హ్యుందాయ్ ఎస్‌యూవీలకు పెరుగుతున్న క్రేజ్.. జనవరిలోనూ కనిపించిన ఎస్‌యూవీ ట్రెండ్..

సెమీకండక్టర్ చిప్ కొరత నుండి ఆటోమొబైల్ కంపెనీలు ఇప్పుడిప్పుడే క్రమంగా తేరుకుంటున్న నేపథ్యంలో, గత నెలలో హ్యుందాయ్ ప్రోత్సాహకర ఫలితాలను నమోదు చేసింది. గత నెలలో కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ మోటార్ ఇండియా, మొత్తం 44,022 కార్లను విక్రయించినట్లు ప్రకటించింది. అయితే, గతేడాది జనవరి 2021 నెలలో విక్రయించిన 52,005 కార్లతో పోలిస్తే, గత నెలలో అమ్మకాలు 15.35 శాతం క్షీణించాయి. అయితే, రానున్న నెలల్లో అమ్మకాలు మెరుగ్గా ఉంటాయని కంపెనీ భావిస్తోంది.

హ్యుందాయ్ ఎస్‌యూవీలకు పెరుగుతున్న క్రేజ్.. జనవరిలోనూ కనిపించిన ఎస్‌యూవీ ట్రెండ్..

గడచిన డిసెంబర్ 2021 నెలతో పోలిస్తే, ఈ కొత్త సంవత్సరంలో హ్యుందాయ్ కార్ల అమ్మకాలు మెరుగ్గా ఉన్నాయి. డిసెంబర్ 2021లో కంపెనీ మొత్తం విక్రయాలు 32,312 యూనిట్లుగా ఉంటే, జనవరి 2022లో 44,022 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో అమ్మకాలు 36.24 శాతం వృద్ధిని సాధించాయి. గత నెలలో టాప్ సేల్స్ చార్ట్‌లో హ్యుందాయ్ క్రెటా, వెన్యూ, గ్రాండ్ ఐ10 నియోస్, ఐ20, శాంట్రో, వెర్నా మరియు హ్యుందాయ్ అల్కాజార్ మోడళ్లు ఉన్నాయి.

హ్యుందాయ్ ఎస్‌యూవీలకు పెరుగుతున్న క్రేజ్.. జనవరిలోనూ కనిపించిన ఎస్‌యూవీ ట్రెండ్..

వాస్తవానికి, డిసెంబర్‌ నెలలో అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి, స్టాక్ క్లియరెన్స్ కోసం కార్ కంపెనీలు డిసెంబర్ నెలలో తమ కార్లపై భారీ డిస్కౌంట్లు మరియు వివిధ రకాల ఆఫర్లను అందిస్తుంటాయి. అయినప్పటికీ, హ్యుందాయ్ కార్ల అమ్మకాలు మాత్రం డిసెంబర్ 2021 నెలలో భారీగా క్షీణించాయి. దీంతో డిసెంబర్ నెలలో హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ విక్రయాల పరంగా మూడవ స్థానంలోకి పడిపోయింది. రెండవ స్థానాన్ని టాటా మోటార్స్ దక్కించుకుంది.

హ్యుందాయ్ ఎస్‌యూవీలకు పెరుగుతున్న క్రేజ్.. జనవరిలోనూ కనిపించిన ఎస్‌యూవీ ట్రెండ్..

అయితే, జనవరి 2022 నెలలో, హ్యుందాయ్ మోటార్ ఇండియా అంతకు ముందు నెలలో టాటా మోటార్స్ స్వాధీనం చేసుకున్న నంబర్ 2 స్థానాన్ని తిరిగి పొందింది. జనవరి 2022 లో, టాటా మోటార్స్ దాదాపు 41 వేల యూనిట్ల ప్యాసింజర్ కార్ల విక్రయాలను నమోదు చేసింది. కానీ డిసెంబర్ 2021 తర్వాత, జనవరి 2022లో కంపెనీ తన నంబర్ 2 స్థానాన్ని కొనసాగించలేకపోయింది. హ్యుందాయ్ ఇండియా 2021లో స్థిరమైన మొదటి త్రైమాసికాన్ని (క్వార్టర్ 1)ని కలిగి ఉంది.

హ్యుందాయ్ ఎస్‌యూవీలకు పెరుగుతున్న క్రేజ్.. జనవరిలోనూ కనిపించిన ఎస్‌యూవీ ట్రెండ్..

అంతకు ముందు సంవత్సరం హ్యుందాయ్ దేశీయ విక్రయాలు ప్రతి నెలా 50,000 యూనిట్ల మార్కును దాటాయి. అయితే, సెప్టెంబర్ 2021 నుండి కంపెనీ నెలవారీ విక్రయాలు 40 వేల మార్కుకు పడిపోయాయి. ఈ గణాంకాలను పోల్చి చూస్తే, జనవరి 2020 సేల్స్‌లో కంపెనీ కొంత ప్రోత్సాహకర వృద్ధిని కనబరిచినట్లుగా తెలుస్తోంది. జనవరి 2022లో హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ అమ్మకాలు తగ్గుముఖం పట్టినప్పటికీ, కంపెనీ ఎగుమతులు మాత్రం 8.1 శాతం వృద్ధిని నమోదు చేసి 9,405 యూనిట్లకు పెరిగాయి.

