భారతదేశంలో హోండా కథ మళ్ళీ మొదటికే రానుందా..? డీజిల్ కార్లను పూర్తిగా నిలిపివేయనుందా..?

జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా (Honda) ఇప్పుడు భారతదేశంలో తన ఉనికి కాపాడుకునేందుకు పోరాడుతుంది. ఒకప్పుడు హోండా బ్రాండ్ భారతదేశంలో ఓ తిరుగులేని మరియు విశ్వసనీయమైన ఆటోమొబైల్ బ్రాండ్‌గా ఉండేది. కార్లు ధరలు అధికంగా ఉన్నప్పటికీ, ప్రారంభంలో కేవలం పెట్రోల్ కార్లను విక్రయించినప్పటికీ హోండా కార్లను కొనేందుకు కస్టమర్లు ఆసక్తి చూపేవారు.

Recommended Video

2021 హోండా అమేజ్ రివ్యూ; ఫీచర్స్, పర్ఫామెన్స్ & పూర్తి వివరాలు

అయితే, ఇప్పుడు ఇతర పోటీదారులతో పోల్చుకుంటే హోండా తమ లైనప్‌లో అతి తక్కువ మోడళ్లను మాత్రమే విక్రయిస్తోంది. హోండా నుండి ఇప్పుడు అమేజ్ మరియు సిటీ సెడాన్లు తప్ప చెప్పుకోవడానికి వేరే ఇతర మోడళ్లు లేవు. మార్కెట్లోని పోటీదారులు మాత్రం ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ నుండి ప్రీమియం ఎస్‌యూవీల వరకూ వివిధ విభాగాలలో కార్లను విక్రయిస్తుంటే, హోండా మాత్రం తమ కార్లను ఒక్కొక్కటిగా డిస్‌కంటిన్యూ చేస్తూ వస్తోంది.

భారతదేశంలో హోండా కథ మళ్ళీ మొదటికే రానుందా..? డీజిల్ కార్లను పూర్తిగా నిలిపివేయనుందా..?

భారతదేశంలో హోండా ఇప్పటికే అకార్డ్ (Honda Accord), సిఆర్-వి (Honda CR-V), సివిక్ (Honda Civic), బ్రయో (Honda Brio), మొబిలియో (Honda Mobilio) మరియు బిఆర్-వి (Honda BR-V) వంటి మోడళ్లను డిస్‌కంటిన్యూ చేసింది. తాజా సమాచారం ప్రకారం, భారత మార్కెట్లో అన్ని డీజిల్ కార్ల అమ్మకాలను కూడా నిలిపివేయాలని హోండా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఉద్గార నిబంధనలు కఠితరం కావడంతో డీజిల్ కార్ల తయారీ చాలా ఖరీదైన ప్రక్రియగా మారింది. మరోవైపు కస్టమర్లు కూడా క్లీన్ అండ్ సస్టైనబుల్ మొబిలిటీకి ప్రాధాన్యత ఇస్తున్నందున హోండా తమ డీజిల్ కార్ల సాధ్యాసాధ్యాలను అంచనా వేసే పనిలో పడింది.

భారతదేశంలో హోండా కథ మళ్ళీ మొదటికే రానుందా..? డీజిల్ కార్లను పూర్తిగా నిలిపివేయనుందా..?

ఈ విషయం గురించి హోండా సీఈవో మాట్లాడుతూ డీజిల్ వాహనాల గురించి తాము పెద్దగా ఆలోచించడం లేదని అన్నారు. దీన్నిబట్టి చూస్తుంటే. భారత మార్కెట్‌తో సహా గ్లోబల్ మార్కెట్‌లలో కూడా హోండా డీజిల్ కార్లు నిలిపివేయబడుతాయనే ప్రచారం జరుగుతోంది. మన దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి ఇప్పటికే ఈ విధానాన్ని పాటిస్తోంది. భారతదేశంలో మారుతి సుజుకి పూర్తిగా డీజిల్ కార్లను విక్రయించడాన్ని నిలిపివేసింది. ఆ తర్వాత టాటా మోటార్స్ మరియు హ్యుందాయ్ వంటి పెద్ద కంపెనీలు కూడా చిన్న డీజిల్ ఇంజన్‌లను ఆఫర్ చేయడం నిలిపివేసాయి.

భారతదేశంలో హోండా కథ మళ్ళీ మొదటికే రానుందా..? డీజిల్ కార్లను పూర్తిగా నిలిపివేయనుందా..?

ప్రస్తుతం, ఈ కంపెనీలు డీజిల్ ఇంజన్‌ను ఎంపికను ఎంపిక చేసిన మోడళ్లలో మాత్రమే అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, హోండా కార్స్ ఇండియా సీఈఓ టకుయా సుమురా మాట్లాడుతూ, "మేము ప్రస్తుతం డీజిల్ కార్ల గురించి ఆలోచించడం లేదు. డీజిల్‌తో RDE (రియల్ డ్రైవింగ్ ఎమిషన్) క్లియర్ చేయడం చాలా కష్టం. యూరప్‌లో కూడా చాలా బ్రాండ్‌లు డీజిల్‌ ఇంజన్ కార్లను నిలిపివేస్తున్నాయని" డీజిల్ కార్లకు తగ్గుతున్న ఆదరణను గురించి ఆయన ప్రస్తావించారు.

