వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డ్ దక్కించుకున్న హ్యుందాయ్ ఐయానిక్ 5; భారత్‌లో కూడా విడుదల!

పెరుగుతున్న ఇంధన ధరల సమస్య కేవలం భారతదేశంలోనే కాదు, అమెరికా వంటి అగ్రరాజ్యాల్లో కూడా ఉంది. ఈ నేపథ్యంలో, ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లు రాజ్యమేలుతున్నాయి. పెట్రోల్ కార్లతో పోల్చుకుంటే, వాటి ధర దాదాపు రెట్టింపుగా ఉన్నప్పటికీ, కస్టమర్లు మాత్రం ధీర్ఘ కాలంలో అవి అందించే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రిక్ కార్ల వైపు పరుగులు తీస్తున్నారు. దీంతో ఇప్పుడు ఎటు చూసినా ఎలక్ట్రిక్ కార్లే కనిపిస్తున్నాయి. రోడ్లపైనే కాదు అవార్డుల కార్యక్రమంలో కూడా వీటి హవానే కొనసాగుతోంది.

వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డ్ దక్కించుకున్న హ్యుందాయ్ ఐయానిక్ 5; భారత్‌లో కూడా విడుదల!

వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ - ఐయానిక్ 5

తాజాగా, ప్రకటించిన "వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ 2022 " (World Car Of The Year 2022) విజేతలలో కూడా ఎలక్ట్రిక్ కార్లదే పైచేయిగా నిలిచింది. ఈ జాబితాలో కొరియన్ కార్ బ్రాండ్ అందిస్తున్న హ్యుందాయ్ ఐయానిక్ 5 (Hyundai Ioniq 5) ఎలక్ట్రిక్ కారు ఈ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇటీవల 2022 న్యూయార్క్ ఆటో షోలో ప్రకటించిన WCOTY (వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్) అవార్డులలో 6 విభాగాల్లో మొత్తం 5 విభాగాలను ఎలక్ట్రిక్ వాహనాలే గెలుచుకున్నాయి. దీన్నిబట్టి చూస్తుంటే, భవిష్యత్ మొత్తం ఎలక్ట్రిక్ కార్లదే అని తెలుస్తోంది.

వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డ్ దక్కించుకున్న హ్యుందాయ్ ఐయానిక్ 5; భారత్‌లో కూడా విడుదల!

వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఆఫ్ ది ఇయర్ - ఐయానిక్ 5

ఈ 2022 ఎడిషన్ వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్‌లో హ్యుందాయ్ ఐయానిక్ 5 మూడు అవార్డులను గెలుచుకొని ఈ వేదికపై అతిపెద్ద విజేతగా నిలిచింది. ఈ 2022 సీజన్‌కు గాను హ్యుందాయ్ ఐయానిక్5 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో పాటుగా మరో రెండు విభాగాల్లో కూడా అవార్డులను దక్కించుకుంది. హ్యుందాయ్ ఐయానిక్ 5 ఈవీ దాని తోబుట్టువు అయిన కియా ఈవీ6 (Kia EV6) మరియు ఫోర్డ్ ముస్టాంగ్ మాక్ (Ford Mustang Mach E) మోడళ్లని ఓడించి వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ అవార్డును గెలుచుకుంది.

వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డ్ దక్కించుకున్న హ్యుందాయ్ ఐయానిక్ 5; భారత్‌లో కూడా విడుదల!

అంతేకాకుండా, ఈ కొరియన్ క్రాస్ఓవర్ ఈవీ ఈ సంవత్సరం అవార్డులలో కొత్త కేటగిరీగా ప్రవేశపెట్టబడిన వరల్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఆఫ్ ది ఇయర్ (World Electric Vehicle Of The Year) అవార్డును కూడా గెలుచుకుంది. ఈ అవార్డ్ రేసులో ఉన్న ఆడి ఇ-ట్రాన్ జిటి (Audi e-tron GT) మరియు మెర్సిడెస్ ఈక్యూఎస్ (Mercedes EQS) లను ఓడించి హ్యుందాయ్ ఐయానిక్ 5 ఈ అవార్డును పొందింది. ఈ కార్యక్రమంలో ఇది హ్యుందాయ్ ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ కారుకి లభించిన రెండవ అవార్డు.

వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డ్ దక్కించుకున్న హ్యుందాయ్ ఐయానిక్ 5; భారత్‌లో కూడా విడుదల!

వరల్డ్ కార్ డిజైన్ ఆఫ్ ది ఇయర్ - ఐయానిక్ 5

ఈ 2022 WCOTY అవార్డుల కార్యక్రమంలో హ్యుందాయ్ ఐయానిక్ 5 సాధించిన మూడవ మరియు చివరి విభాగపు అవార్డ్ "వరల్డ్ కార్ డిజైన్ ఆఫ్ ది ఇయర్" (World Car Design Of The Year). ఈ విభాగంలో పోటీ పడిన మెర్సిడెస్ ఈక్యూఎస్ మరియు కియా ఈవీ6 మోడళ్లను ఓడించి హ్యుందాయ్ ఐయానిక్ 5 వరల్డ్ కార్ డిజైన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును దక్కించుకుంది. ఇలా మూడు విభాగాలలో హ్యుందాయ్ ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ కారు విజయం దక్కించుకుని, పోడియంలో అగ్రస్థానంలో నిలిచింది.

వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డ్ దక్కించుకున్న హ్యుందాయ్ ఐయానిక్ 5; భారత్‌లో కూడా విడుదల!

భారతదేశంలో కూడా విడుదల కానున్న ఐయానిక్ 5

హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ కారును భారతదేశంలో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. కంపెనీ ఈ కారును తమ చెన్నై అసెంబ్లీ ప్లాంట్‌లో అసెంబుల్ చేసే అవకాశం ఉంది. ఫలితంగా, ఈ కారు ధర ఇంపోర్టెడ్ కియా ఈవీ6 ధర కన్నా తక్కువగా ఉంచబడుతుంది. ఓ నివేదిక ప్రకారం, హ్యుందాయ్ అయానిక్ 5 కారు ధర సుమారు రూ. 35 లక్షల మరియు 40 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్). ఉండొచ్చని అంచనా.

వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డ్ దక్కించుకున్న హ్యుందాయ్ ఐయానిక్ 5; భారత్‌లో కూడా విడుదల!

హ్యుందాయ్ అయానిక్ 5 ఈవీ స్పెసిఫికేషన్లను గమనిస్తే, ఇందులో ఎలక్ట్రిక్ మోటార్ వెనుక భాగంలో ఉంటుంది, కాబట్టి ఇదొక రియర్ వీల్ డ్రైవ్ ఎలక్ట్రిక్ కారుగా ఉంటుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 168bhp పవర్‌ను మరియు 350Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 354 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది. గ్లోబల్ మార్కెట్ల కోసం హ్యుందాయ్ అయానిక్ 5 కారులో 321bhp పవర్ మరియు 605Nm టార్క్ ను జనరేట్ చేసే ఓ శక్తివంతమైన వేరియంట్ కూడా ఇది ఇది పూర్తి చార్జ్ పై 412 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది. అయితే, ఈ వేరియంట్ భారత మార్కెట్లో విడుదల కాకపోవచ్చు.

వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డ్ దక్కించుకున్న హ్యుందాయ్ ఐయానిక్ 5; భారత్‌లో కూడా విడుదల!

హ్యుందాయ్ ఐయానిక్ 5 WCOTY 2022లో సాధించిన ట్రిపుల్ (మూడు అవార్డుల) విజయం గురించి , హ్యుందాయ్ మోటార్ కంపెనీ ప్రెసిడెంట్ మరియు సీఈఓ జైహూన్ చాంగ్ మాట్లాడుతూ, ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందుకోవడం తమకెంతో గౌరవంగా ఉందని, ఇది తమ వ్యక్తులు మరియు వ్యాపార భాగస్వాములందరి ప్రతిభను మరియు కృషిని గుర్తిస్తుందని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని అధునాతన ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన చెప్పారు.

Article Published On: Friday, April 15, 2022, 10:56 [IST]
English summary
Hyundai ioniq 5 ev won world car of the year 2022 award india launch expected soon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+