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

మీకు తెలుసా.. భారతదేశంలో అత్యంత వేగవతమైన కార్లు గురించి..!!

పినిన్ఫారినా బాటిస్టా (Pininfarina Battista):

నిజానికి పినిన్ఫారినా అనేది ఇటాలియన్ కార్ తయారీ సంస్థ. అయితే ఈ కంపెనీని భారతీయ వాహన తయారీదిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కొనుగోలు చేసింది. అయితే ఈ కంపెనీ బాటిస్టా ప్రీమియం హైబ్రిడ్ ఎలక్ట్రిక్ సూపర్ కారుని మొదటిసారిగా 2019 జెనీవా మోటార్ షోలో ఆవిష్కరించింది.

మీకు తెలుసా.. భారతదేశంలో అత్యంత వేగవతమైన కార్లు గురించి..!!

పినిన్ఫారినా బాటిస్టా అద్భుతమైన డిజైన్ కలిగిన సూపర్ కారు, ఇది 120 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంది. ఈ కారు కేవలం 2 సెకన్లో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు యొక్క గరిష్ట వేగం గంటకు ఏకంగా 350 కిలోమీటర్లు. మొత్తానికి ఇది భారతీయ మార్కెట్లోని అత్యంత వేగవంతమైన కార్లలో ఒకటిగా నిలిచింది.

మీకు తెలుసా.. భారతదేశంలో అత్యంత వేగవతమైన కార్లు గురించి..!!

వాజిరానీ ఎకోంక్ ఎలక్ట్రిక్ హైపర్ కార్ (Vazirani Ekonk Electric Hypercar):

ముంబైకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'వాజిరానీ' (Vazirani) భారతీయ మార్కెట్లో అత్యంత వేగవంతమైన సూపర్ కార్ ఎకోంక్ విడుదల చేసింది. ఇది భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న సూపర్ కార్లలో ఒకటి. ఇది సింగిల్ సీట్ కలిగిన హైపర్ ఎలక్ట్రిక్ కారు.

మీకు తెలుసా.. భారతదేశంలో అత్యంత వేగవతమైన కార్లు గురించి..!!

వాజిరానీ కంపెనీ యొక్క ఈ ఎకోంక్ ఎలక్ట్రిక్ హైపర్ కార్ చూడటానికి చాలా మంచి డిజైన్ కలిగి, అత్యాధునిక ఫీచర్స్ పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 2.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్లు వేగవతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 309 కిలోమీటర్ల వరకు ఉంది. అంతే కాకూండా ఈ హైపర్ కారు బరువు 738 కేజీలు మాత్రమే. కావున ఇది అత్యంత తేలికైన వేగవంతమైన కారుగా నిలిచింది.

మీకు తెలుసా.. భారతదేశంలో అత్యంత వేగవతమైన కార్లు గురించి..!!

డిసి అవంతి (DC Avanti):

డిసి అవంతి కార్ల గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ప్రముఖ డిజైనర్ 'దిలీప్ చాబ్రియా' నేతృత్వంలోని డిజైన్ బృందం ఈ డిసి అవంతి కార్లను తయారు చేయబడ్డాయి. ఇవి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా ఆధునిక ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. డిసి అవంతి అనేది భారతీయ మార్కెట్లో 2012 న ఆవిష్కరించబడింది. ఇది కంపెనీ యొక్క మొదటి సూపర్ కార్. అయితే ఈ కారుకి దేశీయ మార్కెట్లో అంత పెద్ద డిమాండ్ లేదు. ఈ కారణంగానే ఈ డిసి అవంతి కారు భారతీయ మార్కెట్లో నిలిపివేయబడింది.

మీకు తెలుసా.. భారతదేశంలో అత్యంత వేగవతమైన కార్లు గురించి..!!

డిసి అవంతి సూపర్ కార్ అనేది 2-సీటర్ కూపే. దీని ధర మిగిలిన సూపర్ కార్లకంటే కూడా తక్కువగానే ఉన్నప్పటికీ ఆశించిన విజయం పొందలేకపోయింది. డిసి అవంతి ధర రూ. 34.17 లక్షలు. డిసి అవంతి కారు టర్బోఛార్జ్డ్ 2 లీటర్ల ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 250 బిహెచ్‌పి పవర్ మరియు 340 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది భారతదేశంలో తయారుచేయబడిన వేగవతమైన సూపర్ కారు.

మీకు తెలుసా.. భారతదేశంలో అత్యంత వేగవతమైన కార్లు గురించి..!!

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతదేశంలోని అత్యుత్తమ మరియు వేగవంతమైన కార్లను గురించి తెలుసుకున్నారు.. కదా. దీనిపైనా మీ అభిప్రాయాలను మాతో పంచుకొండి, మరియు ఎప్పటికప్పుడు కొత్త కార్లు & బైకుల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ చూస్తూ ఉండండి.

Article Published On: Monday, July 11, 2022, 12:52 [IST]
English summary
Here are the top indian made supercars and its brands details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+