కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా వర్సెస్ కియా కారెన్స్.. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటారు..?

ప్రముఖ దేశీయ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki), భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఎర్టిగా (Ertiga) ఎమ్‌పిలో కొత్త అప్‌డేటెడ్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ కొత్త మోడల్ ఇప్పుడు సరికొత్త ఫీచర్లతో పాటుగా అప్‌గ్రేడ్ చేయబడిన ఇంజన్ మరియు సరికొత్త 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ వంటి ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ఈ విభాగంలో తాజాగా కొరియన్ కార్ కంపెనీ కియా మోటార్స్ విడుదల చేసిన కియా కారెన్స్ (Kia Carens) ఎమ్‌పివితో ఏ విధంగా పోటీ పడుతుందో ఈ కథనంలో చూద్దాం రండి.

కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా వర్సెస్ కియా కారెన్స్.. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటారు..?

ఎర్టిగా వర్సెస్ కారెన్స్ - డిజైన్

మారుతి సుజుకి ఎర్టిగా యొక్క 2022 మోడల్ డిజైన్‌లో కంపెనీ ఎలాంటి మేజర్ మార్పులు చేయలేదు. గత మోడల్‌తో పోల్చకుంటే, ఇందులో కొత్త గ్రిల్ మరియు కొత్త అల్లాయ్ వీల్స్ తప్ప బయటి డిజైన్‌లో ఎలాంటి మార్పు ఉండదు. అంటే, ఇది ఓవరాల్‌గా పాత వెర్షన్ ఎర్టిగా మాదిరిగానే అనిపిస్తుంది. అయితే, కియా కార్నివాల్ ఈ విభాగంలో కొత్తగా వచ్చిన లేటెస్ట్ మోడల్. సన్నటి డేటైమ్ రన్నింగ్ లైట్లు, హుడ్ క్రింది భాగంలో సన్నటి గ్రిల్ మరియు దాని దిగువ భాగంలో హనీకోంబ్ ప్యాటర్న్‌తో కూడిన పెద్ద ఎయిర్‌ డ్యామ్, స్పోర్టీ అల్లాయ్ వీల్స్, ఫ్లోటింగ్ రూఫ్‌రైల్స్ మరియు ఎక్కువ ఎక్స్టీరియర్ క్రోమ్ ఎలిమెంట్స్‌తో కారెన్స్ ఈ విభాగంలో మారుతి ఎర్టిగా కన్నా చాలా ప్రీమియంగా కనిపిస్తుంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా వర్సెస్ కియా కారెన్స్.. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటారు..?

ఎర్టిగా వర్సెస్ కారెన్స్ - ఫీచర్లు

కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా ఇప్పుడు 7 ఇంచ్ సుజుకి స్మార్ట్‌ప్లే ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ యొక్క లేటెస్ట్ వెర్షన్, లెదర్‌తో చుట్టబడిన స్టీరింగ్ వీల్, ప్యాడిల్ షిఫ్టర్‌లు (ఆటోమేటిక్ వేరియంట్‌లో), ఆన్‌బోర్డ్ వాయిస్ అసిస్టెంట్, సుజుకి కనెక్ట్, స్మార్ట్‌వాచ్ కనెక్టివిటీ, సీట్ బ్యాక్ రిక్లైనర్ మరియు ఫ్లాట్ ఫోల్డ్ ఆప్షన్‌తో కూడిన 50:50 స్ప్లిట్ థర్డ్ రో సీట్స్, క్రూయిజ్ కంట్రోల్, యాంటీ-పించ్ ఫీచర్‌తో కూడిన డ్రైవర్ సైడ్ ఆటో-విండో, ఫాలో మీ హోమ్ ఫంక్షనాలిటీతో కూడిన ఆటో హెడ్‌ల్యాంప్‌లు మరియు రిట్రాక్టబుల్ కీ-ఆపరేటెడ్ సైడ్ మిర్రర్స్ వంటి కొత్త ఫీచర్లు లభిస్తాయి.

కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా వర్సెస్ కియా కారెన్స్.. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటారు..?

కియా కారెన్స్ విషయానికి వస్తే, 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.5 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, ఆటో క్లైమేట్ కంట్రోల్, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, మల్టిపుల్ యూఎస్‌బి ఛార్జింగ్ పాయింట్‌లు, యాంబియంట్ లైటింగ్, స్పాట్‌లైట్లు మరియు రియర్ టేబుల్ ట్రే, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్ మరియు దానిపై వివిధ రకాల కంట్రోల్ బటన్స్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, పానోరమిక్ సన్‌రూఫ్, ఎల్ఈడి హెడ్‌లైట్లు మొదలైనవి ఉన్నాయి. కియా బ్రాండ్ ఎల్లప్పుడూ కూడా తమ వాహనాలను అధునాత ఫీచర్లతో లోడ్ చేస్తుంది కాబట్టి, ఈ రేసులో కారెన్స్ ముందంజలో ఉంటుంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా వర్సెస్ కియా కారెన్స్.. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటారు..?

