హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ (Creta Knight Edition) విడుదల: ధరలు, కొత్త ఫీచర్లు
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ (Hyundai), భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ ఎస్యూవీ క్రెటా (Creta) లో కంపెనీ ఓ కొత్త నైట్ ఎడిషన్ (Knight Edition) ను విడుదల చేసింది. స్టాండర్డ్ మోడల్‌తో పోల్చుకుంటే కొత్త హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ (Hyundai Creta Knight Edition) పలు కాస్మెటిక్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్ లను కలిగి ఉంటుంది. క్రెటా నైట్ ఎడిషన్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

క్రెటా నైట్ ఎడిషన్ 1.5 లీ పెట్రోల్ ఎస్+ (మ్యాన్యువల్) : రూ.13.51 లక్షలు
క్రెటా నైట్ ఎడిషన్ 1.5 లీ పెట్రోల్ ఎస్ఎక్స్(ఆప్షనల్) (ఐవిటి గేర్‌బాక్స్) : రూ.17.22 లక్షలు
క్రెటా నైట్ ఎడిషన్ 1.5 లీ డీజిల్ ఎస్+ (మ్యాన్యువల్) : రూ.14.47 లక్షలు
క్రెటా నైట్ ఎడిషన్ 1.5 లీ డీజిల్ ఎస్ఎక్స్(ఆప్షనల్) (ఐవిటి గేర్‌బాక్స్) : రూ.18.18 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)

భారతదేశపు మొట్టమొదటి స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ మరియు దేశపు అతిపెద్ద ఎగుమతిదారు అయిన హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్, గడచిన 2021లో భారతదేశం యొక్క నెంబర్ వన్ ఎస్యూవీ బ్రాండ్ గా అవతరించింది. హ్యుందాయ్ సాధించిన ఈ విజయాన్ని పురస్కరించుకుని, కంపెనీ ఈ కొత్త క్రెటా నైట్ ఎడిషన్ ను ప్రవేశపెట్టింది. హ్యుందాయ్ క్రెటా 2021లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా నిలిచింది మరియు గత కొన్ని సంవత్సరాలుగా క్రెటా ఈ విభాగంలో విక్రయాల పరంగా అగ్రగామిగా ఉంది.

హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ పేరుకు తగినట్లుగానే ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లలో బ్లాక్ కలర్ థీమ్‌ను కలిగి ఉంటుంది. స్టాండర్డ్ మోడల్‌తో పోల్చుకుంటే, ఈ నైట్ ఎడిషన్ క్రెటాలో లభించే ఎక్స్టీరియర్లలో ఫ్రంట్ రేడియేటర్ గ్రిల్ పై బ్లాక్ గ్లోస్ మరియు రెడ్ కలర్ ఇన్సర్ట్లు, బ్లాక్ గ్లోస్ ఎక్స్టీరియర్ స్టైలింగ్ ఎలిమెంట్స్‌లో భాగంగా, ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ ప్లేట్లు, లైట్నింగ్ ఆర్చ్ సి-పిల్లర్ గార్నిష్, సైడ్ సిల్ గార్నిష్, రూఫ్ రెయిల్స్, సైడ్ మిర్రర్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, టెయిల్ లాంప్ ఇన్సర్ట్లు అన్నీ కూడా బ్లాక్ కలర్ లో ఫినిష్ చేయబడి ఉంటాయి.

అంతేకాకుండా, ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్ లోని బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, డార్క్ క్రోమ్ ఎంబ్లమ్ ఫినిష్, స్పోర్టి రెడ్ ఫ్రంట్ బ్రేక్ కాలిపర్స్, డార్క్ మెటల్ కలర్ అల్లాయ్ వీల్స్ (S+ ట్రిమ్ లో R16 సైజ్ మరియు SX(O) ట్రిమ్ లో R17 సైజ్) మరియు నైట్ ఎడిషన్ యాంబ్లం వంటి మార్పులు ఉంటాయి. ఇంకా ఇందులో
స్మార్ట్ పనోరమిక్ సన్‌రూఫ్, ట్రియో బీమ్ ఎల్ఈఢి హెడ్‌ల్యాంప్స్ మరియు క్రెసెంట్ గ్లో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్ వంటి స్టాండర్డ్ డిలైట్ ఫీచర్లు ఉన్నాయని, ఇవి తమ కస్టమర్లకు ఉన్నతమైన అల్టిమేట్ ఎస్యూవీ అనుభవాన్ని అందిస్తాయని హ్యుందాయ్ పేర్కొంది.

ఈ ఫీచర్లకు అదనంగా, కొత్త హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ లో ఏసి వెంట్ ఇన్సర్ట్లు కూడా బ్లాక్ కలర్లో ఉంటాయి. స్టీరింగ్ వీల్ మరియు సీట్లపై కలర్ స్టిచింగ్/పైపింగ్ క్యాబిన్ అనుభవంలో స్పోర్టినెస్‌ను మరింత పెంచుతాయి. క్రెటా నైట్ ఎడిషన్ విడుదలతో పాటుగా హ్యుందాయ్ తమ 2022 మోడల్ క్రెటా స్టాండర్డ్ మోడళ్లలో కూడా కొన్ని అప్‌గ్రేడ్స్ చేసింది. క్రెటా ఇప్పుడు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (హైలైన్)ని ట్రిమ్‌లలో స్టాండర్డ్ ఫీచర్‌గా లభించడంతో పాటుగా కొత్త డెనిమ్ బ్లూ కలర్‌తో పాటు SX (O) ట్రిమ్స్‌లో గ్లోసీ బ్లాక్ సెంటర్ కన్సోల్‌ను కూడా కలిగి ఉంటుంది.

అలాగే, పవర్‌ట్రెయిన్ ఎంపికల స్పెక్ట్రమ్‌లో కస్టమర్ ఎంపికలను మెరుగుపరచడానికి క్రెటా 1.5 లీటర్ పెట్రోల్ S ట్రిమ్‌లో కంపెనీ అత్యంత వినూత్నమైన iMT (ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్)ని కూడా పరిచయం చేసింది. ఇందులోని ఇతర ఫీచర్లలో స్మార్ట్ పనోరమిక్ సన్‌రూఫ్, R16 బ్లాక్ అల్లాయ్ వీల్స్, స్మార్ట్‌ఫోన్ వైర్లెస్ ఛార్జర్, వెనుక డిస్క్ బ్రేక్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ (VSM), హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ (HAC), ప్యాడిల్ షిఫ్టర్లు, మెటల్ పెడల్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ మరియు ఆటో ఫోల్డింగ్‌తో కూడిన సైడ్ మిర్రర్స్, పవర్ విండో ఆటో అప్/డౌన్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ విడుదల సందర్భంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్ (సేల్స్, మార్కెటింగ్ అండ్ సర్వీస్) శ్రీ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ, భారతదేశంలో హ్యుందాయ్ యొక్క 25 ఏళ్ల ప్రయాణంలో ప్రతి సందర్భంలోనూ కస్టమర్లకు ఆనందాన్ని కలిగించడానికి తాము స్థిరమైన ప్రయత్నాలు చేస్తూ వచ్చామని, క్రెటా ఎస్‌యూవీని ప్రవేశపెట్టడం ద్వారా అల్టిమేట్ ఎస్యూవీ కోసం వెతుకుతున్న లక్షల మంది భారతీయ ఎస్యూవీ కొనుగోలుదారుల ఆకాంక్షలను నెరవేర్చామని అన్నారు.


Click it and Unblock the Notifications








