ఆరవ తరం హోండా సిఆర్-వి (2022 Honda CR-V) ఆవిష్కరణ.. భారత్‌లో విడుదలయ్యేనా?

జపనీస్ కార్ బ్రాండ్ హోండా (Honda) తమ ఆరవ తరం సిఆర్-వి (CR-V) ని గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించింది. ఇది 2016లో వచ్చిన ఐదవ తరం సిఆర్-వి స్థానాన్ని రీప్లేస్ చేయనుంది. ఈ సరికొత్త మోడల్ పూర్తిగా కొత్త ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ స్టైలింగ్ ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఇది టెక్నాలజీ పరంగా కూడా అధునాతనంగా ఉంటుంది మరియు అప్‌గ్రేడ్ చేయబడిన హైబ్రిడ్ పవర్‌ట్రైన్ సెటప్ ను కలిగి ఉంటుంది. హోండా ఈ కొత్త మోడల్ ను భారత మార్కెట్లో కూడా విడుదల చేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఆరవ తరం హోండా సిఆర్-వి (2022 Honda CR-V) ఆవిష్కరణ.. భారత్‌లో విడుదలయ్యేనా?

హోండా తమ ఐదవ తరం సిఆర్-వి ఎస్‌యూవీని 2016 లో విడుదల చేసింది. ఆ తర్వాత 2019 లో కంపెనీ ఇందులో మిడ్-లైఫ్‌సైకిల్ అప్‌డేట్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆరవ తరం సిఆర్-వి మోడల్ పాత మోడల్ స్థానాన్ని భర్తీ చేయనుంది. ఈ కొత్త 2022 మోడల్ హోండా సిఆర్-వి డిజైన్ పూర్తిగా రీడిజైన్ చేయబడింది. పాత మోడల్ తో పోలిస్తే, ఈ కొత్త తరం మోడల్ ఇప్పుడు మరింత నిటారుగా ఉండే సిల్హౌట్‌ని పొందుతుంది మరియు ఐదవ తరం మోడల్ కంటే 69 మిమీ ఎక్కువ పొడవు మరియు 10 మిమీ ఎక్కువ వెడల్పును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ కూడా 10 మిమీ పెరిగింది.

ఆరవ తరం హోండా సిఆర్-వి (2022 Honda CR-V) ఆవిష్కరణ.. భారత్‌లో విడుదలయ్యేనా?

గమనించినట్లయితే, కొత్త CR-V యొక్క స్టైలింగ్ కొత్త BR-V మోడల్ ని పోలి ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఈ ఎస్‌యూవీ ముందు భాగంలో పెద్ద క్రోమ్ స్ట్రిప్‌తో అనుసంధానించబడిన విస్తృతమైన హెడ్‌ల్యాంప్‌లతో పెద్ద సైజులో నిటారుగా ఉండే ఫ్రంట్ గ్రిల్ ఉంటుంది. మునుపటి మోడళ్ల మాదిరిగా కాకుండా కొత్త CR-V పొడవాటి బోనెట్‌ను పొందుతుంది మరియు సైడ్ ప్రొఫైల్ లో కూడా స్ట్రాంగ్ షోల్డర్ లైన్ మరియు వీల్ ఆర్చ్‌లపై బ్లాక్ క్లాడింగ్ తో మంచి రగ్గడ్ లుక్ ని కలిగి ఉంటుంది. ఎస్‌యూవీ వెనుక భాగంలో మునుపటి కంటే మరింత సన్నగా ఉండే L- ఆకారపు టెయిల్ లైట్స్ ను పొందుతుంది.

ఆరవ తరం హోండా సిఆర్-వి (2022 Honda CR-V) ఆవిష్కరణ.. భారత్‌లో విడుదలయ్యేనా?

ఇక ఇంటీరియర్ ఫీచర్లను గమనించినట్లయితే, కొత్త 2022 హోండా సిఆర్-వి క్యాబిన్ గత సంవత్సరం కంపెనీ ఆవిష్కరించిన 11వ-తరం హోండా సివిక్‌ సెడాన్ కి చాలా దగ్గర పోలికను కలిగి ఉంటుంది. ఈ కారులో పెద్ద 7.0 ఇంచ్ ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కంపెనీ స్టాండర్డ్‌ గా అందిస్తోంది. కస్టమర్ ఎంచుకునే వేరియంట్ ను బట్టి డ్యాష్‌బోర్డ్ మధ్యలో 7.0 ఇంచ్ లేదా 9.0 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉంటుంది. ఎయిర్ కండిషనింగ్‌ను కంట్రోల్ చేయడానికి హోండా ఈ కారులో ఓల్డ్-స్కూల్ టైప్ భౌతిక నాబ్‌లు మరియు బటన్‌లను అందించింది.

ఆరవ తరం హోండా సిఆర్-వి (2022 Honda CR-V) ఆవిష్కరణ.. భారత్‌లో విడుదలయ్యేనా?

