Hyundai i20 N-Line కొత్త కలర్ ఆప్సన్స్‌లో.. ఇప్పుడు నచ్చింది ఎంచుకోండి

ప్రముఖ సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ 'హ్యుందాయ్' (Hyundai) దేశీయ మార్కెట్లో ఇప్పటికే తన 'ఐ20 ఎన్-లైన్' (i20 N-Line) ను గత ఏడాది విడుదల చేసింది. అయితే ఈ 'Hyundai i20 N-Line' ఇప్పుడు కొత్త కలర్ ఆప్షన్స్ పొందింది. ఈ కొత్త కార్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

Hyundai i20 N-Line ఇప్పుడు కొత్త కలర్ ఆప్సన్స్‌లో.. నచ్చింది ఎంచుకోండి

కంపెనీ యొక్క 'హ్యుందాయ్ ఐ20 ఎన్-లైన్' (Hyundai i20 N-Line) ఇప్పుడు థండర్ బ్లూ, టైటాన్ గ్రే, పోలార్ వైట్ మరియు కొత్త స్టార్రీ నైట్ అనే కొత్త నాలుగు సింగిల్ టోన్ కలర్స్ లో అందుబాటులో ఉంది. అయితే ఈ హ్యుందాయ్ ఐ20 ఎన్-లైన్ ఫైరీ రెడ్ సింగిల్-టోన్ కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది.

Hyundai i20 N-Line ఇప్పుడు కొత్త కలర్ ఆప్సన్స్‌లో.. నచ్చింది ఎంచుకోండి

సింగిల్ టోన్ కలర్స్ లో మాత్రమే కాకుండా కంపెనీ డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లో కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇందులో థండర్ బ్లూ, పోలార్ వైట్ మరియు ఫెయిరీ రెడ్ ఫాంటమ్ బ్లాక్ రూఫ్‌తో అందించబడుతుంది. ఈ కారులో సైడ్ స్కర్ట్స్ మరియు రూఫ్ స్పాయిలర్ రెడ్ యాక్సెంట్‌లతో ఇవ్వబడ్డాయి. కావున ఇవి మునుపటికంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

Hyundai i20 N-Line ఇప్పుడు కొత్త కలర్ ఆప్సన్స్‌లో.. నచ్చింది ఎంచుకోండి

హ్యుందాయ్ ఐ20 ఎన్-లైన్ అద్భుతమైన డిజైన్ పొందుతుంది. ఇది 16-ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉపయోగించబడ్డాయి, అంతే కాకుండా నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్‌లు ఇవ్వబడ్డాయి. ఇందులో ప్రత్యేకంగా ట్యూన్ చేయబడిన సస్పెన్షన్ మరియు ట్విన్ ఎగ్జాస్ట్ టిప్స్ కూడా ఉపయోగించబడ్డాయి.

Hyundai i20 N-Line ఇప్పుడు కొత్త కలర్ ఆప్సన్స్‌లో.. నచ్చింది ఎంచుకోండి

హ్యుందాయ్ i20 N-లైన్‌ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 1.0-లీటర్, 3-సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజన్‌ పొందుతుంది. ఈ ఇంజిన్ 6,000 rpm వద్ద 118 బిహెచ్‌పి పవర్ మరియు 1,500 - 4,000 rpm వద్ద 172 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ ఇంజన్‌తో కంపెనీకి 6-స్పీడ్ iMT మరియు 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్సన్ పొందుతుంది.

