భారత మార్కెట్లో రెండవ స్థానాన్ని తిరిగి దక్కించుకున్న హ్యుందాయ్, జూన్‌లో 49,001 యూనిట్లు

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ గడచిన మే 2022 నెలలో భారత మార్కెట్లో అమ్మకాల పరంగా రెండవ స్థానాన్ని కోల్పోయి మూడవ స్థానానికి పడిపోయిన సంగతి తెలిసినదే. అయితే, జూన్ 2022 నెలలో మార్కెట్ సెంటిమెంట్ బలంగా ఉండటం మరియు కొత్తగా ప్రవేశపెట్టిన హ్యుందాయ్ వెన్యూకి మంచి డిమాండ్ ఏర్పడటంతో కంపెనీ గత నెలలో తిరిగి తన రెండవ స్థానాన్ని దక్కించుకుంది. గడచిన జూన్ నెలలో హ్యుందాయ్ ఇండియా మొత్తం 49,001 కార్లను విక్రయించింది. ఈ సమయంలో కంపెనీ అమ్మకాలు 21 శాతం వార్షిక వృద్ధిని కనబరిచాయి.

భారత మార్కెట్లో రెండవ స్థానాన్ని తిరిగి దక్కించుకున్న హ్యుందాయ్, జూన్‌లో 49,001 యూనిట్లు

గడచిన మే 2022 నెలలో టాటా మోటార్స్ అత్యధిక నెలవారీ అమ్మకాలను సాధించి, రెండవ స్థానాన్ని దక్కించుకుంది. కాగా, హ్యుందాయ్ మూడవ స్థానానికి పడిపోయింది. అయితే, హ్యుందాయ్ జూన్ 2022 నెలలో మొత్తం 49,001 వాహనాలను విక్రయించింది, దీంతో ఇది టాటా మోటార్స్ నుండి ఆటోమోటివ్ అమ్మకాల ర్యాంకింగ్స్‌లో రెండవ స్థానాన్ని తిరిగి పొందడంలో సహాయపడింది. జూన్ 2021 నెలలో హ్యుందాయ్ విక్రయించిన 40,496 యూనిట్లతో పోలిస్తే, గత నెలలో అమ్మకాలు 21 శాతం (8,505 యూనిట్లు) పెరిగాయి.

భారత మార్కెట్లో రెండవ స్థానాన్ని తిరిగి దక్కించుకున్న హ్యుందాయ్, జూన్‌లో 49,001 యూనిట్లు

హ్యుందాయ్ నెలవారీ అమ్మకాలు కూడా వృద్ధి చెందాయి. మే 2022 నెలలో హ్యుందాయ్ మొత్తం అమ్మకాలు 42,293 యూనిట్లుగా ఉంటే, జూన్ 2022 నెలలో ఇవి 49,001 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ సమయంలో కంపెనీ నెలవారీ అమ్మకాలు 15.86 శాతం (6,708 యూనిట్లు) పెరిగాయి. హ్యుందాయ్ గత నెలలో ఫేస్‌లిఫ్టెడ్ వెన్యూ ఎస్‌యూవీని భారతదేశంలో విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో ఈ కొత్త సబ్-4 మీటర్ ఎస్‌యూవీ ధరలు రూ. 7.53 లక్షల నుండి ప్రారంభమవుతాయి.

భారత మార్కెట్లో రెండవ స్థానాన్ని తిరిగి దక్కించుకున్న హ్యుందాయ్, జూన్‌లో 49,001 యూనిట్లు

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ మోడల్ కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న పెద్ద ఎస్‌యూవీల నుండి ప్రేరణ పొందిన కొత్త ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంటుంది. అప్‌డేట్ చేయబడిన హ్యుందాయ్ వెన్యూ లో 2-స్టెప్ రిక్లైనింగ్ రియర్ సీట్లు మరియు ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లేతో కూడిన 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు అమెజాన్ యొక్క అలెక్సా మరియు ఆండ్రాయిడ్ అసిస్టెంట్ వంటి వాయిస్ అసిస్టెంట్‌లను సపోర్ చేసే ఫీచర్లు మరియు హ్యుందాయ్ బ్లూలింక్ కనెక్టెడ్ కార్ సూట్ ద్వారా 60కి పైగా కనెక్ట్ చేయబడిన కార్ ఫీచర్‌లు లభిస్తాయి.