ఎర్టిగా వర్సెస్ కారెన్స్ - సేఫ్టీ ఫీచర్లు

కొత్త 2022 మారుతి ఎర్టిగాలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడి మరియు బ్రేక్ అసిస్ట్‌తో కూడిన ఏబిఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, హై-స్పీడ్ అలర్ట్ సిస్టమ్, డ్రైవర్ మరియు కో-డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్ వంటి సేఫ్టీ ఫీచర్లను అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా అందిస్తోంది. కాగా, హై-ఎండ్ వేరియంట్లలో 360-డిగ్రీ మెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ హోల్డ్ అసిస్ట్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ వంటి అదనపు సేఫ్టీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా వర్సెస్ కియా కారెన్స్.. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటారు..?

ఇక కియా కారెన్స్ ఎమ్‌పివిలో లభించే సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన ఏబిఎస్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ స్టార్ట్ కంట్రోల్, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటుగా ఇందులో జియోఫెన్సింగ్, లైవ్ వెహికల్ పొజిషనింగ్ మరియు ట్రాకింగ్, రిమోట్ ఇంజన్ స్టార్ట్/స్టాప్, క్లైమేట్ కంట్రోల్ ఆపరేషన్ మరియు డోర్ లాక్/అన్‌లాక్ వంటి స్మార్ట్ సేఫ్టీ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్ల పరంగా ఎర్టిగా కన్నా కారెన్స్ ముందంజలో ఉంటుంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా వర్సెస్ కియా కారెన్స్.. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటారు..?

ఎర్టిగా వర్సెస్ కారెన్స్ - ఇంజన్

మారుతి సుజుకి ఎర్టిగా కేవలం ఒకే ఒక పెట్రోల్ ఇంజన్ మరియు సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్లతో మాత్రమే లభిస్తుంది. ఈ అప్‌డెటెడ్ వెర్షన్‌లో కంపెనీ రీట్యూన్ చేయబడిన కొత్త 1.5-లీటర్ డ్యూయల్ వివిటి పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించింది. మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన ఈ ఇంజన్ గరిష్టంగా 105 పిఎస్ పవర్‌ను మరియు 138 ఎన్ఎమ్ టార్క్‌‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. కాగా, కంపెనీ ఇందులో మునుపటి 4-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్థానంలో కొత్త 6-స్పీడ్ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ను పరిచయం చేసింది.

కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా వర్సెస్ కియా కారెన్స్.. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటారు..?

కియా కార్లు ఎప్పుడూ విభిన్న రకాల ఇంజన్లతో లభిస్తాయి. కారెన్స్ కూడా మూడు విభిన్న ఇంజన్ ఆప్షన్‌లతో విడుదల చేయబడింది. ఇందులో మొదటిది 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ (114 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌). ఈ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడుతుంది. ఇకపోతే, మిగిలిన రెండు ఇంజన్‌లు పెట్రోల్ యూనిట్లు, ఇందులో ఒకటి 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ (113 బిహెచ్‌పి పవర్ మరియు 144 ఎన్ఎమ్ టార్క్). ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా వర్సెస్ కియా కారెన్స్.. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటారు..?

ఇక మూడవ ఇంజన్ ఆప్షన్ 1.4 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, ఇది గరిష్టంగా 138 బిహెచ్‌పి పవర్‌ను మరియు 242 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్లతో లభిస్తుంది. ఇంజన్ ఆప్షన్స్ విషయానికి వస్తే, కియా కారెన్స్ పెట్రోల్, డీజిల్ మరియు టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో కొనుగోలుదారుల అభిరుచికి మరియు అవసరానికి తగినట్లుగా అందుబాటులో ఉంటుంది.

కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా వర్సెస్ కియా కారెన్స్.. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటారు..?

ఎర్టిగా వర్సెస్ కారెన్స్ - ధరలు

చివరిగా ధరలను గమనిస్తే, మార్కెట్లో కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా (2022 Maruti Suzuki Ertiga) ధరలు రూ.8.35 లక్షల నుండి ప్రారంభం అవుతాయి మరియు ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.12.79 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇక కియా కారెన్స్ ఎమ్‌పివి ధరల విషయానికి వస్తే, ఇది రూ.8.99 లక్షల నుండి ప్రారంభమై రూ.16.99 లక్షల వరకూ వెళ్తుంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

కొత్త 2022 మారుతి సుజుకి ఎర్టిగా వర్సెస్ కియా కారెన్స్.. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటారు..?

ఎర్టిగా వర్సెస్ కారెన్స్ - చివరిగా ఏది బెస్ట్ అంటారు?

మీరు బడ్జెట్‌లో లభించే 7-సీటర్ ఎమ్‌పివి కోసం చూస్తున్నట్లయితే, విశ్వసనీయమైన మారుతి సుజుకి బ్రాండ్ అందిస్తున్న ఎర్టిగా ఎమ్‌పివిని సెలక్ట్ చేసుకోవచ్చు. ఇది కారులో అవసరమైన అన్ని డీసెంట్ ఫీచర్లను కలిగి ఉంటుంది. అలాకాకుండా, కాస్తంత ధర ఎక్కువైనా ఫర్వాలేదు ప్రీమియం ఫీచర్లతో కూడిన 7-సీటర్ ఎమ్‌పివి కావాలనుకుంటే, కియా కారెన్స్ మీకు అధనపు కంఫర్ట్ ఫీచర్లతో ఓ ఎగ్జిక్యూటివ్ ఎమ్‌పివిగా అందుబాటులో ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Monday, April 18, 2022, 9:16 [IST]
English summary
Https auto hindustantimes com auto cars maruti ertiga091634
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+