భారతదేశంలో హోండా కథ మళ్ళీ మొదటికే రానుందా..? డీజిల్ కార్లను పూర్తిగా నిలిపివేయనుందా..?

హోండా తమ భవిష్యత్ మోడళ్లను పూర్తిగా పెట్రోల్ లేదా హైబ్రిడ్ మోడళ్లుగా తీర్చిదిద్దాలని చూస్తోంది. అలాగే, ఎలక్ట్రిక్ మొబిలిటీ పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టనుంది. హోండా డీజిల్ కార్లను నిలిపివేయాలని నిర్ణయించుకోవడాని అసలు కారణం, వచ్చే ఏడాది నుంచి భారతదేశంలో రియల్ డ్రైవింగ్ ఎమిషన్ నిబంధనలు అమలులోకి రానుండటమే.

భారతదేశంలో హోండా కథ మళ్ళీ మొదటికే రానుందా..? డీజిల్ కార్లను పూర్తిగా నిలిపివేయనుందా..?

ఈ నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ సగటు ఇంధన ఆర్థిక వ్యవస్థ-2 ప్రమాణం అమలులో ఉంటుంది, దీని కింద వాస్తవ ప్రపంచంలో కూడా ఉద్గార ప్రమాణం యొక్క లక్ష్యాన్ని సాధించాల్సి ఉంటుంది. ఇలా చేయాలంటే, డీజిల్ ఇంజన్ల తయారీకి భారీ మొత్తంలో ఖర్చు అవుతుంది. పెరిగిన తయారీ ఖర్చు కారణంగా, డీజిల్ కార్ల ధర కూడా పెరుగుతుంది. కాబట్టి, కస్టమర్లు ఖరీదైన డీజిల్ కార్ల కన్నా పెట్రోల్ లేదా హైబ్రిడ్ కార్లనే కొనుగోలు చేసే ఆస్కారం ఉంది.

భారతదేశంలో హోండా కథ మళ్ళీ మొదటికే రానుందా..? డీజిల్ కార్లను పూర్తిగా నిలిపివేయనుందా..?

డీజిల్ కార్లపై తగ్గుతున్న ప్రజాదరణ

హోండా తమ ఎర్త్‌డ్రీమ్స్ సిరీస్ క్రింద భారత మార్కెట్లో మొదటిసారిగా డీజిల్ కార్లను ప్రవేశపెట్టినప్పుడు, అవి హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. అసలే హోండా కార్లు అందులోనూ అధిక మైలేజీనిచ్చే డీజిల్ కార్లు కావడంతో కస్టమర్లు ఈ బ్రాండ్ కార్లను ఎక్కువగా ఆదరించడం మొదలు పెట్టారు. అయితే, ఇప్పుడు కస్టమర్ల మైండ్‌సెట్ పూర్తిగా మారిపోయింది. మైలేజ్ తగ్గిన పర్వాలేదు పెట్రోల్ మోడళ్లనే కొనాలని కస్టమర్లు భావిస్తున్నారు. దీంతో మార్కెట్లో డీజిల్ కార్లకు ఆదరణ క్రమంగా తగ్గుతూ వస్తోంది.

భారతదేశంలో హోండా కథ మళ్ళీ మొదటికే రానుందా..? డీజిల్ కార్లను పూర్తిగా నిలిపివేయనుందా..?

హోండా అందిస్తున్న అత్యంత పాపులర్ కార్లలో అమేజ్ కూడా ఒకటి. ఇది డీజిల్ ఇంజన్‌తో కూడా లభిస్తుంది. హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ 2013లో తమ బ్రయో హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా అమేజ్ కాంపాక్ట్ సెడాన్‌ను తయారు చేశారు. హోండా అమేజ్ మార్కెట్లోకి 9 ఏళ్లలో ఏకంగా 5 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడైంది. మార్కెట్లో ఎస్‌యూవీలకు పాపులారిటీ పెరిగినప్పటికీ, అమేజ్ మాత్రం తన పాపులారిటీని కోల్పోలేదు. ఖరీదైన హోండా సిటీ సెడాన్‌ను కొనుగోలు చేయలేని వారికి హోండా అమేజ్ ఎల్లప్పుడూ ఓ మినీ సిటీ సెడాన్ మాదిరిగానే కనిపించింది.

భారతదేశంలో హోండా కథ మళ్ళీ మొదటికే రానుందా..? డీజిల్ కార్లను పూర్తిగా నిలిపివేయనుందా..?

హోండా విక్రయించిన ప్రతి 100 కార్లలో దాదాపు 93 కార్లు పెట్రోల్ మోడళ్లే. దీన్ని బట్టి చూస్తుంటే, హోండా డీజిల్ కార్ల కన్నా కూడా పెట్రోల్ కార్లే ఎక్కువగా పాపులర్ అయినట్లు తెలుస్తోంది. హోండా అమేజ్ 1.2-లీటర్ i-VTEC పెట్రోల్ మరియు 1.5-లీటర్ i-DTEC ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులోని పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 88 బిహెచ్‌పి శక్తిని మరియు 110 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. కాగా, డీజిల్ ఇంజన్ గరిష్టంగా 98.6 బిహెచ్‌పి శక్తిని మరియు 200 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. గేర్‌బాక్స్ విషయానికి వస్తే, మ్యాన్యువల్ మరియు సివిటి ట్రాన్సిమిషన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda might discontinue all diesel models in india details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X