మైలేజ్ సమస్యకు చెక్ పెట్టేందుకు వస్తున్న హోండా సిటీ హైబ్రిడ్ (Honda City e:HEV); ఏప్రిల్ 14న లాంచ్!

జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్ ఇండియా లిమిటెడ్ (Honda Car India Limited), భారత మార్కెట్లో విక్రయిస్తున్న సిటీ సెడాన్‌లో మరో కొత్త పవర్‌ట్రైన్‌తో కూడిన సరికొత్త కారును విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా, కంపెనీ ఇందుకు సబంధించిన ఓ టీజర్ ను కూడా విడుదల చేసింది. ఈ టీజర్‌ను బట్టి చూస్తుంటే, హోండా నుండి రాబోయే కొత్త సిటీ సెడాన్ హైబ్రిడ్ కారు రూపంలో ఉంటుందని తెలుస్తోంది. హోండా సిటీ సెడాన్ జెడ్ఎక్స్ వేరియంట్లో కంపెనీ ఇ-హెచ్‌ఈవీ (Honda City e:HEV) పేరుతో ఈ టీజర్‌ను విడుదల చేసింది.

మైలేజ్ సమస్యకు చెక్ పెట్టేందుకు వస్తున్న హోండా సిటీ హైబ్రిడ్ (Honda City e:HEV); ఏప్రిల్ 14న లాంచ్!

ఈ టీజర్ వీడియోలో కంపెనీ తమ హోండా సిటీ సెడాన్ జెడ్ఎక్స్ వేరియంట్ యొక్క వెనుక భాగాన్ని టీజ్ చేసింది. ఇందులో ZX బ్యాడ్జ్‌కి దిగువన e:HEV బ్యాడ్జ్ కనిపిస్తుంది. హోండా సిటీ హైబ్రిడ్ సెడాన్‌ను కంపెనీ ఏప్రిల్ 14, 2022 వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు పేర్కొంది. హోండా అధికారిక వెబ్‌సైట్‌లో కంపెనీ ఈ కొత్త సిటీ సెడాన్ హైబ్రిడ్ వేరియంట్ పేజీని హైలైట్ చేసింది మరియు ఈ కారు పట్ల ఆసక్తి ఉన్న వారికో రిజిస్ట్రేషన్లను కూడా ఓపెన్ చేసింది.

మైలేజ్ సమస్యకు చెక్ పెట్టేందుకు వస్తున్న హోండా సిటీ హైబ్రిడ్ (Honda City e:HEV); ఏప్రిల్ 14న లాంచ్!

సమాచారం ప్రకారం, కొత్త హోండా సిటీ హైబ్రిడ్ కారులో, కంపెనీ స్టాండర్డ్ పెట్రోల్ ఇంజన్‌తో పాటుగా రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లను ఉపయోగించే i-MMD హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించవచ్చని తెలుస్తోంది. కంపెనీ దీనిని టాప్-ఎండ్ ZX ట్రిమ్‌లో విడుదల చేయనుంది. సిటీ హైబ్రిడా సెడాన్ ఈ సంవత్సరంలో హోండా యొక్క అతిపెద్ద లాంచ్ కానుంది. ప్రస్తుతం, కంపెనీ తమ పాపులర్ హోండా సిటీ మిడ్-సైజ్ సెడాన్ ను పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో విక్రయిస్తోంది.

వాస్తవానికి, హోండా సిటీ హైబ్రిడ్ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే విడుదల కావలసి ఉండగా, కరోనా మహమ్మారి పరిస్థితుల కారణంగా, దీని లాంచ్ వాయిదా వేయబడింది. ఈ నెలలో హోండా తమ సిటీ సెడాన్ హైబ్రిడ్ కారును ప్రవేశపెట్టిన తర్వాత, దీని డెలివరీలు వచ్చే (మే 2022) నెలలో ప్రారంభించబడుతాయని భావిస్తున్నారు. హోండా సెన్సింగ్ టెక్నాలజీతో కంపెనీ ఈ హైబ్రిడ్‌ కారును అందించవచ్చు. హోండా ప్రస్తుతం తన గ్లోబల్ మోడల్స్ హైబ్రిడ్ కార్లలో కూడా ఇదే టెక్నాలజీని ఉపయోగిస్తోంది.

హోండా సెన్సింగ్ టెక్నాలజీలో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, ఆటో హై బీమ్ అసిస్ట్, ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి అనేక భద్రతా ఫీచర్లను కలిగి ఉండే ఓ కంప్లీట్ సేఫ్టీ ఫీచర్ ప్యాకేజ్. సింపుల్‌గా చెప్పాలంటే, ఇది మహీంద్రా ఎక్స్‌యూవీ700 మరియు ఎమ్‌జి ఆస్టర్ వంటి కార్లలో లభిస్తున్న అడాస్ (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటి ఫీచర్లకు సమానమైనదిగా ఉంటుంది.

