కియా కారెన్స్‌కి భారీగా పెరిగిన డిమాండ్, ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్ ఎంత ఉందో తెలుసా?
కొరియన్ కార్ కంపెనీ కియా మోటార్స్, భారత మార్కెట్లో తాజాగా విడుదల చేసిన తమ నాల్గవ మోడల్ కియా కారెన్స్ (Kia Carense) మార్కెట్లో భారీ డిమాండ్ ను దక్కించుకుంటోంది. ఎమ్‌పివి విభాగంలో టొయోటా ఇన్నోవా (Toyota Innova) కి పోటీగా వచ్చిన ఈ కారును కంపెనీ కేవలం రూ.8.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకే విక్రయిస్తోంది. సరసమైన ధరలు, ప్రీమియం ఫీచర్లు మరియు మంచి ప్రాక్టికాలిటీ వంటి అంశాలు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. హై డిమాండ్ కారణంగా ఈ మోడల్ వెయిటింగ్ పీరియడ్ కూడా పెరిగిపోయింది.

ఎమ్‌పివి విభాగంలో కియా ఇప్పటికే కార్నివాల్ (Kia Carnival) అనే వాహనాన్ని విక్రయిస్తోంది. అయితే, ధర మరియు ఫీచర్ల పరంగా లగ్జరీ ఎమ్‌పివి విభాగంలో విక్రయించబడుతోంది. ఈ నేపథ్యంలో, సరసమైన ధరకే 7-సీటర్ వాహనాన్ని కోరుకునే కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకొని కంపెనీ ఈ కారెన్స్ ఎమ్‌పివిని ప్రవేశపెట్టింది. కియా కారెన్స్ చూడటానికి ఎమ్‌పివిలా ఉన్నప్పటికీ, ప్రాక్టికాలిటీ పరంగా ఇది మార్కెట్లోని అనేక 7-సీటర్ ఎస్‌యూవీలకు పోటీగా నిలుస్తుంది.

కియా సోనెట్ (Kia Sonet) కాంపాక్ట్ ఎస్‌యూవీ విడుదల తర్వాత ఈ బ్రాండ్ నుండి వచ్చిన మరొక సరికొత్త ఉత్పత్తి కియా కారెన్స్. తాజా సమాచారం ప్రకారం, చాలా మంది కొనుగోలుదారులు ఈ కారును కొనుగోలు చేసేందుకు ఆసక్తిచూపుతున్నారు. ఇప్పటి వరకు ఈ కారును 19,000 మందికి పైగా బుక్ చేసుకున్నట్లు సమాచారం. ఈ సరికొత్త కియా మోడల్ కోసం పెరుగుతున్న డిమాండ్ కారణంగా, దీని వెయిటింగ్ పీరియడ్ కూడా భారీగా పెరుగుతోంది. ఇకపై కొత్తగా ఈ కారును బుక్ చేసుకున్న వారు, డెలివరీ కోసం దాదాపు 14 వారాలు వేచి ఉండాల్సి రావచ్చు.

అయితే, కస్టమర్ ఎంచుకునే వేరియంట్ ను బట్టి ఈ వెయిటింగ్ పీరియడ్ మారుతూ ఉంటుంది. కొన్ని వేరియంట్ల కోసం దాదాపు 49 వారాల వరకూ వెయిటింగ్ పీరియడ్ ఉన్నట్లు సమాచారం. సెమీ కండక్టర్ చిప్స్ లభ్యత కూడా కియా కారెన్స్ వెయిటింగ్ పీరియడ్ పెరగడానికి మరొక కారణంగా ఉంది. అయితే, ఈ వెయిటింగ్ పీరియడ్ ను వీలైనంత త్వరగా తగ్గించేందుకు కంపెనీ సన్నాహాలు కూడా చేస్తోంది. ఇందులో భాగంగా, కంపెనీ తమ అనంతపురం ప్లాంట్‌లో మూడో షిప్టులో ఉత్పత్తిని కూడా ప్రారంభించింది.

కియా సెల్టోస్ (Kia Seltos) మాదిరిగానే కియా కారెన్స్ కూడా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. కియా కారెన్స్ మొత్తం 5 వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్ వేరియంట్లు ఉన్నాయి. ఇది 6-సీటర్ లేదా 7-సీటర్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంటుంది. ఆకర్షణీయమైన ధర మరియు అధ్భుతమైన ఫీచర్ల కారణంగా కియా కారెన్స్ ప్రెస్టీజ్ మరియు ప్రెస్టీజ్ ప్లస్ వేరియంట్‌లకు గొప్ప స్పందన లభిస్తోంది.

