రూ.5 లక్షలకే కొత్త మినీ ఎస్‌యూవీని విడుదల చేయనున్న హ్యుందాయ్! టాటా పంచ్‌కు గట్టి పోటీ తప్పదా!?

కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) తన ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో ఎస్‌యూవీ విభాగాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని చూస్తోంది. ఈ బ్రాండ్ నుండి ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న వెన్యూ, క్రెటా మరియు అల్కజార్ మోడళ్లకు మంచి డిమాండ్ ఉంది. ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో కూడా హ్యుందాయ్ తమ కొత్త తరం శాంటాఫే మోడల్ ను విడుదల చేయాలని చూస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన టాటా పంచ్ మినీ ఎస్‌యూవీకి పోటీగా హ్యుందాయ్ ఓ కొత్త మినీ ఎస్‌యూవీని తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

రూ.5 లక్షలకే కొత్త మినీ ఎస్‌యూవీని విడుదల చేయనున్న హ్యుందాయ్! టాటా పంచ్‌కు గట్టి పోటీ తప్పదా!?

హ్యుందాయ్ నుండి రాబోయే ఈ మినీ ఎస్‌యూవీ ధర సుమారు రూ.5 లక్షల రేంజ్ లో ఉండొచ్చని అంచనా. గతేడాది కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లలో ఆవిష్కరించిన క్యాస్పర్ మైక్రో ఎస్‌యూవీ కాన్సెప్ట్ ఆధారంగా హ్యుందాయ్ ఈ కారును తయారు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం, భారతదేశంలో కాంపాక్ట్ కార్లకు, మరీ ప్రత్యేకించి చిన్న ఎస్‌యూవీలకు చాలా బలమైన డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ ను క్యాష్ చేసుకునేందుకు హ్యుందాయ్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తోంది.

రూ.5 లక్షలకే కొత్త మినీ ఎస్‌యూవీని విడుదల చేయనున్న హ్యుందాయ్! టాటా పంచ్‌కు గట్టి పోటీ తప్పదా!?

హ్యుందాయ్ గత నెలలో మరోసారి భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీ బ్రాండ్‌గా నిలవడమే ఇందుకు నిదర్శనం. గడచిన సంవత్సరంలో హ్యుందాయ్ మొత్తం 2.52 లక్షలకు పైగా ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) లను విక్రయించింది. హ్యుందాయ్ అందిస్తున్న కొత్త తరం క్రెటా (Hyundai Creta) ఈ బ్రాండ్ లైనప్‌లో అత్యధికంగా అమ్ముడైన మోడల్ గా అగ్రస్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో, హ్యుందాయ్ ఎస్‌యూవీ విభాగంలో తన అగ్రస్థానాన్ని అలానే నిలబెట్టుకోవడానికి కొత్త ఎస్‌యూవీ మోడళ్లను విడుదల చేసే పనిలో ఉంది.

రూ.5 లక్షలకే కొత్త మినీ ఎస్‌యూవీని విడుదల చేయనున్న హ్యుందాయ్! టాటా పంచ్‌కు గట్టి పోటీ తప్పదా!?

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, హ్యుందాయ్ భారతదేశం కోసం తయారు చేయబోయే మినీ ఎస్‌యూవీని Ai3 అనే కోడ్‌నేమ్ తో అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. హ్యుందాయ్ ఈ ఎస్‌యూవీని అభివృద్ధి చేయడం మరియు విడుదల చేయడం కోసం కూడా కొన్ని నిధులను కూడా కేటాయించినట్లు తెలుస్తోంది. కొన్ని మీడియా నివేదికల ప్రకారం, ఈ కొత్త ఎస్‌యూవీ వచ్చే ఏడాది భారతదేశంలో విక్రయించబడుతుందని భావిస్తున్నారు.

రూ.5 లక్షలకే కొత్త మినీ ఎస్‌యూవీని విడుదల చేయనున్న హ్యుందాయ్! టాటా పంచ్‌కు గట్టి పోటీ తప్పదా!?

హ్యుందాయ్ ఇటీవల దక్షిణ కొరియాలో విడుదల చేసిన కాస్పర్ మైక్రో ఎస్‌యూవీ ఆధారంగా, ఈ మినీ ఎస్‌యూవీని కొన్ని మార్పులతో కొత్త పేరుతో భారతదేశంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీని తయారీ ఖర్చును అదుపులో ఉంచేందుకు కంపెనీ ప్రస్తుతం విక్రయిస్తున్న హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కారులో ఉపయోగించిన ఇంజన్ ఆప్షన్లనే ఈ కొత్త కారులో కూడా ఉపయోగించే అవకాశం ఉంది.

