కియా కార్లకు పెరుగుతున్న డిమాండ్.. వెయిటింగ్ పీరియడ్ తగ్గించేందుకు ధర్డ్ షిఫ్ట్ ప్రారంభం!
కొరియన్ కార్ కంపెనీ కియా మోటార్స్ (Kia Motors) మార్కెట్లో విడుదల చేస్తున్న కొత్త ఉత్పత్తుల కారణంగా, కంపెనీ విక్రయించే కొన్ని మోడళ్ల వెయిటింగ్ పీరియడ్ భారీగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో, వెయిటింగ్ పీరియడ్ ను తగ్గించేందుకు కియా మోటార్స్ తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచింది. ప్రస్తుతం, కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్ జిల్లాలో ఓ కార్ల తయారీ కేంద్రం ఉంది. ఈ ప్లాంట్ లో కంపెనీ ఇప్పుడు కొత్తగా మూడవ షిఫ్టును కూడా ప్రారంభించి, కార్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచింది.

అనంతపూర్ ఫ్యాక్టరీలో మూడవ షిఫ్టును ప్రారంభించడం ద్వారా కొత్త వ్యక్తులకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటుగా కంపెనీ విక్రయించే సోనెట్, సెల్టోస్ మరియు కారెన్స్ వంటి కార్ల వెయిటింగ్ పీరియడ్ కూడా భారీగా తగ్గుతుందని భావిస్తున్నారు. కియా మోటార్స్ యొక్క అనంతపూర్ ప్లాంట్ లో సంవత్సరానికి 3 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ఇప్పుడు ఇందులో మూడవ షిఫ్టును ప్రారంభించడంతో కంపెనీ పూర్తి సామర్థ్యంతో కార్లను ఉత్పత్తి చేస్తోంది.

కియా మోటార్స్ భారతీయ మార్కెట్‌తో పాటు ఇతర దేశాలలో కూడా మంచి స్పందనను అందుకుంటోంది, దీని కారణంగా సెల్టోస్ మరియు సోనెట్ వంటి మోడళ్ల కోసం చాలా కాలం వేచి ఉండాల్సి వస్తోంది. ఇదిలా ఉంటే, కియా మోటార్స్ ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన కారెన్స్ (Kia Carens) ఎమ్‌పివికి మార్కెట్ నుంచి ఆదరణ లభిస్తోంది. ఈ కారు కోసం ఇప్పటికే 19,000 యూనిట్లకు పైగా బుకింగ్‌లు వచ్చినట్లు కంపెనీ తెలిపింది.

కియా కారెన్స్ కోసం ఉన్న అధిక డిమాండ్ కారణంగా, ఇందులో కొన్ని వేరియంట్లను సొంతం చేసుకునేందుకు కస్టమర్లు దాదాపు 9 నెలల నుండి 1 సంవత్సరం వరకు వేచి ఉండవలసి వస్తోంది. ఈ వెయిటింగ్ పీరియడ్ ను తగ్గించేందుకు కంపెనీ గట్టిగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే, అనంతపురం ప్లాంట్ లో మూడవ షిఫ్ట్‌ని ప్రారంభించింది. కియా మోడళ్లకు పెరుగుతున్న డిమాండ్ తో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెమీకండక్టర్ చిప్ కొరత కూడా కంపెనీ ఉత్పత్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తోంది.

కియా ఇండియా ప్లాంట్ లో మూడవ షిఫ్టును ప్రారంభించడం ద్వారా కంపెనీ ఇప్పుడు పూర్తి స్థాయిలో (సంవత్సరానికి 3 లక్షల) కార్లను ఉత్పత్తి చేస్తుంది. కియా ఈ ప్లాంట్‌లో 2019లో ప్రారంభించింది, అప్పటి నుండి ఇప్పటివరకు కంపెనీ 5 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసింది. వీటిలో 4 లక్షల యూనిట్లు భారత మార్కెట్‌లో విక్రయించబడగా, మిగిలినవి వివిధ దేశాలకు ఎగుమతి చేయబడ్డాయి. కియా వాహనాలకు వినియోగదారుల నుండి లభిస్తున్న స్పందను దృష్టిలో ఉంచుకొని, కంపెనీ మరొక ప్లాంట్‌ను ప్రారంభించే ప్రణాళికపై కూడా పని చేస్తున్నట్లు సమాచారం.

