ప్రమాదంలో కూడా ప్రాణాలు కాపాడే అత్యంత సురక్షితమైన కార్లు - వాటి వివరాలు

ఆధునిక కాలంలో ఎక్కువ మంది కార్ల కొనుగోలుదారులు ధరతో పాటు డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాదు, సేఫ్టీ ఫీచర్స్ మరియు సేఫ్టీ రేటింగ్ కూడా చూస్తున్నారు. ఈ కారణంగానే దేశీయ మార్కెట్లో సేఫ్టీ రేటింగ్ ఎక్కువ ఉన్న కార్లకు డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగిన కార్లు గురించి పూర్తి సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

ప్రమాదంలో కూడా ప్రాణాలు కాపాడే అత్యంత సురక్షితమైన కార్లు - వాటి వివరాలు

టాటా పంచ్ (Tata Punch):

సేఫ్టీ అంటేనే మొదట గుర్తొచ్చేది టాటా మోటార్స్ యొక్క కార్లు. కావున ఎక్కువమంది కొనుగోలుదారులు టాటా కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. టాటా మోటార్స్ యొక్క మైక్రో SUV చిన్నదైనప్పటికీ, సేఫ్టీలో మాత్రం 5 స్టార్ రేటింగ్ పొంది మార్కెట్లో అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా చేరిపోయింది.

ప్రమాదంలో కూడా ప్రాణాలు కాపాడే అత్యంత సురక్షితమైన కార్లు - వాటి వివరాలు

టాటా పంచ్ భారతదేశంలో గ్లోబల్ NCAP నుండి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ పొందిన అత్యంత సరసమైన మోడల్. ఈ SUV అడల్ట్ సేఫ్టీ విషయంలో 17 పాయింట్లకు గానూ 16.45 పాయింట్లు మరియు పిల్లల సేఫ్టీలో 49 కి గానూ 40.89 పాయింట్లు సాధించింది. మొత్తం మీద సేఫ్టీలో ఇది 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది.

ప్రమాదంలో కూడా ప్రాణాలు కాపాడే అత్యంత సురక్షితమైన కార్లు - వాటి వివరాలు

టాటా పంచ్‌ సేఫ్టీలో మాత్రమే కాకుండా ఆధునిక డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 1.2-లీటర్, 3-సిలిండర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్స్ పొందుతుంది.

ప్రమాదంలో కూడా ప్రాణాలు కాపాడే అత్యంత సురక్షితమైన కార్లు - వాటి వివరాలు

మహీంద్రా ఎక్స్​యూవీ300 (Mahindra XUV300):

మహీంద్రా కంపెనీ కూడా అత్యంత సురక్షితమైన కార్లను మార్కెట్లో విక్రయిస్తోంది. ఇందులో ఒకటి మహీంద్రా ఎక్స్​యూవీ300. ఇది గ్లోబల్ NCAP టెస్ట్ లో అడల్ట్ సేఫ్టీ విషయంలో 37.44 పాయింట్లు మరియు పిల్లల సేఫ్టీ విషయంలో 16.42 పాయింట్లు స్కోర్ చేసి దాని విభాగంలో అత్యంత సురక్షితమైన కారుగా నిలిచింది.

ప్రమాదంలో కూడా ప్రాణాలు కాపాడే అత్యంత సురక్షితమైన కార్లు - వాటి వివరాలు

మహీంద్రా ఎక్స్​యూవీ300 (Mahindra XUV300) ధర దేశీయ మార్కెట్లో రూ. 8.41 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉంది. ఇది 1.2-లీటర్ టర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. కావున మంచి పనితీరుని అందించడానికి కావాల్సిన విధంగా ఇది రూపొందించబడింది.

ప్రమాదంలో కూడా ప్రాణాలు కాపాడే అత్యంత సురక్షితమైన కార్లు - వాటి వివరాలు

టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz):

టాటా మోటార్స్ యొక్క మరో సురక్షితమైన వాహనం టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz). ఇది గ్లోబల్-NCAP టెస్ట్ లో పెద్దల సేఫ్టీలో 16.13 పాయింట్లు మరియు పిల్లల సేఫ్టీలో 29 పాయింట్లు స్కోర్ చేసి మొత్తం సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది.

ప్రమాదంలో కూడా ప్రాణాలు కాపాడే అత్యంత సురక్షితమైన కార్లు - వాటి వివరాలు

టాటా ఆల్ట్రోజ్ కేవలం సురక్షితమైన వాహనం మాత్రమే కాకుండా, మంచి పర్ఫామెన్స్ అందించే కారు కూడా. ఇందులో 1.2-లీటర్ నేచురల్-ఆస్పిరేటెడ్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజన్, 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మంచి పనితీరుని అందిస్తాయి. టాటా ఆల్ట్రోజ్ ప్రారంభ ధరలు రూ. 6.30 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా).

ప్రమాదంలో కూడా ప్రాణాలు కాపాడే అత్యంత సురక్షితమైన కార్లు - వాటి వివరాలు

టాటా నెక్సాన్ (Tata Nexon):

భారతీయ వాహన తయారీ దిగ్గజం అయిన టాటా మోటార్స్ యొక్క అత్యంత పాపులర్ కారు 'నెక్సాన్'. ప్రస్తుతం ఎక్కువ అమ్మకాలు పొందుతున్న కంపెనీ కారు కూడా ఇదే. దీనికి ప్రధాన కారణం డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా మంచి పర్ఫామెన్స్ & అద్భుతమైన సేఫ్టీ. ఈ SUV ధరలు రూ. 7.60 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.

