హోండా సిటీ హైబ్రిడ్ (Honda City e:HEV) ప్రొడక్షన్ ప్రారంభం; త్వరలో విడుదల

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ఇటీవల భారత మార్కెట్లో ఆవిష్కరించిన తమ సరికొత్త హైబ్రిడ్ కారు హోండా సిటీ ఇ:హెచ్ఈవి (Honda City e:HEV) యొక్క ఉత్పత్తిని కంపెనీ ప్రారంభించింది. రాజస్థాన్‌లోని తపుకరాలో ఉన్న హోండా కార్ ప్లాంట్‌లో ఈ హైబ్రిడ్ సిటీ సెడాన్ తయారవుతోంది. తాజాగా, ఈ ప్లాంట్ నుండి ఉత్పత్తి చేసిన మొదటి సిటీ హైబ్రిడ్ కారును కంపెనీ బయటకు విడుదల చేసింది. త్వరలోనే సిటీ సెడాన్ హైబ్రిడ్ డీలర్ స్టాక్ యార్డులకు చేరుకోనుంది మరియు వచ్చే నెలలో మార్కెట్లో విడుదల కానుంది.

హోండా సిటీ హైబ్రిడ్ (Honda City e:HEV) ప్రొడక్షన్ ప్రారంభం; త్వరలో విడుదల

హోండా నుంచి వచ్చిన మొదటి హైబ్రిడ్ కారు ఇది, భారత మార్కెట్లో హోండా సిటీ e:HEV కి నేరుగా ఎలాంటి పోటీ లేదు. దేశంలో ఇంధన ధరలు గతంలో కంటే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, అధిక మైలేజ్‌నిచ్చే ఎగ్జిక్యూటివ్ సెడాన్‌ను కోరుకునే వారికి హోండా సిటీ హైబ్రిడ్ చక్కటి ఆప్షన్‌గా ఉంటుంది. ఈ హైబ్రిడ్ సెటప్‌ కారణంగా కొత్త హోండా సిటీ ఇ:హెచ్ఈవీ ప్రతి లీటరుకు 26.5 కిమీ మైలేజీని అందించగలదని కంపెనీ పేర్కొంది. ఈ సెగ్మెంట్లోనే అత్యధిక మైలేజీగా చెప్పవచ్చు.

హోండా సిటీ హైబ్రిడ్ (Honda City e:HEV) ప్రొడక్షన్ ప్రారంభం; త్వరలో విడుదల

హోండా సిటీ హైబ్రిడ్ వెర్షన్ ఇప్పటికే కొన్ని ఆసియా మార్కెట్లలో అమ్మకానికి ఉంది మరియు ఇది స్టాండర్డ్ మోడల్‌కి ఎగువన అందుబాటులో ఉంటుంది. కాగా, భారత మర్కెట్లో కొనుగోలుదారులను ఆకర్షించడానికి, ఇండియా-స్పెక్ హోండా సిటీ ఇ:హెచ్ఈవిలో ఎక్కువ క్రోమ్ గార్నిష్‌తో ఇది చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. ఐదవ తరం హోండా సిటీ సెడాన్‌ యొక్క టాప్-ఎండ్ వేరియంట్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఈ హైబ్రిడ్ కారును తయారు చేస్తోంది. ఇది పూర్తిగా భారతదేశంలోనే తయారవుతున్న మేడ్ ఇన్ ఇండియా హోండా హైబ్రిడ్ కారుగా ఉంటుంది.

హోండా సిటీ హైబ్రిడ్ (Honda City e:HEV) ప్రొడక్షన్ ప్రారంభం; త్వరలో విడుదల

స్టాండర్డ్ మోడల్‌కి మరియు ఈ హైబ్రిడ్ మోడల్‌కి ఓవరాల్ డిజైన్‌లో ఎలాంటి మార్పు ఉండదు. అయితే, ఈ రెండు మోడళ్ల మధ్య వ్యత్యాసాన్ని చూపేందుకు కంపెనీ దీని ఫ్రంట్ డిజైన్‌లో హోండా లోగోను బ్లూ యాక్సెంట్స్‌తో హైలైట్ చేసింది. ఇందులోని ఇతర డిజైన్ అంశాలలో రివైజ్డ్ ఫ్రంట్ బంపర్, హారిజాంటల్ స్లాట్‌లకు బదులుగా హనీకోంబ్ ప్యాటర్న్‌తో కూడిన కొత్త ఫ్రంట్ గ్రిల్ డిజైన్, డిఫ్యూజర్ వంటి ఎలిమెంట్‌తో రివైజ్ చేయబడిన రియర్ బంపర్ మరియు బూట్‌ డోర్‌పై కొత్త లిప్ స్పాయిలర్ వంటి మార్పులు ఉన్నాయి.

