ఒక్క కీ తోనే కార్లను డెలివరీ చేస్తున్న హ్యుందాయ్..! ఆరు నెలల తర్వాతే సెకండ్ కీ డెలివరీ..!!
సాధారణంగా, కార్ కంపెనీలు మరియు డీలర్లు కార్లను డెలివరీ చేసేటప్పుడు కారుతో పాటుగా రెండు తాళం చెవులను కస్టమర్లకు అందజేస్తారు. అయితే, హ్యుందాయ్ మాత్రం ఇప్పుడు కేవలం ఒక్క తాళం చెవితోనే కస్టమర్లకు వాహనాలను డెలివరీ చేస్తున్నట్లు సమాచారం. రెండవ తాళం చెవి పొందాలంటే కస్టమర్లు కనీసం ఆరు నెలల వరకూ వేచి ఉండాల్సిన పరిస్థితి. అసలేం జరిగిందంటే..

ప్రస్తుతం, ప్రపంచ వ్యాప్తంగా యావత్ ఆటోమొబైల్ పరిశ్రమను సెమీకండక్టర్ చిప్ కొరత వేధిస్తున్న సంగతి మనందరికీ తెలిసినదే. దీంతో కార్ల తయారీ సంస్థలు తమ వాహనాల తయారీలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. కార్ కంపెనీలు తయారుచేసే స్మార్ట్ కీ మొదలుకొని, కార్లలోని ఇన్ఫోటైన్‌మెంట్ మరియు అనేక ఎలక్ట్రానిక్ పరికరాలలో వీటి ఉపయోగం చాలా ఎక్కువగా ఉంటుంది. నిజానికి, కారులోని అనేక భాగాలు పనిచేయాలంటే, ఈ ఎలక్ట్రానిక్ చిప్స్ చాలా కీలంగా ఉంటాయి.

సెమీకండక్టర్ చిప్ షార్టేజ్ నేపథ్యంలో, హ్యుందాయ్ ఇప్పుడు తమ కస్టమర్లకు ముందు ఒక్క స్మార్ట్ కీ తోనే వాహనాలను డెలివరీ చేస్తోంది. రెండవ స్మార్ట్ కీ ని ఆరు నెలల తర్వాత నేరుగా కస్టమర్ ఇంటికే డెలివరీ చేసేలా కంపెనీ ప్లాన్ చేస్తోంది. ప్రారంభంలో, హ్యుందాయ్ తమ కస్టమర్లకు ఒక స్మార్ట్ కీ తో పాటుగా మరొక మ్యాన్యువల్ కీని కూడా అందిస్తోంది, ఈ మ్యాన్యువల్ కీ లో ఎటువంటి ఎలక్ట్రానిక్స్ ఉండవు. అంటే, మొత్తమ్మీద హ్యుందాయ్ కస్టమర్లకు ఇప్పుడు మూడు తాళం చెవులు లభిస్తాయన్నమాట.

అయితే, ఇది అన్ని హ్యుందాయ్ మోడళ్లకు వర్తించదు. స్మార్ట్ కీ కలిగిన కొన్ని ఎంపిక చేసిన మోడళ్లు మరియు వేరియంట్లకు మాత్రమే వర్తిస్తుంది. ప్రభావిత మోడళ్లలో ఐ20 ('ఆస్టా' మరియు అంతకంటే ఎక్కువ వేరియంట్లు), ఐ20 ఎన్-లైన్, క్రెటా ('ఎస్' మరియు అంతకంటే ఎక్కువ వేరియంట్లలో) మరియు అల్కజార్ (అన్ని వేరియంట్లు) ఉన్నాయి. సమాచారం ప్రకారం, పైన పేర్కొన్న వాహనాలకు సంబంధించిన రెండవ కీ 6 నెలల వ్యవధిలో సంబంధిత వినియోగదారులకు డెలివరీ చేయబడుతుంది.