ప్రమాదంలో కూడా ప్రాణాలు కాపాడే అత్యంత సురక్షితమైన కార్లు - వాటి వివరాలు

టాటా నెక్సాన్ సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందింది. అదే సమయంలో ఈ SUV 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటాయి. ఇవి రెండూ కూడా వరుసగా 118 బిహెచ్‌పి పవర్ & 170 ఎన్ఎమ్ టార్క్ మరియు 108 బిహెచ్‌పి పవర్ మరియు 260 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

ప్రమాదంలో కూడా ప్రాణాలు కాపాడే అత్యంత సురక్షితమైన కార్లు - వాటి వివరాలు

మహీంద్రా ఎక్స్​యూవీ700 (Mahindra XUV700):

మహీంద్రా కంపెనీ యొక్క మరో SUV ఈ మహీంద్రా ఎక్స్​యూవీ700 (Mahindra XUV700). ఇది కూడా అత్యంత సురక్షితమైన కారు. సేఫ్టీలో ఇది 5 స్టార్ రేటింగ్ పొందింది. అడల్ట్ సేఫ్టీలో 16.03 పాయింట్లు, పిల్లల సేఫ్టీలో 41.66 పాయింట్లు సాధించి దేశీయ మార్కెట్లోని సేఫెస్ట్ కార్లలో ఒకటిగా చేరిపోయింది.

ప్రమాదంలో కూడా ప్రాణాలు కాపాడే అత్యంత సురక్షితమైన కార్లు - వాటి వివరాలు

మహీంద్రా ఎక్స్​యూవీ700 మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ తో పాటు ADAS టెక్నాలజీని కూడా పొందుతుంది. ఈ SUV లో ఒక పెట్రోల్ ఇంజన్ మరియు రెండు డీజిల్ ఇంజన్‌లు అందుబాటులో ఉంటాయి. ఎక్స్​యూవీ700 ధరలు రూ. 13.45 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) నుండి ప్రారంభమవుతాయి.

ప్రమాదంలో కూడా ప్రాణాలు కాపాడే అత్యంత సురక్షితమైన కార్లు - వాటి వివరాలు

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ (Volkswagen Taigun):

భారతీయ మార్కెట్లో మహీంద్రా మరియు టాటా మోటార్స్ మాత్రమే కాకుండా ఫోక్స్‌వ్యాగన్ కూడా టైగన్ అనే అత్యంత సురక్షితమైన కారుని విక్రయిస్తోంది. ఇది గ్లోబల్ NCAP టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్ పొందింది. ఇది అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ లో 34 పాయింట్లకు గాను 29.64 పాయింట్లు సాధించింది. అదే సమయంలో పిల్లల సేఫ్టీలో 49 పాయింట్లకు గానూ 42 పాయింట్లను స్కోర్ చేసింది.

ప్రమాదంలో కూడా ప్రాణాలు కాపాడే అత్యంత సురక్షితమైన కార్లు - వాటి వివరాలు

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ రెండు ఇంజన్ ఆప్షన్స్ పొందుతుంది. అవి ఒకటి 1.0-లీటర్ TSI ఇంజన్ మరొకటి 1.5-లీటర్ TSI ఇంజన్. ఇవి రెండూ మంచి పనితీరుని అందిస్తాయి. కాగా ధరల విషయానికి వస్తే ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ప్రారంభ ధరలు రూ. 11.55 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా).

ప్రమాదంలో కూడా ప్రాణాలు కాపాడే అత్యంత సురక్షితమైన కార్లు - వాటి వివరాలు

స్కోడా కుషాక్ (Skoda Kushaq):

స్కోడా కుషాక్ కూడా దేశీయ మార్కెట్లో లభ్యమవుతున్న అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటి. ఇది గ్లోబల్-ఎన్‌సిఎపి టెస్ట్ లో ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మాదిరిగానే 5 స్టార్ రేటింగ్ సాధించి ఉత్తమైన సేఫ్టీ కార్ల జాబితాలో చేరిపోయింది. ఇది అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ లో 34 పాయింట్లకు గాను 29.64 పాయింట్లు సాధించింది. అదే సమయంలో పిల్లల సేఫ్టీలో 49 పాయింట్లకు గానూ 42 పాయింట్లను స్కోర్ చేసింది.

ప్రమాదంలో కూడా ప్రాణాలు కాపాడే అత్యంత సురక్షితమైన కార్లు - వాటి వివరాలు

స్కోడా కుషాక్ రెండు ఇంజిన్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి 1.0 లీటర్ మూడు సిలిండర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5-లీటర్ టిఎస్ఐ టర్బో పెట్రోల్ ఇంజన్. దీని ధర రూ. 11.29 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా).

ప్రమాదంలో కూడా ప్రాణాలు కాపాడే అత్యంత సురక్షితమైన కార్లు - వాటి వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత సురక్షితమైన కార్లను గురించి ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకున్నారు, కదా.. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటు కొత్త కారు మరియు కొత్త బైకుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Saturday, October 15, 2022, 13:25 [IST]
English summary
Here is list of top 7 safest made in india cars details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+