ఇక ఇంజన్ ఆప్షన్ల విషయానికి వస్తే, కొత్త తరం హోండా సిఆర్-వి 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 2.0-లీటర్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఈ అప్‌గ్రేడ్ చేయబడిన యూనిట్లు హైబ్రిడ్ పవర్‌ట్రైన్ కారణంగా మునుపటి కన్నా మరింత ఎక్కువ మైలేజీని అందించనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో, హోండా 1.5-లీటర్ ఇంజన్‌ ఆప్షన్ ను సిఆర్-వి యొక్క లో-స్పెక్ వేరియంట్‌ లలో అందిస్తుంది. ఇకపోతే, పెద్ద 2.0 లీటర్ హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్ ను టాప్-స్పెక్ వేరియంట్‌ లలో అందిస్తుంది. కొత్త తరం హోంా సిఆర్-వి అమ్మకాలలో సగం ఈ కొత్త హైబ్రిడ్ వెర్షన్ నుండే వస్తాయని కంపెనీ భావిస్తోంది.

ఆరవ తరం హోండా సిఆర్-వి (2022 Honda CR-V) ఆవిష్కరణ.. భారత్‌లో విడుదలయ్యేనా?

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కొత్త తరం హోండా సిఆర్-వి కేవలం ఫ్రంట్ వీల్-డ్రైవ్ ఆప్షన్ తో మాత్రమే కాకుండా ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ తో కూడా అందుబాటులోకి వస్తుంది. ఇందులోని రెండు రకాల ఇంజన్లు కూడా ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ ను కలిగి ఉండే అవకాశం ఉంది. హోండా కొన్ని ఎంపిక చేసిన మార్కెట్‌ లలో ఈ కొత్త సిఆర్-వి ఎస్‌యూవీని డీజిల్ ఇంజన్ ఆప్షన్ తో కూడా విక్రయించే అవకాశం ఉంది.

భారతదేశం విషయానికి వస్తే, హోండా తొలిసారిగా తమ రెండవ తరం సిఆర్-వి ఎస్‌యూవీని 2004లో మార్కెట్లో ప్రవేశపెట్టబడింది. ఆ తర్వాత 2013లో CKD (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) రూట్ ద్వారా తమ నాల్గవ తరం మోడల్ ను ఇక్కడి మార్కెట్లో ప్రారంభించబడేంత వరకు హోండా ఈ ప్రీమియం ఎస్‌యూవీని పూర్తిగా విదేశాలలో తయారు చేసి, భారతదేశానికి దిగుమతి చేసుకుని విక్రయించేది. కాగా, 2008 లో హోండా తమ ఐదవ తరం మోడల్‌ను భారతదేశంలో ఆవిష్కరించిన తర్వాత ఇది పెట్రోల్ ఇంజన్ తో పాటుగా డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో కూడా అందుబాటులోకి వచ్చింది.

ఆరవ తరం హోండా సిఆర్-వి (2022 Honda CR-V) ఆవిష్కరణ.. భారత్‌లో విడుదలయ్యేనా?

అయితే, భారతదేశంలో కఠినమైన బిఎస్6 ఉద్ఘార నిబంధనలు ప్రవేశపెట్టిన తర్వాత హోండా తమ డీజిల్ వెర్షన్ సిఆర్-వి ఎస్‌యూవీని 2020 లో నిలిపివేసింది. అదే సమయంలో హోండా సివిక్ సెడాన్ అమ్మకాలు కూడా నిలిపివేయబడ్డాయి. కాగా, ఇటీవలే హోండా తమ పెట్రోల్ వెర్షన్ సిఆర్-వి ఎస్‌యూవీని కూడా భారతదేశంలో విక్రయించడాన్ని పూర్తిగా నిలిపివేసింది. అయితే, కంపెనీ ఇప్పుడు ఈ కొత్త తరం మోడల్ సిఆర్-వి ఎస్‌యూవీని ఆవిష్కరించడాన్ని చూస్తుంటే, ఇది భారత మార్కెట్లో కూడా విడదలైతే బాగుంటుందని హోండా ఎస్‌యూవీ ఔత్సాహికులు కోరుకుంటున్నారు.

ఆరవ తరం హోండా సిఆర్-వి (2022 Honda CR-V) ఆవిష్కరణ.. భారత్‌లో విడుదలయ్యేనా?

ప్రస్తుతం, హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ కు భారత మార్కెట్లో బలమైన ఎస్‌యూవీ పోర్ట్‌పోలియో లేదు. కంపెనీ గతంలో కొన్ని మోడళ్లను విడుదల చేసినప్పటికీ అవి మార్కెట్లో ఎక్కువ కాలం నిలువలేకపోయాయి. నిజానికి, ఇప్పటికీ హోండా సిఆర్-వి ఎస్‌యూవీకి భారత మార్కెట్లో అద్భుతమైన డిమాండ్ ఉంది. ఇది ఇప్పుడు కొత్త హైబ్రిడ్ సెటప్ తో భారత మార్కెట్లో విడుదలైతే, మార్కెట్లో మంచి ఆదరణను పొందే అవకాశం ఉంది. భారతదేశంలో కొత్త హోండా సిఆర్-వి ఈ విభాగంలో ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ మరియు రాబోయే హ్యుందాయ్ టూసాన్ వంటి ప్రీమియం మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
Honda unveils all new sixth gen honda cr v suv globally details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X