రూ.5 లక్షలకే కొత్త మినీ ఎస్‌యూవీని విడుదల చేయనున్న హ్యుందాయ్! టాటా పంచ్‌కు గట్టి పోటీ తప్పదా!?

ఈ మినీ ఎస్‌యూవీలో 1.2-లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని తెలుస్తోంది. ఈ ఇంజన్ గరిష్టంగా 83 పిఎస్ పవర్ ను మరియు 114 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అలాగే, ఇందులో మరింత శక్తివంతమైన వేరియంట్ కోరుకునే వారి కోసం కంపెనీ ఓ టర్బో ఇంజన్ ఆప్షన్ ను కూడా అందించవచ్చని సమాచారం.

రూ.5 లక్షలకే కొత్త మినీ ఎస్‌యూవీని విడుదల చేయనున్న హ్యుందాయ్! టాటా పంచ్‌కు గట్టి పోటీ తప్పదా!?

ఈ టర్బో వేరియంట్ లో 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఇంజన్ ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 100 పిఎస్ పవర్ ను మరియు 172 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ ఇంజన్‌లో ఏఎమ్‌టి గేర్‌బాక్స్ ఆప్షన్ ఉండకపోవచ్చు, అయితే ఆటోమేటిక్ కోరుకునే వారి కోసం కంపెనీ ఇందులో సివిటి గేర్‌బాక్స్ ను అందించే అవకాశం ఉంది.

రూ.5 లక్షలకే కొత్త మినీ ఎస్‌యూవీని విడుదల చేయనున్న హ్యుందాయ్! టాటా పంచ్‌కు గట్టి పోటీ తప్పదా!?

దక్షిణ కొరియాలో విడుదలకు సిద్ధమవుతున్న హ్యుందాయ్ క్యాస్పర్ మినీ ఎస్‌యూవీ విషయానికి వస్తే, కంపెనీ ఇందులో అనేక ఫీచర్లను జోడించింది. ఈ చిన్న కారులో 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పుష్ బటన్ స్టార్ట్, డ్రైవింగ్ మోడ్‌లు, వెంటిలేటెడ్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మరియు 7 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి మరెన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

రూ.5 లక్షలకే కొత్త మినీ ఎస్‌యూవీని విడుదల చేయనున్న హ్యుందాయ్! టాటా పంచ్‌కు గట్టి పోటీ తప్పదా!?

మరి భారతదేశంలో విడుదల కాబోయే మినీ ఎస్‌యూవీలో ఎలాంటి ఫీచర్లు లభిస్తాయో వేచి చూడాలి. భారత మార్కెట్లో విడుదల కాబోయే హ్యుందాయ్ మినీ ఎస్‌యూవీ ఈ విభాగంలో టాటా పంచ్‌, రెనో కైగర్, మహీంద్రా కెయూవీ100 మరియు మారుతి సుజుకి ఇగ్నిస్ వంటి మోడళ్లతో పోటీ పడే అవకాశం ఉంది.

రూ.5 లక్షలకే కొత్త మినీ ఎస్‌యూవీని విడుదల చేయనున్న హ్యుందాయ్! టాటా పంచ్‌కు గట్టి పోటీ తప్పదా!?

హ్యుందాయ్ బ్రాండ్ కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, గతేడాది హ్యుందాయ్ భారతదేశంలో 1.25 లక్షల యూనిట్లకు పైగా క్రెటా ఎస్‌యూవీలను విక్రయించింది. అలాగే, హ్యుందాయ్ వెన్యూ విషయానికి వస్తే, ఇది కూడా 2021 లో 1.08 లక్షల యూనిట్ల అమ్మకాలను సాంధించింది. దీంతో వెన్యూ మోడల్ హ్యుందాయ్ బ్రాండ్ నుండి అత్యధికంగా అమ్ముడైన రెండవ ఎస్‌యూవీ మోడల్ గా మారింది. హ్యుందాయ్ గడచిన సంవత్సరం మార్కెట్లో ప్రవేశపెట్టిన 7-సీటర్ ఎస్‌యూవీ హ్యుందాయ్ అల్కాజార్ (Hyundai Alcazar) కూడా అమ్మకాల్లో ముందంజలో ఉంది. గత 2021లో మొత్తం 17,700 యూనిట్లకు పైగా హ్యుందాయ్ అల్కజార్ అమ్మకాలు నమోదయ్యాయి.

Most Read Articles

English summary
Hyundai motor india plans to launch new mini suv to rival tata punch details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X