హ్యుందాయ్ నుండి రానున్న రెండు అత్యంత వేగవంతమైన N కాన్సెప్ట్ కార్లు.. జులై 15న ఆవిష్కరణ!

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ (Hyundai) జులై 15వ తేదీన రెండు కొత్త కాన్సెప్ట్ కార్లను ఆవిష్కరించనుంది. ఈ మేరకు హ్యుందాన్ ఎన్ కాన్సెప్ట్ (Hyundai N Concept) పేరుతో కంపెనీ ఓ టీజర్ ను కూడా విడుదల చేసింది. హ్యుందాయ్ బ్రాండ్ యొక్క పెర్ఫార్మెన్స్ విభాగమైన ఎన్ డివిజన్ (N Division) ఈ కార్లను ప్రత్యేకంగా మరియు శక్తివంతంగా డిజైన్ చేసింది. ఈ రెండు కార్లలో ఒకటి హ్యుందాయ్ అందిస్తున్న ఎలక్ట్రిక్ కారు అయానిక్ 5 (Ioniq 5) యొక్క వేగవంతమైన వెర్షన్ గా తెలుస్తోంది.

హ్యుందాయ్ నుండి రానున్న రెండు అత్యంత వేగవంతమైన N కాన్సెప్ట్ కార్లు.. జులై 15న ఆవిష్కరణ!

హ్యుందాయ్ ఈ రెండు ఎన్ కాన్సెప్ట్ వాహనాలను జులై 15వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించనుంది, దీంతో కంపెనీ ఆ రోజును "ఎన్ డే" (N Day) గా పిలుస్తోంది. హ్యుందాయ్ విడుదల చేసిన ఈ టీజర్ చిత్రాన్ని నిశితంగా గమనిస్తే, కొత్త ఎన్ కాన్సెప్ట్ కారును ఓ నల్లటి సిల్క్ వస్త్రంతో కవర్ చేయబడి కనిపిస్తుంది. మొదటి చూపులో ఇది ఓ ఫార్ములా వన్ కారు మాదిరిగా కనిపిస్తుంద్. దీని వెనుక భాగంలో ఉండే వింగ్ భాగాన్ని గమనిస్తే, ఇది ఓ పొడవైన కూప్ బాడీ స్టైల్ స్పోర్ట్స్ కారుగా తెలుస్తుంది.

హ్యుందాయ్ నుండి రానున్న రెండు అత్యంత వేగవంతమైన N కాన్సెప్ట్ కార్లు.. జులై 15న ఆవిష్కరణ!

హ్యుందాయ్ క్లెయిమ్ చేస్తున్న మిస్టీరియస్ కాన్సెప్ట్ కారు గురించి ప్రస్తుతానికి ఎలాంటి వివరాలు అందుబాటులో లేవు. అయితే, ఇది ఐయానిక్ 5 యొక్క ఫాస్టెస్ట్ వెర్షన్ అయి ఉండొచ్చనే పుకార్లు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. హ్యుందాయ్ విడుదల చేసిన మరొక టీజర్ ఫొటోలో రేస్‌ ట్రాక్ పై వేగంగా పరుగులు తీస్తున్న ఓ బ్లూ కలర్ కారు కనిపిస్తుంది. ఈ కొత్త కారు హ్యుందాయ్ ఐయానిక్ 5 ఎలక్ట్రిక్ క్రాస్‌ఓవర్ యొక్క గో-ఫాస్టర్ ఎన్ వెర్షన్‌గా ఉంటుందని భావిస్తున్నారు.

హ్యుందాయ్ నుండి రానున్న రెండు అత్యంత వేగవంతమైన N కాన్సెప్ట్ కార్లు.. జులై 15న ఆవిష్కరణ!

ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన న్యూయార్క్ ఆటో షోలో హ్యుందాయ్ ఐయానిక్ 5 వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డును గెలుచుకొని, అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. హ్యుందాయ్ బ్రాండ్ యొక్క గేమ్ ఛేంజింగ్ ఈవీ రాబోతున్న ఈ గో ఫాస్టర్ వెర్షన్ గురించి ప్రస్తుతానికి పెద్దగా తెలియనప్పటికీ, ఈ కారు జూలై 15వ తేదీన వచ్చినప్పుడు ఇది Ioniq 5 N బ్యాడ్జ్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ కొత్త హ్యుందాయ్ ఐయానిక్ 5 ఎన్ ఎడిషన్ పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ కారు 2023లో భారత రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది.

హ్యుందాయ్ నుండి రానున్న రెండు అత్యంత వేగవంతమైన N కాన్సెప్ట్ కార్లు.. జులై 15న ఆవిష్కరణ!

