హ్యుందాయ్ క్రెటాలో ఎన్-లైన్ వేరియంట్.. టీజర్ ఆవిష్కరణ.. ఇది భారత్‌లో విడుదలయ్యేనా?

కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ (Hyundai) విక్రయిస్తున్న పాపులర్ ఎస్‌యూవీ క్రెటా (Creta) లో కంపెనీ మరో కొత్త పెర్ఫార్మెన్స్ వేరియంట్ ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. గతంలో తమ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ హ్యుందాయ్ ఐ20 లో విడుదల చేసిన ఎన్-లైన్ వేరియంట్ మాదిరిగానే, కంపెనీ తమ క్రెటా ఎస్‌యూవీలో కూడా ఓ ఎన్-లైన్ (N-Line) వేరియంట్‌ను అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు కంపెనీ కొన్ని టీజర్ చిత్రాలను కూడా విడుదల చేసింది.

హ్యుందాయ్ క్రెటాలో ఎన్-లైన్ వేరియంట్.. టీజర్ ఆవిష్కరణ.. ఇది భారత్‌లో విడుదలయ్యేనా?

హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ (Hyundai Creta N-Line) యొక్క టీజర్ చిత్రాలను హ్యుందాయ్ బ్రెజిల్ వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేసింది. అయితే, ఈ హ్యుందాయ్ క్రెటా ఎన్-లైన్‌ను భారతదేశంలో లాంచ్ అవుతుందా లేదా అనే విషయం ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. భారత మార్కెట్లో హ్యుందాయ్ క్రెటాకు ఇప్పటికే మంచి డిమాండ్ ఉంది. కంపెనీ ఇందులో స్టాండర్డ్ మోడళ్లతో పాటు పలు స్పెషల్ ఎడిషన్ మోడళ్లను కూడా విక్రయిస్తోంది. కాబట్టి, ఈ ఎన్-లైన్ క్రెటా ఇక్కడి మార్కెట్లో విడుదలైతే, ఇది ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంది.

హ్యుందాయ్ క్రెటాలో ఎన్-లైన్ వేరియంట్.. టీజర్ ఆవిష్కరణ.. ఇది భారత్‌లో విడుదలయ్యేనా?

అంతర్జాతీయ మార్కెట్లలో హ్యుందాయ్ తమ i10, i20, i30, Elantra, Kona మరియు Tucson వంటి కార్లలో ఎన్-లైన్ వేరియంట్‌లను అందిస్తోంది. అయితే, భారతదేశంలో, కేవలం హ్యుందాయ్ ఐ20 మోడల్ లో మాత్రమే ఎన్-లైన్ వేరియంట్ అందుబాటులో ఉంది. తాజా, సమాచారం ప్రకారం, హ్యుందాయ్ ఇండియా త్వరలోనే తమ ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీ వెన్యూలో కూడా ఎన్-లైన్ వేరియంట్ ను విడుదల చేయవచ్చని తెలుస్తోంది. బహుశా, హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ మార్కెట్లోకి వచ్చాక ఇందులో ఎన్-లైన్ వేరియంట్ వచ్చే అవకాశం ఉంది.

హ్యుందాయ్ క్రెటాలో ఎన్-లైన్ వేరియంట్.. టీజర్ ఆవిష్కరణ.. ఇది భారత్‌లో విడుదలయ్యేనా?

ప్రస్తుతం, గ్లోబల్ మార్కెట్ల కోసం రాబోయే హ్యుందాయ్ క్రెటా ఎన్-లైన్‌ విషయానికి వస్తే, ఇది హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ హ్యాచ్‌బ్యాక్ మాదిరిగానే ప్రత్యేకమైన కాస్మెటిక్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్ లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ మార్పులలో N లైన్ బ్యాడ్జ్‌తో కూడిన స్పోర్టియర్ ఫ్రంట్ గ్రిల్, ఎక్స్‌టీరియర్‌లో కాంట్రాస్ట్ రెడ్ ట్రీట్‌మెంట్ వంటి మరికొన్ని స్పోర్టీ డిజైన్ అంశాలు ఉండనున్నాయి.

హ్యుందాయ్ క్రెటాలో ఎన్-లైన్ వేరియంట్.. టీజర్ ఆవిష్కరణ.. ఇది భారత్‌లో విడుదలయ్యేనా?