కస్టమర్ల నుండి కియా కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి మరియు భారత మార్కెట్లో కంపెనీ మరిన్ని కొత్త మోడల్‌లను విడుదల చేయడానికి ఈ కొత్త ప్లాంట్‌ను తెరవడం చాలా అవసరం. ప్రస్తుతం, కియా మోటార్స్ అనంతపురం ప్లాంట్ లో 211 ఎకరాల్లో మాత్రమే ఉత్పత్తి పనులు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఉన్న కియా మోటార్స్ ప్లాంట్‌లో ప్రతి 1.20 నిమిషాలకు కొత్త వాహనం సిద్ధం అవుతుందని సమాచారం. ఇందుకోసం ఈ ప్లాంట్‌లో దాదాపు 12 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు.

ప్రెస్, బాడీ షేపింగ్, పెయింటింగ్, ఇంజిన్ ఇన్‌స్టాలేషన్ కోసం ఉపయోగించే కియా మోటార్స్ యొక్క ఈ ప్లాంట్‌లో 450 కంటే ఎక్కువ రోబోట్‌లు ఇన్‌స్టాల్ చేయబడ్డాయి. దీనితో పాటు, వాటిని అసెంబ్లీ లైన్‌లో కూడా వివిధ మార్గాల్లో ఉపయోగిస్తారు. ఇప్పుడు కంపెనీ కొత్త ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేస్తుందో వేచి చూడాలి మరియు అది ప్రారంభమయ్యే నాటికి, కొత్త మోడల్‌ను తీసుకురావడానికి ముందు కంపెనీ ఈ చర్య తీసుకోవలసి ఉంటుంది.

కంపెనీ సెప్టెంబర్ 2019 లో వాహనాలను ఎగుమతి చేయడం ప్రారంభించింది మరియు దానిని తమ పాపులర్ సెల్టోస్ ఎస్‌యూవీతో ప్రారంభించింది. కంపెనీ ప్రస్తుతం దేశంలోనే మొదటి UV (యుటిలిటి వెహికల్) ఎగుమతిదారుగా ఉంది మరియు భారతదేశంలో తయారైన వాహనాలను దాదాపు 91 దేశాలకు ఎగుమతి చేస్తోంది. కియా మోటార్స్ భారతదేశంలో కార్యకలాపాలు ప్రారంభించిన కేవలం 2.5 సంవత్సరాలలో ఈ సంఖ్యను సాధించింది.

కియా మోటార్స్ ఇటీవలే భారత మార్కెట్లో తమ నాల్గవ మోడల్ కారెన్స్ (Kia Carens) ఎమ్‌పివిని కూడా విడుదల చేసింది. కారెన్స్ ఎమ్‌పివికి లభిస్తున్న ఆదరణ చూస్తుంటే, త్వరలోనే కంపెనీ అమ్మకాలు కొత్త గరిష్టానికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కంపెనీ ప్రస్తుతం సెల్టోస్, సొనెట్, కార్నివాల్ మరియు కొత్త క్యారన్స్‌తో సహా మొత్తం నాలుగు వాహనాలను విక్రయిస్తోంది, వీటన్నింటికీ కస్టమర్ల నుండి మంచి స్పందన వస్తోంది.

Kia Carens భారతదేశంలో ఇటీవలే ప్రారంభించబడింది మరియు దీని ధర రూ. 8.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతుంది. కియా కారెన్స్ ఎమ్‌పివి ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్ అనే 5 వేరియంట్‌లలో విడుదల చేయబడింది, ఇందులో టాప్-ఆఫ్ ది లైన్ వేరియంట్ ధర రూ.16.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.


Click it and Unblock the Notifications