హ్యుందాయ్ నుండి రాబోయే ఐయానిక్ 5 ఎన్ గురించి ఎటువంటి వివరాలను కంపెనీ వెల్లడించనప్పటికీ, ఈ వేగవంతమైన ఎలక్ట్రిక్ కారులో, దాని తోబుట్టువైన కియా ఈవీ6 జిటి (Kia EV6 GT) మోడల్ నుండి గ్రహించిన డ్యూయల్ మోటారు సెటప్‌ ను ఉపయోగించవచ్చని భావిస్తున్నారు. కియా ఈవీ6 లైనప్ లో అత్యంత వేగవంతమైన ఈ జిటి మోడల్ ను కంపెనీ 2022 ప్రారంభంలో ఆవిష్కరించింది.

హ్యుందాయ్ నుండి రానున్న రెండు అత్యంత వేగవంతమైన N కాన్సెప్ట్ కార్లు.. జులై 15న ఆవిష్కరణ!

కియా ఈవీ6 జిటి మోడల్ లో ప్రతి యాక్సిల్‌పై ఒక్కొక్క మోటారు అమర్చబడి ఉంటుంది. ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్లు కలిసి మొత్తంగా 577 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 740 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తాయి. ఈ హై-పెర్ఫార్మెన్స్ సెటప్ కారణంగా కియా ఈవీ6 జిటి కేవలం 3.5 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ క్రాసోవర్ గరిష్ట వేగం గంటకు 261 కిలోమీటర్లుగా ఉంటుంది.

హ్యుందాయ్ నుండి రానున్న రెండు అత్యంత వేగవంతమైన N కాన్సెప్ట్ కార్లు.. జులై 15న ఆవిష్కరణ!

హ్యుందాయ్ ఐయానిక్ 5 ఎన్ కాన్సెప్ట్ కూడా ఇదే పవర్‌ట్రైన్ ను కలిగి ఉంటుందన్న వార్తల నేపథ్యంలో, ఈ కొత్త హై-పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ కారు కూడా కియా ఈవీ6 జిటి మాదిరిగానే అదే విధమైన పెర్ఫార్మెన్స్ గణాంకాలను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ రెండు కార్లకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాలంటే జులై 15 వరకూ ఆగాల్సిందే. అప్పటి వరకూ తెలుగు డ్రైవ్‌స్పార్క్ ను గమనిస్తూ ఉండండి.

హ్యుందాయ్ నుండి రానున్న రెండు అత్యంత వేగవంతమైన N కాన్సెప్ట్ కార్లు.. జులై 15న ఆవిష్కరణ!

భారత మార్కెట్లో జులై 13న కొత్త 2022 హ్యుందాయ్ టూసాన్ విడుదల

ఇదిలా ఉంటే, హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఈ నెల 13వ తేదీన భారత మార్కెట్లో తమ కొత్త తరం హ్యుందాయ్ టూసాన్ (2022 Hyundai Tucson) ప్రీమియం ఎస్‌యూవీని విడుదల చేసేందుకు సిద్ధమైంది. మునుపటి తరం టూసాన్ తో పోల్చుకుంటే ఈ కొత్త 2022 హ్యుందాయ్ టూసాన్ డిజైన్, ఫీచర్లు, టెక్నాలజీ మరియు సేఫ్టీ విషయాలలో అనేక రెట్లు మెరుగ్గా ఉంటుంది. వాస్తవానికి, ఈ కొత్త తరం హ్యుందాయ్ టూసాన్ ఎస్‌యూవీ కోసం ఇటీవల నిర్వహించిన గ్లోబల్ క్రాష్ టెస్టులో ఇది 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ను దక్కించుకుంది. దానికి ముందు తరం మోడల్ జీరో స్టార్ రేటింగ్‌ను కలిగి ఉండేది.

హ్యుందాయ్ నుండి రానున్న రెండు అత్యంత వేగవంతమైన N కాన్సెప్ట్ కార్లు.. జులై 15న ఆవిష్కరణ!

పాత తరం హ్యుందాయ్ టూసాన్ తో పోలిస్తే ఈ కొత్త 2022 హ్యుందాయ్ టూసాన్ ఎస్‌యూవీ పూర్తిగా రీడిజైన్ చేయబడింది. ఇది హ్యుందాయ్ బ్రాండ్ యొక్క లేటెస్ట్ డిజైన్ ఫిలాసఫీ 'సెన్సుయస్ స్పోర్టినెస్‌' ఆధారంగా డిజైన్ చేయబడింది. ఈ కారులో ముందు వైపు కొత్త 3డి క్యాస్కేడింగ్ ఫ్రంట్ గ్రిల్‌, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన హెడ్‌ల్యాంప్ సెటప్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌‌తో కూడిన ఫ్రంట్ బంపర్, సైడ్స్ లో షార్ప్ బాడీ లైన్స్ మరియు రాక్డ్ విండో లైన్ తో ఇది మంచి స్పోర్టీ లుక్ ని కలిగి ఉంటుంది. - ఈ ఎస్‌యూవీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Article Published On: Thursday, July 7, 2022, 16:30 [IST]
English summary
Hyundai n concept car teased ahead of global debut on 15th july 2022 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+