మీకు తెలుసా.. '2022 హ్యుందాయ్ టుసాన్' వెయిటింగ్ పీరియడ్ ఎంతో?

'2022 హ్యుందాయ్ టుసాన్' (2022 Hyundai Tucson) ఇటీవల ఆధునిక హంగులతో, కొత్త ఫీచర్స్ తో అధికారికంగా భారతీయ మార్కెట్లో విడుదలైంది. ఈ SUV మార్కెట్లో విడుదలకాకముందే దాదాపు 3,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది. అయితే ఇప్పుడు డెలివరీ టైమ్ లైన్ ఏమిటి, బుక్ చేసుకున్న కస్టమర్లు ఎన్ని రోజులు వేచి ఉండాలి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

మీకు తెలుసా.. '2022 హ్యుందాయ్ టుసాన్' వెయిటింగ్ పీరియడ్ ఎంతో?

భారతీయ మార్కెట్లో విడుదలైన '2022 టుసాన్' ప్రారంభ ధర రూ. 27.70 లక్షలు కాగా, టాప్ వేరియంట్ హర రూ. 34.39 లక్షల వరకు ఉంది. ధరలను బట్టి చూస్తే మార్కెట్లో ప్రస్తుతం ఉన్న ఖరీదైన కార్లలో కొత్త టుసాన్ కూడా ఉంది. అయితే బుకింగ్స్ మాత్రం భారీగానే ఉన్నాయి.

మీకు తెలుసా.. '2022 హ్యుందాయ్ టుసాన్' వెయిటింగ్ పీరియడ్ ఎంతో?

కొత్త హ్యుందాయ్ టుసాన్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కంపెనీ యొక్క అదికారిక వెబ్‌సైట్ లో లేదా కంపెనీ డీలర్‌షిప్ లో రూ. 50,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు బుక్ చేసుకున్న కస్టమర్లు డెలివరీ కోసం దాదాపు 8 నుంచి 10 నెలలు వేచి ఉండాల్సిన అవసరం ఉంది.

మీకు తెలుసా.. '2022 హ్యుందాయ్ టుసాన్' వెయిటింగ్ పీరియడ్ ఎంతో?

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం నెలకు కనీసం 400 యూనిట్ల కార్లను డెలివరీ చేయాలనీ, ఏ సమయంలో సంవత్సరానికి 5,000 యూనిట్లను డెలివరీ చేయడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ ఈ SUV కి మంచి సంఖ్యలో బుకింగ్స్ పొందుతున్నట్లు అర్థమవుతోంది.

మీకు తెలుసా.. '2022 హ్యుందాయ్ టుసాన్' వెయిటింగ్ పీరియడ్ ఎంతో?

దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న 2022 టూసాన్ ఆధునిక డిజైన్ పొందుతుంది. ఇందులో ఎల్ఈడీ డిఆర్ఎల్ దాని కింద ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ క్లస్టర్ ఉంది. అదే సమయంలో ఇది పెద్ద ఎయిర్ డ్యామ్ మరియు ముందు భాగంలో స్కిడ్ ప్లేట్‌ వంటి వాటిని కలిగి ఉంది. సైడ్ ప్రొఫైల్ 'Z' షేప్ డిజైన్, 18-ఇంచెస్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌ కూడా ఉన్నాయి. రియర్ ప్రొఫైల్ లో డ్యూయల్ T-షేప్ ఎల్ఈడీ టెయిల్-లైట్స్ ఉన్నాయి, ఇవి ఎల్ఈడీ లైట్ బార్ ద్వారా కనెక్ట్ చేయబడ్డాయి.

మీకు తెలుసా.. '2022 హ్యుందాయ్ టుసాన్' వెయిటింగ్ పీరియడ్ ఎంతో?

హ్యుందాయ్ టూసాన్ మొత్తం 7 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. ఇందులో 5 మోనో టోన్‌ కలర్స్ (పోలార్ వైట్, ఫాంటమ్ బ్లాక్, ఫైరీ రెడ్, స్టార్రి నైట్ మరియు గ్రే), డ్యూయెల్ టోన్ కలర్స్ (వైట్/బ్లాక్ మరియు రెడ్/బ్లాక్).

మీకు తెలుసా.. '2022 హ్యుందాయ్ టుసాన్' వెయిటింగ్ పీరియడ్ ఎంతో?

ఇందులోని ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, డాష్‌బోర్డ్ పైన సాఫ్ట్-టచ్ ప్లాస్టిక్‌లు మరియు దిగువన బేజ్ ప్లాస్టిక్‌ పొందుతుంది. డ్యాష్‌బోర్డ్‌లో 10.25-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ దాని చుట్టూ పియానో ​​బ్లాక్ యాక్సెంట్‌లు ఉన్నాయి. అదే సమయంలో ఇందులో 10.25-ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ కూడా ఉంది. సెంటర్ కన్సోల్‌లో ఆటోమేటిక్ గేర్ లివర్ అలాగే కొన్ని ఫిజికల్ బటన్‌లు ఉన్నాయి.

మీకు తెలుసా.. '2022 హ్యుందాయ్ టుసాన్' వెయిటింగ్ పీరియడ్ ఎంతో?

అంతే కాకుండా ఇందులో డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్, 64-కలర్ యాంబియంట్ లైటింగ్, 360-డిగ్రీ కెమెరాలు, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, అలెక్సా & గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్, 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్ మరియు రిక్లైనింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మీకు తెలుసా.. '2022 హ్యుందాయ్ టుసాన్' వెయిటింగ్ పీరియడ్ ఎంతో?

2022 టూసాన్ గురించి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇది ఇప్పుడు ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) పొందుతుంది. కావున ఇందులో ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్‌లు మరియు రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ వంటి ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. హ్యుందాయ్ తన విభాగంలో మొదటిసారిగా ఇందులో ADAS టెక్నాలజీ ప్రవేశపెట్టింది.

మీకు తెలుసా.. '2022 హ్యుందాయ్ టుసాన్' వెయిటింగ్ పీరియడ్ ఎంతో?

2022 హ్యుందాయ్ టూసాన్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.0-లీటర్ పెట్రోల్ మరియు 2.0-లీటర్ డీజిల్ ఇంజన్‌ ఆప్సన్స్ తో అందుబాటులో ఉంటుంది. ఇవి రెండు వరుసగా 156 పిఎస్ పవర్ & 192 ఎన్ఎమ్ టార్క్ మరియు 186 పిఎస్ పవర్ & 416 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి.

మీకు తెలుసా.. '2022 హ్యుందాయ్ టుసాన్' వెయిటింగ్ పీరియడ్ ఎంతో?

ఇక సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్-డీసెంట్ కంట్రోల్, హిల్-అసిస్ట్, బ్లైండ్-స్పాట్ వ్యూ మానిటర్ మరియు సరౌండ్-వ్యూ మానిటర్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతను మరింత మెరుగుపరుస్తాయి.

Most Read Articles

English summary
Hyundai tucson waiting period revealed details
Story first published: Saturday, August 13, 2022, 9:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X