Hyundai i20 N-Line ఇప్పుడు కొత్త కలర్ ఆప్సన్స్‌లో.. నచ్చింది ఎంచుకోండి

ఇటీవల హ్యుందాయ్ మోటార్ ఇండియా హ్యుందాయ్ ఐ20 స్టాండర్డ్ వెర్షన్ నుండి కొన్ని వేరియంట్లు మరియు ఫీచర్లను తొలగించిందని అలాగే కొన్ని ఫీచర్లు కూడా జోడించబడింది. కంపెనీ ఆస్టా ట్రిమ్ నుండి 1.2-లీటర్ పెట్రోల్ IVT మరియు 1.0-లీటర్ DCT ఆటోమేటిక్‌లను వదిలివేసింది, దాని స్థానంలో ఆస్టా (ఓ)తో భర్తీ చేయబడింది, ఇది ఇప్పటివరకు మాన్యువల్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

Hyundai i20 N-Line ఇప్పుడు కొత్త కలర్ ఆప్సన్స్‌లో.. నచ్చింది ఎంచుకోండి

2022 హ్యుందాయ్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో వస్తుంది మరియు ఈ విభాగంలోని ఇతర మోడల్‌లు నిరంతరం అనేక అప్‌డేట్‌లతో తీసుకురాబడ్డాయి. ఈ విభాగంలో, హ్యుందాయ్ i20 భారతీయ మార్కెట్లో మారుతి సుజుకి బాలెనో మరియు టాటా ఆల్ట్రోజ్‌ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Hyundai i20 N-Line ఇప్పుడు కొత్త కలర్ ఆప్సన్స్‌లో.. నచ్చింది ఎంచుకోండి

ఇదిలా ఉండగా సెమీకండక్టర్ చిప్ కొరత నుండి ఆటోమొబైల్ కంపెనీలు ఇప్పుడిప్పుడే క్రమంగా తేరుకుంటున్న నేపథ్యంలో, గత నెలలో హ్యుందాయ్ ప్రోత్సాహకర ఫలితాలను నమోదు చేసింది. గత నెలలో కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ మోటార్ ఇండియా, మొత్తం 44,022 కార్లను విక్రయించినట్లు ప్రకటించింది.

Hyundai i20 N-Line ఇప్పుడు కొత్త కలర్ ఆప్సన్స్‌లో.. నచ్చింది ఎంచుకోండి

అయితే, గతేడాది జనవరి 2021 నెలలో విక్రయించిన 52,005 కార్లతో పోలిస్తే, గత నెలలో అమ్మకాలు 15.35 శాతం క్షీణించాయి. అయితే, రానున్న నెలల్లో అమ్మకాలు మెరుగ్గా ఉంటాయని కంపెనీ భావిస్తోంది. గడచిన డిసెంబర్ 2021 నెలతో పోలిస్తే, ఈ కొత్త సంవత్సరంలో హ్యుందాయ్ కార్ల అమ్మకాలు మెరుగ్గా ఉన్నాయి. డిసెంబర్ 2021లో కంపెనీ మొత్తం విక్రయాలు 32,312 యూనిట్లుగా ఉంటే, జనవరి 2022లో 44,022 యూనిట్లుగా ఉన్నాయి.

Hyundai i20 N-Line ఇప్పుడు కొత్త కలర్ ఆప్సన్స్‌లో.. నచ్చింది ఎంచుకోండి

ఈ సమయంలో అమ్మకాలు 36.24 శాతం వృద్ధిని సాధించాయి. గత నెలలో టాప్ సేల్స్ చార్ట్‌లో హ్యుందాయ్ క్రెటా, వెన్యూ, గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20, శాంట్రో, వెర్నా మరియు హ్యుందాయ్ అల్కాజార్ మోడళ్లు ఉన్నాయి. వాస్తవానికి, డిసెంబర్‌ నెలలో అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి, స్టాక్ క్లియరెన్స్ కోసం కార్ కంపెనీలు డిసెంబర్ నెలలో తమ కార్లపై భారీ డిస్కౌంట్లు మరియు వివిధ రకాల ఆఫర్లను అందిస్తుంటాయి. అయినప్పటికీ, హ్యుందాయ్ కార్ల అమ్మకాలు మాత్రం డిసెంబర్ 2021 నెలలో భారీగా క్షీణించాయి. దీంతో డిసెంబర్ నెలలో హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ విక్రయాల పరంగా మూడవ స్థానంలోకి పడిపోయింది.

More from DriveSpark

Article Published On: Wednesday, March 9, 2022, 9:56 [IST]
English summary
Hyundai i20 n line gets new color option features engine details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+