కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ బుకింగ్స్ ప్రారంభం.. బుకింగ్ అమౌంట్ కేవలం రూ.21,000 మాత్రమే!

దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ (Hyundai) కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో విక్రయిస్తున్న వెన్యూ (Venue) కాంపాక్ట్ ఎస్‌యూవీలో కొత్త 2022 మోడల్ కోసం బుకింగ్‌లను ప్రారంభించింది. ఆసక్తిగల కస్టమర్లు కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ ఎస్‌‌యూవీని రూ.21,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి హ్యుందాయ్ డీలర్‌షిప్‌లలో కానీ లేదా హ్యుందాయ్ ఇండియా వెబ్‌సైట్ లో క్లిక్ టు బై ప్లాట్‌ఫారమ్‌ ద్వారా కానీ బుక్ చేసుకోవచ్చు. సరికొత్త ఫేస్‌లిఫ్టెడ్ హ్యుందాయ్ వెన్యూ జూన్ 16, 2022వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేయబడుతుంది.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ బుకింగ్స్ ప్రారంభం.. బుకింగ్ అమౌంట్ కేవలం రూ.21,000 మాత్రమే!

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కొత్త 2022 మోడల్ హ్యుందాయ్ వెన్యూ కొన్ని సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లతో అందుబాటులోకి రానుంది. అందులో ఒకటి అమెజాన్ అలెక్సా మరియు గూగుల్ అసిస్టెంట్ సహాయంతో కూడిన హోమ్-టు-కార్ (Home-to-car) ఫీచర్. ఇందుకు సంబంధించి కంపెనీ ఓ టీజర్ వీడియోని కూడా విడుదల చేసింది. హ్యుందాయ్ అమెజాన్ అలెక్సా మరియు గూగుల్ అసిస్టెంట్‌తో ఇంగ్లీష్ మరియు హిందీలో వాయిస్ కమాండ్స్‌ ను అనుమతించే కొత్త హోమ్ టు కార్ ఫీచర్‌ను ప్రచారం చేస్తోంది.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ బుకింగ్స్ ప్రారంభం.. బుకింగ్ అమౌంట్ కేవలం రూ.21,000 మాత్రమే!

ఈ టీజర్ వీడియోలో హ్యుందాయ్ వెల్లడించిన దాని ప్రకారం, కస్టమర్ ఇంటిలో ఉండే అమేజాన్ అలెక్సా డిజైజ్ ను ఉపయోగించి వాయిస్ కమాండ్ సాయంతో కొత్త హ్యుందాయ్ వెన్యూ కారులోని ఏసి (ఎయిర్ కండిషనింగ్) ను రిమోట్ గా స్టార్ట్ చేయవచ్చు. కేవలం ఏసి మాత్రమే కాకుండా, అనేక ఇతర ఫీచర్లను కూడా వాయిస్ కమాండ్స్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ బుకింగ్స్ ప్రారంభం.. బుకింగ్ అమౌంట్ కేవలం రూ.21,000 మాత్రమే!

కొత్త హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ 2022 హోమ్ టు కార్ ఫీచర్లలో భాగంగా కారు క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్‌ను రిమోట్‌గా యాక్సెస్ చేయడం, డోర్‌లను అన్‌లాక్ చేయడం మరియు లాక్ చేయడం మరియు కస్టమర్లు తమ వాహనాల స్థితిని తనిఖీ చేయడం వంటి ఫీచర్లను కంట్రోల్ చేయడానికి వాహన యజమానులను అనుమతిస్తుంది. ఫైండ్ మై కార్ ఫీచర్‌ని యాక్సెస్ చేయడానికి అలాగే టైర్ ప్రెజర్ మరియు ఫ్యూయల్ లెవెల్ మానిటరింగ్ సిస్టమ్‌ల నుండి సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి కూడా వాయిస్ కమాండ్‌లను ఉపయోగించవచ్చు.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ బుకింగ్స్ ప్రారంభం.. బుకింగ్ అమౌంట్ కేవలం రూ.21,000 మాత్రమే!

