HPCL తో చేతులు కలిపిన RACEnergy: ఎందుకో తెలుసా..!!

భారతదేశంలో రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహన వినియోగం పెరుగుతున్న సమయంలో వాటికి కావలసిన మౌలిక సదుపాయాలయిన ఛార్జింగ్ స్టేషన్స్ మరియు స్వాపింగ్ స్టేటన్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఇలాంటి స్టేషన్స్ మరిన్ని పెంచడానికి మరియు వాహన వినియోగదారులకు అనుకూలంగా ఉండటానికి చాలా కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో ఒకటి RACENergy.

HPCL తో చేతులు కలిపిన RACEnergy: ఎందుకో తెలుసా..!!

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల మౌలిక సదుపాయాల సంస్థ RACEnergy, భారతదేశంలోని అతిపెద్ద ఇంధన సంస్థలలో ఒకటైన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) తో కలిసి హైదరాబాద్‌లో తన మొదటి బ్యాటరీ స్వాప్ స్టేషన్‌ను ఈ రోజు (2022 జనవరి 03) ప్రారంభించింది.

HPCL తో చేతులు కలిపిన RACEnergy: ఎందుకో తెలుసా..!!

ఈ ప్రారంభ సమయంలో తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు & వాణిజ్యం మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగాల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మరియు IKEA ఎదురుగా ఉన్న HITEC సిటీలో మొదటి స్టేషన్‌ను RACEnergy యొక్క సిటిఓ మరియు సహ వ్యవస్థాపకుడు గౌతం మహేశ్వరన్ ప్రారంభించారు. ఇది అక్కడి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఈ సమయంలో కంపెనీ అందించిన సమాచారం ప్రకారం, 2022 జనవరిలో నగరంలోని ప్రధాన ప్రదేశాలలో వివిధ HPCL అవుట్‌లెట్‌లలో మూడు బ్యాటరీ స్వాప్ స్టేషన్‌లను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ బ్యాటరీ స్వాప్ స్టేషన్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మరియు త్రీ వీలర్స్ బ్యాటరీ స్వాపింగ్ చేసుకోవచ్చు.

HPCL తో చేతులు కలిపిన RACEnergy: ఎందుకో తెలుసా..!!

RACEnergy తన ఉనికిని పెంచడానికి తగిన సన్నాహాలు చేస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ప్రారంభించిన ఈ స్వాపింగ్ స్టేషన్ కూడా ఇందులో భాగమే. రానున్న రోజుల్లో ఈ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ మరిన్ని అందుబాటులోకి రానున్నాయి.

HPCL తో చేతులు కలిపిన RACEnergy: ఎందుకో తెలుసా..!!

బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ ప్రారంభించిన సందర్భంగా RACEnergy CTO మరియు సహ వ్యవస్థాపకుడు గౌతమ్ మహేశ్వరన్ మాట్లాడుతూ.. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఈ-మొబిలిటీ రంగంలో ఇప్పుడు వేగవంతమైన పురోగతిని కొనసాగిస్తున్నందున మేము దానితో అనుబంధం కలిగి ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నామన్నారు, అంతేకాకుండా HPCL రిటైల్ అవుట్‌లెట్‌లలో మా బ్యాటరీ స్వాప్ స్టేషన్‌లను పైలట్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసారు.

ప్రస్తుతం దేశీయ విఫణిలో ఎలక్ట్రిక్ వాహన వినియోగం చాలా ఎక్కువగా ఉంది, అయితే ఈ సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం చాలా అవసరం. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత వేగవంతం చేయడానికి బ్యాటరీ స్వాపింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఎంతైనా అవసరం.

HPCL తో చేతులు కలిపిన RACEnergy: ఎందుకో తెలుసా..!!

ప్రస్తుతం మన రాష్ట్రంలో మాత్రమే కాకుండా భారతదేశం మొత్తం HPCL యొక్క రిటైల్ అవుట్‌లెట్‌లు ఉన్నాయి. కావున వీటి ద్వారా రాష్ట్రంలో బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ మరింత పెంచుకోవచ్చు. కావున ఈ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసుకోవడానికి HPCL చాలా అనుకూలంగా ఉంటుందని RACEenergy CEO మరియు సహ వ్యవస్థాపకుడు అరుణ్ శ్రేయస్ ఈ సందర్భంగా తెలియజేసారు.

RACEnergy ద్వారా తయారు చేయబడిన బ్యాటరీ స్వాప్ స్టేషన్‌లు వాహన వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ స్టేషన్స్ సహాయంతో వినియోగదారులు తమ డిశ్చార్జ్ అయిన బ్యాటరీలను 2 నిమిషాలలోపు ఛార్జ్ చేసిన వాటితో మార్చుకోవచ్చు. కావున వారు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. ఇది వారి సమయాన్ని కూడా చాలా వరకు ఆదా చేస్తుంది.

HPCL తో చేతులు కలిపిన RACEnergy: ఎందుకో తెలుసా..!!

RACEnergy అనేది BITS పిలానీ పూర్వ విద్యార్థులు, అరుణ్ శ్రేయాస్ మరియు గౌతం మహేశ్వరన్ 2018 లో స్థాపించిన సంస్థ. ఇది ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మరియు త్రీ వీలర్స్ కోసం బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ ద్వారా భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీని చాలా వేగవంతం చేస్తుంది.

RACEnergy జాతీయ మరియు రాష్ట్ర స్థాయి భాగస్వామ్యాలను ఉపయోగించుకోవడం ద్వారా భారతదేశంలో బ్యాటరీ స్వాప్ స్టేషన్‌లను మరింత పెంచే అవకాశం ఉంటుంది. కంపెనీ తమ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ మరింత ఎక్కువ సంఖ్యలో తీసుకురావడానికి 2023 ని గమ్యంగా ఉంచుకున్నారు. ఇందులో భాగంగానే ఈ దిశ వైపు అడుగులు వేస్తున్నారు. RACEnergy స్థాపించే ఈ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల సమయాన్ని తగ్గించడమే కాకుండా డబ్బును కూడా కొంత వరకు ఆదా చేస్తుంది.

Most Read Articles

English summary
Hyderabad first electric vehicle battery swapping station hpcl raceenergy partnership details
Story first published: Monday, January 3, 2022, 18:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X