హ్యుందాయ్ ఎస్‌యూవీలకు పెరుగుతున్న క్రేజ్.. జనవరిలోనూ కనిపించిన ఎస్‌యూవీ ట్రెండ్..

జనవరి 2022లో కంపెనీ మొత్తం విక్రయాలను పరిశీలిస్తే, హ్యుందాయ్ గత నెలలో 53,427 యూనిట్లను (దేశీయ విక్రయాలు మరియు ఎగుమతులు కలిపి) విక్రయించింది. ఎగుమతులు పెరిగినప్పటికీ, దేశీయ అమ్మకాలు బాగా క్షీణించడంతో మొత్తం అమ్మకాలు క్షీణించాయి. గత నెలలో మొత్తం అమ్మకాలను పరిశీలిస్తే, జనవరి 2022లో, హ్యుందాయ్ 60,105 యూనిట్లను విక్రయించింది మరియు ఈ సంవత్సరం మొత్తం విక్రయాలలో 11.11 శాతం క్షీణతను నమోదు చేసింది.

హ్యుందాయ్ ఎస్‌యూవీలకు పెరుగుతున్న క్రేజ్.. జనవరిలోనూ కనిపించిన ఎస్‌యూవీ ట్రెండ్..

హ్యుందాయ్ దేశీయ విపణిలో అమ్మకాల పరంగా ఇటీవలి కాలంలో అత్యుత్తమంగా లేకపోయినప్పటికీ, ఎగుమతి పరంగా బాగా వృద్ధి చెందింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా 2021 నాటికి 32,799 యూనిట్ల హ్యుందాయ్ క్రెటా యూనిట్లను ఎగుమతి చేసింది మరియు 2020లో 25,995 యూనిట్లను మాత్రమే ఎగుమతి చేసి, ఈ సమయంలో 26.17 శాతం వృద్ధిని సాధించింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా మొత్తం SUV ఎగుమతులు 42,238 యూనిట్లుగా ఉన్నాయి.

హ్యుందాయ్ ఎస్‌యూవీలకు పెరుగుతున్న క్రేజ్.. జనవరిలోనూ కనిపించిన ఎస్‌యూవీ ట్రెండ్..

భారతదేశం నుండి హ్యుందాయ్ వెన్యూ 7,698 యూనిట్లు మరియు హ్యుందాయ్ క్రెటా గ్రాండ్ 1,741 యూనిట్లు ఎగుమతి చేయబడ్డాయి. ఎంపిక చేసిన ఎగుమతి మార్కెట్లలో హ్యుందాయ్ అల్కాజర్‌ను కంపెనీ క్రెటా గ్రాండ్ పేరుతో విక్రయిస్తోంది. ఈ సందర్బంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ ఉన్ సూ కిమ్ మాట్లాడుతూ.. "ఆత్మనిర్భర్ భారత్" యొక్క ప్రభుత్వ విజన్‌కు అనుగుణంగా, హ్యుందాయ్ మోటార్ ప్రపంచానికి 'మేక్-ఇన్-ఇండియా'కు కట్టుబడి ఉందని మరియు దేశంలో ఎస్‌యూవీ నాయకత్వం యొక్క వారసత్వాన్ని కొనసాగిస్తోందని చెప్పారు.

హ్యుందాయ్ ఎస్‌యూవీలకు పెరుగుతున్న క్రేజ్.. జనవరిలోనూ కనిపించిన ఎస్‌యూవీ ట్రెండ్..

టాటా పంచ్ కి పోటీగా హ్యుందాయ్ చిన్న ఎస్‌యూవీ..

ఇదిలా ఉంటే, చిన్న ఎస్‌యూవీ మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ ను క్యాష్ చేసుకునేందుకు హ్యుందాయ్ మోటార్ ఇండియా ఓ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఇక్కడి మార్కెట్లో విడుదల చేయాలని చూస్తోంది. ఇది ఈ విభాగంలా టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీకి పోటీగా మరియు ప్రస్తుత హ్యుందాయ్ వెన్యూకి దిగువన ప్రవేశపెట్టబడుతుందని సమాచారం. హ్యుందాయ్ ఇప్పటికే గ్లోబల్ మార్కెట్ల కోసం (Hyundai Casper) పేరుతో ఓ చిన్న ఎస్‌యూవీని ఆవిష్కరించింది. దీని ఆధారంగా భారత్ కోసం కంపెనీ ఓ చిన్న ఎస్‌యూవీని విడుదల చేసే అవకాశం ఉంది. ఈ మినీ ఎస్‌యూవీ ధర సుమారు రూ.5 లక్షల రేంజ్ లో ఉండొచ్చని అంచనా. లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, February 2, 2022, 16:45 [IST]
English summary
Hyundai motor india sold 44022 cars in january registers 15 percent decline details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+