హోండా సిటీ హైబ్రిడ్ (Honda City e:HEV) ప్రొడక్షన్ ప్రారంభం; త్వరలో విడుదల

హోండా సిటీ హైబ్రిడ్ కారులో అందిస్తున్న హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌ చాలా సమర్థవంతమైనదని కంపెనీ తెలిపింది. ఇది సరళమైన ISG (ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్)ను కలిగి ఉంటుంది. కొత్త హోండా సిటీ ఇ-హెచ్ఈవి హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు ఫ్రంట్ యాక్సిల్స్‌లో అమర్చిన రెండు ఎలక్ట్రిక్ మోటార్లు మరియు ఓ చిన్న బ్యాటరీ ప్యాక్ ఉంటాయి. ఈ బ్యాటరీ ప్యాక్‌ను ప్రత్యేకంగా చార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. కారు చలనంలో ఉన్నప్పుడు మరియు బ్రేక్ లను అప్లయ్ చేసినప్పుడు వచ్చే ఎనర్జీ సాయంతో ఈ బ్యాటరీ ప్యాక్ చార్జ్ అవుతుంది.

హోండా సిటీ హైబ్రిడ్ (Honda City e:HEV) ప్రొడక్షన్ ప్రారంభం; త్వరలో విడుదల

సిటీ హైబ్రిడ్ కారులో స్టాండర్డ్ మోడల్‌లో ఉపయోగించిన అదే 1.5 లీటర్ నేచురల్-ఆస్పిరేటెడ్ అట్కిన్సన్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. అయితే, ఈ ఇంజన్ కేవలం 97 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 127 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. ఇది స్టాండర్డ్ మోడల్ ఉత్పత్తి చేసే పవర్, టార్క్ స్వల్పంగా తక్కువ. అయితే, ఇందులోని హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ కారణంగా ఈ ఇంజన్ మరియు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు కలిసి గరిష్టంగా 108 బిహెచ్‌పి శక్తిని మరియు 253 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.

హోండా సిటీ హైబ్రిడ్ (Honda City e:HEV) ప్రొడక్షన్ ప్రారంభం; త్వరలో విడుదల

ఈ హైబ్రిడ్ కారులోని బ్యాటరీ పూర్తిగా చార్జ్ అయిన తర్వాత దీనిని విడిగా కేవలం ఎలక్ట్రిక్ మోడ్ లో కూడా డ్రైవ్ చేయవచ్చు. అయితే, ఎలక్ట్రిక్ మోడ్ లో ఇది కేవలం గంటకు 40 కిమీ వేగంతో మాత్రమే ప్రయాణిస్తుంది. ఎలక్ట్రిక్ మోడ్ లో దీని రేంజ్ ఎంత ఉంటుందనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అలాకాకుండా, ఎలక్ట్రిక్ మరియు పెట్రోల్ ఇంజన్ కలయికతో దీనిని ఉపయోగించడం ద్వారా ఇది లీటరుకు 26.5 కిమీ మైలేజీని ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

హోండా సిటీ హైబ్రిడ్ (Honda City e:HEV) ప్రొడక్షన్ ప్రారంభం; త్వరలో విడుదల

హోండా ఈ హైబ్రిడ్ కారులో 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, సరౌండ్ సౌండ్ స్పీకర్ సిస్టమ్, పూర్తి ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 7 ఇంచ్ ఫుల్-కలర్ టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, వాక్ అవే ఆటో లాక్, హోండా స్మార్ట్ కనెక్ట్ యాప్‌ సాయంతో పనిచేసే కనెక్ట్ చేయబడిన కార్ టెక్ వంటి మరెన్నో ఫీచర్లను అందిస్తోంది.

హోండా సిటీ హైబ్రిడ్ (Honda City e:HEV) ప్రొడక్షన్ ప్రారంభం; త్వరలో విడుదల

సేఫ్టీ పరంగా చూస్తే, Honda City e:HEV, ఈ ప్రోడక్ట్ లైనప్ లోని ఇతర వేరియంట్ల కన్నా చాలా మెరుగ్గా ఉంటపంది. కంపెనీ ఇందులో హోండా సెన్సింగ్ టెక్నాలజీ అనే అధునాతన డ్రైవర్ డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లను అందిస్తోంది. ఈ ఫీచర్లలో ఆటో హై బీమ్ అసిస్ట్, ఎమర్జెన్సీ బ్రేకింగ్, రోడ్ డిపార్చర్ మిటిగేషన్, ఎజైల్ హ్యాండ్లింగ్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్-కీపింగ్ అసిస్ట్ మరియు ఫ్రంట్ కొలిషన్ వార్నింగ్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి. ఈ కారు ధర మరియు డెలివరీకి సంబంధించిన సమాచారం తెలియాలంటే, మరికొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda city e hev hybrid car production started in india launch expected soon
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X