కియా కారెన్స్ ఎమ్‌పివి తయారీ ఖర్చును తక్కువగా ఉంచేందుకు కంపెనీ కియా సెల్టోస్ ఎస్‌యూవీలో ఉపయోగించిన అవే ఇంజన్స్‌ను ఇందులో కూడా ఉపయోగించింది. ఇందులో మొత్తం మూడు ఇంజన్ ఆప్సన్స్ ఉన్నాయి. అవి: 1.5 పెట్రోల్ ఇంజన్, 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్. ఇవి వివిధ రకాల గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి. కియా కారెన్స్ ఇంజన్ స్పెసిఫికేషన్లను క్రింది పట్టికలో చూడొచ్చు.
| 1.4T-GDi Petrol Engine | |
| Power | 140 ps / 6000 rpm |
| Torque | 242 Nm / 1500-3200 rpm |
| Transmission | 7 DCT / 6 MT |
| 1.5 Petrol Engine | |
| Power | 115 ps / 6300 rpm |
| Torque | 144 Nm / 4500 rpm |
| Transmission | 6MT |
| 1.5 CRDi VGT Diesel Engine | |
| Power | 115 ps / 4000 rpm |
| Torque | 250 Nm / 1500-2700 rpm |
| Transmission | 6 AT / 6 MT |

ఇదివరకు చెప్పుకున్నట్లుగా కియా కారెన్స్ మొత్తం ఐదు ట్రిమ్‌లు, మూడు ఇంజన్ ఆప్షన్లతో వివిధ వేరియంట్లలో అందుబాటులో ఉంది. కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే, కంపెనీ ఈ ఎమ్‌పివిని అరోరా బ్లాక్ పెర్ల్, గ్రావిటీ గ్రే, గ్లేసియర్ వైట్ పెర్ల్, ఇంపీరియల్ బ్లూ, మోస్ బ్రౌన్, ఇంటెన్స్ రెడ్, స్పార్క్లింగ్ సిల్వర్, మరియు క్లియర్ వైట్ అనే ఎనిమిది ఆకర్షణీయమైన రంగులలో విక్రయిస్తోంది. కియా కారెన్స్ యొక్క వివిధ వేరియంట్లు మరియు వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
| Trims | Petrol | Turbo Petrol | Diesel |
| Smartstream 1.5 | Smartstream 1.4T | 1.5L CRDi VGT | |
| Premium | ₹8.99 Lakh | ₹10.99 Lakh | ₹10.99 Lakh |
| Prestige | ₹9.99 Lakh | ₹11.99 Lakh | ₹11.99 Lakh |
| Prestige Plus | 6MT - ₹13.49 Lakh
7DCT - ₹14.59 Lakh | ₹13.49 Lakh | |
| Luxury | ₹14.99 Lakh | ₹14.99 Lakh | |
| Luxury Plus (6/7 Seater) | 6MT - ₹16.19 Lakh
7DCT - ₹16.99 Lakh | 6MT - ₹16.19 Lakh
6AT - ₹16.99 Lakh |

కియా కారెన్స్ ఎమ్‌పివిలో ప్రధానంగా లభించే ఫీచర్ల వివరాలను గమనిస్తే, ఈ కారులో 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.5 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, ఆటో క్లైమేట్ కంట్రోల్, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, మల్టిపుల్ యూఎస్‌బి ఛార్జింగ్ పాయింట్‌లు, యాంబియంట్ లైటింగ్, స్పాట్‌లైట్లు మరియు రియర్ టేబుల్ ట్రే మొదలైనవి ఉన్నాయి.

ఇంకా ఇందులో జియోఫెన్సింగ్, లైవ్ వెహికల్ పొజిషనింగ్ మరియు ట్రాకింగ్, ఇంజన్ స్టార్ట్/స్టాప్, క్లైమేట్ కంట్రోల్ ఆపరేషన్ మరియు డోర్ లాక్/అన్‌లాక్ వంటి స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. అలాగే, సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ స్టార్ట్ కంట్రోల్, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








