ఈ కార్లపైన మాత్రమే డిస్కౌంట్స్ అందిస్తున్న హ్యుందాయ్: వివరాలు
విజయదశమి ముగిసిపోయింది.. ఇక దీపావళికి ఎన్నో రోజులు లేవు. అయితే ఎక్కువమంది ప్రజలు ఈ పండుగల సందర్భంగా కొత్త కార్లు మరియు బైకులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఈ పండుగ సమయంలో కొనుగోలుదారులను మరింత ఆకర్షించడానికి కంపెనీలు కూడా చాలా వరకు గొప్ప ఆఫర్స్ మరియు డిస్కౌంట్ వంటి వాటిని ప్రవేశపెడతాయి.
ఇప్పుడు దేశీయ మార్కెట్లో ప్రముఖ వాహన తయారీ సంస్థ అయిన 'హ్యుందాయ్' (Hyundai) తన 'ఆరా, గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20 మరియు కోనా ఎలక్ట్రిక్' వంటి వాటిపైన అద్భుతమైన ఆఫర్స్ అందిస్తోంది. కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్స్ తో కొత్త కారు కొనాలనుకునేవారు ఇప్పుడు మరింత తక్కువ ధరకే హ్యుందాయ్ కార్లను సొంత చేసుకోవచ్చు. దీని గురించేయ్ మరింత సమచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

హ్యుందాయ్ ఆరా (Hyundai Aura):
హ్యుందాయ్ కంపెనీ యొక్క 'ఆరా' కొనుగోలుపైన ఇప్పుడు రూ. 30,000 వరకు ఆదా చేసుకోవచ్చు. కంపెనీ యొక్క ఆరా పెట్రోల్ మరియు CNG రెండు వేరియంట్స్ పైనా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. కావున ఇందులో ఏ వేరియంట్ కోనుగోలు చేసినా ఈ అఫర్ అనేది వర్తిస్తుంది.

హ్యుందాయ్ ఆరా సబ్-కాంపాక్ట్ సెడాన్ ధర భారతీయ మార్కెట్లో రూ. 6.09 లక్షల నుండి రూ. 8.87 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు అందుబాటులో ఉంటుంది. ఇది E, S, SX, SX+ మరియు SX (O) అనే నాలుగు వేరియంట్‌లలో విక్రయించబడుతోంది. వీటిలో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి వాటితోపాటు వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి.

హ్యుందాయ్ ఆరా మొత్తం రెండు ఇంజిన్ ఆప్సన్స్ పొందుతుంది. అవి 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 1-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్. ఇవి రెండూ వరుసగా 83 బిహెచ్‌పి పవర్ & 114 ఎన్ఎమ్ టార్క్ మరియు 100 బిహెచ్‌పి పవర్ & 172 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 NIOS):
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కొనుగోలుపైన కూడా కస్టమర్లు రూ. 48,000 ఆదా చేయవచ్చు. దేశీయ మార్కెట్లో గ్రాండ్ ఐ10 నియోస్ ధరలు రూ. 5.43 లక్షల నుంచి రూ. 8.45 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకు ఉంటాయి. అయితే ఇది మొత్తం ఎరా, మాగ్నా, స్పోర్ట్స్ మరియు ఆస్టా అనే నాలుగు ట్రిమ్స్ లో అందుబాటులో ఉంటుంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ 1.2-లీటర్ ఇంజన్ మరియు 1-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్ అనే రెండు పెట్రోల్ ఇంజిన్లను పొందుతాయి. ఇవి రెండూ కూడా 5 స్పీడ్ మాన్యువల్ మరియు 5 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్ పొందుతాయి. కావున మంచి పనితీరుని అందిస్తాయి.

ఇక హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ యొక్క డిజైన్ మరియు ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉండటమే కాకుండా 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, కీలెస్ ఎంట్రీ మరియు హిట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటి ఫీచర్స్ పొందుతుంది.

హ్యుందాయ్ ఐ20 (Hyundai i20):
హ్యుందాయ్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ యొక్క కొనుగోలుపైన ఈ దీపావళి సందర్భంగా రూ. 20,000 వరకు ఆదా చేసుకోవచ్చు. హ్యుందాయ్ ఐ20 ధరలు రూ. 7.07 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 11.62 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. ఇప్పుడు ఈ కారుని కొనుగోలు చేసే వారు ఈ అఫర్ పొందవచ్చు.

హ్యుందాయ్ ఐ20 మాగ్నా, స్పోర్ట్స్, ఆస్టా మరియు ఆస్టా (O) అనే నాలుగు ట్రిమ్స్ లో అందుబాటులో ఉంటుంది. వీటిలో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎయిర్ ప్యూరిఫైయర్, కనెక్టెడ్ కార్ టెక్ మరియు సన్‌రూఫ్ వంటివి ఆధునిక ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. కాగా వీటిలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రివర్స్ కెమెరా మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

హ్యుందాయ్ ఐ20 మూడు ఇంజన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. అవి 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, 1-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ మరియు 1.5-లీటర్ డీజిల్ యూనిట్. ఈ మూడు ఇంజిన్లు అద్భుతమైన పనితీరుని అందిస్తాయి.

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ (Hyundai Kona Electric):
హ్యుందాయ్ కంపెనీ తన పెట్రోల్ మరియు డీజిల్ కార్ల మీద మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ కారుపైన కూడా డిస్కౌంట్ అందిస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ తన 'కోనా ఎలక్ట్రిక్' ఎస్‌యూవీ పైన రూ. 1 లక్ష వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ కొత్త ఎస్‌యూవీ ధరలు దేశీయ విఫణిలో రూ. 23.84 లక్షల నుండి రూ. 24.03 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకు ఉన్నాయి.

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ వాహన విభాగంలో మంచి అమమకాలు పొందుతున్న కంపెనీ బ్రాండ్. ఇది అద్భుతమైన డిజైన్ మరియు ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 39.2 kWh బ్యాటరీ ప్యాక్ అందుబాటులో ఉంటుంది. ఇందులో ఒక ఫుల్ ఛార్జ్ పైన గరిష్టంగా 452 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని ARAI చేత ధృవీకరించబడింది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
భారతీయ మార్కెట్లో గత విజయదశమి నుంచి కూడా చాలా కంపెనీలు తమ కొనుగోలుదారుల కోసం చాలా వరకు డిస్కౌంట్స్ అందింస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ జాబితాలో హ్యుందాయ్ కంపెనీ చేరింది. హ్యుందాయ్ కంపెనీ ఇప్పుడు దీపావళి సందర్భంగా మంచి డిస్కౌంట్స్ అందించింది. కావున కొనుగోలుదారులు దీనిని ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ 2022 అక్టోబర్ 1 నుంచి 2022 అక్టోబర్ 31 వరకు మరియు స్టాక్ ఉన్నంతవరకు మాత్రమే వర్తిస్తుంది. అంతే కాకూండా నగరం లేదా రాష్ట్రాన్ని బట్టి డిస్కౌంట్‌లు మారే అవకాశం కూడా ఉంటుంది. ఖచ్చితమైన డిస్కౌంట్ మరియు ఆఫర్స్ తెలుసుకోవటానికి సమీపంలోని హ్యుందాయ్ డీలర్‌షిప్‌ను సంప్రదించి తెలుసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








