హోండా సిటీ ఇ:హెచ్ఈవి (Honda City e:HEV) హైబ్రిడ్ వేరియంట్ ఆవిష్కరణ - ఫీచర్లు

జపనీస్ కార్ బ్రాండ్ హోండా (Honda) భారత మార్కెట్లో విక్రయిస్తున్న సిటీ సెడాన్‌లో ఓ కొత్త హైబ్రిడ్ వెర్షన్‌ను ఆవిష్కరించింది. హోండా సిటీ ఇ-హెచ్‌ఈవీ (Honda City e:HEV) పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ హైబ్రిడ్ వెర్షన్ V మరియు ZX అనే రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. ఈ హైబ్రిడ్ కారును పూర్తిగా భారతదేశంలోనే తయారు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ మేడ్ ఇన్ ఇండియా హోండా సిటీ ఇ-హెచ్ఈవి హైబ్రిడ్ కారు ధరలు కంపెనీ మే 2022 నెల ఆరంభంలో వెల్లడించనుంది.

హోండా సిటీ ఇ:హెచ్ఈవి (Honda City e:HEV) హైబ్రిడ్ వేరియంట్ ఆవిష్కరణ - ఫీచర్లు

Honda City e:HEV - హైబ్రిడ్ ఇంజన్, గేర్‌బాక్స్, మైలేజ్

హైటెక్ పెర్ఫార్మెన్స్, అడ్వాన్స్డ్ సేఫ్టీ, ప్రీమయం డిజైన్ మరియు కంఫర్ట్‌తో హోండా సిటి ఇ-హెచ్ఈవి హైబ్రిడ్ కారును తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది. కొత్త హోండా సిటీ హైబ్రిడ్ కారులో, కంపెనీ స్టాండర్డ్ పెట్రోల్ ఇంజన్‌తో పాటుగా రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లను ఉపయోగించే i-MMD హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించింది. హోండా సిటీ హైబ్రిడ్ 1.5 లీటర్ అట్కిన్సన్ i-VTEC పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ మరియు రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లుతో కలిసి గరిష్టంగా 109 బిహెచ్‌పి శక్తిని మరియు 253 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.

హోండా సిటీ ఇ:హెచ్ఈవి (Honda City e:HEV) హైబ్రిడ్ వేరియంట్ ఆవిష్కరణ - ఫీచర్లు

ఈ ఎలక్ట్రిక్ మోటార్లు కారు ముందు చక్రాలకు అమర్చబడి ఉంటాయి, ఇవి ఒకే ఫిక్స్‌డ్ రేషియో గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. ఇంజిన్ eCVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. హైబ్రిడ్ పవర్‌ట్రైన్ కారణంగా, కొత్త సిటీ ఇ-హెచ్ఈవి లీటరుకు 26.5 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ కారు గరిష్టంగా గంటకు 176 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుందని కంపెనీ తెలిపింది.

హోండా సిటీ ఇ:హెచ్ఈవి (Honda City e:HEV) హైబ్రిడ్ వేరియంట్ ఆవిష్కరణ - ఫీచర్లు

Honda City e:HEV - ఫీచర్లు

ఇందులోని ఫీచర్ల విషయానికి వస్తే, కంపెనీ తమ ఐదవ తరం హోండా సిటీ హైబ్రిడ్ కారు యొక్క టాప్-ఎండ్ వేరియంట్లలో అందించే అన్ని ఫీచర్లను ఇందులో కూడా అందించనుంది. అదనంగా, ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే మరియు హోండా వెబ్‌లింక్ కనెక్టింగ్ టెక్నాలజీతో కూడిన పెద్ద 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, ట్వీక్ చేసిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ (ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో సహా) మరియు అలెక్సా అండ్ గూగుల్ వాయిస్ అసిస్టెంట్ వంటి మరెన్నో ఫీచర్లు కూడా ఉన్నాయి.

హోండా సిటీ ఇ:హెచ్ఈవి (Honda City e:HEV) హైబ్రిడ్ వేరియంట్ ఆవిష్కరణ - ఫీచర్లు

సిటీ హైబ్రిడ్ హోండా యొక్క స్వంత ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్)తో వస్తుంది. దీనినే హోండా సెన్సింగ్ టెక్నాలజీ అని కూడా పిలుస్తారు. హోండా సెన్సింగ్ టెక్నాలజీలో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, ఆటో హై బీమ్ అసిస్ట్, బ్లైండ్-స్పాట్ డిటెక్షన్, ఎమర్జెన్సీ బ్రేకింగ్ మరియు ఫ్రంట్ కొలైజన్ వార్నింగ్ సిస్టమ్ వంటి అనేక అధునాతన భద్రతా ఫీచర్లు ఉన్నాయి. సమర్థవంతమైన బ్రేకింగ్ కోసం ఈ కారులో నాలుగు చక్రాలపై డిస్క్ బ్రేకులు మరియు ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది.