హోమ్ టూ కార్ సెటప్‌తో యాక్సెస్ చేయగల ఇతర ఫీచర్‌లలో స్పీడ్ అలర్ట్, ఐడిల్ టైమ్ అలర్ట్ మరియు టైమ్ ఫెన్సింగ్ అలర్ట్ లు కూడా ఉన్నాయి. కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ ఈ బ్రాండ్ యొక్క లేటెస్ట్ బ్లూలింక్ కనెక్టింగ్ టెక్నాలజీతో కూడా అందుబాటులోకి వస్తుంది. ఈ కనెక్టింగ్ టెక్నాలజీతో కొత్త హోమ్ టు కార్ సెటప్‌తో పాటుగా 60 కి పైగా కనెక్టింగ్ ఫీచర్లు ఉంటాయి.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ బుకింగ్స్ ప్రారంభం.. బుకింగ్ అమౌంట్ కేవలం రూ.21,000 మాత్రమే!

హ్యుందాయ్ వెన్యూ భారత మార్కెట్లోకి ప్రవేశించి మూడేళ్లు పూర్తయింది. ఈ మూడేళ్ల కాలంలో కంపెనీ మూడు లక్షలకు పైగా వెన్యూ కార్లను విక్రయించింది. ఈ నేపథ్యంలో, కొత్తగా విడుదల చేయబోయే 2022 హ్యుందాయ్ వెన్యూలో కంపెనీ గణనీయమైన కాస్మెటిక్ మరియ ఫీచర్ అప్‌గ్రేడ్లను చేయనుంది. రివైజ్ చేయబడిన పెద్ద ఫ్రంట్ గ్రిల్, బానెట్ క్రింది భాగంలో ఎల్ఈడి టర్న్ ఇండికేటర్లు మరియు సన్నటి ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన స్మోక్డ్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్, బంపర్ క్రింది భాగంలో సిల్వర్ స్కఫ్ ప్లేట్ వంటి మార్పులతో ఇది ముందు వైపు నుండి చాలా కొత్తగా కనిపిస్తుంది.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ బుకింగ్స్ ప్రారంభం.. బుకింగ్ అమౌంట్ కేవలం రూ.21,000 మాత్రమే!

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ రియర్ డిజైన్ కూడా రివైజ్ చేయబడింది. కొత్త టెయిల్ ల్యాంప్స్ మరియు రెండు టెయిల్ ల్యాంప్స్ ను కలుపుతూ పోయే ఎల్ఈడి లైట్ స్ట్రిప్, రీప్రొఫైల్ చేయబడిన రియర్ బంపర్, కొత్త అల్లాయ్ వీల్స్, సిల్వర్ కలర్ రూఫ్ రెయిల్స్ మరియు రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్‌తో ఇది చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. కొత్త హ్యుందాయ్ వెన్యూలో కొత్త 2 స్టెప్ రిక్లైనింగ్ రియర్ సీట్లు కూడా ఉంటాయి. ఇది హ్యుందాయ్ నుండి రాబోయే ప్రీమియం ఎస్‌యూవీ టూసాన్ నుండి స్ఫూర్తి పొంది డిజైన్ చేయబడింది.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ బుకింగ్స్ ప్రారంభం.. బుకింగ్ అమౌంట్ కేవలం రూ.21,000 మాత్రమే!

కాగా, ఈ ఫేస్‌లిఫ్టెడ్ హ్యుందాయ్ వెన్యూ యొక్క 2022 మోడల్ ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ప్రస్తుతం, ఇది మూడు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. వీటిలో మొదటిది 1.2-లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్, ఇది గరిష్టంగా 82 బిహెచ్‌పి పవర్ ను మరియు 114 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ బుకింగ్స్ ప్రారంభం.. బుకింగ్ అమౌంట్ కేవలం రూ.21,000 మాత్రమే!

ఇందులో మరింత శక్తివంతమైన టర్బోచార్జ్డ్ త్రీ-సిలిండర్ 1.0-లీటర్ పెట్లో ఇంజన్ కూడా ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 118 బిహెచ్‌పి పవర్ ను మరియు 172 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, ఇందులో ఉన్న ఏకైక డీజిల్ ఇంజన్ ఆప్షన్ 1.5-లీటర్ యూనిట్. ఇది గరిష్టంగా 99 బిహెచ్‌పి పవర్ ను మరియు 240 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ని ఉత్పత్తి చేస్తుంది. ఇవన్నీ వివిధ రకాల గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉన్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Article Published On: Friday, June 3, 2022, 16:21 [IST]
English summary
Hyundai venue facelift bookings open book yours for rs 21000 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+