భారత్‌కు వస్తున్న Hyundai Ioniq 5 మరియు Kia EV6 ఎలక్ట్రిక్ కార్లు; లాంచ్ ఎప్పుడంటే..?

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) డిమాండ్ శరవేగంగా పెరుగుతోంది. పెరుగుతున్న ఇంధన ధరలు మరియు ఎలక్ట్రిక్ వాహనాల పట్ల కస్టమర్లలో పెరుగుతున్న అవగాహన నేపథ్యంలో, ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ రెట్టింపు వేగంతో వృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో, భారత ఈవీ మార్కెట్లోని డిమాండ్ ను వీలైనంత త్వరగా క్యాష్ చేసుకునేందుకు దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా, తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో కనీసం ఒక ఎలక్ట్రిక్ కారునైనా అందించాలని ప్లాన్ చేస్తున్నాయి.

భారత్‌కు వస్తున్న Hyundai Ioniq 5 మరియు Kia EV6 ఎలక్ట్రిక్ కార్లు; లాంచ్ ఎప్పుడంటే..?

భారతదేశంలో కొన్ని పేరుమోసిన లగ్జరీ కార్ బ్రాండ్లు ధనికుల కోసం ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టాయి. అయితే, సామాన్యులకు అందుబాటులో ఉండేలా టాటా మోటార్స్ మాత్రమే రెండు ఎలక్ట్రిక్ కార్లను (టిగోర్ ఈవీ, నెక్సాన్ ఈవీ) విక్రయిస్తోంది. కాగా, ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కారు రేసులో పాల్గొనేందుకు మరో రెండు కొరియన్ కార్లు రాబోతున్నాయి. కొరియన్ కార్ బ్రాండ్ అయిన హ్యుందాయ్ మరియు దాని అనుబంధ కంపెనీ అయిన కియా రెండూ కూడా భారత మార్కెట్లో రెండు ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి.

భారత్‌కు వస్తున్న Hyundai Ioniq 5 మరియు Kia EV6 ఎలక్ట్రిక్ కార్లు; లాంచ్ ఎప్పుడంటే..?

గ్లోబల్ మార్కెట్ల కోసం ఆవిష్కరించబడిన హ్యుందాయ్ ఐయానిక్ 5 (Hyundai Ioniq 5) మరియు కియా ఈవీ6 (Kia EV6) ఎలక్ట్రిక్ కార్లు త్వరలోనే భారతదేశంలో కూడా విడుదల కాబోతున్నాయి. ఓ నివేదిక ప్రకారం, ముందుగా కియా ఈవీ6 భారతదేశంలో విడుదలయ్యే అవకాశం ఉంది. వచ్చే నెలలో (మే 2022లో) ఈ కొరియన్ ఎలక్ట్రిక్ భారతదేశంలో లాంచ్ అవుతుందని సమాచారం. కియా ఇండియా మొదట్లో తమ ఈవీ6 ఎలక్ట్రిక్ కారును పూర్తిగా విదేశాలలో నిర్మించబడిన యూనిట్ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్, CBU) రూట్‌లో ఇండియాకు దిగుమతి చేసుకోనున్నారు.

భారత్‌కు వస్తున్న Hyundai Ioniq 5 మరియు Kia EV6 ఎలక్ట్రిక్ కార్లు; లాంచ్ ఎప్పుడంటే..?

కియా ఈవీ6 ఇంపోర్టెడ్ మోడల్ గా భారతదేశంలోకి రానున్న నేపథ్యంలో, దీని ధర కూడా సాధారణం కన్నా రెట్టింపుగా ఉంటుందని తెలుస్తోంది. అంచనా ప్రకారం, భారతదేశంలో కియా ఈవీ6 ధర రూ. 50 లక్షల వరకూ ఉండొచ్చని సమాచారం. అయితే, మార్కెట్లో ఈ మోడల్ కు లభించే డిమాండ్ ను బట్టి, కంపెనీ ఈ కారును విడిభాగాల రూపంలో భారతదేశంలోకి దిగుమతి చేసుకుని, ఇక్కడే స్థానికంగా అసెంబుల్ చేసే అవకాశం ఉంది. అలా జరిగినప్పుడు దీని ధర కాస్తంత తగ్గే అవకాశం కూడా ఉంది. అయితే, ఇదంతా జరగడానికి మరో ఏడాదికి పైగా సమయం పట్టవచ్చని అంచనా.

భారత్‌కు వస్తున్న Hyundai Ioniq 5 మరియు Kia EV6 ఎలక్ట్రిక్ కార్లు; లాంచ్ ఎప్పుడంటే..?

కియా ఈవీ6 మార్కెట్లోకి వచ్చిన కొన్ని నెలల తర్వాత హ్యుందాయ్ ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ కారు భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. సమాచారం ప్రకారం, Hyundai Ioniq 5 అక్టోబర్ 2022 చివరిలో భారత మార్కెట్లో విడుదల చేయబడుతుందని తెలుస్తోంది. హ్యుందాయ్ ఇప్పటికే దాని ప్రోడక్ట్ లైనప్ లో ఓ ఎలక్ట్రిక్ కారు (హ్యుందాయ్ కోన)ను కలిగి ఉన్న నేపథ్యంలో, కియా ఈవీ6 మాదిరిగా కాకుండా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును నేరుగా భారతదేశంలోనే అసెంబుల్ చేసే అవకాశం ఉంది.

