షాకింగ్ ధర వద్ద హోండా సిటీ ఇ:హెచ్ఈవి (Honda City e:HEV) హైబ్రిడ్ వేరియంట్ విడుదల

జపాన్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ హోండా (Honda) ఇటీవల ఆవిష్కరించిన తమ సరికొత్త హైబ్రిడ్ కారు హోండా సిటీ ఇ-హెచ్‌ఈవీ (Honda City e:HEV) ని కంపెనీ నేడు అధికారికంగా మార్కెట్లో విడుదల చేసింది. ఈ హైబ్రిడ్ కారు గురించి కంపెనీ ఇదివరకే పూర్తి సమాచారాన్ని వెల్లడించినప్పటికీ, దీని ధరను మాత్రం తెలియజేయలేదు. కాగా, కంపెనీ ఇప్పుడు ఈ మోడల్ యొక్క వేరియంట్ మరియు ధర వివరాలను అధికారికంగా వెల్లడించింది. హోండా సిటీ ఇ:హెచ్‌ఈవీ హైబ్రిడ్ కారు కేవలం ఒకే ఒక వేరియంట్లో (ZX) ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో లభ్యం కానుంది. మార్కెట్లో దీని ధర రూ.19.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

షాకింగ్ ధర వద్ద హోండా సిటీ ఇ:హెచ్ఈవి (Honda City e:HEV) హైబ్రిడ్ వేరియంట్ విడుదల

హోండా గతంలో ఈ కారును కనీసం రెండు వేరియంట్లలోనైనా అందిస్తుందని భావించారు. కానీ, కంపెనీ దీనిని కేవలం ఒకే ఒక వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం, మార్కెట్లో స్టాండర్డ్ మోడల్ హోండా సిటీ ZX CVT వేరియంట్ ధర రూ. 15.03 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. అంటే, స్టాండర్డ్ టాప్-ఎండ్ వేరియంట్‌తో పోలిస్తే, ఈ హైబ్రిడ్ వేరియంట్ ధర సుమారు రూ.4.47 లక్షలు అధికంగా ఉంటుంది. ఇది అద్భుతమైన హైబ్రిడ్ పవర్‌ట్రైన్ మరియు అధునాతన సేఫ్టీ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది కాబట్టి, ఈ మోడల్ కోసం ఇంత అధిక ధర చెల్లించడం వలన నష్టమేమీ లేదనేది మా అభిప్రాయం.

హోండా సిటీ ఇ:హెచ్‌ఈవీ హైబ్రిడ్ వేరియంట్‌ను మేము ఇటీవలే టెస్ట్ డ్రైవ్ చేశాము. - ఇందుకు సంబంధించిన పూర్తి రివ్యూ కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

షాకింగ్ ధర వద్ద హోండా సిటీ ఇ:హెచ్ఈవి (Honda City e:HEV) హైబ్రిడ్ వేరియంట్ విడుదల

ఐదవ తరం హోండా సిటీ సెడాన్‌ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఈ హైబ్రిడ్ వేరియంట్‌ను తయారు చేసింది. స్టాండర్డ్ మోడల్ టాప్-ఎండ్ వేరియంట్లో లభించే అన్ని ఫీచర్లు ఈ హైబ్రిడ్ కారులో లభిస్తాయి. వాటికి అదనంగా, ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే మరియు హోండా వెబ్‌లింక్ కనెక్టింగ్ టెక్నాలజీతో కూడిన పెద్ద 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, ట్వీక్ చేసిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ (ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో సహా) మరియు అమెజాన్ అలెక్సా మరియు గూగుల్ వాయిస్ అసిస్టెంట్ వంటి మరెన్నో ఫీచర్లు కూడా ఉన్నాయి.

షాకింగ్ ధర వద్ద హోండా సిటీ ఇ:హెచ్ఈవి (Honda City e:HEV) హైబ్రిడ్ వేరియంట్ విడుదల

అయితే, స్టాండర్డ్ వేరియంట్‌తో పోల్చుకుంటే, ఈ హైబ్రిడ్ వేరియంట్‌లో అనేక అదనపు సేఫ్టీ ఫీచర్లు కూడా లభిస్తాయి. ఇందులో అధునాతన ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) సేఫ్టీ ఫీచర్లను కంపెనీ అందిస్తోంది. దీనినే హోండా సెన్సింగ్ టెక్నాలజీ అని పిలుస్తోంది. ఈ హోండా సెన్సింగ్ టెక్నాలజీలో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, ఆటో హై బీమ్ అసిస్ట్, బ్లైండ్-స్పాట్ డిటెక్షన్, ఎమర్జెన్సీ బ్రేకింగ్ మరియు ఫ్రంట్ కొలైజన్ వార్నింగ్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి.

షాకింగ్ ధర వద్ద హోండా సిటీ ఇ:హెచ్ఈవి (Honda City e:HEV) హైబ్రిడ్ వేరియంట్ విడుదల

వీటితో పాటుగా ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, సైడ్ మిర్రర్లపై అమర్చబడిన లేన్-వాచ్ కెమెరాలు, మల్టీ-యాంగిల్ రియర్-వ్యూ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TMPS), వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్, హిల్-స్టార్ట్ అసిస్ట్ మరియు ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు మొదలైన స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇంకా, ఇందులో సమర్థవంతమైన బ్రేకింగ్ కోసం నాలుగు చక్రాలపై డిస్క్ బ్రేకులు మరియు ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ ఫీచర్‌ కూడా ఉంటుంది.

