హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ (Hyundai Venue N-Line) ఆవిష్కరణ.. ఫీచర్లు మరియు ఇతర వివరాలు
కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ (Hyundai), భారతదేశంలో తమ రెండవ ఎన్-లైన్ (N-Line) మోడల్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఐ20 ఎన్-లైన్ ను విడుదల చేసిన హ్యుందాయ్, ఇప్పుడు వెన్యూ ఎన్-లైన్ ను లాంచ్ చేయనుంది. ఈ నేపథ్యంలో, కంపెనీ హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ (Hyundai Venue N-Line) వివరాలను, ఫొటోలను అధికారికంగా వెల్లడి చేసింది.
Recommended Video
హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ ను కంపెనీ వచ్చే నెల 6వ తేదీన అధికారికంగా మార్కెట్లో విడుదల చేయనుంది. అయితే, అంతకు ముందే కంపెనీ ఈ స్పెషల్ ఎడిషన్ కు సంబంధించిన అనేక వివరాలను వెల్లడి చేసింది. వెన్యూ ఎన్-లైన్ కోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. ఆసక్తిగల కస్టమర్లు కంపెనీ వెబ్‌సైట్ లో కానీ లేదా అధీకృత హ్యుందాయ్ డీలర్‌షిప్ లలో కానీ బుక్ చేసుకోవచ్చు.

హ్యుందాయ్ వెల్లడించిన సమాచారం ప్రకారం, వెన్యూ ఎన్-లైన్ మొత్తం రెండు వేరియంట్లలో విడుదల కానుంది. వీటిలో వెన్యూ ఎన్-లైన్ ఎన్6 మరియు వెన్యూ ఎన్-లైన్ ఎన్8 అనే రెండు వేరియంట్‌లు ఉన్నాయి. ఇక ఈ ప్రత్యేకమైన ఎన్-లైన్ వెన్యూ యొక్క కలర్ ఆప్షన్‌ల విషయానికి వస్తే, ఇది పోలార్ వైట్ మరియు షాడో గ్రే అనే రెండు మోనో టోన్‌లలో అలాగే, పోలార్ వైట్ విత్ ప్లాటినియం బ్లాక్ రూఫ్, పోలార్ వైట్ విత్ ఫాంటమ్ బ్లాక్ రూఫ్ మరియు థండర్ బ్లూ విత్ షాడో బ్లాక్ రూఫ్ అనే మూడు టూటోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

ప్రస్తుతం, హ్యుందాయ్ విక్రయిస్తున్న ఐ20 ఎన్-లైన్ మాదిరిగానే వెన్యూ ఎన్-లైన్ కూడా ప్రత్యేకమైన మోటార్‌స్పోర్ట్-ప్రేరేపిత డిజైన్‌తో కారు అంతటా స్పోర్టీ రైడ్ హైలైట్స్‌తో డిజైన్ చేయబడింది. హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ లో స్పోర్టి డిజైన్ కోసం కంపెనీ డార్క్ క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, స్పోర్టీ టెయిల్‌గేట్ స్పాయిలర్, ఫ్రంట్ గ్రిల్‌పై ఎన్-లైన్ బ్యాడ్జ్, సైడ్ ఫెండర్లు మరియు టెయిల్‌గేట్ పై ఎన్ బ్రాండింగ్, కొత్త ఎన్-బ్రాండెడ్ 16 ఇంచ్ అల్లాయ్‌లు మొదలైన వాటిని ఉపయోగించింది.

స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే వెన్యూ ఎన్-లైన్‌ను బయటి నుండి మరియు లోపలి నుండి ప్రత్యేకంగా కనిపించేలా చేసేందుకు ఇందులోని వీల్స్, బంపర్స్, ఫెండర్‌లు, సైడ్ సిల్స్ మరియు రూఫ్ రైల్స్ పై అథ్లెటిక్ రెడ్ హైలైట్‌లు, స్పోర్టీ బ్లాక్ ఇంటీరియర్ మరియు క్యాబిన్ లో అక్కడక్కడా అథ్లెటిక్ రెడ్ ఇన్‌సర్ట్‌లు మరియు ఫ్రంట్ బ్రేక్‌లపై రెడ్ కాలిపర్‌లు వంటి ప్రత్యేకమైన స్పోర్టీ రెడ్ హైలైట్ ను ఉపయోగించారు. ఈ మార్పులన్నీ కూడా కొత్త హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ ను మరింత స్పోర్టీగా కనిపించేలా చేస్తాయి.

ఈ ప్రత్యేకమైన కాంపాక్ట్ ఎస్‌యూవీలో హ్యుందాయ్ అందించబోయే ప్రత్యేక ఫీచర్ల విషయానికి వస్తే, వెన్యూ ఎన్-లైన్ లో డ్యూయల్ కెమెరాలతో కూడిన డాష్‌క్యామ్, బ్లూలింక్ కనెక్టెడ్ టెక్నాలజీ మరియు దానిని సపోర్ట్ చేసే 60 కి పైగా కార్ కనెక్టింగ్ ఫీచర్లు, అలెక్సా మరియు గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సెటప్‌తో కూడిన హోమ్ టు కార్ ఫీచర్, పానోరమిక్ సన్‌రూఫ్, ప్రయాణీకుల వినోదం కోసం అధునాతన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు డ్రైవర్ సమాచారం కోసం డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి ఉన్నాయి.

హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ కంఫర్ట్ ఫీచర్లు మరియు సేఫ్టీ ఫీచర్ల పరంగా, దాని టాప్ ఎండ్ వేరియంట్‌తో సమానంగా ఉంటుందని సమాచారం. సేఫ్టీ విషయానికి వస్తే, హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ లో వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ అసిస్ట్ కంట్రోల్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు, ఈబిడితో కూడిన ఏబిఎస్, బ్రేక్ అసిస్ట్ సిస్టమ్, సెన్సార్లు మరియు కెమెరాతో కూడిన పార్కింగ్ అసిస్ట్ మొదలైనవి ఉండనున్నాయి.

చివరిగా ఇంజన్ పనితీరును గమనిస్తే, హ్యుందాయ్ వెన్యూ ఎన్-లైన్ పవర్‌ఫుల్ 1.0-లీటర్ టర్బో జిడిఐ పెట్రోల్ ఇంజన్ తో రానుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 120 బిహెచ్‌పి శక్తిని మరియు 172 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7 స్పీడ్ డిసిటి (డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్) ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఇందులో మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ అందుబాటులో ఉంకపోవచ్చని సమాచారం. వెన్యూ ఎన్-లైన్ ప్రీ-బుకింగ్ కోసం అడ్వాన్స్ మొత్తాన్ని రూ. 21,000 గా నిర్ణయించారు.

ఇదిలా ఉంటే, హ్యుందాయ్ అనుబంధ సంస్థ కియా మోటార్స్ కూడా తమ లైనప్ లో ఎక్స్-లైన్ (X-Line) పేరిట ప్రత్యేకమైన మోడళ్లను విడుదల చేయాలని చూస్తోంది. హ్యుందాయ్ వెన్యూ ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారు చేయబడిన కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీలో కంపెనీ ఓ కొత్త ఎక్స్-లైన్ వేరియంట్‌ను విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో, కంపెనీ ఇప్పటికే కియా సోనెట్ ఎక్స్-లైన్ (Kia Sonnet X-Line) టీజర్‌ను కూడా విడుదల చేసింది. వెన్యూ ఎన్-లైన్ మాదిరిగానే సోనెట్ ఎక్స్-లైన్ కూడా ప్రత్యైకమైన స్టైలింగ్‌తో రానుంది. మరిన్ని లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