హోండా సిటీ ఇ:హెచ్ఈవి (Honda City e:HEV) హైబ్రిడ్ వేరియంట్ ఆవిష్కరణ - ఫీచర్లు

టాప్-స్పెక్ ZX వేరియంట్‌లో ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు మరియు ఫాగ్ ల్యాంప్స్, e:HEV హైబ్రిడ్ బ్యాడ్జ్‌లు, టెయిల్-ల్యాంప్‌పై కొత్త లిప్ స్పాయిలర్ వంటి డిజైన్ మార్పులను కూడా కలిగి ఉంటుంది. సైడ్ మిర్రర్ క్రింది భాగంలో లేన్ వాచ్ కెమెరా ఫచర్ కూడా ఉంటుంది. హోండా సిటీ హైబ్రిడ్ సైడ్స్ లో 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ మరియు వాటిపై 185/55 R16 ప్రొఫైల్ టైర్లు అమర్చబడి ఉంటాయి. ఇందులో బ్రేక్ ఎనర్జీ రీజనరేషన్ టెక్నాలజీ కూడా ఉంటుంది, ఫలితంగా బ్రేక్ వేసిన ప్రతిసారి వచ్చే శక్తి బ్యాటరీలను చార్జ్ చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది.

హోండా సిటీ ఇ:హెచ్ఈవి (Honda City e:HEV) హైబ్రిడ్ వేరియంట్ ఆవిష్కరణ - ఫీచర్లు

ఎక్స్టీరియర్ డిజైన్ పరంగా ఇందులో పెద్ద మార్పులు చేయలేదు. కాగా, హోండా సిటీ హైబ్రిడ్ ఇప్పుడు బ్లాక్ అండ్ ఐవరీ డ్యూయెల్ టోన్ ఇంటీరియర్ థీమ్‌తో లభిస్తుంది. కంపెనీ ఇందులో స్మార్ట్ కీ ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ సాయంతో యజమానులు తమ కారును మరియు అందులోని ఏసి ఫీచర్‌ను రిమోట్‌గానే స్టార్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. వేసవిలో కారును ముందుగానే కూల్ చేసి పెట్టుకోవడానికి ఈ ఫీచర్ ఎంతగానో సహకరిస్తుంది. ఇప్పుడు ఇందులోని అధునాతన హోండా కనెక్ట్ యాప్ అమెజాన్ ఎకో, గూగుల్ అసిస్టెంట్ మరియు స్మార్ట్‌వాచ్ ఇంటిగ్రేషన్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.

హోండా సిటీ ఇ:హెచ్ఈవి (Honda City e:HEV) హైబ్రిడ్ వేరియంట్ ఆవిష్కరణ - ఫీచర్లు

Honda City e:HEV - కాంపిటీషన్, వారంటీ

ప్రస్తుతం, మార్కెట్లో హోండా సిటీ హైబ్రిడ్‌కు ప్రత్యక్షంగా పోటీ ఎలాంటి హైబ్రిడ్ కారు లేదు. అయితే, ఇది మిడ్-సైజ్ సెడాన్ అయినందున, ఈ విభాగంలో ఇది స్కోడా స్లావియా, మారుతి సుజుకి సియాజ్, హ్యుందాయ్ వెర్నా మరియు రాబోయే ఫోక్స్‌వ్యాగన్ వర్త్యుస్ వంటి కార్లతో పోటీపడుతుంది. హోండా సిటీ హైబ్రిడ్ కారుపై కంపెనీ 3 ఏళ్లు లేదా అపరిమిత కిలోమీటర్ల వారంటీని మరియు ఇందులో ఉపయోగించిన లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌పై 8 ఏళ్ల పరిమిత వారంటీని కంపెనీ అందిస్తోంది.

More from DriveSpark

Article Published On: Thursday, April 14, 2022, 13:26 [IST]
English summary
Honda city ehev hybrid revealed specs features details
Read more on: #హోండా #honda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+