హోండా 2022 జులై ఆఫర్స్: ఏ వేరియంట్‌పైన ఎంత డిస్కౌంట్ అంటే?

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'హోండా' (Honda) ఇప్పుడు 2022 జులై నెలలో తన ఉత్పత్తులపైన డిస్కౌంట్లు మరియు ఆఫర్లను అందిస్తోంది. కంపెనీ ఈ ఆఫర్స్ కేవలం తన జాబితాలోని హోండా సిటీ (5వ తరం), హోండా డబ్ల్యుఆర్-వి, హోండా జాజ్, హోండా అమేజ్ మరియు హోండా సిటీ (4వ తరం) కార్లపైన మాత్రమే అందిస్తోంది.

ఇంతకీ హోండా కంపెనీ ఈ కార్లపైన ఎంత వరకు డిస్కౌంట్స్ అందిస్తోందనే మరిన్ని వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

హోండా 2022 జులై ఆఫర్స్: ఏ వేరియంట్‌పైన ఎంత డిస్కౌంట్ అంటే?

హోండా సిటీ - 5వ తరం (Honda City - 5th Generation):

హోండా కంపెనీ యొక్క 'హోండా సిటీ' (Honda City) అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్ వెహికల్. అయితే కంపెనీ ఇప్పుడు ఈ వెహికల్ పైన ఈ 2022 జులై నెలలో ఏకంగా రూ. 27,396 వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో రూ. 5000 వరకు క్యాష్ డిస్కౌంట్, లేదా రూ. 5,396 వరకు ఫ్రీ FOC యాక్ససరీస్ పొందవచ్చు. అంతే కాకుండా కంపెనీ దీనిపైన రూ. 5000 కార్ ఎక్స్ఛేంజ్‌ అవకాశం కూడా కల్పిస్తోంది.

హోండా 2022 జులై ఆఫర్స్: ఏ వేరియంట్‌పైన ఎంత డిస్కౌంట్ అంటే?

వీటితో పాటు కంపెనీ ఇప్పుడు తన కస్టమర్ల కోసం రూ. 5,000 లాయల్టీ బోనస్ యొక్క అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తోంది. అంతే కాకుండా ఎక్స్చేంజ్ బోనస్ రూ. 7,000 మరియు కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 5,000 వంటి వాటిని కూడా ఈ నెలలో హోండా సిటీ 5 వ తరం కొనుగోలు చేసేవారు పొందవచ్చు.

హోండా 2022 జులై ఆఫర్స్: ఏ వేరియంట్‌పైన ఎంత డిస్కౌంట్ అంటే?

హోండా డబ్ల్యుఆర్-వి (Honda WR-V):

హోండా కార్స్ ఇండియా 2022 జులై నెలలో తన హోండా డబ్ల్యుఆర్-వి పైన రూ. 27,000 వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో రూ. 10,000 కార్ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, రూ. 5,000 కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. అంతే కాకుండా రూ. 5,000 లాయల్టీ బోనస్‌ మరియు రూ. 7,000 కార్ ఎక్స్ఛేంజ్ బోనస్‌ కూడా పొందవచ్చు. మొత్తం మీద కొనుగోలుదారులు ఈ నెలలో హోండా డబ్ల్యుఆర్-వి కొనుగోలు చేసినట్లయితే రూ. 27,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.

హోండా 2022 జులై ఆఫర్స్: ఏ వేరియంట్‌పైన ఎంత డిస్కౌంట్ అంటే?

హోండా జాజ్ (Honda Jazz):

హోండా జాజ్ (Honda Jazz) పైన కంపెనీ ఇప్పుడు రూ. 25,000 డిస్కౌంట్ అందిస్తోంది. ఇందులో ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ రూ. 10,000 ఉంది. అదే సమయంలో కస్టమర్ లాయల్టీ బోనస్ రూ. 5,000 మరియు కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 3,000 వరకు ఉండగా, కార్ ఎక్స్ఛేంజ్ బోనస్ 7,000 వరకు ఉంది.

హోండా 2022 జులై ఆఫర్స్: ఏ వేరియంట్‌పైన ఎంత డిస్కౌంట్ అంటే?

కొత్త హోండా అమేజ్ (New Honda Amaze):

హోండా కంపెనీ యొక్క హోండా అమేజ్ మంచి అమ్మకాలను పొందుతున్న కంపెనీ వెహికల్. ఇప్పుడు కంపెనీ దీని పైనా కూడా 2022 జులై నెలలో రూ. 8,000 వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. ఇందులో రూ. 5,000 లాయల్టీ బోనస్ మరియు రూ. 3,000 కార్పొరేట్ డిస్కౌంట్ మాత్రమే ఉన్నాయి. ఈ నెలలో హోండా అమేజ్ కొనుగోలు చేసేవారు ఈ బెనిఫిట్స్ పొందవచ్చు.

హోండా 2022 జులై ఆఫర్స్: ఏ వేరియంట్‌పైన ఎంత డిస్కౌంట్ అంటే?

హోండా సిటీ - 4వ తరం (Honda City - 4th Generation):

కంపెనీ హోండా సిటీ - 4వ తరం మీద కేవలం రూ. 5,000 మాత్రమే డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇది కస్టమర్ లాయల్టీ బోనస్ కింద ఈ ప్రయోజనం పొందవచ్చు. కావున ఈ హోండా సిటీ కొనుగోలుపైనా కస్టమర్లు ఇప్పుడు రూ. 5,000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు.

హోండా 2022 జులై ఆఫర్స్: ఏ వేరియంట్‌పైన ఎంత డిస్కౌంట్ అంటే?

కంపెనీ అందిస్తున్న ఈ ప్రయోజనాల్లో ఎక్కువగా హోండా సిటీ - 5వ తరం మీద అందిస్తోంది. అయితే తక్కువగా హోండా సిటీ - 4వ తరం మీద అందిస్తోంది. అయితే ఈ ప్రయోజనాలన్నీ కేవలం 2022 జులై 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మరిన్ని వివారాలు తెలుసుకోవడానికి సమీపంలోని హోండా డీలర్షిప్ సందర్శించవచ్చు.

More from DriveSpark

Article Published On: Wednesday, July 6, 2022, 8:00 [IST]
English summary
Honda cars india offers for july 2022 on city amaze jazz wr v details
Read more on: #హోండా #honda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+