హ్యుందాయ్ వెన్యూ 3,00,000 యూనిట్లు.. కొత్త 2022 మోడల్ త్వరలోనే రాబోతోంది..

కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న వెన్యూ దేశీయ విపణిలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి. హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue) సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్‌యూవీ300, టొయోటా అర్బన్ క్రూయిజర్, రెనో కైగర్ మరియు నిస్సాన్ మాగ్నైట్‌ వంటి మోడళ్లకు పోటీగా అత్యధిక అమ్మకాలను నమోదు చేస్తోంది. వెన్యూ తాజాగా మరొక అరుదైన రికార్డును దక్కించుకుంది. ఈ మోడల్ మార్కెట్లోకి వచ్చిన మూడేళ్లలో దాదాపు 3,00,000 యూనిట్లకు పైగా అమ్ముడైంది.

హ్యుందాయ్ వెన్యూ 3,00,000 యూనిట్లు.. కొత్త 2022 మోడల్ త్వరలోనే రాబోతోంది..

హ్యుందాయ్ వెన్యూ 2019 లో తొలిసారిగా భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అప్పటి నుండి ఇప్పటి వరకూ ముడూ లక్షల మందికి పైగా వినియోగదారులకు చేరువైంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) నుండి వచ్చిన మొట్టమొదటి మోడల్ వెన్యూ. అతికొద్ది సమయంలోనే ఈ మోడల్ దేశీయ మార్కెట్లో మంచి ప్రజాదరణ దక్కించుకుంది. ప్రతినెలా ఈ మోడల్ అమ్మకాలు స్థిరంగా సాగుతున్నాయి.

హ్యుందాయ్ వెన్యూ 3,00,000 యూనిట్లు.. కొత్త 2022 మోడల్ త్వరలోనే రాబోతోంది..

హ్యుందాయ్ విక్రయిస్తున్న మరొక పాపులర్ ఎస్‌యూవీ మరియు ఖరీదైన క్రెటా (Hyundai Creta)ని కొనుగోలు చేయలేని వారికి హ్యుందాయ్ వెన్యూ మంచి ప్రత్యామ్నాయంగా ఉంటుంది. అంతేకాకుండా, గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో పూర్తి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకున్న మేడ్ ఇన్ ఇండియా కారు టాటా నెక్సాన్ కి కూడా హ్యుందాయ్ వెన్యూ గట్టి పోటీ ఇస్తోంది. ఇప్పుడు ఈ కారు మార్కెట్లోకి ప్రవేశించిన 3 సంవత్సరాలలో 3 లక్షలకు పైగా కస్టమర్లను సొంతం చేసుకొని, అమ్మకాల పరంగా కొత్త ఎత్తులకు చేరుకుంది.

హ్యుందాయ్ వెన్యూ 3,00,000 యూనిట్లు.. కొత్త 2022 మోడల్ త్వరలోనే రాబోతోంది..

హ్యుందాయ్ వెన్యూ రికార్డుల పరంపర..

హ్యుందాయ్ ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని మే 21, 2019న తొలిసారిగా భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది మార్కెట్లోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లోనే 50,000 యూనిట్లకు విక్రయాలను నమోదు చేసి, రికార్డు సృష్టించింది. ఆ తర్వాత మరికొన్ని నెలల పాటు డిమాండ్ మందగించింది. అయినప్పటికీ, మొదటి 15 నెలల్లో 1,00,000 యూనిట్ల అమ్మకాల మార్కును చేరుకుంది. ఆ తర్వాత 25 నెలలకు 2,00,000 యూనిట్లను చేరుకోగా, 31 నెలల వ్యవధిలో 2,50,000 యూనిట్ల మైలురాయిని చేరుకుంది. ఇప్పుడు 36 నెలల్లో 3,00,000 యూనిట్ల అమ్మకాలకు చేరువైంది.

హ్యుందాయ్ వెన్యూ 3,00,000 యూనిట్లు.. కొత్త 2022 మోడల్ త్వరలోనే రాబోతోంది..

వెన్యూ ఓ మినీ క్రెటా ఎస్‌యావీలా ఉంటుంది..

హ్యుందాయ్ వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీని మొదటి చూపులో ఓ చిన్న సైజు క్రెటా ఎస్‌యూవీ మాదిరిగా కనిపిస్తుంది. అయితే, దీని స్టైలింగ్ చాలా ఆడంబరంగా ఉంటుంది, ముఖ్యంగా ఇందులోని స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, ఇంటీరియర్‌లు చక్కగా స్టైల్ చేయబడ్డాయి మరియు దీని డ్యాష్‌బోర్డ్ లో పెద్ద 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా లభిస్తుంది. హ్యుందాయ్ వెన్యూ క్యాబిన్ లోపల చిన్న వస్తువుల కోసం పుష్కలమైన స్టోరేజ్ స్పేస్ లభిస్తుంది. అంతేకాదు, ఈ చిన్న కారులో తగినంత బూట్ స్పేస్ కూడా ఉంటుంది. అవసరమైతే, అదనపు బూట్ స్పేస్ కోసం వెనుక సీట్లను మడచుకునే సౌలభ్యం కూడా ఉంది.