హ్యుందాయ్ క్రెటా ఎన్-లైన్ ఇంటీరియర్స్ లో వివిధ భాగాలలో ఎన్-లైన్ లోగో మరియు కొత్త ఎన్-లైన్ స్టీరింగ్ వీల్‌తో కూడిన ఆల్-బ్లాక్ ఇంటీరియర్‌ థీమ్ కలిగి ఉండే అవకాశం ఉంది. హ్యుందాయ్ క్రెటా యొక్క సౌత్ అమెరికన్ వెర్షన్ 156.90 బిహెచ్‌పి పవర్ మరియు 191 ఎన్ఎమ్ టార్క్‌ తో కూడిన 2.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో అందించబడుతుంది. ఈ 2.0-లీటర్ యూనిట్ భారతదేశంలో విక్రయించబడుతున్న హ్యుందాయ్ అల్కాజార్ 7-సీటర్ ఎస్‌యూవీలో ఉపయోగించబడుతోంది.

హ్యుందాయ్ క్రెటాలో ఎన్-లైన్ వేరియంట్.. టీజర్ ఆవిష్కరణ.. ఇది భారత్‌లో విడుదలయ్యేనా?

భారత మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా మూడు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. ఇందులో అత్యంత ప్రజాదరణ పొందినది 1.5-లీటర్ డీజిల్ ఇంజన్. ఈ ఇంజన్ 114 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. కాగా, పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో మొదటిది 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. ఇది గరిష్టంగా 113 బిహెచ్‌పి పవర్ మరియు 144Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కూడా మాన్యువల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

హ్యుందాయ్ క్రెటాలో ఎన్-లైన్ వేరియంట్.. టీజర్ ఆవిష్కరణ.. ఇది భారత్‌లో విడుదలయ్యేనా?

ఇకపోతే, ఈ మోడల్ మరింత శక్తివంతమైన టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కోరుకునే వారి కోసం కంపెనీ ఇందులో 1.4-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ ను అందిస్తోంది. ఈ ఇంజన్ గరిష్టంగా 138 బిహెచ్‌పి మరియు 242 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ క్విక్-షిఫ్టింగ్ 7-స్పీడ్ డిసిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడిం ఉంటుంది. హ్యుందాయ్ క్రెటా విషయానికి వస్తే, ఇధి భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న మిడ్-సైజ్ ఎస్‌యూవీగా ఉంది.

హ్యుందాయ్ క్రెటాలో ఎన్-లైన్ వేరియంట్.. టీజర్ ఆవిష్కరణ.. ఇది భారత్‌లో విడుదలయ్యేనా?

హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ (Creta Knight Edition) విడుదల

ఇదిలా ఉంటే, కంపెనీ ఇందులో ఇటీవలే హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ (Hyundai Creta Knight Edition) పేరిట ఓ స్పెషల్ ఎడిషన్ మోడల్ ను మార్కెట్లో విడుదల చేసింది. స్టాండర్డ్ మోడల్‌తో పోల్చుకుంటే, ఈ కొత్ స్పెషల్ ఎడిషన్ మోడల్ పలు కాస్మెటిక్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్ లను కలిగి ఉంటుంది. క్రెటా నైట్ ఎడిషన్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. మార్కెట్లో క్రెటా నైట్ ఎడిషన్ ధరలు రూ.13.51 లక్షల నుండి రూ.18.18 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

హ్యుందాయ్ క్రెటాలో ఎన్-లైన్ వేరియంట్.. టీజర్ ఆవిష్కరణ.. ఇది భారత్‌లో విడుదలయ్యేనా?

హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లలో బ్లాక్ కలర్ థీమ్‌లో ఉంటుంది. ఈ నైట్ ఎడిషన్ క్రెటాలో లభించే ఎక్స్టీరియర్లలో ఫ్రంట్ రేడియేటర్ గ్రిల్ పై బ్లాక్ గ్లోస్ మరియు రెడ్ కలర్ ఇన్సర్ట్‌లు, బ్లాక్ గ్లోస్ ఎక్స్టీరియర్ స్టైలింగ్ ఎలిమెంట్స్‌లో భాగంగా, ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ ప్లేట్లు, లైట్నింగ్ ఆర్చ్ సి-పిల్లర్ గార్నిష్, సైడ్ సిల్ గార్నిష్, రూఫ్ రెయిల్స్, సైడ్ మిర్రర్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా, టెయిల్ లాంప్ ఇన్సర్ట్‌లు అన్నీ కూడా బ్లాక్ కలర్ లో ఫినిష్ చేయబడి ఉంటాయి. - ఈ స్పెషల్ ఎడిషన్ కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Hyundai to launch creta n line variant soon teaser out
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X