నేటి నుండి హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ (Hyundai Venue N-Line) బుకింగ్‌లు ప్రారంభం

కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ (Hyundai) దేశీయ విపణిలో విక్రయిస్తున్న వెన్యూ (Venue) కాంపాక్ట్ సెడాన్‌లో ఓ ప్రత్యకేమైన ఎన్-లైన్ (N-Line) ఎడిషన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.

Recommended Video

భారత్‌లో విడుదలైన 2022 Hyundai Tucson | వివరాలు

ఇందులో భాగంగా హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ (Hyundai Venue N-Line) కోసం కంపెనీ నేటి నుండి (ఆగస్ట్ 25, 2022) అధికారికంగా బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. ఆసక్తిగల కస్టమర్లు కంపెనీ వెబ్‌సైట్‌లో కానీ లేదా అధీకృత హ్యుందాయ్ డీలర్‌షిప్‌లో కానీ రూ. 21,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

నేటి నుండి హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ (Hyundai Venue N-Line) బుకింగ్‌లు ప్రారంభం

గతంలో హ్యుందాయ్ విడుదల చేసిన ఐ20 ఎన్-లైన్ మాదిరిగానే వెన్యూ ఎన్-లైన్ కూడా మోటార్‌స్పోర్ట్-ప్రేరేపిత డిజైన్, స్పోర్టీ రైడ్ మరియు హ్యాండ్లింగ్‌ ఫీచర్లతో అందుబాటులోకి రానుంది. హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ లో స్పోర్టి డిజైన్‌ కోసం కంపెనీ డార్క్ క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, స్పోర్టీ టెయిల్‌గేట్ స్పాయిలర్, ఫ్రంట్ గ్రిల్‌పై ఎన్-లైన్ బ్యాడ్జ్, సైడ్ ఫెండర్లు మరియు టెయిల్‌గేట్ పై ఎన్ బ్రాండింగ్, కొత్త ఎన్-బ్రాండెడ్ 16 ఇంచ్ అల్లాయ్‌లు మొదలైన డిజైన్ ఎలిమెంట్స్ ఉంటాయి.

నేటి నుండి హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ (Hyundai Venue N-Line) బుకింగ్‌లు ప్రారంభం

అంతేకాకుండా, ఇందులోని వీల్స్, బంపర్స్, ఫెండర్‌లు, సైడ్ సిల్స్ మరియు రూఫ్ రైల్స్ పై అథ్లెటిక్ రెడ్ హైలైట్‌లు, స్పోర్టీ బ్లాక్ ఇంటీరియర్ మరియు క్యాబిన్ లో అక్కడక్కడా అథ్లెటిక్ రెడ్ ఇన్‌సర్ట్‌లు మరియు ఫ్రంట్ బ్రేక్‌లపై రెడ్ కాలిపర్‌లు వంటి ప్రత్యేకమైన హైలైట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా కొత్త హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ ను స్టాండర్డ్ వేరియంట్ నుండి ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి మరియు వెన్యూ స్పోర్టీ క్యారెక్టర్ ను మరింత పెంచేలా చేస్తాయి.

నేటి నుండి హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ (Hyundai Venue N-Line) బుకింగ్‌లు ప్రారంభం

హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ ఉండబోయే ప్రధాన ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో డ్యూయల్ కెమెరాలతో కూడిన డాష్‌క్యామ్‌, బ్లూలింక్ కనెక్టెడ్ టెక్నాలజీ మరియు దానిని సపోర్ట్ చేసే 60 కి పైగా కార్ కనెక్టింగ్ ఫీచర్లు, అలెక్సా మరియు గూగుల్ వాయిస్ అసిస్టెంట్‌ సెటప్‌తో కూడిన హోమ్ టు కార్ ఫీచర్, పానోరమిక్ సన్‌రూఫ్, ప్రయాణీకుల వినోదం కోసం అధునాతన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు డ్రైవర్ సమాచారం కోసం డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి మరెన్నో ఫీచర్లు ఉంటాయి.

నేటి నుండి హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ (Hyundai Venue N-Line) బుకింగ్‌లు ప్రారంభం

వెన్యూ ఎన్-లైన్ వేరియంట్‌ను కంఫర్ట్ ఫీచర్లు మరియు సేఫ్టీ ఫీచర్ల పరంగా, దాని టాప్ ఎండ్ వేరియంట్‌తో సమానంగా ఉంచబడుతుందని నమ్ముతారు. సేఫ్టీ విషయానికి వస్తే, హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ లో వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ అసిస్ట్ కంట్రోల్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు, ఈబిడితో కూడిన ఏబిఎస్‌, బ్రేక్ అసిస్ట్ సిస్టమ్, సెన్సార్లు మరియు కెమెరాతో కూడిన పార్కింగ్ అసిస్ట్ మొదలైనవి ఉండే అవకాశం ఉంది.