హ్యుందాయ్ వెన్యూ 3,00,000 యూనిట్లు.. కొత్త 2022 మోడల్ త్వరలోనే రాబోతోంది..

మూడు ఇంజన్లు.. ఐదు గేర్‌బాక్స్ ఆప్షన్లు..

హ్యుందాయ్ వెన్యూని కొనాలనుకునే కస్టమర్లకు కంపెనీ విభిన్న ఇంజన్లు మరియు గేర్‌బాక్స్ ఆప్షన్లను అందిస్తోంది. ఇందులో మొదటిది 1.2-లీటర్ కప్పా పెట్రోల్ ఇంజన్, ఇది 82 బిహెచ్‌పి శక్తిని మరియు 114 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కేవలం 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. ఇకపోతే, రెండవది ఇంజన్ 1.0-లీటర్ కప్పా టర్బో-పెట్రోల్ ఇంజన్, ఇది గరిష్టంగా 118 బిహెచ్‌పి శక్తిని మరియు 172 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్, 7-స్పీడ్ డిసిటి (డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్) మరియు ఐఎమ్‌టి (ఇంటెలిజెంట్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

హ్యుందాయ్ వెన్యూ 3,00,000 యూనిట్లు.. కొత్త 2022 మోడల్ త్వరలోనే రాబోతోంది..

ఇక, మూడవది డీజిల్ ఇంజన్. ఇది 1.5-లీటర్ యూ సిఆర్‌డిఐ డీజిల్ ఇంజన్. ఈ ఇంజన్ గరిష్టంగా 99 బిహెచ్‌పి శక్తిని మరియు 240 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. ఈ మూడు ఇంజన్లలో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ మూడు రకాల గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో ఐఎమ్‌టి గేర్‌బాక్స్ అనేది కొత్తగా ప్రవేశపెట్టబడిన క్లచ్ రహిత గేర్‌బాక్స్. ఇతర కార్లలో ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) మాదిరిగానే ఐఎమ్‌టి (ఇంటెలిజెంట్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) కూడా పనిచేస్తుంది.

హ్యుందాయ్ వెన్యూ 3,00,000 యూనిట్లు.. కొత్త 2022 మోడల్ త్వరలోనే రాబోతోంది..

కంపెనీ బాస్ ఏం చెబుతున్నాడంటే..

"హ్యుందాయ్ మొబిలిటీ స్పేస్‌లో వినూత్నమైన మరియు ఇంటెలిజెంట్ టెక్నాలజీని అందించడంలో ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. వెన్యూ యొక్క విజయమే మా హైటెక్ మరియు ఫీచర్ ప్యాక్డ్ ప్రొడక్ట్ ఆఫర్‌లపై కస్టమర్ల ప్రేమకు నిదర్శనం" అని హ్యుందాయ్ మోటార్ ఇండియా డైరెక్టర్ (సేల్స్, మార్కెటింగ్) అండ్ సర్వీస్) తరుణ్ గార్గ్ చెప్పారు. హ్యుందాయ్ వెన్యూని పరిచయం చేసిన ఈ మూడేళ్ల కాలంలో తాము ఈ మోడల్ బ్లూలింక్ కార్ కనెక్టింగ్ టెక్నాలజీని మరియు వినూత్నమైన iMT (ఇంటిలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్)ని పరిచయం చేశామని, ఇది 33కి పైగా కనెక్ట్ చేయబడిన కార్ ఫీచర్‌లతో కస్టమర్‌లను ఆకట్టుకుంటోందని ఆయన అన్నారు.

హ్యుందాయ్ వెన్యూ 3,00,000 యూనిట్లు.. కొత్త 2022 మోడల్ త్వరలోనే రాబోతోంది..

కొత్త 2022 మోడల్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ వస్తోంది..

హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీ భారత మార్కెట్లోకి విడుదల చేసి మూడేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో, కంపెనీ ఇందులో ఓ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే, కంపెనీ ఈ మోడల్ లైనప్ లో కొన్ని వేరియంట్ల బుకింగ్స్ నిలిపివేసినట్లు తెలుస్తోంది. సమాచారం ప్రకారం, హ్యుందాయ్ వెన్యూ యొక్క కొన్ని వేరియంట్‌ లు మాత్రమే డీలర్‌షిప్‌లలో అమ్మకానికి ఉంచబడ్డాయి మరియు ప్రస్తుతం దాని DCT మరియు iMT వేరియంట్‌ లు హోల్డ్‌లో ఉంచబడ్డట్లు తెలుస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Hyundai venue achieves 3 lakh sales milestone in india
Story first published: Friday, May 27, 2022, 10:21 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X