భారతీయ మార్కెట్లో 'Hyundai Ioniq 5' లాంచ్ ఎప్పుడో తెలుసా..!!
ప్రముఖ వాహన తయారీ సంస్థ 'హ్యుందాయ్' (Hyundai) భారతీయ మార్కెట్లో కోసం కొత్త ఎలక్ట్రిక్ కారుని విడుదల చేయనున్న సంగతి ఇప్పటికే అందరికి తెలిసిన విషయమే. అయితే కంపెనీ విడుదల చేయనున్న ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు పేరు 'హ్యుందాయ్ ఐయోనిక్ 5' (Hyundai Ioniq 5). హ్యుందాయ్ ఈ ఆల్-ఎలక్ట్రిక్ ఐయోనిక్ 5 ను ఈ ఏడాది భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

హ్యుందాయ్ కంపెనీ తన బియాండ్ మొబిలిటీ స్ట్రాటజీ కింద 2022 ద్వితీయార్థంలో దేశీయ మార్కెట్లో ఆల్-ఎలక్ట్రిక్ ఐయోనిక్ 5ని విడుదల చేయనున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. ఇప్పటికే కంపెనీ యొక్క ఈ ఎలక్ట్రిక్ కార్ '2022 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్' అవార్డును కూడా కైవసం చేసుకుంది.

భారతీయ మార్కెట్లో విడుదలకానున్న ఈ కొత్త 'హ్యుందాయ్ ఐయోనిక్ 5' 'ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్' ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు ఆధునిక డిజైన్ కలిగి ఉండటమే కాకుండా, లేటెస్ట్ ఫీచర్స్ కూడా పొందుతుంది. 'హ్యుందాయ్ ఐయోనిక్ 5' లో ఐయోనిక్ అనే పదం "అయాన్" మరియు "యూనిక్" కలయికతో ఏర్పడింది.

త్వరలో దేశీయ మార్కెట్లో విడుదలకానున్న హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారు రెండు పవర్‌ట్రెయిన్ ఆప్సన్స్ పొందుతుంది. ఇందులో మొదటిది సింగిల్-మోటార్ లేఅవుట్. ఇది 169 హెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది పూర్తి చార్జ్ పై దాదాపుగా 354 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

అయితే కంపెనీ యొక్క హై ట్రిమ్ డ్యూయల్-మోటార్, ఆల్-వీల్-డ్రైవ్ లేఅవుట్‌ను పొందుతుంది. కావున ఇది 325 హెచ్‌పి పవర్ మరియు 605 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారుని 220 కిలోవాట్ డిసి ఛార్జర్‌ని ఉపయోగించి కేవలం 18 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం చార్జ్ చేసుకోవచ్చు. ఇది కేవలం 5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

భారతీయ మార్కెట్ కోసం హ్యుందాయ్ కంపెనీ ఒక ప్రణాళికను రూపొందించుకుంది. దీని ప్రకారం కంపెనీ ఈ సంవత్సరంలోనే 'కోనా ఎలక్ట్రిక్ ఫేస్‌లిఫ్ట్' కూడా విడుదల చేసే అవకాశం ఉంది. కావున హ్యుందాయ్ యొక్క ఐయోనిక్ అనేది ఈ సంవత్సరం కంపెనీ లాంచ్ చేసే మొదటి మోడల్ కాదు.

అంతే కాకుండా, కంపెనీ నాల్గవ-తరం టక్సన్, క్రెటా ఫేస్‌లిఫ్ట్ మరియు వెన్యూ ఫేస్‌లిఫ్ట్ అనే మరో మూడు ఎలక్ట్రిక్ SUV లను కూడా ఈ సంవత్సరం లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీటికి సంబంధించిన అధికారిక సమాచారం త్వరలో తెలుస్తుంది.

ఇదిలా ఉండగా కంపెనీ విడుదల చేయనున్న కొత్త ఐయోనిక్5 లో మరియు భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా 2022లో హ్యుందాయ్ ఐయోనిక్ 6 ని మరియు 2023లో హ్యుందాయ్ ఐయోనిక్ 7ని ప్రపంచ మార్కెట్లలో విడుదల చేయనున్నట్లు హ్యుందాయ్ ఇంతకుముందు వెల్లడించింది. అయితే హ్యుందాయ్ ఐయోనిక్ 5 అనేది భారతీయ మార్కెట్లో విడుదలైన తరువాత కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ గా భారత్‌కు వచ్చే అవకాశం ఉంటుంది.

హ్యుందాయ్ ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ కారు ధరను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇది దాదాపు రూ. 35 లక్షల నుంచి రూ. 40 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉంటుందని ఆశిస్తున్నాము. ఐయానిక్ 5 విడుదలైతే ఇది కేవలం 100 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడి ఉండే అవకాశం ఉంటుంది. మార్కెట్లో ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు విడుదలైన తరువాత కియా ఈవి6 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

భారతీయ మార్కెట్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు రోజురోజుకి అమాంతం పెరిగిపోతున్న సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలను మంచి డిమాండ్ ఉంది. ఈ తరుణంలో హ్యుందాయ్ కంపెనీ ఈ లేటెస్ట్ కారుని విడుదల చేస్తే తప్పకుండా మంచి ఆదరణ పొందుతుంది అని ఆసితున్నాము. అయితే ఎలాంటి ఆదరణ పొందుతుంది అనే మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తుంది. అప్పటివరకు ఎప్పటికప్పుడు కొత్త కార్లు మరియు బైకుల గురించి మరింత సమాచారం తెలుసుకోవడం కోసం మా డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో అవ్వండి. మీకు నచ్చిన కారు లేదా బైక్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.


Click it and Unblock the Notifications