షాకింగ్ ధర వద్ద హోండా సిటీ ఇ:హెచ్ఈవి (Honda City e:HEV) హైబ్రిడ్ వేరియంట్ విడుదల

హోండా సిటీ హైబ్రిడ్ కారులో దాని పవర్‌ట్రైన్ చాలా విశిష్టమైనది. ఇందులో స్టాండర్డ్ పెట్రోల్ ఇంజన్‌తో పాటుగా రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లు కూడా ఉంటాయి. ఇందులోని 1.5 లీటర్ అట్కిన్సన్ i-VTEC పెట్రోల్ ఇంజన్ మరియు రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లతో కలిసి గరిష్టంగా 109 బిహెచ్‌పి శక్తిని మరియు 253 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ ఎలక్ట్రిక్ మోటార్లు కారు ముందు చక్రాలపై అమర్చబడి ఉంటాయి. ఇవి ఒకే ఫిక్స్‌డ్ రేషియో eCVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది లీటరుకు 26.5 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.

షాకింగ్ ధర వద్ద హోండా సిటీ ఇ:హెచ్ఈవి (Honda City e:HEV) హైబ్రిడ్ వేరియంట్ విడుదల

ఇక డిజైన్ విషయానికి వస్తే, స్టాండర్డ్ మోడల్ టాప్ ఎండ్ వేరియంట్‌కి మరియు ఈ హైబ్రిడ్ వేరియంట్‌కి మధ్య పెద్దగా తేడాలు ఏమీ లేవు. అయితే, కంపెనీ హైబ్రిడ్ వేరియంట్‌ను హైలైట్ చేసేందుకు ఫ్రంట్ గ్రిల్ పైన మందపాటి క్రోమ్ స్ట్రిప్‌ మరియు ఆ గ్రిల్‌లో స్టాండర్డ్ మోడల్‌లో కనిపించే హారిజాంటల్ స్లాట్‌లకు బదులుగా ఉండే హనీకోంబ్ ప్యాటర్న్ లను ఉపయోగించింది. ఇందులో ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటాయి, వీటిలో ఎలాంటి మార్పు ఉండదు. కాకపోతే, ఈ హైబ్రిడ్ వేరియంట్ యొక్క ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ పూర్తిగా రీడిజైన్ చేయబడి ఉంటుంది, ఇప్పుడు ఇది చూడటానికి పంజా లాంటి స్టైలింగ్‌ను కలిగి ఉంటుంది.

షాకింగ్ ధర వద్ద హోండా సిటీ ఇ:హెచ్ఈవి (Honda City e:HEV) హైబ్రిడ్ వేరియంట్ విడుదల

ఈ కారు ముందు వైపు కనిపించే మరొక ప్రధానమైన మార్పు ఏంటంటే, దాని ఫ్రంట్ హోండా లోగో. స్టాండర్డ్ సిటీ వేరియంట్లలో ఇది పూర్తి క్రోమ్‌లో ఉంటుంది, అయితే, హైబ్రిడ్ వేరియంట్‌లో మాత్రం ఇది బ్లూ కలర్ యాక్సెంట్‌లను కలిగి ఉండి, ఇది హైబ్రిడ్ వాహనం అని గుర్తు చేస్తుంది. సైడ్ ప్రొఫైల్‌లో ఎలాంటి మార్పులు లేవు. ఈ హైబ్రిడ్ కారులో బ్లాక్-అవుట్ B-పిల్లర్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, షార్క్-ఫిన్ యాంటెన్నా, 16 ఇంచ్ డ్యూయల్-టోన్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌, వెనుక వైపు బూట్ లిడ్‌పై లిప్ స్పాయిలర్‌ మరియు బ్లూ యాక్సెంట్స్‌తో కూడిన రియర్ హోండా లోగో వంటి మార్పులు ఇందులో ఉన్నాయి.

హోండా సిటీ హైబ్రిడ్ కారుపై కంపెనీ 3 ఏళ్లు లేదా అపరిమిత కిలోమీటర్ల వారంటీని అందిస్తోంది. ఆసక్తిగల కస్టమర్లు 5 సంవత్సరాల పొడగించిన వారంటీ (ఎక్స్‌టెండెడ్ వారంటీ) లేదా కారు కొనుగోలు చేసిన తేదీ నుండి 10 ఏళ్ల వరకూ ఎప్పుడైనా వారంటీ (ఎనీటైమ్ వారంటీ)ని కొనుగోలు చేయవచ్చు. కాగా, ఇందులో ఉపయోగించిన లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌పై కారు కొనుగోలు చేసిన తేదీ నుండి 8 ఏళ్లు లేదా 1,60,000 కిలోమీటర్లు (ఏది ముందుగా ముగిస్తే) పరిమిత వారంటీని కూడా కంపెనీ అందిస్తోంది. సిటీ హైబ్రిడ్ కారును కంరపెనీ రేడియంట్ రెడ్ మెటాలిక్, ప్లాటినం వైట్ పెర్ల్, మెటోరాయిడ్ గ్రే మెటాలిక్, గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్ మరియు లూనార్ సిల్వర్ మెటాలిక్ అనే 5 విభిన్న రంగులలో విక్రయిస్తోంది.

Article Published On: Wednesday, May 4, 2022, 15:10 [IST]
English summary
Honda city ehev hybrid variant price revealed details
Read more on: #హోండా #honda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+