మైలేజ్ సమస్యకు చెక్ పెట్టేందుకు వస్తున్న హోండా సిటీ హైబ్రిడ్ (Honda City e:HEV); ఏప్రిల్ 14న లాంచ్!

ఇలాంటి అద్భుతమైన ఫీచర్లతో సిటీ హైబ్రిడ్ సెడాన్ భారతదేశంలో అనేక భద్రతా ఫీచర్లతో నిండిన హోండా మొదటి కారుగా నిలుస్తుంది. దీని కారణంగా, హోండా సిటీ హైబ్రిడ్ సెడాన్ ధర కూడా దాని ఇతర వేరియంట్‌ల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. కంపెనీ దీనిని భారత మార్కెట్లో సిటీ సెడాన్ యొక్క టాప్ ఆఫ్ ది లైన్ వేరియంట్‌గా విక్రయించవచ్చు.

మైలేజ్ సమస్యకు చెక్ పెట్టేందుకు వస్తున్న హోండా సిటీ హైబ్రిడ్ (Honda City e:HEV); ఏప్రిల్ 14న లాంచ్!

కొత్త హోండా సిటీ హైబ్రిడ్ ఇంజన్ కూడా చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. ఇది హోండా యొక్క i-MMD హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించే హైబ్రిడ్ ఇంజన్. ఇందులో అంతర్గత దహన యంత్రం (IC)తో పాటుగా అమర్చిన రెండు ఎలక్ట్రిక్ మోటార్లు కూడా ఉంటాయి. ఇందులోని 1.5 లీటర్ అట్కిన్సన్ పెట్రోల్ ఇంజన్, గరిష్టంగా 98 బిహెచ్‌పి పవర్ ను మరియు 127 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

మైలేజ్ సమస్యకు చెక్ పెట్టేందుకు వస్తున్న హోండా సిటీ హైబ్రిడ్ (Honda City e:HEV); ఏప్రిల్ 14న లాంచ్!

అదే సమయంలో, ఇందులోని రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లతో కూడిన ఈ ఇంజన్ 109 బిహెచ్‌పి శక్తిని మరియు 253 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఎలక్ట్రిక్ మోటార్లు కారు ముందు చక్రాలకు అమర్చబడి ఉంటాయి, ఇవి ఒకే ఫిక్స్‌డ్ రేషియో గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. ఇందులోని ఫీచర్ల విషయానికి వస్తే, కంపెనీ తమ ఐదవ తరం హోండా సిటీ హైబ్రిడ్ కారు యొక్క టాప్-ఎండ్ జెడ్ఎక్స్ వేరియంట్లో అందించే అన్ని ఫీచర్లను ఇందులో కూడా అందించనుంది.

మైలేజ్ సమస్యకు చెక్ పెట్టేందుకు వస్తున్న హోండా సిటీ హైబ్రిడ్ (Honda City e:HEV); ఏప్రిల్ 14న లాంచ్!

హోండా గ్లోబల్ మార్కెట్ల కోసం కూడా కొత్త వాహనాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. తాజాగా, కంపెనీ తన కొత్త 2022 Honda HR-V టీజర్‌ను కూడా విడుదల చేసింది. హోండా హెచ్ఆర్-వి ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లలో మంచి సక్సెస్‌ఫుల్ మోడల్‌గా మరియు ఖరీదైన హోండా సిఆర్-వి ఎస్‌యూవీకి ప్రత్యామ్నాయంగా ఉంది. హోండా సిఆర్-వి మాదిరిగానే హెచ్ఆర్-వి కూడా ఓ 5-సీటర్ ఎస్‌యూవీ. ఈ రెండు మోడళ్లలో ప్రధానమైన తేడా ఎక్కడ అంటే, వాటి ఇంజన్ మరియు స్పేస్ విషయంలో ఉంటుంది. ఇది ప్రత్యేకించి అమెరికన్ మార్కెట్ కోసం తయారు చేయబడింది. అధిక ధర కారణంగా, ఇది భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు లేవు. భారత మార్కెట్లో సిఆర్-విని నిలిపివేసిన తర్వాత ప్రస్తుతం, హోండా భారత మార్కెట్లో ఎలాంటి ఎస్‌యూవీలను విక్రయించడం లేదు.

More from DriveSpark

Article Published On: Tuesday, April 12, 2022, 15:48 [IST]
English summary
Honda city e hev hybrid variant teaser released official unveil on 14th april details
Read more on: #హోండా #honda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+