భారత్‌కు వస్తున్న Hyundai Ioniq 5 మరియు Kia EV6 ఎలక్ట్రిక్ కార్లు; లాంచ్ ఎప్పుడంటే..?

ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ కారును హ్యుందాయ్ తమ చెన్నై అసెంబ్లీ ప్లాంట్‌లో అసెంబుల్ చేయనుంది. ఫలితంగా, ఈ కారు ధర ఇంపోర్టెడ్ కియా ఈవీ6 ధర కన్నా తక్కువగా ఉంచబడుతుంది. ఓ నివేదిక ప్రకారం, హ్యుందాయ్ అయానిక్ 5 కారు ధర సుమారు రూ. 35 లక్షల మరియు 40 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్). ఉండొచ్చని అంచనా. వాస్తవానికి, హ్యుందాయ్ అయానిక్ 5 మరియు కియా ఈవీ6 రెండు మోడళ్లు కూడా ఒకే ప్లాట్‌ఫామ్ పై తయారు చేయబడి, వేర్వేరు బాడీ డిజైన్ కలిగిన ఎలక్ట్రిక్ కార్లుగా ఉండనున్నాయి.

భారత్‌కు వస్తున్న Hyundai Ioniq 5 మరియు Kia EV6 ఎలక్ట్రిక్ కార్లు; లాంచ్ ఎప్పుడంటే..?

ఈ Hyundai Ioniq 5 మరియు Kia EV6 రెండూ కూడా హ్యుందాయ్ మోటార్ గ్రూప్ యొక్క E-GMP స్కేట్‌బోర్డ్ స్టైల్ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని తయారుచేయబడనున్నాయి. ఈ ప్లాట్‌ఫారమ్ 800V ఎలక్ట్రికల్ ఆర్కిటెక్చర్‌ను కలిగి ఉంటుంది, ఇది EV6 మరియు Ioniq 5 రెండింటినీ 350kW వరకు పవర్ అవుట్‌పుట్‌ల వద్ద ఛార్జ్ చేయడానికి అనుమతిస్తుంది. అలాగే, ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లు కూడా 4.6 మీటర్ల కంటే ఎక్కువ పొడవును కలిగి ఉంటాయి. అయితే, వీటి వీల్‌బేస్‌లో మాత్రం స్వల్ప మార్పు ఉంటుంది. హ్యుందాయ్ అయానిక్ 5 వీల్‌బేస్ 3,000 మిమీగా ఉంటే, కియా ఈవీ6 వీల్‌బేస్ 2,900 మిమీగా ఉంటుంది.

భారత్‌కు వస్తున్న Hyundai Ioniq 5 మరియు Kia EV6 ఎలక్ట్రిక్ కార్లు; లాంచ్ ఎప్పుడంటే..?

కియా ఈవీ6 యొక్క డ్యూయల్-మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ జిటి-లైన్ వెర్షన్ 321bhp (239kW) గరిష్ట పవర్ మరియు 605Nm గరిష్ట టార్క్‌తో ఐయానిక్ 5 కంటే శక్తివంతమైనదిగా ఉంటుంది. ఇది పూర్తి ఛార్జ్‌పై గరిష్టంగా 441 కిలోమీటర్ల రేంజ్ (EPA టెస్టింగ్ ప్రకారం) అందిస్తుంది. కియా ఈవీ6 యొక్క మరింత శక్తివంతమైన జిటి వెర్షన్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది, ఇది 577bhp పవర్ మరియు 740Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

భారత్‌కు వస్తున్న Hyundai Ioniq 5 మరియు Kia EV6 ఎలక్ట్రిక్ కార్లు; లాంచ్ ఎప్పుడంటే..?

ఇక హ్యుందాయ్ అయానిక్ 5 స్పెసిఫికేషన్లను గమనిస్తే, ఇదొక రియర్ వీల్ డ్రైవ్ ఎలక్ట్రిక్ కారు. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 168bhp పవర్‌ను మరియు 350Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 354 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది. గ్లోబల్ మార్కెట్ల కోసం హ్యుందాయ్ అయానిక్ 5 కారులో 321bhp పవర్ మరియు 605Nm టార్క్ ను జనరేట్ చేసే ఓ శక్తివంతమైన వేరియంట్ కూడా ఇది ఇది పూర్తి చార్జ్ పై 412 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది. అయితే, ఈ వేరియంట్ భారత మార్కెట్లో విడుదల కాకపోవచ్చు.

More from DriveSpark

Article Published On: Thursday, April 7, 2022, 15:31 [IST]
English summary
Hyundai ioniq 5 and kia ev6 electric cars india launch timeline revealed details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+