నేటి నుండి హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ (Hyundai Venue N-Line) బుకింగ్‌లు ప్రారంభం

హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ యొక్క అతిపెద్ద మార్పు దాని ఇంజన్ రూపంలో ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో 1.0-లీటర్ టర్బో జిడిఐ పెట్రోల్ ఇంజన్‌ ను ఉపయోగించవచ్చని సమాచారం. ఈ ఇంజన్ గరిష్టంగా 120 బిహెచ్‌పి శక్తిని మరియు 172 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7 స్పీడ్ డిసిటి (డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్) ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఇందులో మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ అందుబాటులో ఉంకపోవచ్చని తెలుస్తోంది.

నేటి నుండి హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ (Hyundai Venue N-Line) బుకింగ్‌లు ప్రారంభం

హ్యుందాయ్ తమ ఎన్ (N) బ్రాండింగ్ క్రింద పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ కార్లను విక్రయిస్తుంది. అయితే, కంపెనీ వీటి తయారీ ఖర్చును అదుపులో ఉంచేందుకు చాలా వరకూ ఇలాంటి ఎన్-బ్రాండెడ్ కార్లలో కేవలం కాస్మెటిక్ అప్‌గ్రేడ్ లను మాత్రమే చేస్తుంది. కొత్తగా రాబోయే హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్‌ లో నార్మల్, ఎకో మరియు స్పోర్ట్ వంటి డ్రైవింగ్ మోడ్‌ లు కూడా అందుబాటులో ఉండనున్నాయి. భారత మార్కెట్లో ఐ20 ఎన్-లైన్ విడుదల తర్వాత హ్యుందాయ్ కి ఇది (వెన్యూ ఎన్-లైన్) రెండవ ఎన్-లైన్ మోడల్ అవుతుంది.

నేటి నుండి హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ (Hyundai Venue N-Line) బుకింగ్‌లు ప్రారంభం

హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ లాంచ్ యొక్క హైలైట్ ఏంటంటే ఇది మెటావర్స్‌ (Metaverse) ద్వారా విడుదల చేయబడుతుంది. మెటావర్స్ అనేది ఒక వర్చువల్ ప్రపంచం, 3డి టెక్నాలజీని ఉపయోగించి కంపెనీ ఈ కారును వర్చువల్ గా విడుదల చేస్తుంది. హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ సెప్టెంబర్ మొదటి వారంలో భారత మార్కెట్లో విడుదల కానుంది. ఈ కారుకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే మరో వారం రోజుల పాటు వేచి ఉండాల్సిందే.

నేటి నుండి హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ (Hyundai Venue N-Line) బుకింగ్‌లు ప్రారంభం

గతేడాది హ్యుందాయ్ విడుదల చేసిన ఐ20 ఎన్-లైన్ విషయానికి వస్తే, ఇది కొత్త ఫ్రంట్ గ్రిల్‌తో ముందు వైపు కొత్త ఫ్రంట్ ఫాసియాని కలిగి ఉంటుంది. సైడ్స్ లో స్టాండర్డ్ 16 ఇంచ్ అల్లాయ్ వీల్స్ కి బదులుగా కొత్త 17 ఇంచ్ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్, వెనుక వైపున పెద్ద రియర్ బంపర్ మరియు సరికొత్త సైలెన్సర్ డిజైన్ లను కలిగి ఉంటుంది. అలాగే, ఇంటీరియర్స్ లో మెటల్ పెడల్స్, ఎన్-లైన్ బ్యాడ్జింగ్ మరియు అక్కడక్కడా రెడ్ యాక్సెంట్‌లు కనిపిస్తాయి. ఐ20 ఎన్-లైన్ మరియు వెన్యూ ఎన్-లైన్ మోడళ్ల తర్వాత హ్యుందాయ్ తమ పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ క్రెటాలో కూడా ఓ ఎన్-లైన్ వెర్షన్ ను విడుదల చేయవచ్చని సమాచారం. మరిన్ని లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Thursday, August 25, 2022, 14:41 [IST]
English summary
Hyundai venue n line bookings starts from today details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+