దేశీయ మార్కెట్లో 'హ్యుందాయ్ ఐయోనిక్ 5' ఆవిష్కరణ: డిజైన్, రేంజ్ మరియు బుకింగ్ డీటైల్స్

భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగం రోజు రోజుకి అభివృద్ధి వైపు వేగంగా సాగుతున్న సమయంలో 'హ్యుందాయ్' కంపెనీ మరో ఎలక్ట్రిక్ కారు 'ఐయోనిక్ 5' (Ioniq 5) ని దేశీయ మార్కెట్లో అరంగేట్రం చేసింది. ఇది 2023 జనవరిలో జరగనున్న ఆటో ఎక్స్‌పోలో అధికారికంగా విడుదలకానుంది.

హ్యుందాయ్ కంపెనీ దేశీయ మార్కెట్లో ఆవిష్కరించిన 'ఐయోనిక్ 5' యొక్క బుకింగ్స్ కూడా ప్రారంభించింది. కావున ఆసక్తికలిగిన కస్టమర్లు రూ. 1 లక్ష చెల్లించి బుక్ చేసుకోవచ్చు. అయితే కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు ధరలను వెల్లడించలేదు. కానీ దీని ధర రూ. 50 లక్షల కంటే తక్కువ వుండే అవకాశం ఉంటుంది. ధరలన్ని బట్టి చూస్తే ఇది ఇప్పటికే అమ్మకానికి ఉన్న 'కియా ఈవి6' కంటే తక్కువకే లభిస్తుందని తెలుస్తుంది.

దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఆవిష్కరణ

హ్యుందాయ్ ఐయోనిక్ 5 రెట్రో-ఫ్యూచరిస్టిక్ డిజైన్ కలిగి ఉంటుంది. ఇప్పటికే ఇది 2022 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో పాటు వరల్డ్ డిజైన్ ఆఫ్ ది ఇయర్ మరియు వరల్డ్ ఎలక్ట్రిక్ కార్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంది. ఈ లేటెస్ట్ వెహికల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌, ఇంటిగ్రేటెడ్ స్కిడ్ ప్లేట్‌లతో ఫ్రంట్ అండ్ రియర్ బంపర్‌లు మరియు 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

అంతే కాకుండా ఇందులో ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, షార్క్ ఫిన్ యాంటెన్నా, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ మరియు రేక్డ్ రియర్ విండ్‌షీల్డ్ వంటివి కూడా ఉన్నాయి. ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే, లోపల డార్క్ పెబుల్ గ్రే ఇంటీరియర్ థీమ్, స్లైడింగ్ సెంటర్ కన్సోల్, స్లైడింగ్ గ్లోవ్-బాక్స్, లెవెల్ 2 ADAS వంటి వాటితో పాటు రెండు 12.3 ఇంచెస్ స్క్రీన్‌లు (ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఇన్‌స్ట్రుమెంట్‌) ఉన్నాయి.

హ్యుందాయ్ ఐయోనిక్ 5 వెహికల్ టు లోడ్ టెక్నాలజీ, ఎనిమిది-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, బ్లూలింక్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, పవర్డ్ టెయిల్‌గేట్, హీటెడ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, మూవబుల్ సెంటర్ కన్సోల్‌ మరియు పవర్డ్ ఫ్రంట్ సీట్లు వంటి ఆధునిక ఫీచర్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

దేశీయ మార్కెట్లో విడుదల కానున్న హ్యుందాయ్ ఐయోనిక్ 5 కొలతల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. దీని పొడవు 4,635 మిమీ, వెడల్పు 1,890 మిమీ, ఎత్తు 1,625 మిమీ మరియు వీల్‌బేస్ 3,000 మిమీ వరకు ఉంటుంది. అదే సమయంలో ఈ ఎలక్ట్రిక్ కారు మాట్ గ్రావిటీ గోల్డ్, ఆప్టిక్ వైట్ మరియు మిడ్నైట్ బ్లాక్ పెర్ల్ అనే మూడు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులోకి రానుంది.

హ్యుందాయ్ కంపెనీ తన ఐయోనిక్ 5 యొక్క పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, ఇందులో 72.6kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 214 బిహెచ్‌పి మరియు 350 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో 631 కిమీ రేంజ్ అందిస్తుందని ARAI ద్వారా ధృవీకరించబడింది. అయితే ఇది వాస్తవ ప్రపంచంలో కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఇది 350kw DC ఛార్జర్‌ ద్వారా 18 నిముషాల్లో 10-80 శాతం ఛార్జ్ చేసుకోగలదు.

హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 360 డిగ్రీ కెమెరా, డిస్క్ బ్రేక్‌లు మరియు లేన్ ఫాలో అసిస్ట్, లేన్-కీప్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిషన్ వంటి ADAS ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త ఐయోనిక్ 5 గురించి ఎప్పటికప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, December 21, 2022, 11:51 [IST]
English summary
Hyundai ioniq 5 unveiled booking features and range details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+