శ్రీలంక పోలీస్ దళాలు ఉపయోగించనున్న ఇండియన్ బ్రాండ్ కార్లు, ఇవే.. వీటికి దేశంలో ఫుల్ డిమాండ్
భారదేశానికి దక్షిణ సమీపంలో ఉన్న ద్విపం శ్రీలంక దేశానికి శ్రీలంకలోని భారత హైకమిషన్ 125 యూనిట్ల మహీంద్రా స్కార్పియో క్లాసిక్ (Mahindra Scorpio Classic) ఎస్‌యూవీలను శ్రీలంక పోలీస్ దళానికి అందించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.
శ్రీలంక ఆర్ధిక సంక్షోభంలో ఉన్న సమయంలో భారతదేశం సాయం చేయడానికి ముందడుగు వేసింది. ఇందులో భాగంగానే భారతదేశం వాగ్దానం చేసిన దాని ప్రకారం 500 యూనిట్ల ప్రస్తుత క్రెడిట్ లైన్‌లో 125 యూనిట్లను డెలివరీ చేసింది. కాగా మిగిలిన 375 యూనిట్లను డెలివరీ చేయాల్సి ఉంది. ఈ 125 SUV లను అందించే ఫోటోలను భారత హైకమిషన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది.

భారత హైకమిషన్ షేర్ చేసిన ఈ ఫోటోలలో ఇండియా ప్రతినిధులు, శ్రీలంక అధికారులు ఉన్నారు. ప్రస్తుతం భారతీయ మార్కెట్లి విపరీతమైన డిమాండ్ తో ముందుకు సాగుతున్న మహీంద్రా క్లాసిక్ SUV కి సౌత్ ఆఫ్రికా, నేపాల్ మరియు భూటాన్ వంటి ఇతర దేశాలలో కూడా మంచి డిమాండ్ ఉంది. కావున కంపెనీ ఈ దేశాలకు కూడా మహీంద్రా స్కార్పియో క్లాసిక్ SUV లను ఎగుమతి చేస్తుంది.
మహీంద్రా స్కార్పియో క్లాసిక్‌ని ఆఫ్రికా దేశాలకు మాత్రమే కాకుండా ఆస్ట్రేలియాకు కూడా ఎగుమతి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలు పొందిన స్కార్పియో క్లాసిక్ SUV 2.2 లీటర్, టర్బో డీజిల్, mHawk ఇంజిన్ తో వస్తుంది. ఇది 132 హెచ్‌పి పవర్ మరియు 300 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

మహీంద్రా కంపెనీ స్కార్పియో క్లాసిక్‌లో రియర్ వీల్ డ్రైవ్ మాత్రమే అందిస్తుంది, కావున ఇందులో ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ ఇవ్వబడదు. ఇందులో ఉండే ఇంజిన్ దాని మునుపటి మోడల్ కంటే కూడా దాదాపు 55 కేజీలు తక్కువ బరువును పొందుతుంది. కావున ఈ కారణంగా 14 శాతం ఇంధనాన్ని ఆదా చేస్తుంది. పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. కావున ఇది వాహన వినియోగదారులు ఎక్కువగా ఆకర్శిస్తూ ఉంది.
కొత్త స్కార్పియో క్లాసిక్ డిజైన్ విషయానికి వస్తే ఇది దాదాపు దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇందులో కొన్ని అప్డేటెడ్ మార్పులు కూడా గమనించవచ్చు. ఇందులో కొత్త లోగో, రిఫ్రెష్ చేయబడిన ఫ్రంట్ గ్రిల్ , ఫాక్స్ స్కిడ్ ప్లేట్‌తో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్, అప్‌డేట్ చేయబడిన ఫాగ్‌ల్యాంప్ హౌసింగ్ మరియు రీడిజైన్ చేయబడిన టెయిల్-ల్యాంప్ ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ లో డ్యూయెల్ టోన్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 9.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సఫోర్ట్ చేస్తుంది.ఇంటీరియర్ 'బ్లాక్ అండ్ బేజ్' కలర్ థీమ్ పొందుతుంది. స్టీరింగ్ వీల్ లెథెరెట్ ఫినిషింగ్ పొందుతుంది, కావున మంచి పట్టును అందిస్తుంది. డ్యాష్‌బోర్డ్ మరియు సెంటర్ కన్సోల్ ఇప్పుడు వుడ్ ఇన్‌సర్ట్‌లను పొందుతాయి. రెండవ వరుస ప్యాసింజర్ ల కోసం ఏసీ వెంట్స్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ పార్కింగ్ సెన్సార్‌లు వంటివి ఉన్నాయి.
మహీంద్రా స్కార్పియో క్లాసిక్ 7 సీటర్ మరియు 9 సీటర్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. 7-సీటర్ వేరియంట్ లో రెండవ వరుసలో రెండు కెప్టెన్ సీట్లు మరియు మూడవ వరుసలో ఒక బెంచ్ ఉంటుంది. 9-సీటర్ విషయానికి వస్తే, ఇందులో రెండవ వరుసలో ఒక బెంచ్ మరియు వెనుకవైపు నలుగురికి జంప్ సీట్లు లభిస్తాయి. ఇది పరిమాణం పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది, కావున వాహన వినియోగదారులకు చాలా మంచి ప్రయాణ అనుభూతిని అందిస్తుంది.


Click it and Unblock the Notifications