భారత మార్కెట్లో రెండవ స్థానాన్ని తిరిగి దక్కించుకున్న హ్యుందాయ్, జూన్‌లో 49,001 యూనిట్లు

కొత్త 2022 మోడల్ హ్యుందాయ్ వెన్యూ మూడు రకాల ఇంజన్లతో లభిస్తుంది. కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి వాటి ప్రారంభ ధరలు ఇలా ఉంటాయి:

*2022 వెన్యూ 1.2 లీటర్ పెట్రోల్ (ఎమ్‌టి) - రూ.7.53 లక్షలు

*2022 వెన్యూ 1.0 లీ టర్బో పెట్రోల్ (ఐఎమ్‌టి) - రూ.9.99 లక్షలు

*2022 వెన్యూ 1.5 లీటర్ డీజిల్ (ఎమ్‌టి) - రూ.9.99 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

భారత మార్కెట్లో రెండవ స్థానాన్ని తిరిగి దక్కించుకున్న హ్యుందాయ్, జూన్‌లో 49,001 యూనిట్లు

కొత్త 2022 వెన్యూ ఫేస్‌లిఫ్ట్ ఎక్స్టీరియర్ ఫీచర్లను గమనిస్తే, ఇందులో సరికొత్త ఫ్రంట్ గ్రిల్, స్ప్లిట్-హెడ్‌ల్యాంప్ డిజైన్‌తో కూడిన కొత్త ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, బానెట్ క్రింది భాగంలో ఎల్ఈడి టర్న్ ఇండికేటర్లు మరియు సన్నటి ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన స్మోక్డ్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్, బంపర్ క్రింది భాగంలో సిల్వర్ స్కఫ్ ప్లేట్, వెనుక వైపు కొత్త ఎల్-ఆకారపు వ్రాప్‌అరౌండ్ ఎల్ఈడి టెయిల్ లైట్లు మరియు ఈ రెండు టెయిల్ ల్యాంప్స్ ను కలుపుతూ పోయే సన్నటి ఎల్ఈడి లైట్ స్ట్రిప్, రీప్రొఫైల్ చేయబడిన రియర్ బంపర్, కొత్త 16 ఇంచ్ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ వంటి మార్పులు చేయబడ్డాయి.

భారత మార్కెట్లో రెండవ స్థానాన్ని తిరిగి దక్కించుకున్న హ్యుందాయ్, జూన్‌లో 49,001 యూనిట్లు

ఈ కారులోని ఇతర ప్రధాన ఫీచర్లలో కూల్డ్ గ్లోవ్ బాక్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డ్రైవ్ మోడ్‌లు, ఎయిర్ ప్యూరిఫైయర్, అలెక్సా మరియు గూగుల్ అసిస్టెంట్‌తో కూడిన హోమ్ టు కార్ ఫంక్షన్ (ఇంటి వద్ద ఉండే అలెక్సా డివైజ్ సాయంతో కారులోని కొన్ని ఫీచర్లను యాక్సెస్ చేసే సౌకర్యం), 10 ప్రాంతీయ భాషలతో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ మెనూ, 360 డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

భారత మార్కెట్లో రెండవ స్థానాన్ని తిరిగి దక్కించుకున్న హ్యుందాయ్, జూన్‌లో 49,001 యూనిట్లు

హ్యుందాయ్ నెక్స్ట్ కార్ లాంచ్ "ఐయానిక్ 5"..

ఇదిలా ఉంటే, ఈ సంవత్సరం న్యూయార్క్ ఆటో షోలో వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ టైటిల్‌ను గెలుచుకున్న హ్యుందాయ్ లేటెస్ట్ ఎలక్ట్రిక్ కార్ ఐయానిక్ 5 త్వరలోనే భారత మార్కెట్లో విడుదల కానుంది. కియా తమ ఈవీ6 ఎలక్ట్రిక్ కారును తయారు చేసిన ఇ-జిఎమ్‌పి ప్లాట్‌ఫామ్ ఆధారంగానే ఐయానిక్ 5 కూడా రూపుదిద్దుకోనుంది మరియు ఇది 800 వోల్ట్ ఛార్జింగ్ ఆర్కిటెక్చర్‌కు మద్దతు ఇస్తుంది. కియా ఈవీ6 ను ఇంపోర్టెడ్ కారుగా విక్రయిస్తుంటే, హ్యుందాయ్ ఐయానిక్ 5 కారును భారతదేశంలో అసెంబుల్ చేసే అవకాశం ఉంది. ఫలితంగా, ఐయానిక్ 5 ధర, ఈవీ6 ధర కన్నా సరసమైనదిగా ఉండే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Hyundai india sold 49001 cars in june 2022 sales increased by 21 percent y o y
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X