హ్యుందాయ్ కార్లపై ఏప్రిల్ 2022 ఆఫర్లు.. ఏయే మోడల్‌పై ఎంత డిస్కౌంట్ అంటే..?
గడచిన మార్చ్ నెలలో కూడా హ్యుందాయ్ (Hyundai) అమ్మకాలకు బ్రేక్ పడటంతో, కంపెనీ ఈ ఏప్రిల్ నెలలో తమ ప్రోడక్ట్ లైనప్‌లో ఎంపిక చేసిన వాహనాలపై భారీ డిస్కౌంట్లను మరియు వివిధ రకాల ఆఫర్లను ప్రకటించింది. ఏప్రిల్ 2022 నెలలో కంపెనీ హ్యుందాయ్ శాంట్రో (Hyundai Santro), హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 Nios) మరియు హ్యుందాయ్ ఆరా (Hyundai Aura) మోడళ్లపై తగ్గింపులను అందించింది. ఈ ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు కార్పొరేట్ డిస్కౌంట్ వంటివి ఉన్నాయి.

భారత మార్కెట్లో హ్యుందాయ్ గత రెండు నెలలుగా నిరుత్సాహకర అమ్మకాలను నమోదు చేస్తూ వస్తోంది. గడచిన మార్చి 2022 నెలలో హ్యుందాయ్ భారత మార్కెట్లో మొత్తం 44,600 యూనిట్ల వాహనాలను విక్రయించింది. కాగా, అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (మార్చి 2021లో) కంపెనీ మొత్తం 52,600 వాహనాలను విక్రయించింది. ఈ సమయంలో హ్యుందాయ్ ఇండియా దేశీయ అమ్మకాలు 15.2 శాతం తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో, హ్యుందాయ్ ప్రస్తుత ఏప్రిల్ నెలలోనైనా సానుకూల అమ్మకాలను సాధించాలని చూస్తోంది. మరి ఏయే కారుపై ఎలాంటి డిస్కౌంట్స్ లభిస్తున్నాయో చూద్దాం రండి.

హ్యుందాయ్ శాంత్రో (Hyundai Santro)
హ్యుందాయ్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్, శాంత్రా కారుపై కంపెనీ ఈ నెలలో గరిష్టంగా రూ. 28,000 వరకు నగదు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ. 10,000 నగదు తగ్గింపు, రూ. 10,000 ఎక్స్చేంజ్ బోనస్ మరియు రూ. 3,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులోని సిఎన్‌జి వేరియంట్ పై కూడా కంపెనీ తగ్గింపును అందిస్తోంది. హ్యుందాయ్ శాంత్రో సిఎన్‌జి మోడల్‌పై కంపెనీ రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపును అందిస్తోంది.

ఇవే కాకుండా, శాంత్రో ఇతర వేరియంట్లపై కంపెనీ రూ. 15,000 నగదు తగ్గింపు, రూ. 10,000 ఎక్స్చేంజ్ తగ్గింపు మరియు రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపు కూడా అందిస్తోంది. హ్యుందాయ్ శాంత్రో హ్యాచ్‌బ్యాక్ ను కంపెనీ 1.1 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో విక్రయిస్తోంది. ఇది 68 బిహెచ్‌పి పవర్ ను మరియు 99 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. హ్యుందాయ్ శాంత్రో ఈ విభాగంలో మారుతి సుజుకి ఆల్టో మరియు రెనో క్విడ్ వంటి కార్లకు పోటీగా ఉంటుంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 Nios)
హ్యుందాయ్ నుండి లభిస్తున్న మరొక ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ గ్రాండ్ ఐ10 నియోస్ పై కంపెనీ ఈ ఏప్రిల్ 2022 నెలలో గరిష్టంగా రూ. 48,000 వరకు నగదు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో గ్రాండ్ ఐ10 నియోస్ యొక్క టర్బో వేరియంట్‌లపై రూ. 35,000 వరకు నగదు తగ్గింపు, రూ. 10,000 ఎక్స్చేంజ్ బోనస్ మరియు రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపులు కలిసి ఉన్నాయి.

ఇవే కాకుండా, కంపెనీ గ్రాండ్ ఐ10 నియోస్ యొక్క సిఎన్‌జి వేరియంట్లపై కూడా రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 3,000 కార్పొరేట్ డిస్కౌంట్ ను అందిస్తోంది. గ్రాండ్ i10 నియోస్ యొక్క ఇతర వేరియంట్ లపై రూ. 10,000 నగదు తగ్గింపు, రూ. 10,000 ఎక్స్చేంజ్ బోనస్ మరియు రూ. 3,000 కార్పొరేట్ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది.

హ్యుందాయ్ ఆరా (Hyundai Aura)
మారుతి సుజుకి డిజైర్, టాటా టిగోర్ వంటి కాంపాక్ట్ సెడాన్లకు పోటీగా హ్యుందాయ్ విక్రయిస్తున్న కాంపాక్ట్ సెడాన్ హ్యుందాయ్ ఆరాపై కంపెనీ ఈ నెలలో గరిష్టంగా రూ. 48,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. హ్యుందాయ్ ఆరా యొక్క టర్బో వేరియంట్‌లపై రూ. 35,000 వరకు నగదు తగ్గింపు, రూ. 10,000 ఎక్స్చేంజ్ బోనస్ మరియు రూ. 3,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తోంది.

ఇదే కాకుండా, హ్యుందాయ్ ఆరా యొక్క సిఎన్‌జి వేరియంట్లపై కూడా కంపెనీ రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 3,000 కార్పొరేట్ డిస్కౌంట్ ను అందిస్తోంది. ఇక ఇందులోని ఇతర వేరియంట్లపై రూ. 10,000 నగదు తగ్గింపు, రూ. 10,000 ఎక్స్చేంజ్ బోనస్ మరియు రూ. 3,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది.

ఈ ఆఫర్‌లు ప్రాంతాన్ని బట్టి మరియు డీలర్‌షిప్ ను బట్టి మారే అవకాశం ఉంటుందని గమనించింది. ఈ ఆఫర్‌లను హ్యుందాయ్ మోటార్ ఇండియా ఏప్రిల్ 1, 2022 నుండి ఏప్రిల్ 30, 2022 వరకు మాత్రమే అందిస్తోంది. ఈ ఆఫర్లకు సంబంధించిన మరింత అదనపు సమాచారం కోసం కస్టమర్లు తమకు సమీపంలోని అధీకృత హ్యుందాయ్ డీలర్‌షిప్‌ని సందర్శించవచ్చు.

హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ (Hyundai Creta Knight Edtion) వస్తోంది..
ఇదిలా ఉంటే, హ్యుందాయ్ మోటార్ ఇండియా నుండి దేశీయ విపణిలో అత్యధికంగా అమ్ముడవుతున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీ క్రెటాలో కంపెనీ ఓ స్పెషల్ ఎడిషన్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ పేరుతో కంపెనీ ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను ప్రవేశపెట్టనుంది. స్టాండర్డ్ క్రెటా మోడల్‌తో పోల్చుకుంటే, ఈ నైట్ ఎడిషన్ క్రెటా కొన్ని కాస్మెటిక్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్ లను కలిగి ఉంటుంది. ఈ కారుకి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