హ్యుందాయ్ ఈ విషయం గురించి నేరుగా ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వకపోయినప్పటికీ, కొత్తగా డెలివరీ తీసుకుంటున్న కస్టమర్లు మరియు కొందరు డీలర్లు ఈ విషయం గురించి చెబుతున్నారు. ఈ చర్య వలన కొత్త హ్యుందాయ్ కార్ల వినియోగదారులు తాత్కాలిక ఇబ్బందిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే, వారికి రెండవ కీ సమస్య లేకుండా చేసేందుకు కంపెనీ ఒక స్మార్ట్ కీ తో పాటుగా మరొక మ్యాన్యువల్ కీ ని కూడా అందజేస్తోంది. ఈ ఆరు నెలల వ్యవధిలో ఒక స్మార్ట్ కీ పనిచేయకపోయినా మ్యాన్యువల్ కీతో కారుని లాక్/ఆన్-లాక్ చేయవచ్చు.

ఇక హ్యుందాయ్ మోటార్ ఇండియా విషయానికి వస్తే, ఈ బ్రాండ్ ఇప్పటి వరకూ భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థగా కొనసాగుతూ వచ్చింది. అయితే, గడచిన నెలలో టాటా మోటార్స్ చూపిన అద్భుతమైన అమ్మకాల పనితీరు కారణంగా, ఈ కొరియన్ బ్రాండ్ తన ద్వితీయ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. దీంతో టాటా మోటార్స్ గడచిన మే 2022 నెలలో అమ్మకాల పంరగా 'భారతదేశపు రెండవ అతిపెద్ద కార్ తయారీదారు'గా నిలిచింది.

హ్యుందాయ్ ఇండియా ప్రోడక్ట్ లైనప్ లో క్రెటా ఎస్‌యూవీ ప్రస్తుతం కంపెనీ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్‌గా కొనసాగుతోంది. కాగా, హ్యుందాయ్ అందిస్తున్న వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫీచర్లు మరియు టెక్నాలజీ పరంగా ఫుల్లీ లోడెడ్ అయినప్పటికీ, ఇటీవలి కాలంలో ఈ చిన్న ఎస్‌యూవీ అమ్మకాలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, హ్యుందాయ్ తమ వెన్యూ అమ్మకాలను పెంచుకునేందుకు ఇందులో ఓ కొత్త అప్‌డేటెడ్ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేయబోతోంది.

కొత్త 2022 మోడల్ హ్యుందాయ్ వెన్యూ ఎస్‌యూవీని కంపెనీ జూన్ 16వ తేదీన మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో, కంపెనీ ఇప్పటికే కొన్ని టీజర్ చిత్రాలను కూడా విడుదల చేసింది. వాటిని బట్టి చూస్తే, కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ లోపల మరియు వెలుపల పెద్ద మార్పులతో రానున్నట్లు తెలుస్తోంది. ముందు వైపు సరికొత్త ఫ్రంట్ గ్రిల్, దీర్ఘచతురస్రాకారపు ఎయిర్ డ్యామ్‌లతో కూడిన రివైజ్డ్ ఫ్రంట్ బంపర్‌తో ఇది కొత్త ఫ్రంట్ ఎండ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు కూడా ఉన్నాయి.

హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో కొత్త అల్లాయ్ వీల్స్ మరియు మరింత ప్రముఖంగా కనిపించే రూఫ్ రెయిల్‌లను కూడా చూడవచ్చు. వెనుక వైపున, రివైజ్ చేయబడిన రియర్ బంపర్ మరియు రెండు టెయిల్ లైట్లను కలుపుతూ పోయే పూర్తి వెడల్పుతో కూడిన లైట్ బార్ ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే, లోపలి వైపున పెద్ద 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త డ్యాష్‌బోర్డ్ లేఅవుట్, హ్యుందాయ్ ఐ20 శ్రేణి నుండి ప్రేరణ పొందిన పూర్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైన మార్పులు ఉండనున్నాయి.

ఫీచర్ల విషయానికొస్తే, అప్‌డేటెడ్ హ్యుందాయ్ వెన్యూలో లేటెస్ట్ కార్ కనెక్టింగ్ టెక్నాలజీ, అమేజాన్ అలెక్సా మరియు గూగుల్ వాయిస్ అసిస్టెంట్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, రియర్ ఏసి వెంట్‌లు, యాంబియంట్ లైటింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి మరెన్నో ఫీచర్లు ఉండనున్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో కనీసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబిఎస్, ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు 360-డిగ్రీ కెమెరా మొదలైనవి ఉండనున్నాయి.
Source: Rushlane


Click it and Unblock the Notifications