'2023 ఆటో ఎక్స్‌పో' డేట్స్, టికెట్ ప్రైస్ వివరాలు - ఇక్కడ చూడండి
వాహన ప్రేమికులు, వాహన తయారీ సంస్థలు ఎంతగానో ఎదురు చూస్తున్న 'ఆటో ఎక్స్‌పో 2023' గురించి ఇప్పటికే తెలుసు. అయినప్పటికీ ఈ 2023 ఆటో ఎక్స్‌పో ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
2020 తరువాత సుదీర్ఘ విరామం తరువాత జరగనున్న ఈ 'ఆటో ఎక్స్‌పో' కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ఈ ఆటో ఎక్స్‌పో దేశ రాజధాని ఢిల్లీలో 2023 జనవరి 13 నుంచి 18 వరకు జరుగుతుంది. నిజానికి జనవరి 13 నుంచి 18 వరకు ప్రజల సందర్శనార్ధం, జనవరి 11 మరియు 12 వ తేదీలు మీడియా కోసం కేటాయించబడతాయి. అయితే 'ఆటో ఎక్స్‌పో'లో భాగంగా కాంపోనెంట్ తయారీదారుల ప్రదర్శన జనవరి 12 నుంచి 15 వరకు జరగనుంది.

ఆటో ఎక్స్‌పో జరిగే ప్రదేశం:
2023 ఆటో ఎక్స్‌పో కాంపోనెంట్ షో ప్రగతి మైదాన్‌లో జరుగుతుంది, కాగా వాహన తయారీదారులు గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో ప్రదర్శిస్తారు. పర్యాటకులు ట్రైన్ మరియు రోడ్డు మార్గాల ద్వారా ఎక్స్‌పో మార్ట్ చేరుకోవచ్చు. ప్రస్తుతం, ఆక్వా లైన్‌లో సమీప ఢిల్లీ మెట్రో స్టేషన్ నాలెడ్జ్ పార్క్ 2. కారులో వెళ్లాలనుకునే వారు గ్రేటర్ నోయిడా ఎక్స్ ప్రెస్ వేపై నోయిడా వైపు డ్రైవ్ చేసి, ఎక్స్ పో మార్ట్ సంకేతాలను అనుసరించి గమ్యం చేరుకోవచ్చు.
ఆటో ఎక్స్‌పో టిక్కెట్ ధర:
'2023 ఆటో ఎక్స్‌పో' వెళ్లాలనుకునే సందర్శకులు BookMyShow లో గానీ అధికారిక ఆటో ఎక్స్‌పో యాప్‌లో గాని కొనుగోలు చేసుకోవచ్చు. ఆటో ఎక్స్‌పో మొదటి రోజు అంటే జనవరి 13 న బిజినెస్ డే కావున ఆ రోజు టికెట్ ధర రూ.750 గా నిర్ణయించబడింది. అయితే జనవరి 14 మరియు 15 వ తేదీల్లో టికెట్ ధర రూ.475 వరకు ఉంటుంది. మిగిలిన రోజులలో టికెట్ ధర రూ.350 మాత్రమే ఉంటుంది.
2023 ఆటో ఎక్స్‌పో లో టాటా మోటార్స్, మారుతి సుజుకి, హ్యుందాయ్, కియా, ఎంజి మోటార్స్, టయోటా మొదలైన కంపెనీలు ఉంటాయి. జనవరిలో జరగనున్న ఆటో ఎక్స్‌పో సుదీర్ఘ విరామం తరువాత జరుగుతుంది కావున చాల వరకు కొత్త మోడల్స్ మరియు రాబోయే లేటెస్ట్ మోడల్స్ అన్నీ కూడా ప్రదర్శించే అవకాశం ఉంది. ఆటో ఎక్స్‌పో లో ప్రముఖులను చూడాలనుకునే వారు 14 మరియు 15 వ తేదీల్లో సందర్శించవచ్చు.
ఈ ఆటో ఎక్స్‌పో లో భారతీయ కంపెనీలు ఇతర కంపెనీలకంటే ఎక్కువ ఉత్పత్తులను ప్రదర్శించే అవకాశం ఉందని భావిస్తున్నాము. అదే సమయంలో విదేశీ కంపెనీలు భవిష్యత్తులో విడుదల చేసే వాహనాలను ప్రదరిసంచవచ్చు. ఈ కారణంగానే ఈ సారి జరగబోయే 2023 ఆటో ఎక్స్‌పో మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కావున ఆటో ఎక్స్‌పో సందర్శించే సందర్శకుల సంఖ్య కూడా భారీగానే ఉండే అవకాశం ఉంటుంది.
2023 ఆటో ఎక్స్‌పో సందర్శించాలనుకునే వారు ముందుగానే టికెట్స్ బుక్ చేసుకోవాలి, అంతే కాకూండా వెళ్లాల్సిన మార్గాలను అక్కడి సంకేతాల సహాయంతో గమ్యాన్ని చేరుకోవాలి. వాహనాలను పార్కింగ్ చేయడానికి కేటాయించిన ప్రదేశాలను కనుగొని వాహనాలను సురక్షితంగా పార్కింగ్ చేసుకోవచ్చు. సందర్శకులు ఏ మాత్రం గందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిన సహాయాలు, సందేహాలు తీర్చడానికి హెల్ఫ్ డెస్క్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి.
'2023 ఆటో ఎక్స్‌పో' లో ప్రదర్శించే కొత్త కొత్త వెహికల్స్ గురించి సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి. అదే విధంగా మార్కెట్లో విడుదలయ్యే కార్లు మరియు బైకుల గురించి కూడా మీకు కావలసిన సమాచారం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ద్వారా పొందవచ్చు. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సలహాలను మాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని కథనాలు తెలుసుకోవడానికి తప్పకుండా తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








